Saturday, April 18, 2026

Aruna's moral teaching - అరుణుడు చేసిన నీతిబోధ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - అరుణుడు చేసిన నీతిబోధ

పుత్రా! ధర్మమందు బుద్ధి నిల్పుము. విప్రులు గౌరవపాత్రులు. న్యాయముగ ధనము సంపాదించవలయును. ప్రజలను కన్నబిడ్డలవలె పాలింపవలయును. ఎప్పుడు నసత్య మాడరాదు. చెడు మార్గము పట్టరాదు.

తాపసులు పూజనీయులు. క్రూర దానవులను చంపవలయును. ఇంద్రియములు జయింపవలయును. రాజు కార్యసిద్ధికొఱకు మంత్రివరులతో మంత్రాంగము నెఱపవలెను. రహస్యమును వెల్లడించరాదు.

కుమారకా! శత్రువు కొలది వాడైనను నుపేక్షించి యుండరాదు. ఇతరులను జేరిన మంత్రి వినయముగ నున్నను నమ్మి యుండరాదు. శత్రులను మిత్రులను చారదృష్టితో కనిపెట్టి యుండవలయును. నిత్యము దానధర్మములందు మనస్సు నిలుకడ జెందవలయును.

వట్టి మాటలు కట్టిపెట్టుము. చెడు సంగతి విడిచిపెట్టుము. పెక్కులు జన్నము లొనరింపుము. మహర్షులు పూజనీయులు. ఎన్నడును స్త్రీని స్త్రీ స్వభావముగలవానిని జూదగానిని నమ్మరాదు. వేటయందు చెడ్డ తమకము తగదు.

జూదము త్రాగుడు పాటలు వారవని తలు- అను విషయములందు తగుల్కొనక ప్రజలను వాని జోలికి పోనిక ఉండవలయును. తెలతెలవారక మున్నే మేల్కొన వలయును. తప్పత యథావిధిగ స్నాన సంధ్య లోమరింపవలయును.

పుత్త్రా: శ్రీపరాశక్తి పరమపూజను పరమభక్తితో దీక్షాపరత నొనర్పలయును. పరాశక్తి పదార్చనమున జన్మము తరించును. శ్రీదేవీ మహాపూజను జీవితకాలమం దొక్కసారియైన చేసి దేవీ పాదతీర్థము సేవించినవాడు మరల తల్లి గర్బము తప్పక ప్రవేశింపడు.

ఆ మహాదేవియే దృశ్యము-దృష్ట-సాక్షి-అన్ని యామెయే అను నిశ్చల భావముతో నిర్బయ ముగ తన్మనస్కుడై యుండవలయును. నిత్యవిధు లొనరించి శ్రీదేవీ మహాసభలు జరిపి యందు తెలిసిన బ్రాహ్మణుల నాహ్వానించి దేవితత్త్వమును ధర్మముగూర్చి యడుగవలయును.

వేదవేదాంగపారగులగు బ్రాహ్మణులను సంపూజింపవల యును. తగిన వారికి గోవులు-భూమి-బంగారము దాన మీయవలయును. చదువురాని విప్రుని పూజింపరాదు. మూర్ఖున కెప్పుడు నన్నము మాత్రము పెట్టవలయును. మరేదియు నీయరాదు.

పుత్రా! ఎన్నడును లోభమువలన ధర్మమును త్రోసి పుచ్చరాదు. అన్నిటికన్న ముఖ్యముగ విప్రుల నెన్నడు నవమానింపరాదు. బ్రాహ్మణులు భూదేవతలు. వారు క్షత్రియులకు తప్పక కారణభూతులు. మఱి ఆదరణీయులు. నీటినుండి నిప్పు బ్రహ్మతేజమునుండి క్షాత్రము రాతినుండి లోహము గల్గును.

ఇవి పరస్పర వైరముగలవయ్యు తమ కారణమునందే తాములయముజెందును. కనుక సుఖసంపదలు గోరుకొను రాజు తప్పక విశేషముగ వినయముతో దానములతో బ్రాహ్మణులను సేవించి గౌరవించవలయును. రాజు ధర్మశాస్త్రముసారముగ దండనీతి ప్రయోగించవలయును. న్యాయముగ ధనము గడించి నిలువ చేయవలయును.

తన తండ్రి ఇట్లు ప్రబోధింపగ త్రిశంకుడు విని ప్రేమతో గద్గదమయిన వాక్కుతో నట్లేయని పలికెను. అపుడు రాజు వేదశాస్త్రవిశారదులు మంత్రవిదులునైన బ్రాహ్మణులను రావించి వెంటనే యభిషేకసామగ్రి సమకూర్చెను. అతడు సర్వతీర్థముల జలములు తెప్పించి రాజులను మంత్రులను ప్రజలనందఱ నాహ్వానించెను. 

రాజొక పుణ్యశుభముహూర్తమున విధివిధానమున తనత్రిశంకు కుమారుని రాజ్యమందభిషేకించి యాసన మప్పగించెను. ఆతడు పిదప తన భార్యతో వనములకేగి వానప్రస్థాశ్రమము స్వీకరించి గంగాతీరమునందు తీవ్ర తప మొనరించెను. మరణకాలము సమీపించగనే యరుణుడు స్వర్గమేగి సురపూజితుడై యింద్రాసనము సమీపమున సూర్యునివలె వెల్గుచుండెను.

రాజిట్లనెను : మున్ను గోవును చంపుటవలన వసిష్ఠుడు సత్యవ్రతుని శపించెనని కథాసందర్బమున నీవు చెప్పితివి. ప్రభూ! గురువు కోపించగా సత్యవ్రతుడు పిశాచత్యము పొంది తిరిగి పిశాచత్వమునుండి యెట్లు ముక్తుడయ్యెనను సంశయము గల్గుచున్నది. 

శాపగ్రస్తుడు సింహాసన మెక్కుటకు తగడు కదా. ముని యేకర్మమువలన నతనిని పిశాచత్వముక్తిని జేసెనో తెల్పుము. విప్రర్షీ! నా కీతని శాపమోక్షణమగూర్చి తెలుపుము. అట్టి పిశాచాకారము గలవాని నతని తండ్రి యొట్లు రప్పించెను. 

సత్యవ్రతుడు వసిష్ఠుని శాపమును వెంటనే పిశాచత్వమొంది కుచ్చితుడు-దుస్సహుడు-క్రూరుడు-లోక భయంకరుడు నయ్యెను.

సత్యవ్రతుడు శ్రీదేవిని భక్తప్రపత్తులతో నుపాసింపగ దేవి సుప్రసన్నయై క్షణములో నతనికి దివ్యదేహము ప్రసాదించెను. శ్రీత్రిభువనేశ్వరీదేవి దయామృతమున నతని పిశాచత్వము తొలగెను. 

పాపములు పటాపంచయ్యెను. అతడు పాపరహితుడు తేజస్వి యయ్యెను. దేవి దయవలన వసిష్ఠుడును ప్రన్నుడయైను. 

సత్యన్రతుని తండ్రియును కొడుకు నెడల ప్రేమగలవాడయ్యెను. తన తండ్రి మరణించగ త్రిశంకుడు సనాతనియగు దేవదేవిని గూర్చి ధర్మమతితో పెక్కులు దేవీ మహాయజ్ఞము లొనరించెను.

త్రిశంకుడి సశరీర స్వర్గ వాంఛ

No comments:

Post a Comment

Aruna's moral teaching - అరుణుడు చేసిన నీతిబోధ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - అరుణుడు చేసిన నీతిబోధ పుత్రా! ధర్మమందు బుద్ధి నిల్పుము. విప్రులు గౌరవపాత్రులు. న్యాయముగ ధనము సంపాదించవలయును...