Monday, April 27, 2026

World of Sutala - సుతల లోకము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - సుతల లోకము

శ్రీనారాయణ డిట్లనెను: వితలము క్రింద సుతలమును లోకము గలదు. అందు విరోచనుని కొడుకు పుణ్యశ్లోకుడునునగు బలి వసించును. మహేంద్రునకు ప్రియము గూర్చు తలంపుతో త్రివిక్రమ భగవానుడు బలిని సుతలమునకు గొని వచ్చెను.

ఇంద్రాదులకు నలవిగాని ముల్లోకముల సంపద నంతయును బలి తన వశము చేసికొనెను. సుతలపతి భయముడిగి భక్తిమీర దేవదేవేశుడగు వామనుని ఆరాధించుచుండును. నారదా! ఇదంతయు నఖిలేశ్వరుడు పాత్రుడు నగు భగవానునకిచ్చిన భూదాన ఫలితమే యని మహాత్ములు వర్ణింతురు.

విప్రవర్యా! పురుషార్థుప్రదుడు వాసుదేవ భగవానుడునకు దేవున కింత గొప్ప దాన మిచ్చుటనవసరము. ఏలయనగా నీ దేవదేవుని యొక్క నామ ముచ్చరించినంత మాత్రమున పలికిన వాని కర్మ బంధములు విషయాలు వెనువెంటనే తునాతునుక లగును. సాంఖ్యు లెల్ల క్లేశబంధములు పాయుటకు నిత్యము నిఖిలేశ్వరు భగవాను నారాదింతురు.

భగవానుడు భక్తులపై దయబూని మాయామయములగు భోగభాగ్యములను భవింపజేయును. కావున నాత్మవిస్మరణ మెల్లక్లేశములకు మూలము. సకల మాయోపాయము లెఱిగిన శ్రీవిష్ణు భగవానుడే సర్వము హరించెను.

హరి యాచించు నెపముతో దేహము తప్ప సర్వస్వము మపహిరించెను. ఇతరోపాయమి లేనందున హరి బలిని వరుణపాశములతో బంధించెను. అట్లు బంధించి హరి బలి నీ గిరిగుహలందు పడవైచెను. అపుడు

బలి యిట్లనెను: ''గురుడు మంత్రిగగల యింద్రు డెంతేనియు మూఢుడు. అట్టి యింద్రు నెడ ప్రసన్నుడై విష్ణవు ముల్లోకముల తుచ్చసంపద నంతయు నమ్మని చేయి చాచెను.. మూఢు డెప్పుడైన కల్యాణస్వరూపుడగు భగవంతుని వదలి లోకసంపదలనే కోరుకొనును గదా!

నా పితామహుడు ప్రహ్లాదుడు. పరమ భాగవతోత్తముడు. ప్రహ్లాదుడు సకల లోకోపకారకుడు. కనుకనే విష్ణువతని తండ్రి సంపద నంతయు నిత్తునన్నను గ్రహింపక విష్ణుదాస్యమునే కోరుకొనెను. వీరుడగు తన తండ్రి మరణించినప్పుటికిని ప్రహ్లాదుడతని సంపదలు కోరుకొనలేదు. ఈ లోకము లన్నియును భగవానున కూపాధిభూతములు.

అతడు సకలలోకహితకరుడు. అట్టి భగవంతుని మహామహిమమును నావంటి యల్పమతిగల దోషయుతు డెన్నటికి నెఱుగజాలడు.'' అని దైత్యపతియు పరమపూజితుడునైన బలి పలికెను. ఆ బలి సుతలమున వసించెను. శ్రీహరి స్వయముగ బలికి ద్వారపాలకుడుగ నుండెను.

మున్నొకనాడు లోకరావణుడగు రావణుడు దిగ్విజయమునకు తరలెను. రావణుడు సుతలము చేరినంతనే భక్తానుగ్రహకారి శ్రీహరి తన కాలిబొటనవ్రేలి గోటికొనతో నతనిని పదివేల యోజనములంత దూరమునంతకు జిమ్మి వేసెను. ఈ పగిదిని దేవ దేవుని ప్రసాదమువలన సుతలరాజు భూతభావనుడు నగుబలి యెల్ల సుఖము లనుభవించుచు సుతలమున నుండును.

తలాతల లోకము

శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము

శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము

శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము

శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment

Definition of nature - ప్రకృతి నిర్వచనం

శ్రీ దేవీ భాగవతం నవమ స్కంధము -  ప్రకృతి నిర్వచనం వత్సా ! నారదా ! ప్రకృతి లక్షణాన్ని వివరించి చెప్పగల సామర్థ్యం ఎవరికైనా ఉందని నేను అనుకోను. ...