Tuesday, February 24, 2026

Fairy tales Telugu - పొడుపు కధలు

పొడుపు కధలు

1. నల్ల కుక్కకు నాలుగు చెవులు ఏమిటది ? సమాధానం : లవంగం

2. బంగారు చెంబులో వెండి గచ్చకాయ ఏమిటది ? సమాధానం : పనసగింజ

3. కుడితి తాగదు, మేత మేయదు గాని, కుండకు పాలు ఇస్తుంది..? సమాధానం : తాడి చెట్టు, ఈత చెట్టు 

4. అనగనగ ఒక అప్సరస. పేరు మధ్యలో ఒక అక్షరం తీసేస్తే మేక..? సమాధానం : మేనక

5. పూజకు పనికిరాని పత్రి ఏమిటి..?? సమాధానం : ఆసుపత్రి 

6. గీయలేని కోణం..?? సమాధానం : కుంభకోణం

7. కొట్టకుండా తగిలే దెబ్బ ఏమిటి..?? సమాధానం : వడదెబ్బ 

8. తాగలేని పాలు ఏమిటి..?? సమాధానం : పాపాలు

9. తినలేని కాయ ఏమిటి..?? సమాధానం : లెంపకాయ 

10. అందరికీ ఇష్టమైన కారం ఏమిటి..??  సమాధానం : ఉపకారం

11. అందరూ కోరుకునే సతి ఏమిటి..?? సమాధానం : వసతి 

12. కూర్చోలేని హాలు ఏమిటి..?? సమాధానం : వరహాలు

13. పగలు కూడా కనపడే నైట్ ఏమిటి..?? సమాధానం : గ్రానైట్ 

14. రుచి లేని కారం ఏమిటి..??  సమాధానం : ఆకారం 

15. ఎగిరినా ఎగురుతుంది, నడచినా నడుస్తుంది కానీ నోట మాట లేదు ? సమాధానం : నీడ 

16. కడుపు నిండా రాగాలు, వంటి నిండా గాయాలు ?  సమాధానం : వేణువు, మురళి 

17. ఇల్లు అంతా తిరిగి మూలన కూర్చుంటుంది ? సమాధానం : చీపిరి 

18. అమ్మకి తమ్ముడిని కాను, కానీ నేను అందరికి మేనమామని ఎవర్ని నేను ? 
సమాధానం : చందమామ

19. జాన కాని జాన ? సమాధానం : ఖజాన 

20. మూత తెరిస్తే, ముత్యాలు ? సమాధానం : దంతాలు 

21. చక్కని చెరువు చిక్కని నీళ్లు తెల్లని కాడ ఎర్రని పువ్వు..? సమాధానం : దీపం 

22. అడవిలో పుటింది, అడవిలో పెరిగింది, మా ఇంటికొచ్చింది, మహాలక్ష్మిగా మారింది..?
సమాధానం : గడప 

23. పగలేమో కటోర తపస్వి రాత్రి భయంకర రాక్షసి..? సమాధానం : గబ్బిలం 

24. పచ్చని చేలు పరిమళాల పిట్టా ఒళ్ళు విరుచుకుంది తెచ్చుకుందాం అంటే గుచ్చుకుంది..?
సమాధానం : మొగలి పువ్వు 

25. అరచేతిలో లెక్కించలేనన్ని ఇళ్ళు, వాటికి వెళ్లే దారేకాని వచ్చే దారే లేదు?
సమాధానం : జల్లెడ

26. పోకంతా పొట్టోడు, ఇంటికి గట్టోడు? సమాధానం : తాళం కప్ప

27. సన్న తోడవు తొలగిస్తే, కమ్మని వెన్నముద్ద అందరూ ఇష్టంగా ఆరగిస్తారు?
సమాధానం : అరటిపండు 

28. చారెడు కుండలో మానెడు పగడాలు?  సమాధానం : దానిమ్మ పండు 

29. చెట్టుకు కాయని కరకరలాడే కాయ? సమాధానం : కజ్జికాయ 

30. నల్ల స్తంభం పై నలుగురు దొంగలు?  సమాధానం : లవంగం మొగ్గ 

31. కాళ్ళు చేతులు ఉన్నా నడవలేనిది? సమాధానం : కుర్చీ

32. ఒళ్ళంతా ముళ్ళు, కడుపంతా చేదు? సమాధానం : కాకర కాయ.

33. రంగం కాని రంగం, ఏమి రంగం?  సమాధానం : వీరంగం 

34. రసం కాని రసం ? సమాధానం : నీరసం 

35. దానికి రెండే కాళ్ళు, ఏడు చేతులు? సమాధానం : నిచ్చెన

36. ఈ ఇంటికి, ఆ ఇంటికి మధ్య ఒకటే దూలం? సమాధానం : ముక్కు

37. కళ్లుండి చూడలేదు, కాళ్ళుండి నడవలేదు? సమాధానం : నవారు మంచం

38. కన్ను ఉన్నా తలలేనిది? సమాధానం : సూది

39. కాటుక రంగు, కమలము హంగు ! విప్పిన పొంగు, ముడిచిన క్రుంగు ?  సమాధానం : గొడుగు 

40. బడి కాని బడి, ఏమి బడి? సమాధానం : రాబడి 

41. ఊరికి రెండు కళ్ళు, ఒకటి తెలుపుని చూస్తే, మరొకటి నలుపుని చూస్తుంది..?
సమాధానం : ఆకాశం (రాత్రి, పగలు) 

42. చుక్కలు చుక్కల రాణిని బంగారు వెన్నెల ప్రాణిని బిత్తర చూపులు దానిని చెంగుచెంగున దూకే దాన్ని..??  సమాధానం : జింక (లేడి) 

43. కిట కిట తలుపులు కిటారు తలుపులు ఎప్పుడు మూసిన చప్పుడు కావు ? 
సమాధానం : కను రెప్పలు 

44. పుట్టినపుడు పురుగు ! పెరిగితే పువ్వుల రాజు ? సమాధానం : భ్రమరము

45. హారము కాని హారము, ఏమి హారము ? సమాధానం : ఆహారము

46. అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికొచ్చింది తైతక్క లాడింది ?
సమాధానం : చిల్ల కవ్వ

47. నన్ను కొడితే ఊరుకోను, గట్టిగా అరుస్తాను, దేవుడ్ని పిలుస్తాను ?  సమాధానం : గుడి గంట 

48. చూస్తే చిన్నోడు, వాడి ఒంటి నిండా నారా బట్టలు ?  సమాధానం : టెంకాయ 

49. చూస్తే గజి బిజీ, తింటే కరకర ?  సమాధానం : జంతిక 

50. నాకు నోరు లేదు కానీ మాటలాడుతాను, చెవులు లేవు కానీ ఎంత చిన్నగా మాట్లాడినా విని అందరికీ తెలియచేస్తాను ? సమాధానం : మైకు 

51. చిక్కటి కారడవిలో చక్కటి దారి ?  సమాధానం : పాపిట 

52. చారల పాపకి దూది కుచ్చు! ? సమాధానం : ఉడుత 

53. కొట్టకుండా తగిలే దెబ్బ ఏమిటి ? సమాధానం : వడదెబ్బ 

54. కరవలేని పాము ?  సమాధానం : వెన్నుపాము 

55. అరచెయ్యంత పట్నంలో అరవై గదులు; గదికొక్క సిపాయి; సిపాయికొక్క తుపాకీ ?
సమాధానం : తేనె పట్టు 

56. వెలిగించలేని క్యాండిల్ ? సమాధానం : ఫిల్టర్ క్యాండిల్

57. వాహనాలకు ఉండని టైర్ ఏమిటి ? సమాధానం : సెటైర్ 

58. అంకెల్లో లేని పది ? సమాధానం : ద్రౌపది

59. ఇంటికి పెట్టలేని గేట్ ఏమిటి ? సమాధానం : ఇంట్రాగేట్ 

60. అందరికి నచ్చే బడి ఏమిటి ? సమాధానం : రాబడి 

61. మొక్కకు పూయని రోజాలు ఏమిటి ? సమాధానం : శిరోజాలు 

62. వేసుకోలేని గొడుగు ఏమిటి ? సమాధానం : పుట్టగొడుగు 

63. డబ్బులుండని బ్యాంక్ ఏమిటి ? సమాధానం : బ్లడ్ బ్యాంక్ 

64. నారి లేని విల్లు ఏమిటి ? సమాధానం : హరివిల్లు 

No comments:

Post a Comment