Tuesday, April 21, 2026

Harishchandra identifies his wife and son - హరిశ్చంద్రుడు భార్యాపుత్రులను గుర్తించడం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - హరిశ్చంద్రుడు భార్యాపుత్రులను గుర్తించడం

సూతుడిట్లనెను: అటుపిమ్మట హరిశ్చంద్ర నరపతి తల నేలకు వేసికొని 

రాణి కిట్లనెను: ఓ బాలా! పాపిష్ఠుడ నైన మామ్రోలగూర్చుండుము. నా చేయి నీ తల నఱకుటకు సిద్ధమైనచో నిన్ను చంపుదునవి రాజు కత్తిచేత బట్టి యామెను చంపబూనెను. రాజు రాణినిగాని రాణి రాజునుగాని గుర్తుపట్టలేకుండిరి. అపుడామె తన చావు కోరుకొనుచు దుఃఖార్తయై యిట్లనెను: 

ఓ చండాలా! నీ కిష్టమైనచో నామాట కొంచె మాలకించుము. నా కుమారు డీ పురము బయట చచ్చిపడి యున్నాడు. అతిని శవము నీ చెంతకు దెచ్చి దహన క్రియలు జరుపునంతనఱకు తాళుము. పిదప నన్ను కత్తితో చంపుము. 

రాజు సరేయని పంపగ నామె శోకాతిరేకమున ఘెరముగ నేడ్చుచు బాలునిచెంత కేగెను. ఆమె సర్పదష్టుడగు బాలునిగాంచి అయ్యో కొడుకా! అయ్యో నా చిన్నారీ! యని పలుసారులు రోదించెను. ఆమె తెల్లగ పాలిపోయి కృశించి దుమ్ము కొట్టుకొని తలపై మాసిన వెండ్రుకలతో నుండెను. ఆమె ఆ శనమును శ్మశానమందుంతాను నేల పై గూరుచుండెను. 

ఆమె యిట్లనెను: ''ఓ రాజా! నీ బాలుని చూడుము. ఇతడుతననెచ్చెలులతో నాడుకొనుచుండగ నొకదుష్టసర్పముచేతదష్టుడై చనిపోయెను.'' అను నామె దీనాలాపములు విని రాజు శవమునుజేరి పైనున్న గుడ్డ తొలగించెను. పెక్కునాళ్లు లెడబాటుచే కుందుటవలన నా యేడ్చుచున్న యువతి తన భార్యయేయని రాజు గుర్తించలేక పోయెను. 

మునుపు చక్కని కేశపానముతో నలరురాజునేడుజడలు గట్టి మ్రోడువారినచెట్టువలెనుండుటచే నామె యతనిని గుర్తు పట్టనులేదు. పాముచేత కాటు వేయబడి నేలపడియున్న బాలుడు రాజ లక్షణోపేతుడగుటగని రాజిట్లు తలంచెను.

ఇతని ముఖము వున్నవనాటి చందురు బోలును. ముక్కు పొడవు-నునులే జోకికళ్లు నిగ్గుటద్దముల సాటి వచ్చును. ఇతని మచ్చయు లేదు. ఇతడు పొడవైన నల్లనల్లని ముంగురులవాడు. కమలములబోలు కన్నులవాడు. ఇతని పెదవి పండినదొండపండు. ఇతడు వెడద ఱొమ్ములవాడు. విశాలనేత్రుడు. ఆజానుబాహుడు. ఎగుబుజములవాడు. 

కాలి చిటికెన వ్రేలు నేలతాకువాడు. గంభీరుడు. ఇతడు పద్మపాదుడు. లోతైన నాభిగలవాడు. ఎత్తుమెడ గలవాడు. అయ్యో! ఈ శిశు వొక రాజకుల సంజాతుడు గావచ్చును. ఇతడు దురాత్ముడగు యముని కాలపాశమునకు బలి యయ్యెనే! 

సూతు డిట్లనెను: ఇట్టిబాలుడుతన తల్లియొడిలో నుండుట నతడు చూచెను. రాజునకు తనపూర్వస్మృతి గుర్తుకాగా నయ్యో! నా గారాల కొడుకా! నీ కెంతటి దుర్ధశ పట్టెరాయని కన్నులనీరు గార్చుచు వగచెను. తన కొడు కింతటి కఠిన కాలునకు బలియగుట వలన చింతాపరశుడై రాజు క్షణకాల మూరకుండెను. 

పిమ్మట రాణి దుఃఖమోహావేశముతో నిట్లని వాపోయెను. అయ్యో! కొడుకా! ఏ ఘోరపాపము నా కీ తీరని గుఃఖము గల్గెనో కదా. ఈ ఘోరశోకముయొక్క రూప మెట్టిదో తోచుటలేదు. హా నాధా! రాజా! దుఃఖితురాలనగు నన్నెడబాసితివా! నీ వెచట రహస్యముగ కాలము వెళ్ళబుచ్చున్నావో కదా నీ రాజ్యము పోయెను. మిత్రులు పోయిరి. పెండ్లమునుపిల్లవాని నమ్ముకొంటివి. 

ఓ దైవమా! ఈ హరిశ్చంద్రరాజర్షి నీ కేమి యపకారము చేసెనని యతని నిట్లేడ్పించున్నావు.'' అను నామె దీనువాక్కులు విని రాజు ధైర్యము గోల్పోయెను. పిమ్మట హరిశ్చంద్రుడు తన భార్యను చచ్చిన కొడుకును గుర్తపట్టి వీరు భార్యాపుత్రులే! అయ్యో! యెట్టి దురవస్ధ వచ్చిపడెనే.

అని రాజు లోన కుమిలి కుమిలి వగచెను. రాణియుము దురునవస్ధలో నున్న తన భర్తను గుర్తు పట్టెను. ఆమె దీనార్తయైమూర్ఛిల్లి నేలపై బడెను. ఆ పిదప రాణియు రాజు- నిర్వురు నొకెసారి తెలివొందిరి. వారు శోకభారమున పీడితులై బిట్టు పలవించిరి. 

రాజిట్లనెను: అయ్యో! ముద్దులకొడుకా! నీసుకుమారముఖము ముంగురులతో సొంపైనది. అట్టి నీ దీనముఖమును చూచియు నా హృదయము చెక్కచెక్కులు గాదేమి! నాన్న! నాన్నయని తియ్యగ పల్కుచు చేరరావేమి! నా కొడుకా! కొడుకా! రారమ్మని ప్రేమతో పిలుచుచు నిన్నెన్న డింక కౌగిలించుకొందునో కదా! 

నీ మోకాళ్లకు నల్లని మట్టి యుంటుకొనును. అదినాయుత్తరీయమును-తొడను-శరీరము-నెన్నడుమురికిగ జేయునో కదా! ఓనంగదమా! హృదయ నందనా! నేను పుత్రసౌఖ్యము పూర్తిగ పడయనైతి గదా! నేను నీ తండ్రి నయ్యు నిన్నొక సామాన్య వస్తువువలె నమ్మివేసి తినే! నా ధనము-రాజ్యము-బంధులు-సర్వస్వ పోయెను. నా కొకకొడుకుండెను. 

అతడును సర్పగష్టుడయ్యెను. అతని ముఖకమలము నేను జూచుచున్నాను. అయినను నేను సైతము ఘోర సంతాపవిషముచే దగ్ధుడ నైతిని.'' అని కన్నులు తొడి బడ రాజు బాలుని తీసుకొనెను. రాజు తన కొడుకును ఱొమ్మునకు హత్తుకొని చేష్టదక్కి మూర్ఛితుడై పడిపోయెను. అట్లు నేలపడిన భర్తను చూచి శైబ్య యిట్ల తలంతెను. ఇతని మాటలనుబట్టి యితడా పురుషసింహుడే-ఆ పండిత మానస చంద్రుడే యని నిస్సంశయముగ నాకు దోచుచున్నది. 

మఱియు నితని ముక్కుసైత మెత్తుగ నటులే నూగుపూవునలె మెత్తగ నున్నది. ఈ ప్రసిద్ధిగాంచిన మహాత్ముని ధంతములు తెల్లగ నున్నవి. ఇతడా నరపతియే యైనచో నీ వల్లకాటి కత డేలవచ్చును. అని తలపోయుచునామెపుత్రశోకముడిగి నేలనమూర్ఛపోయినతనపతినిగనెను. 
పతి-సుతశోకమున సంతోషము-వింత-దైన్యము ఒక్కుమ్మడిగ నామెలో ముప్పిరిగొన నామె నఱల మూర్చపోయెను.

పిమ్మట నామె తెలివి తెచ్చుకొని తోట్రుపాటునందు మాటలతో నిట్లనెను: ఓ దైనమా! నీకుదయలేదు. విచక్షణలేదు. నీవుపనికిమాలినదానవు. ఏలన నీమూలముననేకదా దేవతవంటి రాజుచండాలు డయ్యెను. అతనికి రాజ్యనాశము-మిత్రునికి త్యాగము-భార్యాపుత్రుల విక్రయము- జరిగెను. ఇన్ని గల్గించి దైనము పిదప రాజును చండాలును చేసెను. 

నేను నేడు రాజు యొక్క ఛత్రము-సింహసనము-చూచుటలేదు. నేడు రాజ చామరములు నేను చూచుటలేదు. ఎంతలో నెంత విధిమార్పు! మున్నే రాజు నడచుచుండగ తక్కిన రాజులు సేనకులవలె మెలగిరి-వారతని పాదాలు క్రింది మట్టిని తమ యుత్తరియములతో తుడిచిరి- అట్టిరాజు నేడు శవసంస్కారములకై కపాల కలశములు చేబూనెను. 

నేడతడు శవముల పూల మాలల దారాలతో చిక్కు పడిన వెండ్రుకలతో శవముల వసచే నెండిన యుత్తరీయముతో నున్నాడు. సగము కాలిన యెముకలు మజ్జ-మూలుగు-మాంసము-నకు కోరాడుచు నక్కలు-గ్రద్దలు-పక్షులు భీకరరావములు చేయుచున్నవి. చితిమీది దట్టంపు పొగయునువస్త్రముతో నింగి నల్లగిల్లిలటులున్నది. 

రక్కసులు శవ మాంస మాస్నాదించుచు ముదమందుచు ఇలా రాజేంద్రుడు వల్లకాటిలో దుఃఖ పీడితుడై విహరించుచున్నాడు.'' అని పెక్కురీతుల రోదించుచు రాణి రాజు కంఠమును గట్టిగపెనవేసి కొనెను. 

ఆమె దీనార్తితో శోకాతిరేకమున మఱియు నిట్లువగచెను: రాజా! ఇదంతయును నీకు కలగదోచు చున్నదా! కాక నిజమా! నాకంతయు తేటపఱచుము. ఇదేదియో నాకు మోహము గల్గించుచున్నది. ఓ ధర్మజ్ఞ! ఇటులంతయు వీపరీతము జరుగుచుండగ ధర్మమేల తోడుపడదు. విప్రదేవాది పూజన మందు సత్య పరీపాలనమునందున సైతమ్‌ నీ ధర్మము నీకుతోడుపలేదేమి! 

ధర్మమే లేనిచో నికసత్యమెక్కడిది! ఋజు మార్గమేది! దయయేది! నీవు ధర్మప్రవర్తకువైనప్పటికి రాజ్యభ్రంశము నొందితివి. 

సూతుడిట్లనెను: అను నామె మాటలు విని రాజు వేడిగనిట్టూర్చి డగ్గుత్తికతో నిట్లనెను.

తాను చండాలుడైన విధ మంతయును రాజు తన భార్యకు తెలిపెను. ఆమెయును వగచి నగచి వేడి నిట్టూర్పుల విడిచెను. అమె కుమారుని చావు గుఱించి రాజునకు వెల్లడించెను. రాజు జరిగిన దంతయును విని మరల ముర్ఛిల్లెను. పిమ్మట రాజు తెలివొంది చచ్చిన సుతుని మొగమును పలుసార్లు ముద్దు పెట్టు కొనుచుండగ శైబ్య గద్దద వాక్కులతో 

హరిశ్చంద్రున కిట్లనెను: ఓ రాజా! నా తలనఱికి నీ స్వామి పంచిన పని నెఱవేర్చుము. స్వామి ద్రోహము తలపెట్టి యసత్యమునకు పాల్పడకుము. ఓ రాజేంద్రా! నీ క సత్య దోషము పర ద్రోష పాపము తగులకుండుగాక! అను మాటలు విని రాజు మరల నేలపై ముర్చపోయెను. అంతలో తెలివొంది బిట్టు దుఃఖించి రోదించి 

రాజిడిట్లనెను: ఓ ప్రేయసి! ఏతయింత నిష్ఠురముగ పలుకుచున్నావు! ఏది నోట పలుకనైన పలుకరాదో దానినెట్లు చేయగలవు? 

రాణి యిట్లనెను: నేను పూర్వము శ్రీగౌరి దేవిని. దేవతలను-విప్రులను-పూజించితిని. ఆ కారణమున నీవు నాకు మఱుజన్మ మందును పతిగా గలవు. అను రాణీ వాక్కులు విని రాజు భూమి పై మరల పడిపోయెను. పిమ్మట రాజు మూర్చబాసి దుఃఖముతో తన దచ్చిన కుమారుని ముఖమును చుంబించెను. 

రాజిట్లనెను: ఓ ప్రియరాలా! ఎంతయో కాలము క్లేశములను భవించుట నాకిష్టముగలేదు. ఓలలనా! నేనెంచ దౌర్బాగ్యుడనో చూడుము-నామీద నాకే యధికారములేదు. నేనొక వేళ బాధలు పడలేక చండాలు ననుమతి లేక చితి మంటలలో దుముకుదునా. అట్లునేను చేసిన రాబోవు జన్మములోను నేను చండాలునకు దాలసుడను గావలసినదే. ఘోర నరకముందు గూలి దారున దుఃఖమనుభవింప వలసి వచ్చును. 

కాని యింతటి శోక సాగరములో దరి గానకమునుకలు వేయుచున్న నాకు ప్రాణాలు వదలి మహారౌరవ నరకము లందు గూలుటే మేలుగనున్నది. నాకోక్కడే యొక్క కొడుకు పుట్టి వంశము నిలువ బెట్ట గలిగెను. కాని యేమి లాభము! అతడును దుర్బరమైన విధి వంచనకు బలియై పోయెను.

ఇపుడు నేను పరాధీనుడనే. ఈ దురనస్ధలో నేను ప్రాణాలు సైత మెట్లు వదలగలను! ఐనను కష్టాలమీద కష్టాలు గల్గుటవలన నీ తనువు వదలి వేయగలను. ఈ దుర్బరమైన పుత్రోశోకమున గల్గు బాధ ముజ్జగములందును లేదు. అసిపత్ర వనమందును వైతరణి దాటునపుడు నింత బాధ యుండదు. 

ఓ ప్రియురాలా! ఈ నా కొడుకుతోబాటు నేను నారని చిత మంటలలో దుముకగలను. నన్ను క్షమించుము. ఓ మగువా! కమలనయనా! నా మాటకు కడ్డురాకుము. నా మాట వినుము. ఓ చారుహాసినీ! ఇపుడు నీవు నా యనుమతి ప్రకారము నీ విప్రు నింటి కరుగుము. నను మున్ను దానహోమము లాచరించితిని. 

గురువులను సంతోషపఱచితిని. అని నిజమెనచో నేను పరలోకమునందు నిన్ను రోబితుని తప్పక కలిసికోనగలను. ఈ కోరిక యీ లోకాన తీరునది గాదు. ఓ సుహీసినీ! మన జీవితకాలములో నేను నవ్వులాటకైన రహస్యముగనైననిన్నేదేని అనరానిమాట యన్నచో దానిని మఱచిపొమ్ము. నన్ను క్షమించుము. 

ఓ కల్యాణి! నేనొక రాజపత్నినను గర్వముతో నీవు విప్రు నవమానింపకుము. ప్రతివారు తన స్వామిని దైవముగ సంతోషపెట్టవలయును. 

రాణి యిట్లనెను: ఓ రాజర్షీ! నేనును నీ వెంట చితిమంటలతో దుముకగలను, ఈ దుఃఖభారము నేను మోయ జాలను. నేను నీతోడనే సహగమించగలను. ఓ మానదా! నాకు నీ వెంటవచ్చుటే మేలుగాని మఱియే విధనమును గాదు. స్వర్గమో-నరకమో అదేదైన నీ వెంట నుండియే యునుభవింపగలను. ఆమె మాటలువిని హరిశ్చంద్రుడో సతీమణీ! నీ యిష్టమెట్లట్లు నడచుకొమ్మనెను.

హరిశ్చంద్రుడికి బ్రహ్మాదిదేవతలు ప్రత్యక్షమవ్వడం

No comments:

Post a Comment

The appearance of Brahma and the gods to Harishchandra - హరిశ్చంద్రుడికి బ్రహ్మాదిదేవతలు ప్రత్యక్షమవ్వడం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - హరిశ్చంద్రుడికి బ్రహ్మాదిదేవతలు ప్రత్యక్షమవ్వడం సూతు డిట్లనెను: అటుతర్వాత హరిశ్చంద్ర నరపతి చితిపై తనకొడుకు...