వ్యాసుని మోహవృత్తాంతము
నా మాటలు విని సత్యవతి చకితురాలైన తన కోడలికి సుపుత్రప్రాప్తి గలుగవలయునను తలంపుతో నాతో నిట్లనెను :
నందనా! అంబాలిక కాశిరాజు కూతురు. విచిత్రవీర్యుని భార్య విధవ శోకసంతప్త. నీవు ఆ మగువయందు సుపుత్రుని గనుము. మహాత్మా! గ్రుడ్డివాడు రాజు గాజాలడు. కనుక నా మాట విని రాజపుత్రికయందొక కుమారుని గనుము అని నా తల్లి పలుకగ నంబాలిక ఋతుమతి యగువఱకు నేను హస్తిపుర మందుంటిని. ఒక తగిన సమయమున నంబాలిక తన యత్తమాట ప్రకారము నొంటిగ శయనాగారమున నా కడకు వచ్చెను.
ఆమె నన్ను జడదారిగ తబిసిగ మోటువానిగ దలచెను. నన్ను జూడగానే యామెకు మొగము వెలవెల బారెను. ఆ రేయి నాతో గూడి నా కట్టెదుటనున్న యామె వణకు చుండెను.
అపుడా కాంతతో కోపమున నిట్లంటిని : సుశ్రోణీ! నీ రూపగర్వములో నన్ను గాంచి వెలవెలపోతిని. కనుక నీకు పాండువర్ణముగల కొడుకు పుట్టడలడు. అని నే నారాత్రియంతయు నంబాలికను గూడి యామెననుభవించితిని. ఆ పిమ్మట నా తల్లి యనుమతితో నేను నాచోటికేగితిని. పిమ్మట కొంతకాలమునకు వారిర్వురకు పుత్రులు గల్గిరి. మొదటినాడు ధృతరాష్ట్రుడు గ్రుడ్డివాడు. రెండవాడు పాండురాజు ప్రసిద్ధికెక్కెను. అట్టి వారిని గాంచిన నా తల్లి మనస్సు మరింత కలత జెందెను.
అట్లొక యేడాది గడచిన పిదప నా తల్లి నన్ను మరల పిలిచి యిట్లనెను : ద్వైపాయనా! నీవు కనిన యిద్దఱును రాజ్యమునకు యోగ్యులు గారు. కనుక నా కోడలియందు వేరొక కుమారుని నాకు నచ్చు వానిని కనుము. నేనొప్పుకొంటిని. నా తల్లి మోదముతో నంబికను ఋతుకాలమున మరొక పుత్రునిగనుటకిట్లు వేడుకొనెను :
ఓ యమ్మాయీ! నీవీ వ్యాస మునీంద్రునితో సంగమింపుము. మన కురువంశము నిలుపజాలు వానిని రాజ్యమునకు దగిన వానిని గనుము. అందులకామె యేమియు మాటాడక తలవంచుకొని యుండెను. నేను నా తల్లి మాట నిలువబెట్టుటకు మరల రేతిరి శయన గృహము ప్రవేశించితిని.
ఓ యమ్మాయీ! నీవీ వ్యాస మునీంద్రునితో సంగమింపుము. మన కురువంశము నిలుపజాలు వానిని రాజ్యమునకు దగిన వానిని గనుము. అందులకామె యేమియు మాటాడక తలవంచుకొని యుండెను. నేను నా తల్లి మాట నిలువబెట్టుటకు మరల రేతిరి శయన గృహము ప్రవేశించితిని.
అపుడంబిక విచిత్ర వీర్యుని దాసిని సర్వాభరణముల నలంకరించి నా ముందు నకు పంపెను. అది మంచి రూపముగలది. జవరాలు. సుకేశి. ఆ మగువ మేన చందన మలందుకొనెను. పూల మాలలు దాల్చెను. అనురాగభావముతో ఆమె నా కడకు వచ్చెను. ఆమె విలాసములకు నేను ప్రసన్నుడనైతిని.
నేను ప్రమోదముతో నామెకిట్లు వరమిచ్చితిని : ఓ సౌభాగ్యవతీ! నీ కందగాడు, సర్వ ధర్మవిదుడు సత్యవాది శమసంపన్నుడు సర్వ లక్షణ లక్షితుడు నగు సుపుత్రుడు జన్మింప గలడు. అట్లు పుట్టినవాడు విదురుడను పేరు గాంచెను. అట్లు నాకు మువ్వురు పుత్రులు గల్గిరి. అట్టి సంతువలన నన్ను మమకారము మాయ యావరించెను. ఆ మువ్వురు పుత్రులు మిక్కిలి వీర్యవంతులు.
అందుచే నేను శుకవియోగమున గల్గిన శోకము కొంత దిగమ్రింగితిని. మునివరా! ఈ మాయ బలవత్తరమైనది. ఇంద్రియనిగ్రహములేని వారికి దాటరానిది. ఒక రూపము గాని ఆధారముగాని లేనిది. జ్ఞానులను సైతము మోహమున ముంచునది.
మునిప్రవరా! నా చిత్తము మాతృస్నేహమునకు పుత్ర ప్రాప్తికి పరాయత్తమయ్యెను. కనుక వనములందును నాకు శాంతి స్వరూపానందము గల్గుటలేదు. అపుడు నా మనస్సు కోరికల యూయేలలలో నూగెను. ఒకప్పుడు హస్తిపురిలో మఱొకప్పుడు సరస్వతీ తీరమున నిశ్చలశాంతి లేక గ్రుమ్మరితిని.
అప్పుడప్పుడు నాలోనిట్లు జ్ఞానరేఖలుదయించెను : నాకీ పుత్రులేమి? ఈ తీరని మోహపాశమేమి? నేను మరణించినచో వీరు నా శ్రాద్ధకర్మకు దగరు గదా! ఈ నా కొడుకులు వ్యభిచారమున బుట్టినవారు. వీరు నాకేమి సుఖము గల్గింపగలరు? అను నట్టి దాటరానిమాయ నాలో మోహభ్రాంతులు రేకెత్తించెను.
అప్పుడప్పుడు నాలోనిట్లు జ్ఞానరేఖలుదయించెను : నాకీ పుత్రులేమి? ఈ తీరని మోహపాశమేమి? నేను మరణించినచో వీరు నా శ్రాద్ధకర్మకు దగరు గదా! ఈ నా కొడుకులు వ్యభిచారమున బుట్టినవారు. వీరు నాకేమి సుఖము గల్గింపగలరు? అను నట్టి దాటరానిమాయ నాలో మోహభ్రాంతులు రేకెత్తించెను.
మునిపుంగవా! ఈ జగము మిథ్యయని యెఱింగియు నంధ తమసంబున గూలితిని. అప్పుడప్పుడు నేనీ మోహకూపము గూర్చి తలపోయుచు పరితాపమొందితిని. ఆ తర్వాత భీష్ముననుమతి వలన బలశాలియగు పాండుడు రాజయ్యెను. నా సుతుల యభివృద్ధి కారణమున నా మనస్సు మరల ప్రసన్నత గాంచెను.
శూరసేనుని కూతురు కుంతి. మద్రరాజు కుమార్తె మాద్రి. వీరిర్వురును పాండురాజునకు పత్నులైరి. ఒక విప్రుని శాపమువలన పాండురాజు నిర్వేదమంది రాజ్యమువదలి భార్యలతో నడవులకేగెను. నా పుత్రుడడవుల పాలగుట వినిన నా మనస్సు ముక్క చెక్కలయ్యెను.
అపుడు భార్యలతో నా కొడుకు వసించుచోటికేను వెళ్ళితిని. నేను పాండురాజు నోదార్చి హస్తినకేగి ధృతరాష్ట్రునితో మాటలాడి మరల సరస్వతీతీరము జేరితిని. ఆ వనమునందు ధర్మ-వాయుదేవుల-ఇంద్రుని- అశ్వినులవలన పాండురాజు పంచపాండవులను క్షేత్రజ పుత్రులను బడసెను. వారిలో కుంతికి ధర్మ పవనేంద్రులవలన వరుసగా యుధిష్ఠిరుడు - భీముడు - అర్జునుడు గల్గిరి. అశ్వినులవలన మాద్రికి నకుల సహదేవులు గల్గిరి.
అంత నొకనాడు పాండురాజు మాద్రి నేకాంతమున కవుంగిలించుకొనెను. తొంటి విప్రశాపమున పాండురాజు చనిపోయెను. మునులతని కగ్ని సంస్కారము లొనరించిరి. మాద్రి పాండురాజుతో సహగమించెను. కుంతియు సహగమనము చేయదలంచెను. కాని, పుత్రుల సంరక్షణ చేయుటకు మునులామెను వారించిరి. అట్లు పతివియోగమున విలవిలలాడు కుతిని మునులు హస్తిపురికి గొంపోయి భీష్మ విదురుల కప్పగించిరి.
ఇదంతయు విని యితరుల సుఖ దుఃఖములకు నా మనస్సు కలతజెందెను. అట్లు పాండుసుతులు భీష్మునిచేత పెంచబడిరి. ధీశాలియగు ధృతరాష్ట్రుడును విదురుడను పాండవులను ప్రీతిగదుర పోషించిరి.
ఇదంతయు విని యితరుల సుఖ దుఃఖములకు నా మనస్సు కలతజెందెను. అట్లు పాండుసుతులు భీష్మునిచేత పెంచబడిరి. ధీశాలియగు ధృతరాష్ట్రుడును విదురుడను పాండవులను ప్రీతిగదుర పోషించిరి.
కాని దుర్యోధనాదులు ధృతరాష్ట్రసుతులు క్రూరాత్ములు కౌరవులు. పాండవులతో పగబూనియుండిరి. అంతలో నచటికి ద్రోణాచార్య డేతేరగ భీష్ముడతనిని మిక్కిలి గౌరవించెను. కురుపుత్రులకు విద్యగఱపుటకు ద్రోణుడు హస్తినపురమున నియమింపబడెను.
కుంతికి మొట్టమొదట కర్ణుడు పుట్టెను. ఆమె యతనిని వెంటనే వదలి పెట్టెను. కర్ణుడు నదలో గొట్టుకొని పోవుచుండగ సూతు డతనిని గొనిపెంచెను. మహావీరుడగుట కర్ణుడు దుర్యోధనునకు ప్రియమిత్రుడయ్యెను. పిమ్మట భీమదుర్యోధనుల నడుమ జ్ఞాతివైరము పెచ్చు పెరిగెను.
ధృతరాష్ట్రుడు కౌరవపాండవుల మధ్యగల వైరభావమెఱిగెను. అతడు వారి విరోధము తగ్గుటకు పాండవులను వారణావతమున నుండ ఏర్పాడు గావించెను. దుర్యోధనునిలో ద్రోహచింత మెండయ్యెను. అతడు తన మిత్రుడగు పురోచనునంపి పాండవులకు మేలైన లక్కయిండ్లు నిర్మింపజేసెను.
మునివర్యా! ఆ లక్కయింట పాండవులు తమ తల్లితో గూడ కాలిపోయిరని విని మనుమల మీది మమత వలన దుఃఖసాగరమున మునిగితిని అట్లు నేను శోకాతురడనై రేయింబవళ్ళు నిజన ప్రదేశమున పరిభ్రమించుచుంటిని. అంతలో నేకచక్రపురమున దుఃఖపీడితులగు పాండవులు నా కంటబడిరి. నేను పాండవులను గాంచి మోదమొందితిని.
పిమ్మట వారి ద్రుపదపురి నేను వారిని ప్రేరేపించితిని. అంత దుఐఖార్తులగు పాండవులు బ్రామ్మణ వేషములు దాల్చి మృదచర్మములు వస్త్రములుగ ధరించి ద్రుపదసభలో నుండిరి.
అందర్జునుడు మత్స్యయంత్రమును గొట్టి ద్రోపదిని గెలుచుకొనెను. వారేవురును తమ తల్లివచనము ప్రకారముగ ద్రౌపదిని వివాహమైరి. దేవర్షీ! ఆనాటి వారి వివాహము తిలకించి నేనానందమగ్నుడనైతిని. అంతట వారు పాంచాలితో హస్తిపురి కేగిరి. ధృతరాష్ట్రుడు వారికి ఖాండవప్రస్థము నివాసముగ నేర్పరచెను.
అందర్జునుడు మత్స్యయంత్రమును గొట్టి ద్రోపదిని గెలుచుకొనెను. వారేవురును తమ తల్లివచనము ప్రకారముగ ద్రౌపదిని వివాహమైరి. దేవర్షీ! ఆనాటి వారి వివాహము తిలకించి నేనానందమగ్నుడనైతిని. అంతట వారు పాంచాలితో హస్తిపురి కేగిరి. ధృతరాష్ట్రుడు వారికి ఖాండవప్రస్థము నివాసముగ నేర్పరచెను.
ద్విజవరా! వారున్నచోటికి వాసుదేవు డేతెంచెను. శ్రీకృష్ణుడర్జునునితో గలిసి యగ్నికి సంతృప్తి గలిగించెను. పిదప వారు రాజసూయయాగము చేయగ నేనెంతయో హర్షించితిని. దుర్యోధనుడు పాండవుల మహావైభవమును మయసభను గాంచి యోర్వలేక జూదమేర్పాటు చేసెను. శకుని కపటజూదమున మేటి. ధర్మజుడు మాయచేయుటలో నేర్పరి కాడు.
కనుక నతడు తన రాజ్యమంతయు గోలుపోయెను. అందు ద్రోపదియు నమానుషముగ నవమానింపబడెను. అపుడు పాండవులు పాంచాలితో గలిసి పండ్రెండేండ్లు వనవాస క్లేశములనుభవించిరి. దానికి నా మనస్సు క్రుంగిపోయెను.
నారదా! నేను సనాతన దివ్యధర్మమెఱిగిని వాడను. ఐనను సుఖ దుఃఖాత్మకమగు సంసారసాగరమున భ్రమలో మునింగితిని. ఇకేమిచేతును? నేనెక్కడికేగుదును? నాకు సంతోషము శాంతి గల్గుటలేదే యని తలంచుచు నా మనస్సు చంచలమై యూగుచుండెను.
కనుక మునివరా! నీవు సర్వజ్ఞుడవు. నా యీ సందేహము బాపుము. నాకు దుఃఖము దొలగునట్లు నిరంతరము సుఖశాంతులు గల్గునట్లు అనుగ్రహింపుము.
అధ్యాయము 147 నారదుడు స్వవృత్తాంతము తెల్పుట
అధ్యాయము 147 నారదుడు స్వవృత్తాంతము తెల్పుట
No comments:
Post a Comment