శ్రీదేవి యిట్లనెను: సాధకుడు ప్రొద్దుప్రొద్దుననే మేల్కాంచి తన బ్రహ్మరంధ్రమున కర్పూరవర్ణముగల దివ్య సహస్రారకమలమందు స్వాత్మరూపుజగు గురుదేవుని సంస్మరించవలయును. గురుదేవుడు లసద్‌భూషలుదాల్చి సకల విచిత్ర శక్తులు గల్గియుండును.
అతనికి మ్రొక్కి పిదప బుధుడు కండలినీదేవిని మది తలంపవలయును. కుండనీశక్తి బ్రహ్మరంధ్రము జేరునపుడు చైతన్య కాంతి పుంజములు విరజిమ్ముచు క్రిందికి దిగునపుడమృతస్వరూపిణి యగుచు సుషుమ్నా మార్గమున సంచరించునపుడు బ్రహ్మానంద రసస్వరూపమున చెన్నుదలిర్చును.
అట్టి పరాశక్తిని శరణు వేడుచున్నాను. అని మూలాధారమందలి చైతన్యజ్యోతితో వెలగొందుచున్న సత్యజ్ఞానానంతరూపిణి నగు నన్నే ధ్యానింపవలయును. అటుపిమ్మట శౌచాది నిత్యకృత్యములు తీర్చుకొనవలయును. తర్వాత బ్రహ్మణుడు నన్నుద్దేశించి నా ప్రీతికై యగ్నికారయము జరిపి పిదప సఖాసనమున గూర్చిండి నా పుజకు సంకల్పించవలయును.
తొలుత భూతశుద్ద జేసి తర్వాత మాయబీజమగు హ్రీంకారముతో మాతృకాన్యాస మొనర్పవలయును. మూలాధార మందు ''హ'' కారమును హృదయమున రేఫమును కన్బొమల నడుమ ''ఈ'' కారమును శిరమున హ్రీంకారమును న్యాస మొనర్పవలయును. పిదప నితర మంత్రములకు చెప్పబడిన న్యాసములను సైతము చేయవలయును.
తన దేహమందే ధర్మాదులతో పీఠపూజ సలుపవలయును. పిదప ప్రాణయామమువలన హృదయ కమలము విప్పారును. ఆది నా నివాసస్థానము. అచట పంచ ప్రేతాసనముపై శోభిల్లు మహాదేవినగు నన్ను ధ్యానింపవలయును. బ్రహ్మ-విష్ణు-రుద్రుడు-ఈశ్వరుడు-సదాశివుడు అను వీరిని పంచప్రేతము లందురు. వీరు నా పాదమూలమున నిత్యము వినసింతురు.
వీరు భూమి-నీరు-తేజము-వాయువు-గగనమను పంచభూతములతోను జాగ్రత్త-స్వప్నము-సుషుప్తి-తురీ యము-అతీతమను పంచావస్థలతోను గూడి యుందురు. అవ్యక్త చిద్రూపిణి నగు నేను వీరి కధిపతిని. సర్వాతిశాయినిని. వీరైదుగురును నాకాసనములై యుండుటగూర్చి శక్తితంత్రములందు వెల్లడింపబడెను.
ఈ విధముగ నన్నే ధ్యానించి మానసోపచారములతో నన్నే పూజింపవలయును. జపింవలయును. జనఫలము దేవి కర్పించి యర్ఘ్య పాత్రాదుల నాసాదించుకోని పూజాద్రవ్యములు శుద్ది చేయవలయును. ''హ్రీం'' లేక ''ఫట్'' అను మంత్రమున మంత్రించిన జలముతో శుద్ది చేయవలయును. మొదట దిగ్బంధ మొనరించి పిదప గురువందనము చేసి గురు నానతి బడసిన పిదప మొదట హృదయమున భావించిన దివ్యమంగళ విగ్రహమువంటి విగ్రహము నా వాహనము చేయవలయును.
ఇట్లు ప్రాణప్రతిష్టా మంత్రముతో న వాహనము చేసిన పిదప శ్రద్ధాభక్తులతో శ్రీరాజరాజేశ్వరి కాసనము ఆర్ఘ్య పాద్యములు ఆచమనము నైవేద్య తాంబూలము దేవి కర్పించవలయును. తదుపరి శ్రీచ్రకమందున్న యావరణ దేవతలను చక్కగ పూజింపవలయును. ఇట్లు ప్రతిదినము చేయజాలనిచో ఒక శుక్రవారము నాడైన చేయవలయును.
ఇట్లు ప్రాణప్రతిష్టా మంత్రముతో న వాహనము చేసిన పిదప శ్రద్ధాభక్తులతో శ్రీరాజరాజేశ్వరి కాసనము ఆర్ఘ్య పాద్యములు ఆచమనము నైవేద్య తాంబూలము దేవి కర్పించవలయును. తదుపరి శ్రీచ్రకమందున్న యావరణ దేవతలను చక్కగ పూజింపవలయును. ఇట్లు ప్రతిదినము చేయజాలనిచో ఒక శుక్రవారము నాడైన చేయవలయును.
ఈ యంగ దేవతలను శ్రీ యాదిదేవి విరజిమ్ముచున్న కాంతిపుంజములుగ నెంచవలయును. పిమ్మట పువరానృత్తిగల మూలదేవిని సుగంధ కుంకుమాదులచే బూజింపవలయును. తావులు వెదజల్లు పూలర్పించవలయును. నన్ను తరువాత నైవేద్యతర్పణతాంబూల దక్షిణలతో తనుపవలయును.
నగేశా! తర్వాత నీవు రచించిన దేవిసహస్ర నామములతో నన్ను సంతోషపెట్టవలయును. నన్ను తంత్రోక్తమగు కవచముతోను అహంరుద్రేభిః అను దేవిసుక్తముతోను హ్రీంకారోపనిషచ్చులోని థర్వశిమంత్రములోను శ్రీమహావిద్యలోని మహామంత్రములతోను మాటిమాటికి సంతోషపఱచవలయును.
పిదప భక్తిరసమునపులకిత హృదయుడై జగదంబను తప్పిదములను క్షమింపుమని వేడుకొనవలయును. తర్వాత తన శరీరములోని యణువణువు ప్రేమరసమున గగుర్పాటొదవ నానందభాష్పములతో డగ్గుత్తికతో నృత్యగీతవాద్యములతో దేవిని ప్రసన్నురాలిని చేయవలయును.
ఓ వేదపారాయణములందును సకల పురాణములందును నేనే ప్రతిపాద్యను. అందువలన వేదపారాణముచేసి నన్నానందపఱచవలయును. బ్రహ్మణులనుముత్తైదువలను పడుగులను కన్యకలనునితంపామర జనమును శ్రీదేవిగబావించి వారికితుష్టిగ భోజనము పెట్టవలయును. పిదప దేవిని యెడదలో నమస్కరించి సంహరముద్రతో దేవి కుద్వాసనము తెప్పవలయును.
ఓ సువ్రతా! హ్రీంకార మెల్ల మంత్రములకు నాయకమణి వంటిది. కనుకనట్టి హ్రీంకారముతోనే పూజావిధాన మంతయును జరుపవలయును. నేను హ్రీంకార మనెడు నద్దమందు నిత్యము ప్రతిబించుచుందును. కనుక హ్రీంకారమున సమర్పించిన దంతయునుసర్వమంత్రములతో నర్పించిన దానితో సాటియుగును.
పిదప తన గురుని వస్త్రాదులతో పూజించి తన్ను తాను. ధన్యునిగ తలంచుకొనవలయును. ఎవడీ విధముగ శ్రీభువనేశ్వరీ దేవిని సంపూజించునో- అతని కెప్పుడు నెచ్చట నేదియును సాధ్యము కానిది లేదు. అతడు శరీరము వదలిన పిమ్మట నా మణిద్వీపమును తప్పక చేరుకొనగలడు ఇట్టి నాపరమ భక్తుని దేవీ స్వరూపునిగా నెఱుంగవలయును. ఇతని కెల్ల దేవతలును నమస్కరింతురు.
ఓరాజా! ఈ విధముగ నీకు శ్రీదేవీ పూజా విధానమంతయును వివరించితిని. ఇదంతయును తెలిసికొని నీ శక్తికి తగినట్లుగ నన్ను పూజింపుము. దానిచే నీవు ధన్య భాగ్యుడవగుదువు. ఈ దివ్య దేవీ గీతాశాస్త్రమును దేవీ భక్తుడు శిష్యుడు గాని వానికిని ధూర్తుడు దుష్టుడునైన వానికి నెప్పుడును చెప్పరాదు. ఈ దేవీ గీతలను ప్రకటించుట తన తల్లి స్తనములను బైటికి చూపుటవంటిది.
కనుక దేవిగీతలను యత్నముతో సతము రహస్యముగ నుంచవలయుము. దీనిని దేవీభక్తుడు-వినీతశిష్యుడు-పెద్దకొడుకు-సుశీలుడు-సువ్రతుడు-నగు వానికే చెప్పవలయును. దీనిని ప్రత్యేకముగ దేవి పలికి యచ్చోట నంతర్దానమొందెను.
శ్రీదేవీ దర్శన భాగ్యమున నెల్ల దేవతలు నానంద భరితులైరి. హైమనతీదేవి హిమాలయునకు పుత్రికగ జన్మించి గౌరి యనబరగెను. ఆమెను శంకరున కిచ్చి వివాబము జరిపిరి. పిదప వారికి షణ్ముఖుడు జన్మించి తారకాసురుని దునుమాడెను,
జనమేజ రాజా!మున్ను సముద్ర మథనము వేళ పెక్కు రత్నములుద్బవించెను, అమరులు లక్ష్మీప్రాప్తికి స్తోత్రము చేయగ లక్ష్మీదేవి సంతుష్టయై సాగరమందుద్బవించెను. దేవతలు లక్ష్మీదేవిని విష్ణునకొసంగిరి. అంత నామె సంతుష్ఠి జెందెను.
రాజా!ఈవిధముగ నత్యత్తమమైన దేవీ మాహాత్మ్యము వివరింపబడినది. ఈ శ్రీగౌరీలక్ష్ముల యవతార కథ సర్వకామము లీడేర్చను. ఇది మిక్కిలి రహస్యమైనది. దీని నితరులకు చెప్పరాదు. ఈ శ్రీ దేవీగీతను రహస్యముగ పాడుము. ఓ యనఘా! నీవడిగిన దంతయును పవిత్రము పావనము దివ్యమునైనది. దీనిని వినిన తర్వాత నీవేమి వినదలతువో తెలుపుము.
శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము
No comments:
Post a Comment