వ్యాసుడిట్లనెను: అట్లు దుఃఖార్తితో విలపించున్న శునఃశేపుని గని విశ్వామిత్రుడు దయాంతరంగుడై బాలుని చెంత కేగి యిట్లునెను.
''ఓ పుత్రాకా! నా వలన వరుణదేవుని మంత్రము గ్రహింపుము. దానిని నెమ్మనమున స్మరించుచు జపించినతో నీకు తప్పక మేలు గల్గును.'' అను విశ్వామిత్రుని వాక్కులు విని దుఃఖితుడగు శునఃశేవుడు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రమును మదిలో జపించెను.
ఆ మంత్రమును జపించెనంతలోనే వరుణుడు దయాకరుడై ప్రసన్నడై విప్రకోమరు మెదుట ప్రత్యక్షమయ్యెను. వరుణదేవుడే స్వయముగా వచ్చి దర్మనవిచ్చి నందుల కెల్లరు నాశ్చర్యమొంది ప్రమోద మొందిరి.
రోగాతురుడగు రాజు పరమ విస్మయమొంది తన ముందన్న దేవునకు దోసిలొగ్గి పాదములపైబడి నమస్కరించి యిట్లనెను.
దేవాదేవా! దయాసాగరా! నేను వట్టి మందమతిని. పాపని. లోభిని. అపరాధిని. నన్ను పవ్రితుని జేయుము. నేను సంతతి లేక కడు దుఃఖమొందితిని. పుత్ర వ్యామోహమున నిన్ను తూలనాడితిని. నేను దుర్మతిని. నన్ను క్షమింపుము.
ప్రభూ! దేవాదేవా! యాచకుడెప్పుడును దోసము లక్క చేయడు నేను పున్నామ నరక భయమున పుత్రునిగోరి నిన్ను మిక్కిలి మోసగించితిని. పుత్రులు లేని వారికి స్వర్గప్రాప్తి లేనే లేదను మాటకు భయపడి నిన్ను చుల్కనగ జూచితిని.
ఓ విభూ! నీవు జ్ఞానివి. నే నజ్ఞానిని. పుత్ర వ్యామోహమున మునిగితిని. రోగపీడితును దుర్జనుడను కనుక నా దోష మెన్నదగదు. ఓ ప్రభూ? దయానిధీ! నా కొడుకెక్కడికి వెళ్ళెనో నాకే తెలియదు. అతడు చావునకు వెఱచి నన్ను వంచించి వనముల కేగెను.
ఇపుడు నేనీ విప్ర బాలునకు డబ్బిచ్చి కొని తెచ్చితిని. ఈ కొన్న కొడుకుతో నిన్ను మెప్పించుట కీ జన్నము మొదలైనది. నీవు ప్రసన్నడవై దర్శనభాగ్య మొసంగితివి. ఇపుడు నా జలోదర వ్యాధి పూర్తిగ తొలగిపోయినది.
రోగార్తుడగు రాజు మాటలువిని వరుణుడు దయాశుడై యతని కిట్లనెను. రాజా! ఈ శునఃశేపుడు తన బ్రతుకు తీపిచే నన్ను జపించుచున్నాడు. ఇతనిని విడిచిపెట్టుము. నీ యజ్ఞము పూర్తి యయ్యెను. నీవు రోగముక్తుడవైతివి. అని యచటి ప్రజలెల్లరును చూచుచుండగనే వరుణుడు రాజును రోగముక్తుని గావించెను.
రోగార్తుడగు రాజు మాటలువిని వరుణుడు దయాశుడై యతని కిట్లనెను. రాజా! ఈ శునఃశేపుడు తన బ్రతుకు తీపిచే నన్ను జపించుచున్నాడు. ఇతనిని విడిచిపెట్టుము. నీ యజ్ఞము పూర్తి యయ్యెను. నీవు రోగముక్తుడవైతివి. అని యచటి ప్రజలెల్లరును చూచుచుండగనే వరుణుడు రాజును రోగముక్తుని గావించెను.
అట్లు విప్రబాలుడు మహితాత్ముడగు వరుణుని దయవలన బంధముక్తుడయ్యెను. అంత సభయందంతట జయజయధ్వానములు మిన్నుముట్టెను. ఇట్లు రాజు దారుణరోగమునుండి ముక్తడయ్యెను. శునఃశేపుడును బంధముక్తుడై సుఖముండెను. రాజు పిమ్మట సవినయముగ యజ్ఞము పూర్ణము గావించెను.
శునశ్శేపుడికి తండ్రి విశ్వామిత్రుడే
శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము
శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము
శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము
శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము
శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము
శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము
శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము
శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము
శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము
శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము
శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము
శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము
శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
No comments:
Post a Comment