శ్రీమద్దేవీ నవరాత్ర వ్రత విధానము
రాజిట్లనెను : మహానుభావా ! ఆ దయామయి యగు శ్రీదేవి యొక్క పూజా విధానము - ఆరాధన విశేషము - మంత్రహోమముల తెఱంగును నాకు ప్రస్ఫుటముగ దెలుపుము అన
ముని యిట్లనెను : రాజా ! నీకు శ్రీకళారూపయగు దేవి యొక్క పూజావిధాన మెఱింగింతును. శ్రద్ధగ వినుము. ఆ దేవీ పూజవలన జనులకు ధర్మార్థ కామమోక్షములు గల్గును. బ్రహ్మజ్ఞానము గల్గును. దుఃఖ శోకములు నశించును.
మానవుడు మొట్టమొదట శుచిగ స్నానము చేయవలయును. అతడు తెల్లని మడుపులు ధరించవలయును. అతడు తన కనువగు చోట గూర్చుండి యాచమనము చేయవలయును. ఆ ప్రదేశ మావు పేడతో నలుకవలయును. అచ్చోట నుత్తమాసన మేర్పరచవలయును. దానిపై కూర్చుండి ముమ్మారు ఆచమించవలయును.
దానికి పూర్వము మొదట పూజాద్రవ్యములు యథాశక్తిగ సమకూర్చుకొనవలయును. ప్రాణాయామ మొనరించి భూతశుద్ధికి మాతృకాన్యాస మొనర్పవలయును. తదుపరి సంకల్పము చేసి పిదప శ్రీదేవీ ప్రాణప్రతిష్ఠ జరుపవలయును. ఆ పిదప యథావిధిగ న్యాసము లొనర్పవలయును.
ఒక తామ్రపత్రముపై మంచి గంధముతో షట్కోణ యంత్రము వ్రాయవలయును. వానియందు నవాక్షర మంత్రబీజములు వ్రాసి వేదోక్తముగ యంత్ర ప్రతిష్ఠ నొనర్పవలయును. పిమ్మట యంత్ర పూజ సలుపవలయును. యంత్రము లేనిచో నేదే నొక శ్రీదేవి ప్రతిమను చేసి భగవతీపూజ విధివిధానముగ జరుపవలయును.
ఈ విధముగ వేదోక్త మంత్రములతో శ్రీదేవిని పూజింపవలయును. అదియును గానిచో నిశ్చల నిర్మల ధ్యానముతో నవాక్షర మంత్రము నిరంతరము జపింపవలయును. జపసంఖ్యకు దశాంశము హోమమును హోమదశాంశము దేవీ తర్పణమును తర్పణ దశాంశము బ్రాహ్మణ భోజనమును నిష్ఠతో జరుపవలయును.
ప్రతినిత్యమును శ్రీదేవీ చరిత్రత్రయము చక్కగ పఠించి దేవీ విసర్జనము చేయవలయును. ఈ విధముగ విధిగ దేవీనవ రాత్రములందు దేవీ వ్రతమును సమాచరింపవలయును. తనకు శుభమును కోరుకొను మనుజుడు చైత్రాశ్వయుజ మాసములలోని నవరాత్రములందు విధిగ నుపవసింపవలయును.
పంచదార నేయి-తేనె కలిసిన పాయసమును దేవీ జపమంత్ర ముచ్చరించుచు దేవీ ప్రియముగ హోమము చేయవలయును.
అది సాధ్యముగానిచో మేక మాంసముతోగాని బిల్వదళములతోగాని యెఱ్ఱని కరవీర సుమములతోగాని నూగులు పంచదార కలిపిగాని వేల్చవచ్చును. ఈ విధమాచరించుచు అష్టమీ - నవమీ - చతుర్దశులందు యథావిధిగ బ్రాహ్మణ సంతర్పణము చేయవలయును. ఈ విధానముతో శ్రీదేవీ వ్రత మాచరించినచో పేదవాడు కలిమికలవాడగును. రోగి స్వస్థుడగును. అపుత్త్రకుడు తన మాట వినునట్టి సత్పుత్త్రులను బడయును. రాజ్యభ్రష్టుడు చక్రవర్తి గాగలడు. శత్రుపీడితుడు దేవి దయవలన శత్రునాశ మొనర్పగలడు.
అది సాధ్యముగానిచో మేక మాంసముతోగాని బిల్వదళములతోగాని యెఱ్ఱని కరవీర సుమములతోగాని నూగులు పంచదార కలిపిగాని వేల్చవచ్చును. ఈ విధమాచరించుచు అష్టమీ - నవమీ - చతుర్దశులందు యథావిధిగ బ్రాహ్మణ సంతర్పణము చేయవలయును. ఈ విధానముతో శ్రీదేవీ వ్రత మాచరించినచో పేదవాడు కలిమికలవాడగును. రోగి స్వస్థుడగును. అపుత్త్రకుడు తన మాట వినునట్టి సత్పుత్త్రులను బడయును. రాజ్యభ్రష్టుడు చక్రవర్తి గాగలడు. శత్రుపీడితుడు దేవి దయవలన శత్రునాశ మొనర్పగలడు.
ఈ విధముగ నొక విద్యార్థి ఇంద్రియ సంయమముతో దేవీవ్రత మాచరించినచో నతడు తప్పక మహా విద్వాంసుడు గాగలడు. బ్రహ్మ-క్షత్రియ-వైశ్య-శూద్రులలో నెవ్వరైనను పరమభక్తితో శ్రీజగదంబికను గొల్చినచో నతడు సకల సుఖములు పడయగలడు. స్త్రీ పురుషులలో నెవ్వరేని దేవీప్రీతిగ నీ పుణ్యనవరాత్ర వ్రత మాచరించినచో వారి కోరికలు తప్పక సఫల మగును.
ఆశ్వయుజ శుక్లపక్షమునందు శరన్నవరాత్రము లాచరించువారు నిక్కముగ సర్వకామము లనుభవింపగలరు. ఇక నవరాత్రవ్రత విధానము వినుము. అదెట్లన, తొలుత మండలాకారముగ శుద్ధిచేసిన కొంతచోటు పూజాస్థానముగ నేర్పరచుకొనవలయును. అచ్చోట వేదమంత్రవిధానమున కలశస్థాపన చేయవలయును. ఆ కలశముపై శ్రీదేవీయంత్ర ముంచవలయును. కలశము క్రింద నలువైపుల బియ్యము పోయవలయును. శ్రీదేవిని పూలమాలలతో నలంకరించవలయును.
శ్రీచండీ గృహమును ధూపదీపముల ఘుమఘుమలతో ధూపించవలయును. ఆ దేవీ మందిరమందు త్రికాలము లందును యథాశక్తిగ దేవీపూజ లొనర్పవలయును. దేవీపూజ చేయుటలో లోభిత్వముగాని కొంచెపుతనముగాని యెంతమాత్రమును తగవు. దేవి నామ పారాయణాభీష్టఫలదాయిని.
ఆ తల్లిని ధూపదీప నైవేద్యములతో వేదపారాయణలతో మధురగీత వాద్యములతో స్తోత్రపాఠములతో సం సేవింపవలయును. శ్రీమద్దేవీ మహోత్సవమును శుభోదయములగు పెక్కు మంగళవాద్యములతో జరుపవలయును. ఒక కన్యకను యథావిధిగ పూజించుట ముఖ్యము. కన్నియను చందనభూషణ వస్త్రములతో మధుర భోజనములతో సుగంధకుసుమమాలలతో తనుపవలయును.
ఈ విధానముగ దేవీపూజ లొనరించి యష్టమినాడుగాని నవమినాడుగాని యథావిధిగ దేవీహోమ మొనరింపవలయును. ఆ పిదప బ్రాహ్మణ సంతర్పణ జరిపి దశమినాడు పారణ జరుపవలయును. విప్రులకు భూరి దానము లొసంగవలయును. ఈ విధముగ శ్రీమద్దేవీ నవరాత్రవ్రతమును పురుషుడుగాని ప్రతివ్రతయగు సధవగాని విధవగాని భక్తిప్రపత్తులతో నాచరించపవచ్చును.
ఈ విధానముగ దేవీపూజ లొనరించి యష్టమినాడుగాని నవమినాడుగాని యథావిధిగ దేవీహోమ మొనరింపవలయును. ఆ పిదప బ్రాహ్మణ సంతర్పణ జరిపి దశమినాడు పారణ జరుపవలయును. విప్రులకు భూరి దానము లొసంగవలయును. ఈ విధముగ శ్రీమద్దేవీ నవరాత్రవ్రతమును పురుషుడుగాని ప్రతివ్రతయగు సధవగాని విధవగాని భక్తిప్రపత్తులతో నాచరించపవచ్చును.
ఇట్లు చేసినవారీ లోకమందున కోరిన కోర్కెలు పడయుదురు. వారు పిదప దేవీ పరమపద సాయుజ్యము గాంచగలరు. వారి కొకవేళ మరల జన్మము గల్గినచో వారుత్తమ సంస్కారుల కులమందు జన్మించి దేవి పదభక్తి గలవారగుదురు. ఈ విధముగ శ్రీ నవరాత్రవ్రతము గుఱించి తెల్పితిని.
శ్రీదేవీ సమారాధనము సకల సుఖశాంతులకు పట్టుగొమ్మ. కనుక రాజా! నీవును శ్రద్ధతో శ్రీచండికారాధన మొనరించుము. నీవు శత్రువులను గెలిచి నీ రాజ్యము మరల బడయగలవు. నీవు నీ భార్యాపుత్రులతోడ నీ యింట తప్పక శాంతి సమృద్ధులతోడ వన్నెగాంతువు.
ఓ వైశ్యరత్నమా! నీవును సృష్టిసంహాకారకారిణి - కామదాయిని - విశ్వేశ్వరియగు మాయాదేవిని సేవింపుము. నీవును నీ బంధుమిత్రులతో గౌరవమర్యాద చెందగలవు. ఆమెను గొలువని వారు నరకమున గూలుదురు; దుఃఖశోకార్తులు - రోగపీడితులు - శత్రు పరాజితులు నగుదురు. భార్యపుత్త్రహీనులు - దరిద్రనారాయణులు నై యిడుములు గుడుతురు.
శ్రీదేవిని బిల్వదళములతోగాని కమల - కరవీర - చంపక సుమములతోగాని యర్చింపవలయును. శ్రీదేవి బ్రహ్మ హరి మహేశుల కిరీటకాంతుల నివాళు లందుకొను పాదపీఠిక గలది. దేవి వారికి శాశ్వత సుఖము లిచ్చును. అట్టి దేవి నర్చించినవారు పుణ్యపురుషులు - శక్తి భక్తిపరులు నిత్యవిలాసవంతులు. వారు ధనవిభవ సుఖసంపన్నులు - సద్గుణ గరిష్ఠులు-మానవంతులు. వారు వేదోక్తవిధిగ దేవిని గొలిచి మహారాజులై కీర్తి-ప్రతిష్ఠలు గడించువారు.
అధ్యాయము 122 త్రిశిరసుని తపశ్చరణము
అధ్యాయము 122 త్రిశిరసుని తపశ్చరణము
No comments:
Post a Comment