Tuesday, February 24, 2026

Ridge Gourd Beerakaya for Health Telugu - పోషకాల గని బీరకాయ

పోషకాల గని బీరకాయ

బీరకాయలు పోషకాల గని అని చెప్పవచ్చు. ఇవి విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ తో సమృద్ధంగా ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ కె, ఫోలేట్, పొటాషియం అధికంగా ఉంటాయి.

విటమిన్ సి వల్ల రోగ నిరోధక శక్తి పెరిగి, అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుతుంది. ఫైబర్ ఉండటం మలబద్దకం సమస్య తగ్గి జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది.

పొటాషియం రక్తపోటును నియంత్రించి, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. బీటా-కెరోటిన్ చర్మానికి కాంతినివ్వడంతో పాటు, ముడతలు పడకుండా కాపాడుతుంది.

తక్కువ కేలరీలు ఉన్న బీరకాయలు బరువు తగ్గాలనుకునే వారికి అనువైన ఆహారం. బీరకాయల్లోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది.

రక్తహీనతను దూరం చేయడంలోనూ ఈ బీరకాయలు బాగా హెల్ప్ చేస్తాయి. ఇందులో ఎక్కువగా ఐరన్ కంటెంట్ ఉంటుంది.

దీని వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతుంది. దీని వల్ల రక్తహీనత సమస్య దూరమవుతుంది.

No comments:

Post a Comment