Friday, April 17, 2026

Bugga Ramalingeswara Swamy Temple, Tadipatri, Anantapur district - బుగ్గ రామలింగేశ్వర ఆలయం, తాడిపత్రి అనంతపురం జిల్లా



బుగ్గ రామలింగేశ్వర ఆలయం, తాడిపత్రి అనంతపురం జిల్లా

మనదేశంలో వివిధ ప్రాంతాలలో మనకు ఆ పరమేశ్వరుని క్షేత్రాలు దర్శనమిస్తున్నాయి. ఒక్కో ఆలయంలో ఒక్కో పేరుతో కొలువై ఉన్న పరమేశ్వరుడు భక్తులకు దర్శనమిస్తూ వారి కోరికలను నెరవేరుస్తున్నాడు.

అదేవిధంగా మనదేశంలో ఎన్నో శివ ఆలయాలున్నప్పటికీ ఒక్కో ఆలయానికి ఓ ప్రత్యేకతను చాటుకున్నాయి.ఇలాంటి ప్రత్యేకత చెందిన ఆలయాలలో ఒకటిగా పేరుగాంచినది బుగ్గ రామలింగేశ్వర ఆలయం.

ఈ ఆలయంలో వెలసిన శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది.అంతటి ప్రత్యేకత కలిగిన ఈ ఆలయ స్థల పురాణం గురించి తెలుసుకుందాం.

అనంతపురం జిల్లా తాడిపత్రిలోని బుగ్గ రామలింగేశ్వర ఆలయం ఎంతో మహిమాన్వితమైన ఆలయంగా చెప్పవచ్చు.పెన్నా నది దక్షిణ
తీరంలో త్రేతాయుగంలో సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడి చేత ప్రతిష్టింపబడినది కావడంతో ఇక్కడ కొలువై ఉన్న స్వామివారిని రామలింగేశ్వరునిగా పూజిస్తారు.

బ్రాహ్మణుడైన రావణాసురుడిని చంపడం వల్ల వచ్చిన పాపం నుంచి విముక్తి పొందడం కోసం శ్రీరామచంద్రుడు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్య పాలనలో గుత్తి-గండికోట పరిపాలిస్తున్న పెమ్మసాని రామలింగ నాయుడు 1490 - 1509 మధ్య దీనిని నిర్మించాడు.

రామాచారి అని శిల్పకారుడు దాదాపు 650 మంది శిల్పులతో కొన్ని సంవత్సరాల పాటు ఈ ఆలయాన్ని నిర్మించారని అక్కడి శాసనాలు చెబుతున్నాయి.

ఈ ఆలయంలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఏడాదిలో 365 రోజులు గర్భగుడిలో కొలువై ఉన్న స్వామివారి లింగం కింద నుంచి జలధార ఊరుతూనే ఉంటుంది. బుగ్గ అనగా నీటి ఊట వర్షాలు లేకపోయినా వేసవి కాలం అయినా, నీటివనరులు ఎండిపోయిన ఈ ఆలయంలో శివలింగం కింద నుంచి మాత్రం నీరు ఊరుతూనే ఉంటుంది. ఈ విధంగా స్వామివారి లింగం నుంచి నీటి బుగ్గ ఏర్పడటంవల్ల ఈ ఆలయానికి బుగ్గ రామలింగేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఇప్పటికీ ఆ నీటి బుగ్గ రహస్యం ఏమిటో ఎవరికీ అంతుచిక్కడం లేదు.

దేవతలు తూర్పు ముఖంగా ఉండే ఇతర హిందూ దేవాలయాల మాదిరిగా కాకుండా, ఈ ఆలయంలో శివలింగం పశ్చిమాభిముఖంగా ఉంటుంది.

విష్ణు మందిరం ముందు ఏడు చిన్న స్తంభాలను కొట్టినప్పుడు, అవి 'సప్తస్వరాలు' (ఏడు సంగీత స్వరాలు) పలుకుతాయి. ఈ ఆలయ గోపురాలు అసంపూర్తిగా ఉన్నాయి. 

ఇది విజయనగర సామ్రాజ్య పాలనలో 1802లో కొలిన్ మెకంజీ సేకరించిన తాడిపత్రి కైఫియత్ ప్రకారం, ఈ ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యంలోని గుత్తి-గండికోట ప్రాంత పాలకుడైన రామలింగ నాయుడు నిర్మించినట్లు తెలుస్తుంది.

ఈ ఆలయం మొత్తం నల్లటి రాతితో నిర్మించడం మరొక ప్రత్యేకత. 

ఉత్సవాలు: ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం మాఘ మాస బహుళ అష్టమి మొదలుకొని ఫాల్గుణ మాసం శుద్ధ తదియ వరకు అనగా 11 రోజుల పాటు స్వామివారికి బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తారు.

రైలు రోడ్డు మార్గం: బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం తాడిపత్రి రైల్వే స్టేషన్ నుండి 4 కిమీ (2.5 మైళ్ళు) దూరంలో ఉంది.

మన దేవాలయాలు చారిత్రక నగరాలూ

No comments:

Post a Comment

Kings of the Surya Dynasty - Sukanya Vritthanamu - సూర్య వంశ రాజులు - సుకన్యా వృత్తాంతము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము -  సూర్య వంశ రాజులు - సుకన్యా వృత్తాంతము జనమేజయు డిట్లనెను : ఓ మహానుభావా ! సూర్యవంశమునందు బుట్టిన ధర్మజ్ఞులగ...