Wednesday, April 22, 2026

Sri Ramanujacharya - రామానుజాచార్యుడు

రామానుజాచార్యుడు (1017-1137 CE)

రామానుజ చోళ సామ్రాజ్యం క్రింద ఉన్న శ్రీపెరంబుదూర్ (ప్రస్తుత తమిళనాడు) అనే (భూతపురి పూర్వపు నామం)గ్రామంలో ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో 1017 AD లో జన్మించాడు. శ్రీపెరంబుదూరు చెన్నై పట్టణానికి సుమారు పాతిక కిలో విూటర్ల దూరంలో ఉంది. అతను తల్లి కాంతిమతి మరియు తండ్రి ఆసూరి కేశవ 


కలియుగం 4118 సంవత్సరం, శాలివాహన శకం ప్రకారం 930 సంవత్సరం అవుతుంది. ఆయన జనన కాలానికి, కుటుంబానికీ సంబంధించిన ఇతర వివరాలు: పింగళ నామ సంవత్సరం, చైత్ర మాసం. శుక్లపక్షం పంచమి తిథి, బృహస్పతి వారం, ఆర్ద్రా నక్షత్రం, కర్కాటక లగ్నం. ఆయన తల్లి కాంతమతి, తండ్రి కేశవ 
సోమయాజి. హరీత గోత్రం. ఆపస్తంబ సూత్ర యజుశ్శాఖా ధ్యాయులు.

రామానుజులు తండ్రి వద్దా, కాంచీపురంలోని యాదవ ప్రకాశకుల వద్దా ఆయన విద్యాభ్యాసం జరిగింది. విద్యాభ్యాస కాలంలోనే ఆయనలోని విశిష్టాద్వైత సిద్ధాంత విశ్వాసాలు వికాసం పొందాయి. గురువు తోనే భేదించి తన విశిష్టాద్వైత వాదాన్ని నెగ్గించుకొన్న ప్రతిభాశాలి. ఆయనకు ముందు నుంచే విశిష్టాద్వైతం ఉంది. దానిని బహుళ వ్యాప్తిలోకి తీసుకొని రావడం రామానుజుల ఘనత. విద్యాభ్యాస కాలానికి విశిష్టాద్వైతం ఒక సిద్ధాంతంగా ఆయన విశ్వాసాలను తీర్చిదిద్దలేదు. ఆయనకు సహజంగా ఏర్పడిన విశ్వాసాలు అప్పటికే స్థిరపడి ఉన్న విశిష్టాద్వైతానికి అనుగుణంగా ఉన్నాయని, అప్పటికి విశిష్టాద్వైతంలో ఉన్నతుడుగా ఉన్న యామునాచార్యుడు రామానుజుడిని విశిష్టాద్వైత మత ప్రవర్తకుడుగా ప్రోత్సహించాడని అంటారు.

రామానుజ 11వ శతాబ్దంలో ప్రసిద్ధ వేదాంత పండితుడైన యమునాచార్యుడిని కలవడానికి ప్రయత్నించాడు, అయితే వారు కలవలేక పోయారు. యాదవ ప్రకాశాన్ని విడిచిపెట్టిన తర్వాత, రామానుజుడు మరొక వేదాంత పండితుడైన మహాపూర్ణ అని కూడా పిలువబడే పెరియ నంబి ద్వారా శ్రీ వైష్ణవంలోకి దీక్ష పొందాడని చరిత్రకారులు చెప్తారు.

రామానుజుడు కాంచీపురంలోని వరదరాజ పెరుమాళ్ ఆలయం(విష్ణువు) లో పూజారి అయ్యాడు, అక్కడ మోక్షం ( సంసారం నుండి విముక్తి ) సాధించడం అనేది అధిభౌతిక, నిర్గుణ బ్రహ్మంతో కాకుండా విష్ణువు సహాయంతో సాధించాలని బోధించడం ప్రారంభించాడు. విశిష్టాద్వైతం (జీవుడు, ప్రకృతి మరియు ఈశ్వరుడు వేర్వేరుగా ఉన్నా, ఈశ్వరునితో అనుసంధానించబడి ఉంటారు) అయన తత్త్వం. 
రామానుజులు శ్రీ వైష్ణవ సంప్రదాయంలో చాలా కాలంగా అగ్రగామిగా ఉన్నారు.

భక్తి మార్గం ద్వారా ఈశ్వర ప్రాప్తిని బోధించారు. సమానత్వం, దైవభక్తిని ప్రబోధిస్తూ శ్రీభాష్యం వంటి ప్రసిద్ధ గ్రంథాలను రచించారు.

ప్రధాన రచనలు: బ్రహ్మ సూత్రాల శ్రీ భాష్యం, గీతా భాష్యం, వేదార్థ సంగ్రహం, వేదాంత దీపిక, వేదాంత సారం. శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం, శరణాగత గద్యం మొదలైన గ్రంథాలను రచించారు.

ప్రారంభ జీవితం
రామానుజుడుకి అతని గురువు యాదవ ప్రకాశవేద సాహిత్యాన్ని వ్యాఖ్యానించడంలో విభేదాల కారణంగా విడిపోయినప్పుడు, రామానుజ కంచిలోని వరదరాజ పెరుమాళ్ ఆలయానికి భక్తుడయ్యాడు . ఈ కాలంలో, రామానుజుల ఉపన్యాసాల కీర్తి చాలా దూరం చేరుకుంది.

వైష్ణవ ఆచార్యుడు, శ్రీరంగంలోని రంగనాథస్వామి దేవాలయం యొక్క మఠాధిపతి అయిన యమునాచార్య రామానుజులను చాలా చిన్న వయస్సు నుండి గమనించేవారు. అయన తన తదుపరి వారసునిగా గుర్తించారు. అందువల్ల ఆలయ వ్యవహారాల్లో తనకు కార్యదర్శి అయిన శ్రీ మహాపూర్ణ అనే శిష్యుడిని పిలిపించి కంచికి వెళ్లి రామానుజులను తీసుకురావాలని కోరాడు.

మహాపూర్ణ రామానుజులను కలుసుకుని, తన గురువు కోరికను తెలియజేసినప్పుడు, రామానుజులు చాలా సంతోషించారు. వెంటనే 
వారిద్దరూ శ్రీరంగానికి బయలుదేరారు. కానీ అప్పటికే శ్రీరంగంలో యామునాచార్య మరణించారని తెలిసింది. 

అప్పుడు వెంటనే రామానుజులు కంచికి బయలుదేరి వెళ్లి యమునాచార్యుడి మరణానికి శ్రీ రంగనాథుడిని బాధ్యులుగా భావించి పూజించడానికి నిరాకరించారు.

కానీ కొంతకాలానికి, తిరువరంగ అరైయర్ మరియు వైష్ణవ సమాజానికి చెందిన ఇతర సభ్యులకు యామునాచార్యుల వారి మరణం వల్ల వైష్ణవ సమాజంలో శూన్యత ఏర్పడిందని భావించారు. కావున, శ్రీ మహాపూర్ణగారు మరోసారి వెళ్లి రామానుజులను శ్రీరంగానికి ఆహ్వానించాలని నిర్ణయించుకున్నారు.

ఇంతలో, కంచిలో, రామానుజులు కాంచీపూర్ణ అనే గురువుని కలుసుకునేవారు. అంతేకాక ఆయనకు శిష్యుడు కావాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయమై కాంచీపూర్ణను సంప్రదించగా, కాంచీపూర్ణ రామానుజుల కులానికి చెందినవాడు కానందున మర్యాదపూర్వకంగా నిరాకరించి, 
తనకు తగిన గురువు లభిస్తాడని చెప్పాడు. 

దీని తర్వాత కాంచీపూర్ణ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడానికి తిరుపతికి బయలుదేరి ఆరు నెలల తర్వాత తిరిగి వచ్చారు. చివరకు అతను తిరిగి వచ్చినప్పుడు, అతని ద్వారానే వరదరాజులు రామానుజులకు తన కోరికను తెలియజేసారు.

అందుకని కాంచీపూర్ణ రామానుజులకు శ్రీరంగానికి బయలుదేరి వెళ్లాలని భగవంతుని కోరిక అని సలహా ఇచ్చాడు.

రామానుజులు విశిష్టాద్వైతం సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. దీన్ని పాటించేవారినే శ్రీ వైష్ణవులుగా గుర్తిస్తారు. నుదుటన నిలువు నామం పెట్టుకుని భుజాలపై శాశ్వతంగా, శంఖ చక్రాల ముద్రలు వేసుకోవడం వీరి లక్షణం. 

ఈ మత శాఖకు చెందిన సన్యాసాశ్రమం తీసుకున్న వారిని జీయర్లు అంటారు. ఇలయ పెరుమాళ్, ఎంబెరుమానార్, యతిరాజ, భాష్యకార వంటి పేర్లున్నాయి. వేదార్థ సంగ్రహం, శ్రీ భాష్యం, గీతా భాష్యం వంటి గ్రంథాలు రాశారు.

రామానుజులు దేశ వ్యాప్తంగా విశిష్టాద్వైతాన్ని ప్రచారం చేయడానికి పలువురు సింహా సనాధిపులను, జియ్యంగార్లను, పరమై కాంతులను నియమించారు. చాత్తాద వైష్ణవులూ, అమ్మం గార్లూ శ్రీ వైష్ణవ దాసులు కైంకర్యం చేసే సంప్రదాయాలను ఏర్పరిచారు.

రామానుజుడు విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చినవాడైనప్పటికీ, కొన్ని సంప్రదాయాలను ఆయన పాటించలేదు. ఉదాహరణకు పదునెనిమిది సార్లు తిప్పించుకొని ఎట్టకేలకు తిరుమంత్రాన్ని ఉపదేశించిన గోష్ఠీపూర్ణులనే తిరుక్కోట్టియార్‌ నంబి ఆదేశాన్ని కాదని ఒక విష్ణ్వాలయం గోపురం నుంచి తిరుమంత్రాన్ని అందరికీ వినపడేలా ప్రకటించారు.

తిరుక్కోట్టి యార్‌ నంబి యామునాచార్యుల శిష్యులలో ఒకరు. పరమ పవిత్రమైన ఈ మంత్రాన్ని ఎవరికి పడితే వారికి ఉపదేశించ వద్దనీ, విన్నంత మాత్రాన్నే ముక్తి కలుగుతుందనీ నంబి చెపితే ‘‘నేనొక్కడినీ దాని దుష్ఫలితాన్ని అనుభవిస్తే నేమి, అందరికీ ముక్తి కలుగుతుంది గదా!’’ అనే ఉదార భావనతో ఆయన గుడి గోపరం ఎక్కి తిరు మంత్రాన్ని అందరికీ అందించారు.


ఎవరికైనా చెబితే విన్న వారు పుణ్యాత్ములు, చెప్పిన వారు పాపాత్ములు అవుతారన్న నిబంధనను కావాలని అతిక్రమించారు. అందరికీ పుణ్యం వచ్చినప్పుడు తనకు పాపం వచ్చినా పర్వాలేదనేది ఆయన సిద్ధాంతం.' అని ప్రచారం.

కుల, మత భేదాలు లేకుండా భగవంతుని ముందు అందరూ సమానమేనని ప్రబోధించారు. ఆలయ ప్రవేశం, భక్తి మార్గంలో అణగారిన వర్గాలకు చోటు కల్పించారు.

రామానుజులకు 'యతిరాజు, ఎంబెరుమానార్, ఉడయవర్' అను బిరుదు నామాలు కలవు.

ఈ ఆచార్యుడు తన జీవితంలో సాధించిదలచిన (సాధించిన) ముఖ్య ఉద్దేశాలు:

మొదటిది, ప్రబలంగా కొనసాగుతున్న, బౌధ్ధ, జైన, శైవ, వైష్ణవ సంప్రదాయాలన్నీ అనాదిగా వస్తున్న వైదిక మతాన్ని అనుసరించి వచ్చినవేననీ, ఈ మతాలు దేవుడిని కొలవటానికి వచ్చిన వేర్వేరు మార్గాలే కానీ, వైదిక మతానికి బదులుగా పాటించవలసినవి కాదని నిరూపించటం.

రెండవది విశిష్టాద్వైత సిధ్ధాంతాన్ని ప్రతిపాదించటం.

ప్రస్థాన త్రయాన్ని సాధారణ జనానికి అందించడం.

తన జీవితం ద్వితీయార్ధం శ్రీరంగంలో గడిపిన రామానుజులు నూట ఇరవై సంవత్సరాలు జీవించి పుట్టిన సంవత్సరమైన పింగళలోనే మాఘ శుద్ధ దశమి శనివారం నాడు దేహ త్యాగం చేశారు. ఆయన జీవితానంతరం విశిష్టాద్వైతం "ద్రావిడ, సంస్కృతాల ప్రాబల్యాన్ని బట్టి తెంగలై, వడగలై అని రెండు శాఖలు ఏర్పడ్డాయి" 

No comments:

Post a Comment

Devatakrta Devistuti - దేవతాకృత దేవీస్తుతి

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - దేవతాకృత దేవీస్తుతి ఆ దయామతల్లిని దర్శించి దేవత లెల్లరును నమస్కరించిరి. వారికనులనిండ నందబాష్ఫములు నిండగ నోట...