ఔర్వుని జన్మవృత్తాంతము
జనమేజయుడు వ్యాస మునీశా! ఆ భృగుపత్నులు తమ దుఃఖసాగర మెట్లు తరించిరి? భార్గవుల వంశము తిరిగి యెట్లు వృద్ధిగాంచెను? లోభపాపాత్ములగు హైహయ రాజులు విప్రులను జంపిన పిమ్మట నేమిచేసిరో తెలుపుము. మహాత్మా! నీ లలిత వచనామృతము నరులకిహపర సాధకము. దానినెంత క్రోలినను నాకు తనివి తీరుట లేదు. అనగా
వ్యాసుడిట్లనెను : రాజా! విప్రస్త్రీలు దాటరాని దుఃఖమెట్లు దాటిరో దానికి సంబంధించిన పాపహరమగు దివ్యకథ వినిపింతును. శ్రద్ధగా వినుము. అట్లు హైహయులచే పీడితులైన భృగు స్త్రీలు భగ్నహృదయులై భయత్రస్తలై హిమగిరి గుహలకేగిరి. వారెల్లరును పావన గంగాతీరమునందు మట్టితో గౌరమ్మ తల్లిని పూజించిరి. వారు చావునకు తెగబడి యుపవాసములు జేసిరి.
అంత నొకనాడు వారి కలలో శ్రీలోకైకమాత దర్శన మొసంగినది. 'మీలో నొకరితకు తొడలనుండి నా దివ్యాంశముతో నొక దివ్య పురుషుడుద్భవింపగలడు. అతడు మీ కాగల కార్యములన్నియు చక్కపెట్టగలడు' అని పరాంబిక పలికి యంతర్ధాన మొందెను. ఆ పరాంగనలెల్లరు మేలుకొని సంతోషించిరి. వారందఱిలో భయ వ్యాకులత్వములు గల యొక కామిని గలదు. ఆమె కడు నేర్పరి. ఆమె తన వంశము నిలువబెట్టు కొనుటకు తన పెందొడలో గర్భము దాల్చెను.
ఆమె హైహయులకు వెఱచి పారిపోవుచు వారి కంటబడెను. 'ఆమె నుండి దివ్యకాంతులు విరియుచున్నవి. ఆమె భీతితో పారిపోవుచున్నది. పట్టుడు - కొట్టుడు. ఈమె గర్భిణి' యని హైహయులు కేకలిడి పల్కుచు కత్తులు చేబూని యామెను జేరిరి. ఆ భయార్త తన్ను సమీపించువారిని గనెను. ఆమె యే రక్షణము లేక గర్భరక్షణ కొరకు దీనముగ నెలుగెత్తి వాపోయెను.
ఆమెకపుడు నా' యనువాడు లేకుండెను. ఆ గర్భిణి సింహము చేత జిక్కిన లేడిపిల్లవలె హైహయులచేత చిక్కి బాధలు పెట్టబడెను.
ఆమె కన్నుల నీరునిండ ఏడ్చెను. అట్లు విలపించు తన తల్లినిగాంచి యొక బాలకు డామె తొడ చీల్చుకొని వచ్చి చండకోపముతో రెండవ సూర్యునివలె భాసిల్లుచు తన తీక్ష తేజముతో క్షత్రియుల చూపుల వెలుగు లార్పివేసెను. ఆ బాలుని చూడగానే వారు గ్రుడ్డివారైరి. 'పుట్టు గ్రుడ్డి వారివలె మనకీ దురదృష్టమేమ' నితలపోయుచు వారు గిరి దుర్గములు పట్టి సాగిరి.
ఆమె కన్నుల నీరునిండ ఏడ్చెను. అట్లు విలపించు తన తల్లినిగాంచి యొక బాలకు డామె తొడ చీల్చుకొని వచ్చి చండకోపముతో రెండవ సూర్యునివలె భాసిల్లుచు తన తీక్ష తేజముతో క్షత్రియుల చూపుల వెలుగు లార్పివేసెను. ఆ బాలుని చూడగానే వారు గ్రుడ్డివారైరి. 'పుట్టు గ్రుడ్డి వారివలె మనకీ దురదృష్టమేమ' నితలపోయుచు వారు గిరి దుర్గములు పట్టి సాగిరి.
మన మందఱ మొకేసారి యీ బాలుని జూచినంతనే గ్రుడ్డివారమైతిమి. దీనికి కారణమా బ్రాహ్మణ స్త్రీ పాతివ్రత్య ప్రభావమే యగును. వారు మనచే పీడింపబడిరి. వారిమోఘ సంకల్పులు. క్షణములో నేదైన చేయజాలుదురు అని కనువెలుగులేని దిక్కులేని - హైహయులు తలంచిరి. వారు దిక్కుగానక బ్రాహ్మణ స్త్రీని శరణు వేడిరి. భయకంపితురాలగు నామెకు దోసిలొగ్గి నమస్కరించి భయగ్రస్తయగు నామెను చూపువెల్గుకొఱకిట్లు ప్రార్థించిరి :
'కళ్యాణీ! మమ్ము దయజూడుము. మాకు కన్నులు గనిపించుటలేదు. మేము పుట్టంధులవలె నీ మోము జూడజాలకున్నాము. నీ తపో వీర్య మత్యద్భుతము. మేము పాపులము. ఇకేమి చేయగలము? మేము నిన్నే శరణు బొందితిమి. మాకు చూపు ప్రసాదింపుము. గ్రుడ్డితనము చావు కంటె చెడ్డది. మాపై దయబూనుటకు నీవే తగుదువు. మేము సుక్షత్రియులము.
మా కనుచూపు తిరిగి వచ్చిన పిదప నీకు సేవకులమై యుండగలము. ఇకనుండి పాపములు చేయక మా యిండ్ల కేగగలము. ఇకమీద నిట్టి నీచకార్యముల కేవిధముగ నొడిగట్టము. ఎల్ల భార్గవులకును సేవకులమై మెలంగుదుము. మేము తెలివి తక్కువ తనముతో మీ యెడల తప్పు చేసితిమి. మమ్ము క్షమింపుము. ఇకమీద భార్గవుల జోలికి బోము.
ఇక క్షత్రియులకు మీకు పొరపొచ్చెము లుండవు. తల్లీ! హైహయులమగు మేము శపథము చేసి చెప్పుచున్నాము. మీకు చేయెత్తి మ్రొక్కుదుము. మీరింక మీద పుత్రవంతులై సుఖ ముండును. కల్యాణీ! మమ్ము దయజూడుము. ఇంకెన్నడును మిమ్ము ద్వేషింపము'' అను హైహయుల దీనవాక్కులు విని బ్రాహ్మణి యచ్చెరువందెను.
కన్ను వెల్గులు పోగొట్టుకొని దీనార్తులై వినతులైన రాజులతో ఆమె ఇట్లనెను :
కన్ను వెల్గులు పోగొట్టుకొని దీనార్తులై వినతులైన రాజులతో ఆమె ఇట్లనెను :
'క్షత్రియులారా! మీ చూపులను నేను బోగొట్టలేదు. నాకు మీ యెడల కోపము లేదు. ఇందు సత్య మేదో మీరే తెలిసికొనుడు. ఈ భార్గవ బాలుడు నా తొడల నుండి యుదయించెను. ఇతడే మీ యెడల కుపితుడయ్యెను. ఈతడు తన బంధువులను మా గర్భములందున్న శిశువులను సైతము మీరు చంపుట తెలిసికొనెను. ఇతడే మిమ్ము గ్రుడ్డివారిని జేసెను.
మీరు ధనాశకు బానిసలైతిరి. ఏ పాప మెఱుగక ధర్మవర్తనులైన భార్గవులను వారి స్త్రీల గర్భములను శిశువులను మీ పొట్టన పెట్టుకొంటిరి. అపు డీ బాలుడు నా యూరుగర్భములో నూరేండ్లు పెరిగెను. అందితడు వేద వేదాంగము లభ్యసించెను. ఇతడు భృగు వంశాభివృద్ధికి జన్మించెను. మీరితని పితరులను చంపితిరి. ఆ కోపమున మిమ్మితడు నాశము చేయదలచుచున్నాడు.
ఈ కుమారుడు శ్రీదేవీ వరప్రసాదమున నాకు గల్గెను. ఇతని మిఱుమిట్లుగొల్పు దివ్యతేజము గనలేక మీ చూపుకాంతులు మాసిపోయెను. ఇత డౌర్వుడన విఖ్యాతి గాంచగలడు. ఈ నా నందనుని వినయముతో సాగిలపడి వేడుకొనుడు. మీకు నేత్రదానము చేయగలడు'' అను బ్రాహ్మణి సాంత్వవచనములు వినిన పిదప హైహయులు సవినయముగ మునిసత్తముడగు నౌర్వునకు మ్రొక్కి తమపై కన్ను తెరచుమని సంస్తుతించిరి.
ఔర్వు డంత గ్రుడ్డివారి స్తోత్రమునకు గుండె కరుగగ వారి కిట్లనెను : రాజులారా! మీరు మీ మీ యిండ్ల కేగుడు. నా యీ పరమచరిత్రము మీరు చెప్పుకొనుడు. దైవయోగమున కానున్నది తప్పక జరుగును. తెలివిగల పురుషుడెప్పుడును దేనికిని విచార మొందడు. మీరు కోపమువీడి మీమీ యిండ్ల కేగుడు. ఇక ఋషు లందఱును పూర్వ మట్లు స్వాత్మ విచారమున సుఖ ముందురు గాక!''
అను మహావాక్కులు వినినంతనే హైహయులు చూపులు వెలుగొందెను. వారౌర్వునొద్ద ననుమతి గైకొని తమ ఇండ్ల కేగిరి. బ్రాహ్మణియు దివ్యశక్తిగల తన కుమారుని వెంటగొని తన యాశ్రమ మేగెను. ఆమె బ్రహ్మతేజస్సంపన్నుడగు తన కుమారుని కంటికి ఱప్పవోలె పోషించుచుండెను. రాజా! ఈ విధముగ నీకు భృగువంశజులనాశమును లోభాత్ములగు రాజు లొనర్చిన పాపకృత్యమును దెల్పితిని. అనగా –
జనమేజయు డిట్లనెను : హైహయుల ఘోరకృత్యములు వింటిని. ఆ యురువర్గముల వారంతగ నిడుములు పడుటకు లోభ##మే కారణము. మునీశా! నా కొక సందియము గల్గుచున్నది. దానిని దీర్చుకొనదలచితిని. నా రాజులకు భూమిపై హైహయులను పేరెట్లు వచ్చెను? యదువంశజులను యాదవులనియు భరత వంశజులను భారతులనియు నందురు. అటులే వీరి వంశమందు హైహయు డెవడేని గలడా? ఆ రాజులే పని చేయుట వలన హైహయులన బరగిరో ఆ కారణ మెఱుగగోరు చున్నాను. అనగా
జనమేజయు డిట్లనెను : హైహయుల ఘోరకృత్యములు వింటిని. ఆ యురువర్గముల వారంతగ నిడుములు పడుటకు లోభ##మే కారణము. మునీశా! నా కొక సందియము గల్గుచున్నది. దానిని దీర్చుకొనదలచితిని. నా రాజులకు భూమిపై హైహయులను పేరెట్లు వచ్చెను? యదువంశజులను యాదవులనియు భరత వంశజులను భారతులనియు నందురు. అటులే వీరి వంశమందు హైహయు డెవడేని గలడా? ఆ రాజులే పని చేయుట వలన హైహయులన బరగిరో ఆ కారణ మెఱుగగోరు చున్నాను. అనగా
వ్యాసు డిట్లనెను : రాజా! హైహయుల జన్మము వివరింతును. వినుము. వారి కథ పురాతనము - పుణ్యము - పాపనాశకము. ఒకప్పుడు రేవంతుడనువాడు రూపమున తేజమున సాటిలేని వాడుండెను. అతడు సూర్య తనయుడు. అతడొకనా డుత్తమహయమగు నుచ్చైఃశ్రవ మధిరోహించి విష్ణుధామమగు వైకుంఠధామ మేగెను. అతనిని లక్ష్మీదేవి చూచెను. ఆ యుచ్చైశ్శ్రవము సాగరము నుండి లక్ష్మికి తోబుట్టువుగ బుట్టెను. ఆమె దాని మేని జిగిసొబగుల కచ్చెరువంది చూచెను.
ఆ గుఱ్ఱమెక్కి వచ్చునట్టి యందగానిని గాంచి శ్రీహరి లక్ష్మితో నిట్లు పలికెను : ఓ కాంతా! ముల్లోకములను మోహపెట్టుచు రెండవ వలరాజువలె నొప్పి గుఱ్ఱమెక్కి యేతెంచు నత డెవ్వడు? లక్ష్మి గుఱ్ఱమునే చూచుచు దానియందే తగిలిన మనస్సుగల దగుటచే విష్ణువెన్ని మార్లు పిలిచినను పలుకలేదు. అట్లు చపలాక్షి - చంచల - యగు లక్ష్మి మనస్సు మోహవశమున గుఱ్ఱము సొంపులో తగుల్కొనుట విష్ణువు గనెను.
అపుడు విష్ణువు తీవ్రకోపముతో లక్ష్మి కిట్లనెను : ఓ సులోచనా ! ఏమి చూచుచున్నావు? నేనెంతగ పిలిచినను విననంతగ గుఱ్ఱమును గాంచి మోహపరవశవైతివి. నీ వెల్లెడల రమించుటవలన రమయను పేరున చంచలత్వము గల్గుట వలన చంచలయను సార్థకనామమున నొప్పుదువు.
అపుడు విష్ణువు తీవ్రకోపముతో లక్ష్మి కిట్లనెను : ఓ సులోచనా ! ఏమి చూచుచున్నావు? నేనెంతగ పిలిచినను విననంతగ గుఱ్ఱమును గాంచి మోహపరవశవైతివి. నీ వెల్లెడల రమించుటవలన రమయను పేరున చంచలత్వము గల్గుట వలన చంచలయను సార్థకనామమున నొప్పుదువు.
కళ్యాణి ! నీవును సామాన్యరమణివలె చంచలవై యొకచో నిలుకడగనుండక పరిభ్రమింపగలవు.
వామాక్షీ! నేను నీ దగ్గఱ నుండగనే నీ వా గుఱ్ఱమును గాంచి మోహ మందితివి. కనుక నీవును కష్టాలకు నెలవగు నేలపై ఆడు గుఱ్ఱమ వగుదువు గాక! అట్లు దైవయోగమున విష్ణువు శపింపగా లక్ష్మి గడగడలాడుచు భీతితో దుఃఖించెను. ఆమె శంకతో వినయముతో తన పతియగు శ్రీపతికి తల యొగ్గి మ్రొక్కి యిట్లనెను :
దేవదేవా! జగన్నాథా! గోవిందా! దయాసాగరా! ఈ కొలది తప్పున కింతగ శపించితివి! నీలో నింతటి కోపము దాగియున్నదని నే నెన్నడు నెఱుగను. నా మీద నీకున్న సహజమైన ప్రేమ యేమైనది? వజ్ర మెప్పుడైన తన శత్రులమీద పడును గాని తన వారిమీద పడునా? నేను నీ వరమునకు తగినదానను. శాపమున కెట్లు తగుదును? గోవిందా! నే నిప్పుడే నీ ముందే నీవు చూచుచుండగానే ప్రాణాలు తీసికొందును. నీవు లేనిచో నా యెడదలో పెను వేడిమంటలు రగుల్కొనును గదా? విభూ! ఈ నీ ఘోరశాపము దప్పించుకొని నీ సుఖకరమగు సన్నిధానము నేనాడు చేరగలనో దయచేసి తెలుపుము.
హరి యిట్లనెను : భూలోకమున నీకు నా వంటి కుమారుడు గల్గినపుడు నీవు మరల నన్ను బొంది సుఃఖింపగలవు అని లక్ష్మి ననుగ్రహించెను.
అధ్యాయము 139 హైహయ చరిత్ర
అధ్యాయము 139 హైహయ చరిత్ర
No comments:
Post a Comment