శ్రీదేవి మహిషుని సంహరించుట
ఆ మందోదరి కిందుమతి యను చెల్లెలు గలదు. ఆమె చూడచక్కనిది. పెండ్లికి తగిన వయస్సున నున్నది. ఆమె వివాహమునకు స్వయంవర మేర్పరుపబడెను. అందు పలు దేశముల రాజులు వచ్చి సమావిష్టులైరి. ఆ రాజకుమారులలో కులశీలములు-రూపబలములు-సర్వలక్షణములు గల యొక రాకొమరు నిందుమతి వరించెను.
అంత మందోదరి యోపలేని కోపముతో దైవయోగమున నొక శఠుడు-చతురుడు-విటుడు నగు రాజును గని కామించెను. మద్రభూపతి నాకు నచ్చినవాడు. నన్నతని కిచ్చి పెండ్లి చేయు'మని యామె తన తండ్రితో ననెను. తన కూతు మాట లాలించి సంతసించి చంద్రసేనుడు పెండ్లి పనులు మొదలుపెట్టెను.
ఆ రాజకుమారుని రావించి యథావిధిగ నతనికి మందోదరిని ధనరాసులను నొసంగి రాజు వివాహము జరిపించెను. చారుదేష్ణుడను ఆ మద్రపతి యా సుందరిని బడసి సంతుష్టుడై యామెను వెంటగొని తన యింటి కేగెను. అతడామె పెక్కేండ్లు రమించెను. ఒకనాడతడు తన దాసితో రహస్యముగ క్రీడించుచుండగా ఆ విషయ మొక చేటిగని మందోదరికి తెలిపె ఆమె రోషముతో తన పతిని తూలనాడెను.
మరొకప్పుడు తన పతి యొక సామాన్య వనిత యెదలోన కొలువై యామె లాలించుచు నామె కోర్కులు దీర్చుటగని ఇట్లు మందోదరి మిక్కిలి పరితపించెను : నాకితడు స్వయంవరమందు శఠుడు దోచలేదు. ఇపు డితడు నన్ను వంచించెను. నేను మోహముతో నెంత పనిచేసితిని? ఇపు డేమి చేయుదును? నా పతి దయ యెగ్గుసిగ్గులు - లేని శఠుడు. ఇతనితో నాకిక ప్రేమబంధ మెట్లు పొసగును? ఇక నా బ్రతుకు వ్యర్థమే కదా! నే నీనాటినుండియు వీడని పతి సంభోగసౌఖ్యములు గోల్పోతిని. పనికిమాలిన సంతోషమే చివరకు మిగిలెను.
నేను జేసిన యకార్యమే నన్నీ దుఃఖాలపాలు చేసెను. నేనిపుడు దేహత్యాగము చేసికొన్నచో ఆత్మహత్య యగును. ఒకవేళ నేను నా తండ్రి యింటి కేగినచో నటగూడ సంతోషము గల్గదు. అల నా తొంటి చెలులే నన్ను పరిహసింతురు. కనుక నిచటనే కామసుఖములు పాసి-వైరాగ్యము బూని కాలము గడుపుట మంచిది.
నేను జేసిన యకార్యమే నన్నీ దుఃఖాలపాలు చేసెను. నేనిపుడు దేహత్యాగము చేసికొన్నచో ఆత్మహత్య యగును. ఒకవేళ నేను నా తండ్రి యింటి కేగినచో నటగూడ సంతోషము గల్గదు. అల నా తొంటి చెలులే నన్ను పరిహసింతురు. కనుక నిచటనే కామసుఖములు పాసి-వైరాగ్యము బూని కాలము గడుపుట మంచిది.
మహిషుడిట్లనియె : అని యామె దుఃఖముతో సంసార సుఖములను వదలివేసెను. నిత్య కళ్యాణి! అట్లే నీవును భూపతినగు నన్ను నిరాకరించితివి. పిదప నీవు కామార్తవై మందుండును కాపురుషుడు నగు వాని నాశ్రయింపగలవు. నా యీ మంచిమాటలు స్త్రీలకు దగినవి. కాన నా మాట వినుము. విననిచో నీవు నిజముగ శోకముల పాలగుదువు.
శ్రీదేవి యిట్లనియె : మూఢుడా! పాతాళమున కేగుము. లేదా నాతో పోరు సాగింపుము. నిన్ను, నీ దానవుల గుంపులనెల్ల చంపిగాని నేను స్వేచ్ఛగ వెళ్ళను. సాధువులకు క్లేశములు గల్గినపుడెల్ల వారినభిరక్షించుటకునే నవతరింతును. నాకు సహజముగ రూపము జన్మము లేదు. కాని దేవాభ్యుదయమునకు సాధుసంరక్షణమునకు రూపము దాల్చి యవతరింతునని యెఱుగుము.
మహిషాధమా! నేను నిజము చెప్పుచుంటిని, వినుము. నేను దేవతల ప్రార్థన మంగీకరించి పిమ్మట నిన్ను చంపుటకే వచ్చితిని. నిన్ను చంపిన నేను స్థిమితము చెందుదును. కనుక నీవు పాతాళమేగుము లేదా యుద్ధము చేయుము. అన్ని విధముల నిన్ను చంపి తీరుదును. ఇది నిజము అను దేవి పలుకులు విని
మహిషుడు యుద్ధకాముడై ధనస్సుచేపట్టి రణాంగణమున దుమికెను. అతడు చెవివఱకు వింటినారి లాగి బాణములు ఏయగ, దేవి మహాక్రోధముతో వానినెల్ల తన యినుప ములుకులతో తుత్తునియలు చేసెను. అంత వారిర్వురకును భీషణ సంగ్రామము సంఘటిల్లెను. అది జయమును గోరుచున్న దేవదానవులకును భయంకరముగ నుండెను.
అంతలో దుర్ధరుడనువా డుగ్రుడై వచ్చి విషము గ్రక్కు దారుణ బాణములు దేవిపై కురిసెను. భగవతియును మహోగ్రమున వాడి శరములనేయగ నతడు పర్వతమువలె నేలగూలి యసువులు పాసెను. అదిగని మహాస్త్రవిదుడగు త్రినేత్రుడు వచ్చి దేవిపై నేడు బాణములను ఏసెను. అవి తన్ను జేరకముందే శ్రీదేవి ఆ బాణములు దునిమి త్రినేత్రుని తన త్రిశూలముతో పొడిచి చంపెను.
అంతలో దుర్ధరుడనువా డుగ్రుడై వచ్చి విషము గ్రక్కు దారుణ బాణములు దేవిపై కురిసెను. భగవతియును మహోగ్రమున వాడి శరములనేయగ నతడు పర్వతమువలె నేలగూలి యసువులు పాసెను. అదిగని మహాస్త్రవిదుడగు త్రినేత్రుడు వచ్చి దేవిపై నేడు బాణములను ఏసెను. అవి తన్ను జేరకముందే శ్రీదేవి ఆ బాణములు దునిమి త్రినేత్రుని తన త్రిశూలముతో పొడిచి చంపెను.
అదిగని యంధకుడను వాడు లోహగద గొనివచ్చి సింహము తలపై మోదెను. సింహము సైతము క్రోధముతో తన వాడి గోళ్ళతో వాని చీల్చి చెండాడి మాంసము తినసాగెను. ఇట్లందఱును సమరమున మరణించుట గని మహిషుడు విస్మితుడై వేగమువ దేవిపై బాణముల ఏసెను.
అవి తన్ను జేరకమునుపే అంబికాదేవి వాని త్రుంచి గదతో నతని ఱొమ్ము పగులగొట్టెను. అతడా బెట్టిదపు గదాఘాతమునకు మూర్ఛిల్లి కొంచెమాగి మరల లేచెను. అతడు గదతో సింహము తలపై గొట్టగా సింహము తన వాడి గోళ్ళతో నా మహాసురుని చీల్చివేసెను. వాడంతట నరరూపము వదలి సింహరూపము దాల్చి మదించిన దేవి సింహమును తన వాడి గోళ్ళతో నా మహాసురుని చీల్చివేసెను.
వాడంతట నరరూపము వదలి సింహరూపము దాల్చి మదించిన దేవి సింహమును తన గోళ్ళతో తిరిగి చీల్చెను. వాడు సింహరూపము దాల్చుటగని శత్రుసూరిణియగు దేవి వానిపై నినుపములుకులుగల విషబాణములు ప్రయోగించెను. అతడు సింహరూపము వదలి గజరూపము దాల్చి తొండముతో పర్వత శిఖరము పెకలించి దేవిపై విసెరెను. తనపైకి వచ్చు గిరిశిఖరములను శ్రీరణదుర్గ తన వాడి శరములతో నుగ్గునుగ్గొనర్చి వికటాట్టహాస మొనరించెను.
దేవి సింహము గజము తలపై దుమికి గజరూప మహిషుని కఱకు గోళ్ళతో చీల్చివేసెను. వాడపుడు గజరూపము వీడి సింహమును చంపగల శరభాకృతి దాల్చెను. శరభముగని మదమర్ధినియగు దేవి రోషముతో ఖడ్గముగొని వాని తలపై వేయగ నదియు దేవిని తిరిగి కొట్టెను.
దేవి సింహము గజము తలపై దుమికి గజరూప మహిషుని కఱకు గోళ్ళతో చీల్చివేసెను. వాడపుడు గజరూపము వీడి సింహమును చంపగల శరభాకృతి దాల్చెను. శరభముగని మదమర్ధినియగు దేవి రోషముతో ఖడ్గముగొని వాని తలపై వేయగ నదియు దేవిని తిరిగి కొట్టెను.
అప్పటి వారిర్వురి పోరాట మతి భయంకరముగ నుండెను. వాడు మరల మహిష రూపము దాల్చి కొమ్ములతో పొడిచెను. వాడు భీకరముగ తోకనాడించుచు ప్రక్క ప్రక్కలు చూచుచు దేవిని కొమ్ములతో పొడిచెను. పిదప తన తోకతో గిరి శిఖరములు లాగి త్రిప్పుచు దేవిపై విసరి నవ్వుచు
మహిషుడిట్లనెను : దేవీ! ఈ రణరంగమున నీ పోరికచాలును. నేనిపుడు రూప¸యవన భూషితవగు నిన్ను చంపుదును. నీవు మూర్ఖురాలవు. మదమోహితవు విద్యాభిమానినివి. నా తోడనే పోరుచున్నావు. నేను మొదట నిన్ను చంపుదును. పిదప ముందుంచుకొని నన్ను చంపుటకు యత్నించుచున్న కపట పండితులగు దేవతలను చంపుదును అన
దేవి యిట్లనెను : మందమతీ! గర్వింపకుమురా - రణమున నిలబడుమురా! నిన్ను చంపి దేవతలను నిర్భయులనుగ జేయుదును. నీచుడా! నేనిపుడు మధువుగ్రోలి నిన్ను రణమున గూల్తును. నీవు దేవతలకు దుఃఖమును మునులకు భయమును గల్గించువాడవు అని యిట్లు పలికి జగన్మాత బంగరు పాత్రలోని మధువు మాటి మాటికి గ్రోలి క్రోధముతో మహాసురుని చంపదలచెను. పిదప దేవి ద్రాక్షరసము గ్రోలి త్రిశూలముగొని దేవతలు సంతసింపగ దానవునిమీదకురికెను. సురలు ప్రేమ భక్తులతో హర్షించిరి. పూలజల్లులు కురిసిరి. జయజయ దేవమాతా! యనుచు దుందుభి ధ్వానములు జేయుచు జయఘోషలు పెట్టిరి. గగన తలమునుండి సిద్ధ గంధర్వ కిన్నరులును పిశాచచారుణులను ఋషులును పోరుగనుచు సంతసిల్లిరి.
ఆ కపట పండితుడు పెక్కు తీరుల మాయ రూపులు దాల్చి తాల్చి దేవిని దెబ్బకొట్టెను. చండికయును క్రోధారుణ నేత్రములతో తీవ్రముగ త్రిశూలముతో బలముకొలది వాని ఱొమ్మున పొడిచెను. వాడు దెద్బతిని మూర్ఛిల్లెను. పిదప వెంటనే లేచి కాళ్ళతో దేవిని తన్నెను. దేవిని కాలిగిట్టలతో తన్ని వికటముగ నవ్వెను :
ఆ కపట పండితుడు పెక్కు తీరుల మాయ రూపులు దాల్చి తాల్చి దేవిని దెబ్బకొట్టెను. చండికయును క్రోధారుణ నేత్రములతో తీవ్రముగ త్రిశూలముతో బలముకొలది వాని ఱొమ్మున పొడిచెను. వాడు దెద్బతిని మూర్ఛిల్లెను. పిదప వెంటనే లేచి కాళ్ళతో దేవిని తన్నెను. దేవిని కాలిగిట్టలతో తన్ని వికటముగ నవ్వెను :
ఆ భీకర ధ్వని విని సురలు వెఱగందిరి. అంత దేవి సునాభమను సహస్రార చక్రరాజము గ్రహించి ముందున్న మహిషునిగని పేరెలుంగున వాని కిట్లనెను :
ఓరీ మదాంధా! క్షణమాగుము. ఇపుడే యీ చక్రము నీ కుత్తుక కత్తిరించగలదు. నీవు యమపురి కేగగలవు. అని పలికి దేవి చక్రము విసరెను. దానవుని తల వెంటనే తెగిపడెను. పర్వతము నుండి వేడి నెత్తురు పారెను. వాని మొండె మటునిటు నెగురుచు నేలపై బడెను. మింట నిఃఖిల సురులు జయజయ నినాదములు లోకములకు సుఖమును వర్ధిల్లచేయుచు విజృంభించెను.
తక్కిన దానవులు పరుగిడ సాగిరి. సింహ మాకలిగొన్నదానివలె వారి వెంటబడి వారిని తన పొట్టబెట్టుకొనెను. అట్లు క్రూర మహిషుడు చావగనే మిగిలిన దానవులెల్లరును భీతిల్లి పాతాళమునకు పారిపోయిరి. వాని చావువార్తవిని భూమిపైగల మునులు సాధుజనులు పరమానంద భరితులైరి.
అపుడు శ్రీదేవి చండిక రణస్థలము వదలి యొక పవిత్ర ప్రదేశమునందు విరాజిల్లెను. దేవత లెల్లరును సుఖప్రదాయినియగు శ్రీదేవిని సంస్తుతింప వేగ దేవి సన్నిధి కరిగిరి.
No comments:
Post a Comment