నిమి చరిత్రము
జనమేజయు డిట్లనెను : వ్యాసమహర్షీ! వసిష్ఠుని పునర్జన్మము గుఱించి వివరించితివి. అటులే నిమి యెటుల మరొక తనువుదాల్చెనో తెలుపుము.' అన
వ్యాసుడిట్లనెను: రాజా! వసిష్ఠుడు వేరొకదేహము దాల్చెను. కాని, నిమిమాత్రము వసిష్ఠశాపమున మరొక్కమేను దాల్చలేదు. వసిష్ఠుడు నిమిని శపింపగ ఋత్విజులు బ్రాహ్మణులెల్లరు నిట్లు తలంచిరి: ఈ యజ్ఞము పూరణము గాకమునుపే రాజు శపింపబడెనే. రాజు దీక్షితుడుగదా! ఇపుడు మనమేమి చేయవలయును? ఇట్టి విపరీత పరిస్థితిలో చేయదగినదేమున్నది? కానున్నది కాగలదు. మన మీశాపమును వారింపజాలము.
అని తలంచి వారు నిమిలోని సూక్ష్మాంశము గ్రహించి దానిని వివిధ మంత్రములతో గాపాడుచుండిరి. వారు తమ మంత్రశక్తి ప్రభావముతో నిర్వికారమైన సూక్ష్మ రూపమును పల్మారు గంధమాల్యాదులచే పూజించుచుండిరి. కొంతకాలమునకు యజ్ఞము సంపూర్ణమయ్యెను. అపుడు దైవతగణమేతెంచెను. ఋత్విజులు ప్రస్తుతింపగ దేవతలు పరమానందభరితులైరి. మునుల స్తోత్రములకు దేవతలు ప్రసన్నులైరి.
వారు విషణ్ణుడగు రాజున కిట్లనిరి : రాజా! మేము సంతుష్టిజెందితిమి. వరము కోరుకొనుము. ఓ రాజర్షీ ! నీకీ యాగమువలన నుత్తమజన్మ లభింపగలదు. నీకు దేవశరీరము కావలయునో నరదేహము గావలయునో కోరుకొమ్ము. నీ పురోహితుడగు వసిష్ఠుడు నరజన్మమెత్తి గర్వించియున్నాడు.'
అంత నిమిజీవాత్మ ప్రమోదమంది దేవతల కిట్లనెను : నాకీ నశ్వర శరీరముపై వాంఛలేదు. సురలారా! నేను సకల భూతముల చూపులకు పైగా నుండగోరుచున్నాను. నేనెల్ల భూతముల కన్నులపై వాయురూపము దాల్చి చలించుచుండవలయును అనెను.
అపుడు దేవతలు నిమి జీవాత్మకిట్లనిరి : రాజా ! నీవు యజ్ఞప్రియ యజ్ఞేశ్వరి యగు శివభగవతిని ప్రార్థించుము. ఆ దేవి నీ యీ జన్నమునకు తుష్టిజెందెను. ఆ తల్లి నీ కోరిక తప్పక దీర్పగలదు. అని సురలు పలుకగ నిమి పరమభక్తితో పరాంబికను వివిధ దివ్యస్తోత్రములచే సవినయముగ సంస్తుతించెను.
అంత నిమికి సూర్యకోటి సమప్రభయగు శ్రీదేవి ప్రత్యక్షమయ్యెను. దేవి భవ్యలావణ్యపు వెలుంగుగాంచి యెల్లరానందభరితులై తమకు తాము ధన్యజీవులమనుకొనిరి. శ్రీమాత ప్రసన్నురాలుగాగా రాజిట్లు వరము వేడుకొనెను :
ఓ తల్లీ! విమల జ్ఞానము మోక్షకారకము. అట్టి జ్ఞానము గల్గించు జన్మమిమ్ము. నన్నెల్ల ప్రాణుల నేత్రములపై నివసింపనిమ్ము. అంత జగజ్జననియగు మహేశ్వరి సుప్రసన్నయై యిట్లనెను :
నీ ప్రారబ్ధ శేషమున నీకు విమల జ్ఞానము గల్గుగాక! నీవెల్ల ప్రాణులకన్నులపై నుండగలవు. నీ వలననే ప్రాణులకు నిమిషము (కనుమూత) గల్గుచుండును. నీ యునికి వలన నర-పశు-పక్షుల కనులు మూతలుపడును. కాని, యనిమిషులు (దేవతలు) మాత్రము కనుఱప్పలు వాల్చకుందురు.
ఇట్లు వరదాయినియగు దేవి వరములొసింగి మునులకు ప్రియములు పలికి యచ్చోనంతర్ధాన మొందెను. దేవి యంతర్ధానమొందిన పిమ్మట మునులెల్లరు దమలో దామాలో చించుకొని నిమి దేహమును యథావిధిగ తీసికొనిరి. వారు నిమిపుత్త్రుని బడయుటకు నిమి దేహము నరణితో మథించిరి. అగ్నివేల్చిరి.
అట్లరణితో మథింపగ సాక్షాత్తుగ నిమి వంటి సర్వలక్షణ సంపన్నుడగు కుమారుడందుండి యుద్భవించెను. ఆ బాలకు డరణి మథనమున బుట్టుటవలన మిథియనియును తన జనకుని తనువునుండి బుట్టుట వలన జనకుడనియును లోకమున పేరొందెను.
అట్లు నిమి విదేహుడుగనగుటవలన నతని వంశములోని వారెల్లరును విదేహరాజులని పిల్వబడిరి. ఈ ప్రకారముగ నిమి తనయుడు లోకమున జనకుడుగ చిరకీర్తిగాంచి గంగాతీరమున నొక సుందరనగరము నిర్మించెను. ఆ నగరు నాటి నుండి మిథాలానగరమన వన్నెగాంచెను. అందు సుందర ప్రాకారములు నున్నత భవన గోపురములు విలసిల్లెను. అది ధనధాన్య సమృద్ధమై చెన్నొందెను.
అట్లు నిమి విదేహుడుగనగుటవలన నతని వంశములోని వారెల్లరును విదేహరాజులని పిల్వబడిరి. ఈ ప్రకారముగ నిమి తనయుడు లోకమున జనకుడుగ చిరకీర్తిగాంచి గంగాతీరమున నొక సుందరనగరము నిర్మించెను. ఆ నగరు నాటి నుండి మిథాలానగరమన వన్నెగాంచెను. అందు సుందర ప్రాకారములు నున్నత భవన గోపురములు విలసిల్లెను. అది ధనధాన్య సమృద్ధమై చెన్నొందెను.
అతని వంశమున జన్మించిన వారెల్లరును. జనకులుగ విదేహులుగ బిలువబడి జ్ఞానసంపన్నులైరి. రాజా! ఇట్లుత్తమ నిమి చరిత్రమును నతడు శాపవశమున విదేహుడగుటయు నీకు వివరించితిని.
రాజిట్లనెను : ' వ్యాసమునీశా! నిమి శాపకారణము వివరించితివి. నా చిత్త మతిచంచలము. నిమి కథ వినగనే నాకు సంశయము గల్గుచున్నది. వసిష్ఠుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడు - నిమికి పురోహితుడు - బ్రహ్మపుత్రుడు గదా! మఱియతడు రాజుచే నెట్లు శపింపబడెను? వసిష్ఠుడు తనకు గురువు కుల పురోహితుడునని నిమికి తెలియునుగదా!
కనుక యజ్ఞదీక్షలోనున్న రాజు మునినేల క్షమించలేదు? రాజున కంత పట్టరానికోపమెట్లుగల్గెను? నిమి యిక్ష్వాకు వంశజుడు ధర్మవిదుడుగదా! అతడు తన గురువగు బ్రాహ్మణునేల శపించెను?'
వ్యాసుడిట్లనెను : రాజా! ఇంద్రియములను జయించుటకు శక్తిలేని ప్రాణుల కోర్మియుండదు. కనుక నీ లోకమున సామర్థ్య ముండియు క్షమాశీలియగువాడు దుర్లభుడు. ఒక తాపసు డాకలిదప్పులు మాని సర్వసంగపరిత్యాగియై యోగాభ్యాసమున నిష్ఠ గల్గియుండవచ్చును.
కాని, యంతటివాడును తనలో చెలరేగుచున్న కామ-క్రోధ-లోభాహంకారములను నల్గురు శత్రువులను గెల్వనోపడు. అట్టి లోని శత్రువులను గెల్చినట్టి మానవుడు భూత వర్తమాన భవిష్యత్తులలో నొక్కడునులేడు. అట్టి లోని వైరులను గెల్చినట్టి మానవుడు బ్రహ్మవిష్ణుశివలోకములందును స్వర్గమర్త్యపాతాళములందు నొక్కడునులేడు.
కాని, యంతటివాడును తనలో చెలరేగుచున్న కామ-క్రోధ-లోభాహంకారములను నల్గురు శత్రువులను గెల్వనోపడు. అట్టి లోని శత్రువులను గెల్చినట్టి మానవుడు భూత వర్తమాన భవిష్యత్తులలో నొక్కడునులేడు. అట్టి లోని వైరులను గెల్చినట్టి మానవుడు బ్రహ్మవిష్ణుశివలోకములందును స్వర్గమర్త్యపాతాళములందు నొక్కడునులేడు.
ఈ త్రిగుణములకు బ్రహ్మపుత్రులు తపసులు మునులును బద్ధులగుదురు. ఇక సామాన్యమానవుల విషయము చెప్పనేల? కపిల మహర్షి సాంఖ్యయోగ ప్రవర్తకుడు పవిత్రుడుగదా! అట్టి వాడును దైవయోగమువలన సాగరతనయులను దగ్ధుల నొనరించెను. రాజా! ఈ భువనత్రయ మహంకార కారణమున బుట్టెను. జగము నహంకారము రెండును పరస్పరము కార్యకారణ భావమున బద్ధములైనవి.
ఇంక నహంకారము లేనిచో జగమెట్లుండును? బ్రహ్మవిష్ణుమహేశుల శరీరములందు త్రిగుణభావములు వేర్వేరుగ గల్గుచుండును. ఇక మానవులలో సత్త్వగుణము లేదనుటలో వింతయేమున్నది? ఎందులకనగా, త్రిగుణము లెల్లడలను వ్యాపించి యుండును గదా! ఒకప్పుడు సత్త్వము వేరొకప్పుడు రజస్సు మరొకప్పుడు తమము పెరుగుచుండును.
ఒక్కొక్కప్పుడు ఇవి సరిసమానముగ నొప్పును. పరమాత్మ అవ్యయుడు - పరుడు-నిర్గుణుడు - అప్రమేయుడు-అగోచరుడు-సనాతనుడు. అటులే శ్రీదేవి పరబ్రహ్మస్వరూపిణి పరమార్థప్రదాయిని నిర్ణుణ-మాయాశక్తి-సర్వభూతాత్మ. అల్పబుద్ధులకు తెలియరానిది. ఇట్టి పరమాత్మ - పరాశక్తుల యేకత్వమన్యోన్యత్వ మెఱింగిన మనుజుడు సకల దోషములనుండి విముక్తి గాంచగలడు.
ఇట్టి నిర్మల నిశ్చలజ్ఞానమువలన మోక్షము గల్గునని వేదాంతభేరి మ్రోగుచున్నది. దీని నెఱింగిన మానవుడీ త్రిగుణమయ సంసారము దాటగలడు. జ్ఞానము రెండు తెఱంగులుగ నలరారును. అందు మొదటిది శాబ్దజ్ఞానము. అనగా బుద్ధి బలమున వేదశాస్త్రార్థ చమత్కార మెఱుగుట. ఇది బుద్ధిచే నూహించుట వలన గల్గును.
ఇట్టి నిర్మల నిశ్చలజ్ఞానమువలన మోక్షము గల్గునని వేదాంతభేరి మ్రోగుచున్నది. దీని నెఱింగిన మానవుడీ త్రిగుణమయ సంసారము దాటగలడు. జ్ఞానము రెండు తెఱంగులుగ నలరారును. అందు మొదటిది శాబ్దజ్ఞానము. అనగా బుద్ధి బలమున వేదశాస్త్రార్థ చమత్కార మెఱుగుట. ఇది బుద్ధిచే నూహించుట వలన గల్గును.
దీనిలో పెక్కులు కల్పితములై యుండును. వీనిచే చిత్తభ్రాంతి గల్గును. దీనివలన బుద్ధినాశము - దానివలన జ్ఞాననాశము గల్గును. ఇక రెండవది అనుభవజన్య జ్ఞానము. ఇది కడుంగడు దుర్లభము. దీనినెఱిగిన సద్గురువు వలన సత్సాంగత్యమువలన నిది లభ్యమగును. శాబ్దజ్ఞానమువలన ఏనాటికిని వస్తు-కార్య-సిద్ధిగానేరదు. శాబ్దజ్ఞానము వలన లోకోత్తరమైన యాత్మానుభవజ్ఞానము గలుగదు.
జన్మజన్మముల యజ్ఞానపు పెంజీకటుల తెరలను శబ్దజ్ఞానము ఛేదింపజాలదు. ఎట్లనగ, దీపము గూర్చి తెలసినంత మాత్రాన చీకట్లు వ్రీలిపోవుగదా! ఏది బంధకారణముగాదో యదే నిజమైన కర్మ. దేనివలన విముక్తిగల్గునో యదే విద్య. ఇతర కర్మలన్నియు నాయాసము గల్గించునవే. ఇతర విద్యలన్నియును నాయా శిల్పాదికళలలో నేర్పుమాత్రమే కల్గించును.
కనుక సచ్ఛీలము-ఓరిమి-ధృతి-కోపము లేకుండుట - పరోపకారము - సంతోషము మున్నగునవి పరావిద్యకు పండిన దివ్యఫలపురసములు. రాజా ! విద్య తపము యోగాభ్యాసమనునవి ముఖ్యములు. ఇవి లేనిచో కామాది శత్రువులు నశింపరు. జీవుల మనస్సు సహజముగ చంచలమైనది. వశముగానిది. దానికి లోబడిన ప్రాణులు లోకమున ముత్తెఱగుల నుందురు. చంచల చిత్తమువలన కామక్రోధాది భావములు గల్గును. మనస్సును జయించినచో కామాదులు గలుగవు.
కనుక నిమిరాజున కోర్పులేకపోయెను. యయాతి తిరిగి కోపముతో శుక్రాచార్యుని శపించలేదు. యయాతి ముసలితనమునే స్వీకరించెను. నిమి యయాతులలో నొకరాజు క్రూర స్వభావుడు - వేరొకడు శాంతస్వభావుడు. ఇట్టి భిన్న భావములుండుటవలనప నెవనిని దోషిగ నెన్నగలము? మున్ను హైహయగణము ధనాశవలన తమ పురోహితులగు భార్గవులను హింసించిరి. వారు బ్రాహ్మణులను కన్ను మిన్ను గానని కోపముతో సమూలముగ నశింపజేసిరి. పిదప నట్టి క్షత్రియగణమునకు బ్రహ్మహత్యాపాతకము చుట్టుకొనెను.
అధ్యాయము 137 హైహయుల చరిత్ర
అధ్యాయము 137 హైహయుల చరిత్ర
No comments:
Post a Comment