ఇంద్రుడు మరల నింద్రత్వమందుట
ఇంద్రుడు విశాలాక్షియగు తన భార్యనుజూచి ఆమె శోకార్తయై యొంటిగ గనిపించుటచే విస్మయము జెంది ఆమెతో నిట్లనెను :
కాంతా! శుభాననా! ఇచట నే నెల్ల భూతముల కంట బడకుంటిని గదా! ఇట నేనుంట నీ వెటులెఱిగితివి? ఎటుల రాగలిగితివి?'
శచియిట్లనెను : 'ఓ దేవా ! శ్రీ మాతృదేవి దయవలన నిన్నెఱింగితిని. ఆ తల్లి యనుగ్రహముననే నిన్ను గలిసికొంటిని. మునులు సురలును రాజర్షియగు నహుషుని నీ యాసనముపై నుంచిరి. అతడు నన్నెప్పుడును బాధపెట్టు చున్నాడు.
బలనిషూదనా! తాను సురపతియనియు తన్ను పతిగ వరించుమనియు నతడు నన్ననుచున్నాడు. ఆ పాపి నన్నట్లను చుండగ నేనేమి చేయగలను?
ఇంద్రుడిట్లనెను : 'ఓ కళ్యాణీ! నేను మంచి దినముల కెదురు చూచుచున్నాను. నీవును మనస్సు కుదుటపరచుకొని యెదురు చూడుము.' అట్లు ధీశాలియగు నింద్రుడు పలుకగ శచి నిట్టూర్చుచు దుఃఖితయై గడగడలాడుచు నిట్లు పలికెను :
'ఓ మహాత్మా! అచట నే నెట్లు నిలువగలను? దుర్మదాంధుడు వరగర్వితుడునగు ఆ పాపాత్ముడు నన్ను తన వశముచేసికొన జూచుచున్నాడు. అతని ధాటికి సురలును మునులును వెఱచి నన్నా కామాతురుని సేవింపుమని పోరు పెట్టుచున్నారు.
ఓ పరంతపా! బృహస్పతి దేవతలకు వశుడు విప్రుడు బలహీనుడు అట్టివాడు నన్నెట్లు గాపాడగలడు? నే నబలను. పురుషవశ వర్తినిని. అనాధను అట్టి నాకు విధి యనుకూలింపనిచో నేనేమియును జేయజాలనని బాధపడుచున్నాను. నేను స్త్రీని. నీ దానను. పతివ్రతను. కులటను కాను; శోకార్తను. అచట నన్ను బ్రోవగల వారెవ్వరును లేరు.'
ఇంద్రుడిట్లనెను : 'వరాననా! నీ కొక ఉపాయము చెప్పుదును. అటుల చేయుము. విపత్కాలమందు తన సౌశీల్యమును దక్కించుకొనుటయే స్త్రీ ధర్మము. పరుల వలన రక్షింపబడిన నారి పతివ్రత గాదు. స్త్రీ చిత్త మతి చంచలము. అది కామము దెసకే పరుగిడుచుండును.
ఇంద్రుడిట్లనెను : 'వరాననా! నీ కొక ఉపాయము చెప్పుదును. అటుల చేయుము. విపత్కాలమందు తన సౌశీల్యమును దక్కించుకొనుటయే స్త్రీ ధర్మము. పరుల వలన రక్షింపబడిన నారి పతివ్రత గాదు. స్త్రీ చిత్త మతి చంచలము. అది కామము దెసకే పరుగిడుచుండును.
శుచిస్మితా ! స్త్రీల సౌశీల్యము వారిని వారి పాపాల నుండి రక్షించును. కనుక మంచి శీలవతివై నడుచుకొమ్ము. నహుషుడు నిన్ను బలాత్కరించు తఱి నతనిని అతనికి తెలియకుండునట్లు మోసగించుము. అతడొంటరిగ నున్న సమయ మెఱుగుము. అపుడతనితో నీవు పరమర్షుల దివ్య యానమున నా చెంతకు రమ్ము. నేను నీ కపుడు ప్రేయసి నగుదును. ఇదే నా వ్రత'మనుము.
దాని కతడు మోహితుడు డగును. అతడు కామాంధుడై మునులను తన యానమునకు వాహకులుగ నియమించుకొనును. అంత మును లతనిని శాపాగ్నితో దహించివేయుదురు. శ్రీజగదంబికయును నీకు తన కైదండ నొసగగలదు. శ్రీ త్రిభువనేశ్వరీ పాదపద్మములు సంస్మరించు వారి కెన్నడు నెట్టి సంకటములును గల్గవు. ఒకవేళ శ్రీదేవి భక్తుల కాపదలు సంభవించవచ్చును. ఐనను నవి వారి మేలునకే యగునని యెఱుంగుము.
కనుక మణిద్వీపాధివాసిని నెల్ల విధముల గొలుపుము. లోకేశ్వరిని గురు వచనానుసారముగ భజింపుము.'' అన విని శచీదేవి అట్లు చేయుట కొప్పుకొని విశ్వాసముతో భావికార్యమునకు యత్నించుచు నహుషుని చెంత కేగెను. నహుషు డింద్రాణి రాకగని సంతస మొంది యిట్లనెను :
''సత్యభాషిణీ! కాంతా! నీకు కుశలమా? నేను నీ వాడను. నీ దాసుడను. కామినీ! నీవు నా మాట ప్రకారము వచ్చితివి. మితభాషిణీ! నీవు నా దాపుజేరినంతనే సంతసించితిని. ఇక సిగ్గు వదలుము. నీ భక్తుడనగు నన్ను భజింపుము. విశాలాక్షీ! నీ వే పని చెప్పినను చేసి నీకు ప్రియము గూర్తును.'
శచీదేవి యిట్లనెను: 'వాసవా! నీవన్ని పనులును చేసితివి. నా మది నొక కోర్కె గలదు. వినుము. నా వాంఛితము దీర్చినచో నేను నీదాన నగుదును. నా మనోరథ మిపుడు వెల్లడించు చున్నాను. దానిని సాధింప నీవే సమర్థుడవు.'
నహుషు డిట్లనెను : 'చంద్రాస్యా! నీ కోరిక యేమో తెలుపుము. అదెంతటి కష్టసాధ్యమైనదైనను నే నొర్తును. తెల్పుము.' శచి యిట్లనెను : 'రాజేంద్రా! నీ యందు నాకు నమ్మకము లేదు. నేనెట్లు చెప్పుదును. కనుక రాజా! నీవు ప్రమాణము చేసినచో నీకు ప్రియము గూర్తును. ఈ భూమిపై రాజులు నిజము పల్కుట దుర్లభము. నీవు సత్యశీలుడ వను నమ్మకము నాకు గల్గవలయును. అపుడు నా యిష్టము దెల్పుదును. నీ కపుడు వశగతనగుదును. నా మాటలు నిక్కములని నమ్ముము.'
నహుషు డిట్లనెను:'సుందరీ! నీ మాట తప్పక చెల్లింపగలను. నా యజ్ఞదానముల పుణ్యమును ప్రమాణముగ జేసి చెప్పుచున్నాను.'
శచి యిట్లనెను : 'ఇంద్రుని వాహనములు ఉచ్చైః శ్రవము - ఐరావతము - విష్ణు వామనము గరుడి, యమ వాహనము మహిషము, శివ వాహనము వృషభము. బ్రహ్మ వాహనము హంసము. షణ్ముఖుని వాహనము మయూరము. విఘ్నహరుని వాహనము మూషకము. కనుక నో సురపతీ! ఇక నీ వాహన మెట్లుండునో చూడగోరుచున్నాను. నీకు హరిరుద్రుల - సురాసురుల వాహనములు తగవు. నీకు సంశిత వ్రతులగు మునీంద్రులు వాహనముగ నుండ వలయును. వారు నీ పల్లకిని మోయవలయును. అపుడు నిన్ను సర్వదేవాధికునిగ నెఱుగగలను. ఇదియే నా కోరిక. దీనివలన నీ తేజ మినుమడింపవలయునని కోరుదును.'
శచి మాటలకు జ్ఞానహీనుడగు నహుషుడు పకపక నవ్వెను. అంతట శ్రీమహాదేవి మాయచే నహుషుడు ప్రమోహితుడయ్యెను. అతడు వెంటనే యామెను పొగడుచు నిట్లనియెను :
శచి మాటలకు జ్ఞానహీనుడగు నహుషుడు పకపక నవ్వెను. అంతట శ్రీమహాదేవి మాయచే నహుషుడు ప్రమోహితుడయ్యెను. అతడు వెంటనే యామెను పొగడుచు నిట్లనియెను :
'తన్వంగీ! నా ఠీవికి తగిన వాహనము దెల్పి నిజము పల్కితివి. నీ మాట తప్పక చెల్లింతును. అల్పవీర్యుడు మునులను వాహకులుగ జేసికొనజాలడు. నేను ముని వాహన మెక్కి నీ చెంతకు వత్తును. నన్ను సప్తర్షులు మోయుదురు. సురలు నన్ను త్రిలోకములందు గొప్ప తపశ్శాలిగ నెన్నుదురు.
'అట్లు నహుషుడు సంతుష్టుడై శచిని వదలి మునులను పిలిపించి కామార్తితో వారితో నిట్లనెను : 'విప్రులారా ! ఇపుడు నే నింద్రుడను. సకల శక్తియుక్తుడను. మీరు వింత జెందక నా కొకపని జేయవలయును. నా కింద్ర పదవి లభించెను గాని యింద్రాణి లభించలేదు. ఆమె నాతో ప్రేమమున 'దేవదేవా! నీవు ముని యానమున నన్ను జేరి నాకు ముదము గూర్పుము' అని పలికెను.
మునివరులారా ! ఈ పని నాకు కష్టమైనది. మీరే దయతో దీనిని నెఱవేర్పవలయును. నా డెంద మింద్రుని భార్యయందు తగిలినది. నా మదిలో కామాగ్ని ప్రజ్వరిల్లుచున్నది. నా పని నెఱవేర్చుడు. ఇక మీరే నా దిక్కు.'' అగస్త్యాదిమును లీ దుష్కార్యము విని జరుగనున్నది ఎఱింగి దయతో నతని మాట నంగీకరించిరి.
అట్లు తత్త్వదర్శనులగు మునులంగీకరింపగ శచిమీద మనస్సుగల నహుషుడు ప్రమోదమందెను. అతడు పిమ్మట నొక మంచి పల్లకిలో గూర్చుండి దివ్యమునులను వామకులుగ నేర్పరచి సంభ్రమముతో సర్పసర్ప' యని (త్వరగ సాగుమనుచు) ఆ గర్వి-కామాంధుడు లోపాముద్రాపతి మహాతపస్వియగు అగస్త్య మహర్షి తలపై కాలిడెను. అంతేకాక, నహుషుడు కామదుర్మదాంధుడై ఇంద్రాణీగత మనస్కుడై వాతాపిని మ్రింగినవాడు సాగరమును గ్రోలినవాడునైన యగస్త్య మహర్షిని పదపద అనుచు కొరడాతో గొట్టెను. ఆ దెబ్బ తలచుకొనుచు మునివరుడు మహాక్రోధముతో
అట్లు తత్త్వదర్శనులగు మునులంగీకరింపగ శచిమీద మనస్సుగల నహుషుడు ప్రమోదమందెను. అతడు పిమ్మట నొక మంచి పల్లకిలో గూర్చుండి దివ్యమునులను వామకులుగ నేర్పరచి సంభ్రమముతో సర్పసర్ప' యని (త్వరగ సాగుమనుచు) ఆ గర్వి-కామాంధుడు లోపాముద్రాపతి మహాతపస్వియగు అగస్త్య మహర్షి తలపై కాలిడెను. అంతేకాక, నహుషుడు కామదుర్మదాంధుడై ఇంద్రాణీగత మనస్కుడై వాతాపిని మ్రింగినవాడు సాగరమును గ్రోలినవాడునైన యగస్త్య మహర్షిని పదపద అనుచు కొరడాతో గొట్టెను. ఆ దెబ్బ తలచుకొనుచు మునివరుడు మహాక్రోధముతో
నహుషు నిట్లు శపించెను: 'ఓరీ దురాచారా! నీవు వనము నందు ఘోర శరీరముగల సర్పము గమ్ము. పెక్కేండ్లు దుఃఖములు గడుపుము. అటుల నీవు బలముతో తిరుగుచుందువు. పిదప ధర్మజుడు నీ ప్రశ్నల కన్నిటికి సమాధానము లీయగలడు. అట్లు యుధిష్ఠిరుని వలన నీకు శాపముక్తి గల్గును. అపుడు మరల స్వర్గము జేరగలవు.' అట్లు రాజర్షి నహుషుడు శపింపబడి యగస్త్యుని సన్నుతించెను.
నహుషుడు వెంటనే స్వర్గచ్యుతుడై పామై నేలగూలెను. అంత వేగిరముగ బృహస్పతి మానస సరస్సున కేగెను.
అతడింద్రునికి జరిగినదంతయు వినిపించెను. నహుషుడు స్వర్గపదభ్రష్ఠుడగుట మున్నగునవన్నియు నింద్రుడు విని ఆనందభరితుడై యచ్చోటనే యుండెను. ఎల్ల దేవతలును మునులును నహుషుడు స్వర్గభ్రష్టుడగుట వినిరి. వారెల్లరు నింద్రుడు వసించిన సరస్సు కరిగి ఇంద్రున కూరటగల్గించిరి.
అతడింద్రునికి జరిగినదంతయు వినిపించెను. నహుషుడు స్వర్గపదభ్రష్ఠుడగుట మున్నగునవన్నియు నింద్రుడు విని ఆనందభరితుడై యచ్చోటనే యుండెను. ఎల్ల దేవతలును మునులును నహుషుడు స్వర్గభ్రష్టుడగుట వినిరి. వారెల్లరు నింద్రుడు వసించిన సరస్సు కరిగి ఇంద్రున కూరటగల్గించిరి.
సురపతిని సాదరముగ స్వర్గమునకు తీసుకొనివచ్చిరి. ఆ వచ్చిన యింద్రుని సురులును మునులును గలిసికొని హర్షము వెలిపుచ్చిరి. ఇంద్రు నింద్రాసనమున నునిచి యభిషేకించిరి. ఆ విధముగ మరల నింద్రు డింద్రాసనము బడసి యింద్రాణీసహితుడయ్యెను. నందనవనమందు ప్రేమవిహారము లొనర్చెను.
ఇటుల నింద్రుడు గూడ ఘోర దుఃఖములపాలయ్యెను. ఇంద్రుడు అట్లు కామరూపి మహర్షియగు విశ్వరూపుని చంపి శచీప్రముఖ దేవతలచేత సేవింపబడిన శ్రీదేవి కృపాకటాక్షముతో మరల తన పదవి నలంకరింపగలిగెను.
రాజా! ఈ విధముగ వృత్రాసుర వధకు సంబంధించిన దివ్యకథ నీవడుగగ సవిస్తరముగ జెప్పితిని. ఎల్ల ప్రాణు లెట్టి కార్యము చేతురో యట్టి ఫలము తప్పకనుభవింతురు. శుభముగాని యశుభముగాని యనుభవింపక తీరదు. ఇందు సందేహము ఇంతయును లేదు.
No comments:
Post a Comment