Monday, April 20, 2026

Vasishta-Visvamitra Samvadam - వసిష్ట- విశ్వామిత్ర సంవాదం

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - వసిష్ట- విశ్వామిత్ర సంవాదం

అటు పిమ్మట రాజు రాజసూయయాగ మొనరించెను. అందు అతడు వసిష్ఠుని హోతగ నియమించెను. యాగము పరిసమాప్తమైన పిమ్మట వసిష్ఠుడు ఘనముగ సత్కరింపబడెను. 

ఒకనాడు వసిష్ఠుడు సగౌరముగ నింద్రుని భవనము చేరెను. అదేచోటికి విశ్వామిత్రుడేతెంచి వసిష్ఠుని గలిసెను అట్లు వారిర్వురును దైవసభలో గలిసికొనిరి. అపుడు పూజలందుకొని వెలుగొందున్న వసిష్ఠుని విశ్వామిత్రుడు జూచెను.

అటు లింద్రసభలో వసిష్ఠుని గాంచి విస్మయము చెంది విశ్వామిత్రుడిట్లనెను: మునిసత్తమా! ఈ ఘనసత్కార మెచట బొందితివి? నిన్నే మహానుభావుడింతగ పూజింతెనో నిజము పలుకుము. అన 

వసిష్ఠు డిట్లనెను: నాకు ప్రతాపశాలియగు హరిశ్చంద్ర మహారాజు యజమానుడు. ఆ రాజు ఘనముగ దక్షిణలిచ్చి రాజసూయయాగము జరిపెను. అంతటి సత్యవాది నియతవ్రతుడగు రాజు మరెవ్వడులేడు. 

అతడు మహాదాత. ధర్మశీలి. ప్రజాపాలన తత్పరుడు. విశ్వామిత్రానే నతని యజ్ఞమున పూజింపబడితిని. ద్విజవరా! నన్ను నిజము చెప్పుమని యింకేల పట్టు పట్టెదవు? సత్యహరిశ్చంద్రుని వంటి రాజు మున్నులేడు. ముందుండబోడు. అను వసిష్ఠుని వాక్కులు విని 

విశ్వమిత్రుడు గ్రుడ్లెఱ్ఱ జేసి యతని కిట్లనెను: హరిశ్చంద్రుడు మిధ్యావాది కపటప్రియుడు. అతడు వరుణునకు మాట యిచ్చి యతనిని వంచిచెను. 

అతనినే పొగడుచున్నావా! మహామతీ! నా పుట్టినప్పటినుండి సంపాదించిన తపఃఫలము అధ్యయనపుణ్యము నీ పుట్టిననాట గోలె సంపాదించిన నీ తపఃఫలము అధ్యయనపుణ్యము పణముగ నుంచుదము. 

నీవే దుష్టుడు - లుబ్ధుడునకు రాజును సత్య వాదిగ బతికితివో నేనతని ననత్యవాదిగ చేయగలను. అట్లు చేయనిచో నా జన్మార్జిత పుణ్యమంతయా నశించును గాక! చేసినచో నీపున్నెమంతయునశించును. 

ఇదే మరకు పణము. ఇటులా యిర్వురు మునులును మహా కోపముతో వాదించు కొనుచు స్వర్గము వీడి తమ తమ యాశ్రమములకేగిరి.

హరిశ్చంద్రుడికి పరీక్షలు

No comments:

Post a Comment

Harishchandrudiki Parikshalu - హరిశ్చంద్రుడికి పరీక్షలు

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - హరిశ్చంద్రుడికి పరీక్షలు వాసుడిట్లనెను : ఒకానొకప్పుడు హరిశ్చంద్రుడు వేట కడవి కేగెను. అతడట చారెడేసి కన్నులు...