శ్రీదేవి యిట్లనెను: గిరీశ ! ఈ చరాచర జగమంతయును నా మాయాశక్తిచే నిండియున్నది. ఆది నాలోకల్పితమైనది. పరమార్దముననది నా కంటె భిన్నము గాదు. వ్యవహార దృష్ఠిలో చూడగమాయ విద్యయనంబరనగును. కాని తత్త్వదృష్టని చూడమాయలేదు. కేవలము తత్త్వ వస్తువే కలదు.
గీరీశా! చిద్వస్తునగు నేనే పెక్కు మాయా కర్మలంగూడి ఈ జగములు సృజించి ప్రాణ పూర్వకముగ చిదా భాసుడనై యందు ప్రవేశింతును. నా వలననే లోకులకు లోకాంతర గమనములు జరుగును. పెక్కుమాయాభేదముల వలన జీవులుత్పన్నులగుదురు.
ఒకే మహాకాశము వలన ఘటాకాశములు గల్గునటుల పెక్కుపాధి భేదముల వలన మాయవలన జీవులుత్పన్నులగుదురు. ఒకే రవి మంచి చెడు వస్తుల నెల్ల వెల్గింపజేయును. ఐనను రవికేట్టి దోషమును గలుగదు. అటులనే చిద్వస్తువనగు నాకెట్టి దోషము నంటదు:
కొందఱు బుద్ద్యాదుల కర్తృత్వముక నా యందారోపింతురు. కొందఱు మూడు లాత్మయే కర్తయని పోరపడుదురు. కాని పండితులైనవారు పోరపడరు అజ్ఞానము వలన మాయ వలన జీవేశ్వరుల భేదము గల్పింపబడినది. ఎట్లనగ మహాకాశము వలన ఘాటాకాశాది భేదములు గల్పింబడును.
ఇటులే జీవాత్మ- పరమాత్మలకును భేదము గల్పింపబడినది. జీవుల నానాత్వము సహజముగ లేదు. మాయ వలన నున్నట్లు గల్పింపబడెను. అటులే యీశ్వరుల నానాత్వమును మాయ వలన గల్పింబడెను. కాని యది యునుసహజము గాదు. దేహము -మనస్సు-ఇంద్రియాదులు వాసనలు మున్నగు పలు విధముల భేగములు మాయ వలన గల్గుచుండును. పెక్కు జీవేశ్వరుల భేదముల కన్నిటికిన విద్యయే మూల కారణము. మఱేదియును గాదు.
ఈ త్రిగుణములలో వాసనలలో నెన్నో భేదములు గలవు. మఱి బ్రహ్మాదులలో నీశ్వరులలో నెన్నో భేధములు గలవు. వీనికన్నింటికి నామాయయే మూలకారణము. మఱేదియునుకాదు. వస్త్రమందు దారమువలె నాయందెల్ల జగములు వ్యాపించి యున్నవి. అందు వలననే కారణదేహాభిమాని అగు సూత్రాత్మ స్థూలదేహాభిమానియుగు విరాటు నేనే. మఱి బ్రహ్మ-విష్ణు-రుద్రుడు సూర్యచంద్రులు-తారలు-చండాలుడును-దొంగయు-నేనే. నేనే సకల పశు-పక్షి స్వరూపిణిని.
క్రూరాత్ముడగు వ్యాధుడు-మహితాత్ముడగుసజ్జనుడు నేనే. ఎల్ల స్రీ-పుం-నపుంసకరూపములు నేనే. సందేహము లేదు. ఏయేచోటుల నేయే వస్తువు కన-విన-బడునో ఆయాచోటుల నాయా వస్తువులలోనబైట నేనే నిత్యము నిండి యున్నాను. ఈ చరాచర వస్తువులన్నియును నేనే. అవి నేను లేక లేవు.
క్రూరాత్ముడగు వ్యాధుడు-మహితాత్ముడగుసజ్జనుడు నేనే. ఎల్ల స్రీ-పుం-నపుంసకరూపములు నేనే. సందేహము లేదు. ఏయేచోటుల నేయే వస్తువు కన-విన-బడునో ఆయాచోటుల నాయా వస్తువులలోనబైట నేనే నిత్యము నిండి యున్నాను. ఈ చరాచర వస్తువులన్నియును నేనే. అవి నేను లేక లేవు.
ఒక వేళ నేను ఏలకున్నవని యెవడైన ననిచో నావస్తువులు గొడ్రాలిసంతువంటివే. ఒకే త్రాడు పాము-దండ-యను పెక్కు భేధములు నెట్లు దోచునో కేవలము నేనును ఈశ్వరాది బహురూపములనట్లే భాసింతును. అధిష్ఠాన వస్తవులేనిచో కల్పితజగము నిలువజాలదు.
కావున నాయునికి వలననే యివన్ని యును శక్తిగల వగుచున్నవి కాని మఱి దేనివలనను గాదు.
హిమాలయు డిట్లనెను: ఓ దేవేశ్వరీ! నీ సమష్టీ దివ్యస్వరూపమును చూడ కుతూహల మగుచున్నది. నీకు నాయెడ దయగలదవిని చూపింపుము తల్లీ! అను హిమగిరీశుని వాక్కులువిన విష్ణ్వాది దేవతలెల్లరు నతవి మాటను గౌరవించి ముదితులై హర్షించిరి. ఆపుడు దేవతల యభిమత మెఱింగి కామములు గురియునట్టి భక్తకామప్రపూరణి శివాదేవి వారికి తన దివ్య విరాట్స్వరూపము చూపెను.
ఇట్లువారు శ్రీ మహాదేవియొక్క పరాత్పర విరాడ్రూపమును సందర్శించిరి. అపుడు శ్రీదేవియును తల సత్యలోకముగ కన్నులు సూర్యచంద్రులుగ భాసిల్లెను. చెవులు దిక్కులుగపలుకులు వేదములుగ ప్రాణములు వాయువులు హృదయము మహావిశ్వముగ పిఱుదులు భూమిగ తనరెను.
నాబి సరస్సు నీలాలనింగిగ ఱొమ్ముజ్యోతిశ్చక్రముగ మెడమహర్లోకముగ ముఖము జనలోకముగ నలరెను. నెన్నుదురు సత్యలోకమునకు క్రింది దగు తపోలోకముగ బాహువు లింద్రాదులుగ శ్రవణేంద్రియము శబ్దముగ వెలసెను. నాసికలశ్వి దేవతలుగ ఘ్రాణణేంద్రియము గంధముగ ముఖ మగ్నిగ కనుఱప్పలు రాత్రింబవళ్ళుగనె సంగెను. కన్బోమలు బ్రహ్మస్థానముగ దవుడలు-జలములుగ నాలుక రసముగ కోరలు యముడు వెలసెను.
దంతములు-స్నేహ విలాసములు నవ్వలాట-మాయగకడగంటి చూడ్కులు-సృష్టిగ సిగ్గు-పై పెదనిగ నల రారెను. క్రిందగి పెదవి-లోభమగ వీపు-ధర్మమముగ మేఢ్రము-జగమందలి సృష్టికర్తయగు ప్రజాపతిగ పొట్ట-సాగరములుగ ఎముకలు-గిరులుగనాడులు-నదులుగకేశపాశములు వృక్షములుగనై విలసిల్లెను.
ఉత్తమగతులు-కౌమార¸యవన జరలుగ కేశములు-మేఘములుగ కట్టుపుట్టములు-సంఘధ్యలుగ విరాజిల్లెను. మనస్సు-చంద్రుడు విజ్ఞానశక్తి-శ్రీహరిగ హృదయము-రుద్రుడుగనై శోభిల్లెను. రాజా! దేవి పిఱుదం దశ్వజాతులన్నియు నడుమునకు క్రింది భాగమున నతలాదిలోకములుండెను.
ఇట్టి శ్రీదేవి ఇశ్వరూపమును దేవత లెల్లరును కన్నుల కరవుతీర సందర్మించిరి. దేవినుండి వేనవేలు జ్వాలామాలికలు వెలువడుచుండెను. దేవి తన పొడవైన నాలుకతో లోకము లెల్లనాకు నట్లుండెను. దేవి పటపట పండ్లు కొఱకుచు కన్నుల నిప్పుల కణికలు గ్రక్కుచు నానాయుధములు దాల్చి బ్రాహ్మణ క్షత్రియుల నాహారము చేసికొనుచుండెను.
దేవి సహస్రశిరములు సహస్రనయనములు సహస్రచరణమలు గల్గి సూర్యకోటి ప్రభాభాసమానయై విద్యుత్కోటి సమానప్రభలు చిమ్ముచుండెను. పరాశక్తియొక్క మహాభీషణ ఘోరదారణరూపము చూపఱుల హృదయముయములకు భయంకరముగ నుండెను. అట్టి రూపముగాంచి సురలు మిన్ను ముట్టి హహాకారములు చేసిరి. వారి హృదయనలల్లాడగ తీరని మూర్చ మునిగిరి.
వారు దేవి జగదంబయను మాటయే మఱచిరి. అటుల స్పృహ కోల్పోయి పడియున్న దేవతలను దేవికి నలు వైపుల నున్న వేగములు మేలు కోల్పి ప్రభోధ మొనరించెను. దేవతలు దివ్యశ్రుతులాలకించి ధైర్య మవలంబించి ప్రేమాశ్రు పూర్ణ నేత్రములతో గళము తొట్రుపాటు జెందుచుండ కన్నీట మాటలు తడబడ దేవి నీ విధముగ సన్నుతింపసాగిరి. ఓ అమ్మా! మాతపుపలు క్షమింపుము. మేము నీ కన్న బిడ్డలము. మమ్ముకాపాడుమమ్మా!
ఓ దేవేశీ ! నీ కోప ముపసంహరించుము. నీ భీకరరూపము గాంచిన మా గుండె లవిసిపోవుచున్నవి. మేము పామరులము దీనులము. త్రిదశులము. నిన్నెంతని సన్నుతింపగలము ! నీ విక్రమ మహాశక్తు లెంతటివో నీకే తెలియదే ! ఇక నీ తర్వాత పుట్టిన మా కెట్లు తెలియును?
ఓ త్రిభువనేశ్వరీ! నీకు మా ప్రణామములు. ప్రణవాత్మికాః నీకు ప్రణామములు. సకల వేదాంత సంసిద్ధా!హ్రీంకారమూర్తీ! నీకు ప్రణామములు. ఏ జగదంబికనుండి సకల దేవతలు - సాధ్యులు క్ష మనుజులు-పశువులు -పక్షులు జన్మించెనో యట్టి సర్వాత్మికకు ప్రణామములు.
ఏ జగదంబికనుండి ప్రాణాపానములు - వ్రీహియవలు-సత్యము -శ్రద్ధ-బ్రహ్మచర్యము మున్నగునవి కల్గెనో యట్టి సర్వాత్మికకు ప్రణామములు. ఏ జగదంబికనుండి సప్తప్రాణములు -సప్తదీవులు-సప్తసమధలు-సప్తహోమమలు- సప్తలోకవ్లుు గల్గెనో యట్టి సర్వాత్మికకు ప్రణాముములు. ఏ జగదంబికనుండి యెల్ల సాగరములు-నదులు-గిరులు-రసములు-ఓషదులు సంభవించెనో యట్టి సర్వాత్మికకు సర్వాత్మికకు ప్రణామములు.
ఓ మాతా! నీ పూర్వభాగము-వెనుక భాగము- ఇరుపక్కలు-పైభాగము-నాల్గు దిక్కులు వీనికి మాటిమాటికి ప్రణామములు. ఓ దేవేశీ! నీయీ లోకాతీతమైన విశ్వరూప ముపసంహరింపుము. అందాల కందమైన నీమొదటి రూపమును ప్రదర్శింపుము.
తల్లీ!ఇట్లు భయభ్రాంతులైన దేవతలను చూచి జగదంబిక దయాంతరంగయై తన ఘోరరూపమువదలి శాంతసుందరరూపము చూపెను. అపుడు దేవి పాశ-అంకుశ-వర-అభయ హస్త-సర్వాంగసుందరి-శిరీసఖోమలి-కరుణాపూర్ణనయన-మందస్మితముఖమల. అట్టి దేవిసుందర దివ్యరూపమును దర్శించి భయములు పాసి ప్రశాంతచిత్తలై సంతోషాతిశయమున మాటలాడరాక తుదకు పెక్కు గతుల దేవిని సన్నుతించిరి.
జగన్మాత - తత్వబోధ
No comments:
Post a Comment