ఏకావళి చరిత్ర
యశోవతి యిట్లనెను : ఆ రమణీమణి తనకు చెలియలు వింజామరలుగొని వీచుచుండగ వారితో బయలుదేరెను. ఆమె కిరువైపుల రక్షపాలభటులుండిరి. వారు సాయుధులై సన్నద్ధులై యామెను పరిరక్షించుట కామెవెంట వచ్చిరి. అటులనామె వన విహారమున కీ కమలవనముచెంత చేరెను.
నేను సైత మామె వెంబడి గంగాతీరమేగితిని. మేమెల్లరమును క్రీడాకమలములు గైకొని యచ్చరలతో నాటాడుచుంటిమి. ఆ యేకావళియు నేనును క్రీడా వినోదముల మునిగియుండగ నొక బలశాలియగు రాక్షసుడచ్చటికి వచ్చెను. వానిని కాలకేతుడందురు. అతడు పెక్కు రాక్షసులను గూడి గదాసి - చాప - బాణ - తోమర - పరఘలను దాల్చి యుండెను. రూప¸యవనమదము నిండి రెండవ రతి వలె నొప్పుచు కమలములతో నాడుకొనుచున్న యేకావళిని వాడు చూచెను. రాజా!
నేనపు డేకావళితో నిట్లంటిని : ఓ పద్మాక్షి! వీడెవడో క్రూరరాక్షసునివలె నున్నాడు. ఇపుడు మనము రక్షపాలురమధ్య కేగుదము. అని మేమిర్వురమట్లు నిశ్చయించుకొని సత్వరమగు సాయుధులగు సైనికుల నడమకేగితిమి. ఆ కాలకేతుడు మోహనాంగియగు నేకావళినిగాంచి మదనాతురుడై పెద్ద గదగొని పరుగుపరుగున వచ్చెను. వాడు రక్షకులను తరిమి భయకంపితయై దురపిల్లుచున్న తలోదరిని పిట్టుకొనెను. అంత నేనామెను విడిచి నన్ను పట్టుకొనుమంటిని. ఐన నా దానవుడు వినక కామోద్రేకముతో నామెను తీసికొని వెళ్ళెను. అంతట రక్షకులు నిలునిలుమని పలుకుచు ఆ బలశాలిని నిలిపి వానితో వింతగా పోరు సాగాంచిరి.
అపుడు వాని రాక్షససేనలు శస్త్రములు దాల్చి స్వామికార్యము నెరవేర్చుటకు రక్షపాలురతో బోరిరి. కాలకేతువు సైతము పోరాడి రక్షపాలురను చంపి యామెనుగొని యేగెను. అతనివెంట రాక్షస సేనలు నడిచెను. ఆ రాక్షసుడట్లు విలపించుచున్న బాలను గొని తన పురి కరిగెను. నేను నామెను వెన్నంటి యేడ్చుచామె పోయిన యెడకేగితిని. ఆమె తనవెంటవచ్చు నన్ను గాంచి తన మనస్సు కుదుటపఱచుకొనెను.

ఆమెను బిగ్గరగ పిల్చుచు నేనామె చెంతకేగితిని. ఆమె నన్నుగాంచి దుఃఖార్తయై నివ్వెఱపడెను. '
నీ చెలి మిక్కిలి భయపడినది. ఆ చపలాక్షిని నీవైన ఊరడింపుము. నా నగరము దేవలోకము బోలును. నేను నీకు ప్రేమతో దాసుడనగుదును. ఇంక కాతరభావముతో నేల విలపింతువు?' అని చెప్పి నీ చెలిని స్వస్థురాలిని గమ్మనుము!' అని పలికి వాడు నన్ను రథముపై నా చెలిచెంత కూర్చుండ నియమించెను.
అట్లా దుష్టుడు గొప్పసేనతో ప్రసన్నముఖ కమలముతో తన సుందరపురము ప్రవేశించెను. అట నతడేకావళిని నన్ను తన మేడలో నుంచి పెక్కురు రక్కసులను గృహరక్షణకేర్పరచెను. మఱునాడతడు నాతోడ మరల రహస్యముగ నిట్లనెను. 'నీ చెలి విరహాతురయై విలపించుచున్నది. ఆమె నోదార్చుము. ఓ చంద్రాననా! ఈ రాజ్యము నీది. నేను నీ దాసుడను. నీవు నాకు భార్యవై కోరిన సుఖములనుభవింపుము ! అని నా మాటలామెతో చెప్పుమని పలికెను.
వాని మాటలు విని నే నతని కిట్లంటిని : 'ఓ ప్రభూ! నేనామెతోనిట్టి యప్రియములు పలుకజాలను. ఆమెతో నీవే సొంతముగ మాటాడుము.' అని నేను పలుకగ మదనపీడితుడగు రాక్షసుడతివినయముతో తలోదరియగు
వాని మాటలు విని నే నతని కిట్లంటిని : 'ఓ ప్రభూ! నేనామెతోనిట్టి యప్రియములు పలుకజాలను. ఆమెతో నీవే సొంతముగ మాటాడుము.' అని నేను పలుకగ మదనపీడితుడగు రాక్షసుడతివినయముతో తలోదరియగు
నా చెలియ కిట్లనియెను : ఓ కృశోదరీ! నా మీద వశీకరణ మంత్రమేమైన ప్రయోగించితివా! నా యెడద దోచుకొని నీ వశము చేసికొంటివి. నీవు నన్ను నీ దాసునిగ జేసికొంటివని తలంతును. తీవ్ర కామపీడితుడను. వివశుడను. నన్ను భజింపుము. రంభోరూ! ఈ జవ్వన మతి చంచలము. దుర్లభము. నన్ను పతిగ నెంచి కౌగిలించుకొని దానిని సఫలమొనరింపుము.
ఏకావళి యిట్లనెను : నేను మునుపే హైహయుడను రా కొమరునకు మా తండ్రిచేత నీయబడితిని. ఆ వీరుని నేను మనసార ప్రేమించితిని. నీవు శాస్త్ర నిర్ణయమెఱింగినవాడవు. సనాతనమైన కన్యాధర్మము విడనాడి యితరుని పతిగ నెట్లు సేవింపగలను? తన తండ్రి తన్నెవని కిచ్చునో యతనినే పతిగ కన్య భావించును. కన్యక యెప్పుడును పరతంత్రయేగాని స్వతంత్రకాదు కదా'! అని యామె యెంత చెప్పినప్పటికిని మోహితుడగు పాపాత్ముడు వినిపించుకొనలేదు. వాడా విశాలాక్షిని నామె చెంతనున్న నన్ను వదలలేదు. వాని పురము పాతాళ రంధ్రము లోపల సంకటస్థలమున గలదు. ఆ దుర్గమును రక్షకులు కాపాడుచున్నారు. దానిచుట్టు నగడ్త గలదు. అచ్చట ప్రాణప్రియురాలగు నా చెలియ గలదు. ఇచ్చట నామె వియోగమున దుఃఖార్తనై నేను గ్రుమ్మరుచున్నాను.
ఏకవీరుడిట్లనెను : ఓ వరాననా! నీవా దుష్టుని పురమునుండి యెట్లు బైటపడి రాగల్గితివి? నాకిది వింతగనున్నది. నిజము పలుకుము. ఓ భామినీ ! ఆమె తండ్రియామెను హైహయుని కిచ్చెననుమాట నా మదికి నమ్మకము గల్గించుటలేదు.
ఆ హైహయరాజును నేనే. ఇంకొకడు కాడు. సులోచనయగు నీ చెలియ నాకిఱకే యేల యుద్దేశింపబడినది? భామినీ! ఈ నా సందేహము తొలగింపుము. నేనా రక్షసాధముని చంపి నీ సఃఖిని తేగలను. సువ్రతా! నీకు తెలిసినచో నాకామె యుండుచోటు తెలుపుము. ఆ దుఃఖార్తను గుఱించి యామె తండ్రి కెవరును జెప్పనేలేదా? తన యనుంగు కూతురు బంధితురాలగుట తెలిసియు నతడేల మిన్నకుండెను? అతడింత చేతకానివాడా! నా కీకారణములన్నియు తెల్పుము.

కమలాక్షీ! నాతో నీ చెలియలోని మానవాతీత గుణములు వర్ణించుట వలన నా మనసు హరింపబడి కామునిబారి కగ్గమైనది. ఆ కాంతనెప్పుడు గాంతునో? ఆమె నీ సంకటము నుండి యెన్నడు ముక్తురాలిని జేతునా అని నా యెడద ఉవ్విళ్ళూరుచున్నది. ఆ చొఱరాని పురమున కరుగు నుపాయము తెలుపుము. ఆతని చెఱనుండి నీవెట్లు తప్పించుకొని బైటపడితివో తెలుపుము.
యశోవతి యిట్లనెను : ''రాజా! నేను నా చిన్నతనము నందొక సిద్ధ బ్రాహ్మణుని నుండి బీజము, ధ్యానముగల శ్రీభగవతీ దేవీమంత్రము గైకొంటిని. నేనక్కడ నివసించుచు చండవిక్రమయగు చండికను సంతతమారాధింపవలయునని మదిదలంచితిని. సర్వార్థ ప్రదాయిని భక్తానుగ్రహరూపిణియగు శ్రీపరాశక్తిని సంసేవించినచో బంధములనుండి ముక్తిగాంచవచ్చును. శ్రీజగన్మాత నిరాకార - నిరాశ్రయ అయ్యు నాతల్లి తన దివ్యశక్తులతో నీ విశ్వమును పుట్టించి పెంచి గిట్టింపగలదు అని నేను నెమ్మది నెంచి హృదయపీఠికపై నయన రక్తాంబర - సౌమ్య - శివునిరాణి యగు శ్రీత్రిభువనేశ్వరీ దేవిని ధ్యానించితిని. నేనా దివ్యమంగళమూర్తిని లోన నిల్పుకొని సంస్మరించుచు నామె మంత్రరాజమును విడువక జపింప బూనుకొంటిని.
శ్రీ జగదంబ నా భక్తికి మెచ్చి స్వప్నమున సాక్షాత్కరించి యమృతవాక్కులతో నాతో నిట్లనియెను : నీ వింకను నిద్రించుచున్నవా? లేలెమ్ము. వేవేగ మనోహరమైన గంగాతీరము జేరుము. అచటికి హైహయుడను రాజవరుడు రాగలడు. అతని పేరేకవీరుడు. అతడు మహాబలుడు. సర్వశత్రు సంహారకుడు. శత్రులకు చిచ్చఱపిడుగు.

అతనికి దత్తాత్రేయముని మహావిద్యయనబడు నా మంత్రమును ప్రసాదించెను. ఆ మంత్రముబొంది నిరంతరమతడు నా యందు మనస్సు నిలిపి నా పూజయందు తత్పరుడై పరాభక్తితో నన్నే యుపాసించుచుండెను. అతడు మచ్చిత్తుడు. మద్గతప్రాణుడు. మత్పరముడు. ఎల్లభూత కోటిలో నారూపుగాంచి ధ్యానించును. ఆ మహనీయుడు మీకు గల్గిన విపత్తు తొలగింప సమర్థుడు. అతడు విహరించుచు గంగాతటము జేరగలడు. అతడా ఘోర రాక్షసుని నిలువున చంపి యా మానవతిని విడిపించగలడు. ఆ పిమ్మట సకలశాస్త్రాపారంగతుడగు నేకవీర రాకుమారు నేకావళి పతిగ గ్రహించునట్లు నీవు యత్నింపుము అని పలికి శ్రీదేవి యంతర్ధానమందెను.
నేను దిగ్గున మేల్కొని నా దేవ్యారాధనమును స్వప్న వృత్తాంతమును గూర్చి నా చెలికి తెలిపితిని. నా సఃఖి యదంతయు విని ప్రసన్నవదనముతో చిర్నగవుతో నాతో నిట్లనెను :
చెలియా! నీ విపుడే సత్వరముగ నచటికేగుము. నా కార్యము సాధింపుము. సత్యవాణి గల భగవతి మనలను తప్పక ముక్తురాండ్రను చేయగలదు. రాజా! అట్లు నా ప్రియురాలగు చెలియాజ్ఞాపింపగ నచటి నుండి వెడలుట మంచిదనుకొని నేనిచటకు వచ్చితిని. నే నామ మహాదేవి దయాప్రభావమున దేవి ప్రేరణచే బయలు దేరితిని. నాకు శీఘ్రముగ మేలుబాట గనిపించెను.
వీరవర్యా! ఇట్లు నీకు మా దుఃఖకారణమమంతయు వెల్లడించితిని. ఇంకిపుడు నీ వెవరవో - యెవరి నందనుడవో నాకు నిజముగ దెల్పుము.
అధ్యాయము 144 హైహయ కాలకేతుల యుద్ధము
అధ్యాయము 144 హైహయ కాలకేతుల యుద్ధము
No comments:
Post a Comment