హైహయుల చరిత్ర
జనమేజయు డిట్లనెను : వ్యాసమునీంద్రా ! హైహయులను క్షత్రియులు బ్రహ్మహత్యాపాపమునకు వెఱవక భార్గవులను చంపిరంటివి. వారే కులమువారు? గొప్పవారికి కారణము లేక కోపమురాదు గదా! పితామహా! వారికి వైర మే కారణమున గల్గెనో తెలియబలుకుము. రాజులకు పురోహితులతో పగ యెట్లు వచ్చెను? రాజుల కంతటి కోపము గల్గుట కేదో కొలది కారణ ముండియుండును.
కానిచో బ్రాహ్మణుల నేల చంపుదురు. విప్రులు పూజనీయులు - నిరపరాధులు గదా! రాజులు బలవంతులే. ఐనను వారికి మాత్రము పాపభీతి యేల యుండదు? ఒకవేళ విప్రులలో నేదో కొలది దోషమున్న నుండవచ్చును. అంతమాత్రమున రాజశ్రేష్టులు వారి నేల చంపుదురు? మునీశా! నా యీ సందేహము బాపుట కీవే సమర్థుడవు. అట్లు రాజు ప్రశ్నించగా వ్యాసుడు నెమ్మదిలో వారి గత చరిత్ర గుర్తుకు తెచ్చుకొని ప్రీతిగదుర నిట్లనెను :
రాజా! హైహయరాజుల చరిత్రమతిపురాతనము ఆశ్చర్యకరము. దానిని నాకు తెలిసినంతవఱకెఱిగింతును వినుము. మున్ను హైహయవంశమందు కార్తవీర్యార్జునుడను రాజుండెను. అతడు సహస్ర బాహువు బలశాలి ధర్మవీరుడు. ఆతడు విష్ణునవతారమగు దత్తాత్రేయుని శిష్యుడు-సిద్ధుడు-శాక్తేయుడు-దాత-భృగువంశ బ్రాహ్మణులకు యజమానుడు - బ్రాహ్మణులచె యజ్ఞాదికర్మము చేయించుకొనువాడు.
ఆతడు ధర్మనిష్ఠుడు-మహాదాత. యాగములాచరించినవాడు భార్గవుల కనేక దానధర్మము లొసంగినవాడు. అతని దానముల వలన భార్గవులు హయరత్న సంపన్నులై ధనవంతులై పేరుగాంచిరి. కొన్నాళ్ళకు కార్తవీర్యడు స్వర్గధామ మేగెను. అంత హైహయులు దైవయోగమున కడుబీదవారైరి.
ఒకప్పుడు హైహయులకు కొంత డబ్బుకావలసి వచ్చెను. అపుడు వారు భార్గవులను యాచింపదలంచిరి. హైహయులు సవినయముగ విప్రులను ధనమడిగిరి, వారు లోభమతులై లేదులేదని వారికి చిల్లిగవ్వయు నీయకుండిరి.
కొందఱు భార్గవులు క్షత్రియులకు జంకి తమ ధనరాసులను నేలలో బాతిపెట్టిరి. మఱికొందఱు బ్రాహ్మణులకు దానమొసంగిరి. అట్లు భయార్తులగు భార్గవులు తమ దనరాసులను వేరొకచోటికి తరలించి తమతమ యాశ్రమములు వదలి గిరి దుర్గములు పట్టిపోయిరి. అట్లు తమ యజమాను లార్థిక సంకటములో నుండుట కనులార చూచియును విప్రుల ధనలోభమున వారికి ధనమీయక వనదుర్గములు పట్టిపోయిరి.
కొందఱు భార్గవులు క్షత్రియులకు జంకి తమ ధనరాసులను నేలలో బాతిపెట్టిరి. మఱికొందఱు బ్రాహ్మణులకు దానమొసంగిరి. అట్లు భయార్తులగు భార్గవులు తమ దనరాసులను వేరొకచోటికి తరలించి తమతమ యాశ్రమములు వదలి గిరి దుర్గములు పట్టిపోయిరి. అట్లు తమ యజమాను లార్థిక సంకటములో నుండుట కనులార చూచియును విప్రుల ధనలోభమున వారికి ధనమీయక వనదుర్గములు పట్టిపోయిరి.
పిదప రాజులు తమకు ధనమత్యావశ్యక మగుట వలన మిక్కిలి వగచిరి. వారు తుదకు ధనము దొరకునేమోయని భార్గవుల యాశ్రమముల జొరపడిరి. అంత భార్గవులు తమ యాశ్రమములు శూన్యము చేసి వెళ్ళిరి. అదిగని హైహయులు వారి యాశ్రమములలో ధనముండునని త్రవ్విరి. అట్లు త్రవ్వుట వలన కొందఱి యిండ్లలో ధనమెక్కువగ లభించెను. ఆ పిదప ధనమునకు వారెంయో శ్రమపడిరి. వారచ్చటచ్చట నేలలో నున్న ధనమంతయును త్రవ్వి తీసిరి.
వారు ధనాశచే నిరుగుపొరుగు బాపల యిండ్లకు నేగిరి. అట్లంతట త్రవ్వి వారెక్కువగ ధనము బడసిరి. బ్రాహ్మణులు వందురుచు వెఱగంది చేయునది లేక రాజులను శరణు వేడుకొనిరి. ఆ విధముగ రాజులు విప్రుల యిండ్లలో ధనము గొప్పగ బడసియును శరణువేడిన బ్రాహ్మణులను కూడ కోపతీవ్రతతో బాణముల కొట్టి చంపిరి.
వారట నుండి భార్గవులుండు గిరి దుర్గములు జేరి భార్గవులను చంపి వారి భార్యలగర్భములు జీల్చి స్వేచ్ఛగ విహరించిరి. వారు పాపభీతి లేక కంటబడిన భార్గవులనెల్ల వాడి ములుకులతో చంపిరి. మఱికొందఱి నవమానించిరి. అట్లు పాపాత్ములగు హైహయులు తమ గర్భములు ఛేదింపగ విప్రస్త్రీలు కురరిపక్షులవలె బోరున విలపించిరి.
ఆ ఘోరమును తీర్థవాసులగు నితర మునులు గాంచి 'పవిత్ర బ్రాహ్మణులపట్ల మీకీ దారుణ కోపము తగదు. ఉడుగు' డని హైహయులను వారించిరి. 'హైహయులారా! భృగుపత్నుల గర్భములు వ్రయ్యలు చేయుట మీకు తగనిపని. ఇది నీచము నింద్యము. నరుడు తీవ్రమైన పుణ్యపాపముల ఫలమిచ్చటనే పొందును కనుక తన మేలుగోరుకొనువాడిట్టి నీచకర్మము విడనాడవలయును.''
ఆ ఘోరమును తీర్థవాసులగు నితర మునులు గాంచి 'పవిత్ర బ్రాహ్మణులపట్ల మీకీ దారుణ కోపము తగదు. ఉడుగు' డని హైహయులను వారించిరి. 'హైహయులారా! భృగుపత్నుల గర్భములు వ్రయ్యలు చేయుట మీకు తగనిపని. ఇది నీచము నింద్యము. నరుడు తీవ్రమైన పుణ్యపాపముల ఫలమిచ్చటనే పొందును కనుక తన మేలుగోరుకొనువాడిట్టి నీచకర్మము విడనాడవలయును.''
అంత హైహయులు కోపముతో మునుల కిట్లనిరి : మీరెల్లరు సాధుపుంగవులు. పాపకర్మమునకు సరియగు నర్థమెఱుగరు. ఈ భార్గవులు పచ్చి మోసముతో దారులు గొట్టి దోచుకొను దొంగలవలె మా పెద్దలగు పూర్వజులనుండి ధనమపహరించిరి. వీరు పరులను పీడించువారు. కొంగవృత్తితో మోసముతో బ్రతుకువారు.
మాకొక తూరి ధనమత్యావశ్యక మయ్యెను. అపుడు మేమే సవినయముగ వీరిని ధనమిమ్మని వేడుకొంటిమి. ఐనను భార్గవులు తమ యజమాను లిబ్బందులలో నుంట నెఱిగియు ధనము లేదని మిన్నకుండిరి. వీరు మా కార్తవీర్యుని వలె గొప్పగ ధనము సంపాదించిరి. వీరు దాని నిన్ని నాళ్ళేల దాచియుంచిరి? యజ్ఞములు చేసి యాచకుల కేల దానము లీయలేదు?
విప్రులెప్పుడు నెక్కడను ధనము కూడ పెట్టగూడదు. వారు తప్పక యజ్ఞములు చేయవలయును. ఇతరులకీయవలయును. తాము సుఖముగననుభవింపవలయును. ఎక్కడనైన ధనమున్నచో దొంగల వలన - రాజుల వలన - దోపిడిగాండ్రవలన - నిప్పువలన భయము గల్గుచుండును.
ధనము తన్ను గాపాడు వాని నెటులైన వదలి వెళ్ళును. వాడు చచ్చినప్పుడైన తాను ధనమును వదలి పోవును. మేము నాల్గవ వంతు వడ్డీతో గూడ మొత్తము చెల్లింపగలము. అని మేమెంతయో వినయముగ ఈ విప్రులను వేడుకొంటిమి. కాని, లోభమున కొట్టుమిట్టాడుచున్న పురోహితులందుల కొప్పుకొనలేదు. ధనమునకు దానము భోగము నాశమునను మూడు దశలు గలవు.
పుణ్యాత్ములు దానిని దానభోగములకు వినియోగింతురు. కాని, పాపాత్ములు దానిని నశింపజేతురు. ఒకనికింత పెట్టక తానింత తినక ధనమును గూడబెట్టిన పిసినిగొట్టు మోసగాడు. వాడు దుఃఃతుడు. అట్టి వానిని రాజు దండింపవలయును. ఈ విప్రాధములు మాకు గురువులే. ఐనను వారు వంచకులు. కనుక వారిని చంపుటకు పూనుకొంటిమి. మమ్ము కోపింపకుడు.
ఇట్లు హైహయులు సహేతుకముగ పలికి మునులకు నచ్చజెప్పి భార్గవుల భార్యలను వెదకుటకు వెళ్ళిరి. అపుడు భృగు పత్నులు భయత్రస్తలై వాపోవుచు హిమగిరి జేరిరి. పాపమతులను దన దాహముగలవారునగు హైహయుల చేతులలో బడి విప్రులు పీడితులై చచ్చిరి.
ఇట్లు హైహయులు సహేతుకముగ పలికి మునులకు నచ్చజెప్పి భార్గవుల భార్యలను వెదకుటకు వెళ్ళిరి. అపుడు భృగు పత్నులు భయత్రస్తలై వాపోవుచు హిమగిరి జేరిరి. పాపమతులను దన దాహముగలవారునగు హైహయుల చేతులలో బడి విప్రులు పీడితులై చచ్చిరి.
లోభము మనుజునిలో దాగియున్న లోనిశత్రువు - అది దుఃఖకరము. తుదకు తీయని ప్రాణములు సైతము తీయగలది. లోభమెల్ల పాపములకు బానిసతొత్తుగ మారి తన కుల ధర్మమును గూడ విడనాడును. లోభము సొంత తల్లిదండ్రులను - బంధువులను - అన్నదమ్ములను - బావను - హితులను చంపించును.
అది మిత్రులను పుత్రులను అక్క సెల్లెండ్రను తుదకు గురువును సైతము చంపుటకు వెనుకాడదు. పాపమతితో నెంతటి చేయరాని పనియైన చేయింపగలదు. అది కామ క్రోధాహంకారములకన్న చెడ్డది. ఆత్మవైరి. దీని మూలమున నరుడు ప్రాణములు సైతము గోలుపోవును. ఇట్టి లోభముగూర్చి యేమని చెప్పుదును?
రాజా! నీ పూర్వజులగు కౌరవులు కర్మనిరతులు సన్మార్గులు ఐనను వారును లోభము మూలమున నిహతులైరి. భీష్ముడు ద్రోణుడు కర్ణుడు కృపుడు బాహ్లికుడు ధర్మజుడు కృష్ణార్జునులు భీముడు - వీరందఱు గొప్పవారు. వీరు బ్రతికియుండగానే కౌరవ పాండవులు తీవ్రయుద్ధమొనర్చిరి గదా! వారి కుటుంబములు సమూలముగ నాశనమయ్యెను గదా! దీనికంతటికి మూలకారణము లోభమే కదా!
దీనివలన పోరితములో ద్రోణుడు భీష్ముడు పాండుపుత్రులు నశించిరి. ఎందఱందరో సోదరులు తండ్రులు కుమారులు నిహతులైరి కదా! లోభాత్ముడెంతటి దారుణమైన చేయగలడు కనుక లోభమతులగు భార్గవులు పాపమతులగు హైహయులచేత మడిసిరి.
No comments:
Post a Comment