ఉప్మా తింటే కలిగే ప్రయోజనాలు
చాలామంది ఉప్మా తినడానికి అంత ఆసక్తి చూపరు అయితే ఉప్మా తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఎప్పుడు మనం తెలుసుకుందాం..
ఉప్మాను తింటే సాఫీగా జీర్ణం అవుతుందట. అలాగే జీర్ణ సమస్యలను కూడా ఉప్మా మెరుగు పరుస్తుందని చెబుతున్నారు. దీంతో కడుపులో మంట, గ్యాస్ వంటి సమస్యలు కూడా ఉండవట.
మల బద్ధకం సమస్య కూడా తగ్గిపోతుందని చెబుతున్నారు. అలాగే ఉప్మాను మంచి డైట్ ఫుడ్ గా తీసుకోవచ్చట. రోజులో ఒకసారి ఉప్మా తిన్నా బరువు తగ్గేందుకు సహాయపడుతుందని చెబుతున్నారు.
ఉప్మాలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం తిన్నా కూడా కడుపు నిండిన భావన కలుగుతుంది.
ఉప్మా తినడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయట. ఉప్మాలో ఉండే ఆహార పదార్థాల వల్ల బాడీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందట.
అల్లం, క్యారెట్, జీలకర్ర ఆవాలు, కరివేపాకు, కొత్తి మీర, ఉల్లిపాయ, టమాటా, పల్లీలు, పచ్చి మిర్చి వీటి వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అందుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యచిట్కాలు
No comments:
Post a Comment