వ్యాసమహర్షీ ! దేవవైద్యులకు చ్యవనుడు సోమరసం తాగించాడా? మరి ఇంద్రుడు కోపించలేదా? దేవరాజబలంతో మానుషబలం పోటీపడి నెగ్గగలిగిందా? ఇది చాలా కుతూహలాన్ని కలిగిస్తోంది. వివరించవా?
జనమేజయా! తప్పకుండా వివరిస్తాను. విను. ఇది చాలా అద్భుతమైన కథ. దేవకన్యలాంటి సుకన్యతో చ్యవనమహర్షి గృహస్థాశ్రమ ధర్మాలు నిర్వహిస్తున్నాడు. తన అల్లుడు సుం దరాకారుడయ్యాడవి శర్యాతి దంపతులకు ఇంకా తెలియలేదు.
ఒకనాడు శర్యాతి భార్య దుఃఖిస్తూ భర్త దగ్గరికి వచ్చింది. మహారాజా! బంగారం లాంటి అమ్మాయిని ఒక వృద్దాంధతాపసికి కట్టబెట్టి అడవుల్లో విడిచిపెట్టి వచ్చాం. చాలాకాలమైంది. ఎలా ఉందో! జీవించి ఉందో, మరణించిందో! కుశలవార్తలు ఎమీ అందడంలేదు. ఒకసారి వెళ్ళి చూసి రాకూడదా!
కూతురికి ఇలాంటి సంబంధం చేశామే అని నేను ఎడవని రోజంటూ లేదు. పిచ్చితల్లి,
మొగుడికి సేవలతో ఆ అడవుల్లో చిక్కిశల్యమైపోయుంటుంది. వెళ్ళి ఒకసారి ఇంటికి తీసుకురండి. బెంగ పెట్టుకున్నాను. చూడాలనిపిస్తోంది. నారచీరలతో కందమూలాలతో ఆ గుడ్డి మొగుడితో ఎలా పడుతోందో ఎమో! - అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
శర్యాతి యిట్లనెను : ఓ విశాలాక్షీ ! వరారోహా ! మన సుకన్యను సంశితవ్రతుడగు మునిపుంగవుని చూచుటకు సాదరముగ నిపుడే వెళ్లగలను. ఇట్లు శర్యాతి శోకసంకులయగు తన భార్యతో బలికి రథ మధిరోహించి వేవేగ మున్యాశ్రమము జేర నరిగెను.
మొగుడికి సేవలతో ఆ అడవుల్లో చిక్కిశల్యమైపోయుంటుంది. వెళ్ళి ఒకసారి ఇంటికి తీసుకురండి. బెంగ పెట్టుకున్నాను. చూడాలనిపిస్తోంది. నారచీరలతో కందమూలాలతో ఆ గుడ్డి మొగుడితో ఎలా పడుతోందో ఎమో! - అని కళ్ళనీళ్ళు పెట్టుకుంది.
శర్యాతి యిట్లనెను : ఓ విశాలాక్షీ ! వరారోహా ! మన సుకన్యను సంశితవ్రతుడగు మునిపుంగవుని చూచుటకు సాదరముగ నిపుడే వెళ్లగలను. ఇట్లు శర్యాతి శోకసంకులయగు తన భార్యతో బలికి రథ మధిరోహించి వేవేగ మున్యాశ్రమము జేర నరిగెను.
అట ఆశ్రమ సమీపమున కరిగి నవ¸యవనసంపన్నుడు దేవకుమార సమానుడునైన మునివరుని చూచెను. అమరసన్నిభుడగు మునినిగాంచి విస్మయమంది నా పుత్రి యెంత లోకనింద్యమైన నీచకార్య మొనరించెనే యని రాజు తలంచెను. ఈమె మదనబాధలకు తాళలేక ప్రశాంతుడు వృద్దుడు నిర్ధనుడునైన పతిని చంపి వేరొక్కని పతిగ చేసికొన్నది.
ఈ పూవిలుకానిని సహింపశక్యము గాదు. నిండుపరువమున సాధ్యము కానేకాదు. ఈమె మూలమున మా మనువంశమునకు తీరని మచ్చ గల్గినది. ఎవని కూతురు నిందుతురాలో యతని జీవితము వ్యర్థము. సర్వపాపముల దుఃఖము లనుభవించుటకే ప్రాణులకు కూతురు పుట్టును. నేను నా స్వార్థము నెఱవేరుట కెంతటితగని పని చేసితిని.
అక్కటా! ఒక ముసలి చీకునకు నా యనుంగుపట్టి నంటగట్టితినే! తండ్రి తన కుమారి నెల్లవిధముల తగినవానికి దానము చేయవలయును. నేనెట్టి పని చేసితినో యట్టి ఫల మనుభవించితిని.
ఇపుడు నేను పాపకారిణిని చెడునడతగల దానిని నా కూతును చంపినచో తీరని స్త్రీహత్యయు నాకు గల్గును. మనువంశ మెంతయో ప్రసిద్ధి గాంచినది. అది నేటికి నావలన కళంకితమైనది.
లోకాపవాదము బలవత్తర మైనది. స్నేహబంధములు త్రెంపరానివి. ఇట్లు రాజు చింతాసాగరములో మునిగి యేమి చేయుటకును దోచకుండెను అంతలో దైవయోగమున చింతాకులుడగు తండ్రిని సుకన్య గాంచెను. ఆమె యతని సన్నిధికేగి ప్రేమ నిండిన మనస్సుతో నిట్లు ప్రశ్నించెను:
ఓ రాజా! కమలనయనుడు నవయువకుడునగు మునివరుని వీక్షించి యేల వ్యాకులచిత్తముతో విచారించుచున్నావు? మునివంశసంభవా! రాజశ్రేష్ఠా! విషాదము చెందకుము. దిగులు మానుము. రారమ్ము. నాపతి కిపిడు ప్రణమిల్లుము. అని తన యెదుట పలుకుచున్న కూతు మాటలువిని శర్యాతి కోపగించుకొని యామె కిట్లనియెను:
ఓ పుత్రీ! ముని యెక్కడ! గ్రుడ్డిముసలి తబిసి యేడ! ఈ మదోన్మత్తుడగు యువకుడేడ? నాకిందు సందియము గల్గుచున్నది. కులపాంసనురాలా! పాపిష్ఠురాలా! మునిపతిని చంపితివి. కామపీడచేత నవయువకుని పతిని చేపట్టి కుల్కుచున్నావే.
ఈ యాశ్రమమందలి మునిని గానక చింతాతురుడనైతిని. నీ వెంత చెడుపని చేసితివే! కులటకు తగిన పని చేసితివి గదే! ఓసి దుష్టురాలా! నీవలన నే నిపుడు శోకసాగరమున మునిగితిని.
చ్యవన మునిని గానక యొక దివ్యపురుషుని గాంచుచున్నాను. ఆమె తన తండ్రి మాటలువిని నవ్వి యతనిని సాదరముగ తన పతి సమీపమునకు గొని వచ్చెను.
ఓ తండ్రీ! ఇతడే చ్యవనుడు. ఇతడే నీ యల్లుడు. అశ్వినుల దయవలన నిట్లు సుమనోహరుడుగ జేయబడెను. నా మాట నమ్ముము. అశ్వినులు తమంతతామే యీ యాశ్రమమున కేతెంచిరి. వారి దయవలన చ్యవనుడిట్లు చేయబడెను.
ఓ తండ్రీ! నేను నీ కూతురను. పాపచారిణిగాను నీ వీతని మోహనరూపమునకు ముగ్దుడవై నన్ను పాపమతిగ దలంచితివి. తండ్రీ! రాజా! నీ వీ భార్గవుడగు చ్యవనునికి నమస్కరింపుము. ఇది జరిగిన కారణ మడుగుము.
ఇతడు విపులముగ మెత్తము చెప్పగలడు. అను తన కుమార్తె మాటలువిని శర్యాతి వెంటనే మునిచెంత కేగి గౌరవ పురస్సరముగ నతనికి నమస్కరించి యిట్లనెను:
ఓ భార్గవా! జరిగిన వృత్తాంతమంతయు వివరింపుము. నీకు మరల కన్ను లెట్లు కనిపించెను? నీ ముదిమి యేమయ్యెను? ఓ బ్రాహ్మణోత్తమా! నీ సుందరరూపము గాంచినంతనే నాకు సంశయము గల్గుచున్నది. విషయము వివరించుము. విని యానందింతును. అనగా
చ్యవను డిట్లనెను : ఓ రాజా! అశ్విను లిచటి కేగుదెంచిరి. వారు దేవవైద్యులు. నాకు దయతో వారు మహోపకారమొనరించిరి. వారిని నీ యజ్ఞమునందు సోమపాయులుగ జేయుదునని వారు నాకు చేసిన యుపకారమునకు మారుగ వారికి వర మొసంగితిని.
మహారాజా! ఇట్లు వారివలన నాకు చక్కని వయస్సు చూపును గల్గెను. ఇక నిశ్చింతగ నుండుము. సుఖాసనమున కూర్చుండుము. అని ముని పలుకగ రాజును అతని భార్యయు సుకముగ గూర్చుం డిరి. ముని వారికి మంచివిషయములు చెప్పదొడగెను.
పిమ్మట భార్గవుడు రాజు నోదార్చుచు నిట్లనెను : ఓ రాజా! నీచే యజ్ఞము చేయింతును. యాగద్రవ్యములు సమకూర్చుకొనుము.
రాజా! మిమ్ములను సోమపాయులుగ జేతునని వారికి మాట యిచ్చితిని. అది నీ విపుల యాగముననే జరుగవలయును. ఓ రాజేంద్రా ! ఇంద్రుడు తేజోబలముతో కన్ను మిన్ను గానకున్నను నే నతని నడ్డుగొనగలను. నీ సోమయాగమున వారిచే సోమము త్రావింతును.
రాజా! మిమ్ములను సోమపాయులుగ జేతునని వారికి మాట యిచ్చితిని. అది నీ విపుల యాగముననే జరుగవలయును. ఓ రాజేంద్రా ! ఇంద్రుడు తేజోబలముతో కన్ను మిన్ను గానకున్నను నే నతని నడ్డుగొనగలను. నీ సోమయాగమున వారిచే సోమము త్రావింతును.
అపుడు శర్యాతి మహారాజు సంతోషమంది చ్యవనుని మాట యొప్పుకొనెను. రాజు చ్యవనుని సమ్నానించి సంతుష్టుడై మునితో కుశలప్రశ్నములుచేసి పిదప తన భార్యతో తన నగరమున కేగెను. ఒక శుభదినమున సకల కామసంపత్సమృద్ధి గల శర్యాతి రాజు యజ్ఞమునకై తగినస్థలమును చక్కగ సిద్దపఱచెను.
పిదప చ్యవనుడు వసిష్ఠ ముఖ్యులగు మునుల నాహ్వానించి రాజుతో జన్న మాచరింపజేసెను. యజ్ఞము ప్రారంభముకాగా సొమపానముకొఱకు దేవతలు ఇంద్రుడు-అశ్వినులుఝ-నేగుదెంచిరి.
వారిలో నశ్వినులనుగాంచి సందేహించి యింద్రుడు దేవతలతో ''వీరును వచ్చి రేమి? దేవవైద్యులు సొమపానమునకు తగరు వీరి నెవరు రమ్మనిరి?'' అనెను. దేవతలు రాజు చేయు ఆ జన్నమున మాటాడకుండిరి.
అంత చ్యవను డశ్వి దేవతల కిచ్చుటకై సోమరసము గ్రహించగా దేవేంద్రు డడ్డుపడి వారికీయకుమని మునిని వారించెను. అపుడు
చ్యవను డిట్లనెను : ఈ సూర్యపుత్రు లేల సోమపానమునకు తగరు? ఇంద్రా! నిజము చెప్పుము.
వీరు సంకరజన్ములు వారు గారు. రవి కతని ధర్మపత్నియందు జన్మించినవారు. ఏ దోషముచే వీరుసోమార్హులు కారో తెల్పుము.
వీరు సంకరజన్ములు వారు గారు. రవి కతని ధర్మపత్నియందు జన్మించినవారు. ఏ దోషముచే వీరుసోమార్హులు కారో తెల్పుము.
దేవేంద్రా! ఈ విషయముగూర్చి దేవతలతో నాలోచింపుము. నేను వీరికి సోమము త్రావింతునని మాట యిచ్చితిని. ఇందులకై నేను శర్యాతిని యజ్ఞమునకు ప్రేరించితిని. నా వాక్కు సత్యవాక్కని నిరూపించగలను.
శక్రా ! వీరు నాకు నవయవన మొసంగి మేలొనరించిరి. దానికై వారికి నేను ప్రత్యుపకారము చేయదలంచితిని.
అనగా విని ఇంద్రు డిట్లనెను : అశ్వినులు దేవవైద్యులు. వీరు దేవతలచే నిందింపబడిరి. వీరిర్వురును సోమార్హులు గారు. వారికై సోమము తీసి కొనకుము. అన
చ్యవను డిట్లనెను : ఓ అహల్యాజారా ! వృత్రఘ్నూ! పనికిమాలిన కోపము వదలుము. ఈ సూర్యపుత్రులు సోమార్హు లెట్లు గారు? ఇట్లు వారికి వివాదము చెలరేగుచుండగ నొక్కరును నోరెత్తకుండిరి. ఐనను భార్గవుడు మాత్రము తపోబలముతో వారికై సోమము గ్రహించెను.
అశ్వినీదేవతలకు సోమపానార్హత
అశ్వినీదేవతలకు సోమపానార్హత
No comments:
Post a Comment