హైహయ చరిత్ర
అట్లు శ్రీ మహావిష్ణువు కోపముతో లక్ష్మిని శపింపగ నామె యిట్లు గుఱ్ఱమయ్యెను. ఆ రేవంతు డేమయ్యెను? ఏ యువతియైన తన పతి విదేశములనుండగ విరాళిచే కుందును. అటులే లక్ష్మియే దేశమున నాడు గుఱ్ఱమై యొంటిగ బాధ పడెను? లక్ష్మీదేవి యెంతకాల మొంటరిగ నిర్జన ప్రదేశమున నుండెను. ఆ పిమ్మట నామె యేమి చేసెను? శ్రీమన్నారాయణుడు లక్ష్మి చెంత లేడుగదా! ఆమెకెట్లు పుత్రుడుదయించెను? ఆమె తిరిగి శ్రీహరినెట్లు కలిసికొనెను? ఈ లక్ష్మీనారాయణుల చరిత మంతయు విన వేడుకగ నున్నది. దానినంతయు నాకు విశదీకరింపుము అని జనమేజయుడు ప్రశ్నింపగా వ్యాసు డా కథ యంతయు చక్కగ నిట్లు వివరింప దొడగెను.
ఓ జనమేజయా ! ఈ పురాణగాధ చెవులకింపుగొల్పును. పవిత్రమైనది. దీనిని లలితాక్షరములతో వినిపింతును చక్కగ వినుము. అట్లు హరిచే లక్ష్మి శపింపబడుట రేవంతుడుగాంచెను. అతడు భయమున హరికి మ్రొక్కి యచ్చోటు విడిచి వెళ్ళి వెంటనే తన తండ్రి చెంతకేగి యతనితో లక్ష్మిని హరి శపించిన విధానమంతయు వెల్లడించెను. రమాదేవియు చేయునదిలేక వగచుచు హరికి చేతులు మోడ్చి యతని యనుమతితో మనుజలోకమునకు వచ్చెను. పూర్వము సూర్యపత్ని యెచ్చోట తీవ్రతప మొనర్చెనో యచ్చోట లక్ష్మి గుఱ్ఱపు రూపు దాల్చి చేరెను. ఆ చోటు సువర్ణ గిరికి నుత్తరముగ కాళిందీ తమసానదుల తటమున సుందరవనములతో నొప్పారుచుండెను.
ఆమె యచట శ్రీచంద్రశేఖరుడు - త్రిశూలి - కామప్రదుడు - మహా దేవుడు - నగు శంకరుని గుఱించి యేకాగ్రచిత్తముతో ధ్యానించెను. పరమశివుడు పంచాననుడు - త్రిలోచనుడు - దశభుజుడు - అర్ధనారీశ్వరుడు - నీలకంధరుడు. కర్పూర గౌర శరీరుడు - శివుడు, పులితోలుదాల్పు - గజచర్మోత్తరీయుడు - నాగయజ్ఞోపవీతి - కపాల మాలాధరుడు - అట్టి శంకరుని గుఱించి యా పుణ్యతీర్థమున హయరూపము దాల్చిన లక్ష్మి తీవ్రతపమొనరించెను.

ఆ విధముగ రమాదేవి వైరాగ్యముతో పరమశివుని ధ్యానించుచుండగ వేయి దివ్యవర్షములు గడచెను. మహాదేవుడు - పశుపతి - ముక్కంటి - మహేశ్వరుడునగు శివుడు పార్వతీ సహితముగ వృషవాహనమెక్కి యామెకు ప్రత్యక్షమయ్యెను. శివుడు ప్రమథగణసమేతముగ యశ్వినీరూపమున
తపమొనరించు హరివల్లభతో నిట్లనెను : కళ్యాణీ! జగన్మాతా! నీ పతి సకలలోకపతి సర్వార్థప్రదాయకుడు. మఱి నీవేల యిట్లు తపించుచున్నావో తెలుపుము. దేవీ! జగన్నాధుడు భుక్తి ముక్తి ప్రదుడు. అట్టి జగత్పతియైన వాసుదేవుని వదలి నన్నేల స్తుతించుచున్నావు? ప్రతివారును పుణ్యశ్లోకము దివ్యమునైన వేదవాక్కు పాటించవలయును. సతులకు పతియే పరమదైవము.
కనుకనే యువతియు నితరునందెన్నడును తన మనస్సునుంచరాదు. ఎల్ల స్త్రీలకు పతిసేవయే పరమము; స్వధర్మము. తన మేలుగోరుకొను ప్రతి యువతియు తన పతి యెట్టివాడైన నతని నెల్లరీతుల గొలువవలయును. సింధు తనయా! నారాయణు డెల్లవారికి సంసేవ్యుడు యోగ్యుడు పురుషోత్తముడు. అట్టి దేవదేవేశుని విడనాడి నన్నేల ధ్యానించుచున్నావు?
అన లక్ష్మి ఇట్లనెను : శంభూ! దయాళూ! దేవేశా! ఈశా! మహేశా! నా పతి నన్ను శపించెను. కనుక నీవు నన్నీ శాపమునుండి సముద్ధరింపుము. నేను సవినయముగ హరిని ప్రార్థింప నతడు దయతో నాకు శాపమోక్ష మీరీతిగ దెలిపెను. 'ఓ కమలాలయా! నీకు పుత్రుడు గల్గినపుడు శాపమోచనము గల్గును. అపుడు నీవు తిరిగి వైకుంఠమందు నివసింపగలవు'' అని హరి యనగనే నేను తపము చేయుటకీ తపోవనము జేరితిని.

నీవు సర్వకామప్రదుడవు. కనుక నిన్నే యారాధించుచున్నాను. దేవదేవా! భర్తతో సంగమము లేక పుత్రునెట్లు పడయగలను? నేను నిరపరాధను. నా పతి నన్ను వదలి వైకుంఠమందున్నాడు.
శంకరా! నీవు సుప్రసన్నుడవైనచో నాకు కామ్యవరమొసంగుము. నీకును శ్రీహరికిని భేదభావమెందును లేదు. గిరిజామనోహరా! పూర్వము నా పతి వలన శివుడే విష్ణువు - విష్ణువే శివుడని యెఱింగితిని. ఇందు సందియమేమియు లేదు. నేను మీ యిర్వురిలో నొక్కరూపు గాంచితిని. కనుక నిన్నే స్మరించుచున్నాను. అది తెలియక నిన్నాశ్రయించినచో నాకు దోషము గల్గును.
శివుడిట్లనెను : క్షీరసముద్రరాజతనయా! సుందరీ! శ్రీహరికి నాకు గల యేకత్వమెట్లెఱుంగ గల్గితివో నిక్కము పలుకుము. మునులు - సురలు - వేదతత్త్వము తెలిసిన జ్ఞానులును - మా యేకత్వమెఱుంగలేరు. వారు కుతర్కములకు లోనగుదురు. నా భక్తులలో పెక్కురు తెలియక వాసుదేవుని నిందింతురు. విష్ణు భక్తులలో పల్వురు నన్ను తెగడుదురు.
దేవీ! మూర్ఖులు కలికాలమున కాలయోగమున మమ్మెక్కువగ ద్వేషింతురు. మా యేకత్వము మహోదారులకును తెలియరాదు. నీ వెట్లెఱిగితివి? కనుక మా యిర్వురి ఏకత్వ మెఱుగుట కడు దుర్లభము అని శంభుడు లక్ష్మితోనన రమాదేవి ప్రసన్నవదనముతో శివునితో నీ విధముగ చెప్పసాగెను :
లక్ష్మి యిట్లనెను : దేవదేవా! మున్నొకప్పుడు విష్ణువు పద్మాసనమందుండి యేకాంతమున పరమధ్యానపరుడై యుండుట గాంచితిని. కొంతవడికి హరి ధ్యానము చాలించి సుప్రసన్నుడయ్యెను. అపుడు నేను నా పతిని సవినయముగ నిట్లు ప్రశ్నించితిని :

దేవదేవా! ప్రభూ! పూర్వము దేవదానవులు సాగరమును చిలుకగ నేనందుండి యుద్భవించితిని. అచట బ్రహ్మాది సురలుండిరి. వారు పతినెన్నుకొనుచున్న నన్ను గాంచిరి. వారిలో నీవు సర్వశ్రేష్ఠుడవై యుండుట వలన నేను నిన్నే వరించితిని. అట్టి సర్వేశ్వరుడువగు నీ విపుడెవరిని ధ్యానించుచున్నావు? నీ మనోగత మేదియో తెలుపుము. నీవు నాకత్యంతము ప్రియతముడవు అనగా
విష్ణు విట్లనెను : 'కాంతా! వినుము. నేను నెమ్మదిలో గిరిజాపతి - శీఘ్రసంతోషి - సురోత్తముడు నగు శివుని ధ్యానించుచున్నాను. ఒక్కొక్కప్పుడు మహావిక్రముడగు మహాదేవుడు సైతము నన్ను ధ్యానించును. నేనును త్రిపురహరుడు దేవేశుడు శంకరుడు నగు హరుని ధ్యానింతును. ఆ శంకరునకు నేను ప్రాణ ప్రియుడను. అతడు నాకు నంతియే. మా యిర్వురి చిత్తములు గాఢముగ నొకటిగనుండును. మాలో మాకు భేదము లేదు.
విశాలాక్షీ! అట్టి మహాదేవుని ద్వేషించు భక్తులు తప్పక నరకమున గూలుదురని నీతో నిజము పల్కుచున్నాను.'' నేనేకాంతమున నడిగిన ప్రశ్నమునకు ప్రభవిష్ణువగు విష్ణువు నాతో నట్లు పలికెను.
కనుక నీవు విష్ణువునకు ప్రియుడవని యెఱిగి నిన్నే ధ్యానించుచున్నాను. మహేశా! నాకు నా ప్రియునితో సంగము గల్గునట్టు లొనరింపుము అని లక్ష్మి పలుకగ విని వాక్యవిశారదుడగు శివుడు మధుర ప్రియవచనములతో లక్ష్మి నూరార్చి యిట్లనెను :

నితంబినీ! నీ తపమునకు మెచ్చితిని. ఇక నిశ్చింతగ నుండుము. నిన్ను నీ ప్రియునితో తప్పక చేర్పగలను. నా ప్రేరణ వలన జగన్నాథుడగు భగవానుడు గుఱ్ఱమురూపము దాల్చి నీ మమతలు పండింప నిచటికి రాగలడు. మధుసూదనుడు హయరూపమున మదాతిరేకమున పరవళ్ళు ద్రొక్కుచు వచ్చి నిన్ను గలియు విధముగ నే నతనిని ప్రేరింతును.
సుముఖీ! నీకంతట నారాయణుని వంటి పుత్రుడు గల్గును. అతడీ నేలపై భూపాలుడై యెల్లలోకములకు వందనీయుడు కాగలడు. సౌభాగ్యవతీ! అట్లు నీవు పుత్రునిబడసి పిదప నీ పతితో వైకుంఠమేగి విష్ణుప్రియవుగాగలవు. ఆ నీ కుమారు డేకవీరుడను పేర వన్నె గాంచును. అతని మూలమున భూమిపై హైహయ వంశము విస్తరిల్లును. నీవు మదాంధురాలవై మత్తచిత్తవై నీ హృదయపీఠమందున్న శ్రీమాతయగు పరమేశ్వరిని మఱచితివి.
కనుక నిట్టి క్లేశములు పడితివి. త్రైలోక్య కుటుంబినీ! ఆ దోషముల శాంతికి నీ హృదయకమలకోశమందలి పరాదేవతను సర్వాత్మ భావమున శరణు పొందుము. ఆనాడు నీ చిత్త మా యానంద స్వరూపిణియందు లగ్నమెయున్నచో గుఱ్ఱమందెట్లు చిక్కుకొనును? అని గిరిజారమణుడగు శంకరుడు లక్ష్మీదేవికి వరమొసగి గిరిజతో నంతర్ధాన మొందెను.
లక్ష్మి యచ్చోటనే యుండెను. ఆమె దేవాసుర శిరోరత్నములను దాకుచు దివ్యనఖములతో నలరారు శ్రీదేవీచరణ కమలయుగమును ధ్యానించుచు మాటిమాటికి ప్రేమగద్గద వాక్కులతో దేవిని సంస్తుతించుచు గుఱ్ఱము రూపుదాల్చి తన ప్రియుడగు హరిరాకకు దారితెన్నులు చూచుచుండెను.
No comments:
Post a Comment