సూతు డిట్లనెను: అటుతర్వాత హరిశ్చంద్ర నరపతి చితిపై తనకొడుకు నుంచి తన భార్యతోకూడ తాను దోయిలించి విసుచుండెను. అతడు పరమేశాని! శతాక్షి-త్రిభువనేశ్వరి-పంచకోశాంతరస్ధిత-మూలాధారనిలయ-బ్రహ్మస్వరూపిణి- రక్తాంబరధర-దయారససాగర-నానాయుధధర-జగత్పాలన తత్పర-జగదంబ-అగు దేవిని హృదయమున సంస్మరింపగ ధర్మ దేవతను మున్నిడుకొని యింద్రాది దేనతలు నచ్చోటి కరుగదేంచిరు.
వారు వచ్చి ధర్మదేవత నోటితో రాజుతో నిట్లనిరి: ఓ మహాప్రభూ: రాజా! అవధరింపుము. నేను (ధర్మదేవుడు) బ్రహ్మా-నారాయణుడు-సిద్ధసాద్యులు-గంధర్వులు-విశ్వే దేవతాలు-మరుద్గణము-చారణులు-లోకపాలకులు-నాగులు-రుద్రులశ్వినులు-ఇంకనుతక్కిన దేవతలును విశ్వామిత్రుడు-ముల్లోకములకు ధర్మానుసారము మేలుగోరువాడును విశ్వామిత్రుడును అందరమును నీకు మేలు చేయగోరి వచ్చియున్నాము.
అంత ధర్మదేవత యిట్లనెను: రాజా! ఇక దుస్సాహసము వలదు. నేను ధర్మదేవతను. నీ చెంత కేగుదెంచితిని. నీ యింతటి దమము-ఓరిమి-సత్వము మున్నగు సుగుణములకు సుప్రసన్నుడనైతిని.
ఇంద్రుడిట్లనెను: ఓ హరిశ్చంద్ర మహాశయా! నీ నింద్రుడను. నీ సమీపమునకు వచ్చితిని. నీవు నీ భార్యపుత్రులతో గలిసి సనాతన లోకములు గెల్చితివి. రాజా! నీ విక నీ భార్యాపుత్రులనుగూడి స్వర్గ మలకరింపుము. ఇతరుల కలవిగాని స్వర్గసీమ నీ సత్యకర్మలవలన బజసితివి.
సూతుడిట్లనియెను: పిదప నపమృత్యువును తొలగించు సమృతవర్షము గురిసెను. ఇంద్రుడమృతవృష్టి నాకాశమునుండి చితిమీది శిశువుపై గురిసెను. అంతలో పూలజల్లుల్లు గురిసెను. దేవదుందుభులు మ్రోగెను. పిదప హరిశ్చంద్రుని చచ్చిన బాలుడు లేచి వెనుకటి మాదిరిగ సుకుమారుడుగ-ప్రసన్నుడుగ-ఆరోగ్యవంతుడుగ-ప్రేమమూర్తిగ నొప్పెసగెను. హరిశ్చంద్ర రాజంత తన కొడుకును కౌగిలించుకొనెను. అతడు తన భార్యాపుత్రులతో సంపదలతోగూడి దివ్యమాల్యాంబరములు దాల్చెను.
ప్రమోదభరితుడై నిశ్చింతుడై యుండెను. వెంటనే ఇంద్రుడు రాజుతో నిట్లు పలికెను. ఓ మహాత్మా! నీవు నీ పుణ్య సత్కర్మముల ఫలితముగ భార్యాపుత్రులతో సుఖదామమగు స్వర్గసీమ కరుగుదెమ్ము.
హరిశ్చంద్రు డిట్లనెను: ఓ దేవ రాజా! నా చండాలస్వామి యనుమతిబడయక యతని యప్పు తీర్చక నేను స్వర్గమునకు రాజాలను,
ఘర్ము డిట్లనెను: నీకు రాబోవు కష్టములు నేను ముందుగ తెలిసికొని నామాయతో నేను చండాలరూపమున నీ కీ పక్కణమును చూపితిని.
ఇంద్రు డిట్లనెను: రాజా! ఏ పరమస్ధానమును భూమిమీది ప్రజలు గోరుకొందురో యట్టి పుణ్యపురుషులకు నిలయమగు స్వర్గధామమును బొందుము.
హరిశ్చంద్రు డిట్టనెను: ఓ దేవరాజా! నీకు నమస్కారము. నా మాటయును కొంచెము వినుము. కోసలనగర ప్రజలు నా వియోగ దుఃఖమున నమునిగియున్నారు. అట్టివారివి విడనాడిన నేనెట్టుల స్వర్గమునకు రాగలను? బ్రహ్మాహత్య-సురా పానము-గోవధ-స్త్రీవధ-ఇవన్నియును తన్ను గొల్చు భక్తుని విడనాడికత వాని పాపమునకు సమాన మగును.
కనుక తన్ను నమ్మి కొల్చువానిని విడువరాదు. వదలినవానికి సుఖ మెక్కడిది? నా ప్రజలు రాక నేను కలదనునింద్రా! నీ స్వర్గమునకు నీవే వెళ్ళుము. సురనరా! నేను స్వర్గములకు వెళ్ళినను మఱినరక మేగినను వారితోడనే వెళ్లగలను.
ఇంద్రు డిట్ల నెను: ''రాజా! ఒక్కొక్కకని పుణ్యముపాపములు పెక్కురీతులుగ వేర్వేరుగ నుండును. అట్టి వారందఱితో నొక్కుమ్మడిగ నీవు స్వర్గసుఖ మెట్ల గోరుచున్నావు?''
హరిశ్చంద్రు డిట్లనెను: ఇంద్రా! రాజు తన ప్రజల బలముచేతనే రాజ్య మనుభవించును. రాజు వారి మూలముననే మహాయజ్ఞములు చేయును. వారీకూపములు నిర్మించును. నేను నా ప్రజల మూలముననేయన్ని మునుష్ఠించితిని. వారంనఱన వదలి నే నొక్కడనే స్వర్గ మేగవలయుదని నే నుపదానాల నీయలేదు.
దేవేశ్వరా! కనుక నే నేదైన పున్నెము చేసినచో జన్న మొనరించినచో జపము చేసినచో నా కర్మఫలము పెక్కేండ్లను భవింపనలసియున్నచో-అదంతయును నా ప్రజలనుగూడి యొక్కనా డనుభవించిన నా కంతయు చాలును.
సూతు డిట్లనెను: సరే అట్లే కానిమ్మని త్రిలోకపతి యనెను. పిమ్మట ధర్మదేవత-ఇంద్రుడు-కౌశికుడు-నెల్లరును ప్రసన్న మనస్సులతో నాల్గు వర్ణముల ప్రజలు వసించు కోసలపురి కరిగిరి.
అపుడు దేవేంద్రు డిట్లనెను: ఓ మహాజనులారా! మీ రిపుడు దుర్లభమైన స్వర్గలోకమునకు వెళ్ళుటకు హరిశ్చంద్రుని సమీపమునకు రండు. హరిశ్చంద్రుడు తన ధర్మబలముతో స్వర్గమును జయించెను. అనగా వారు రాజును చేరిరి. హరిశ్చంద్రు వారిని చూచెను. మీరు నా వెంట స్వర్గమునకు రండని రాజనెను.
ప్రజలు దేవేంద్రుని వాక్కులు రాజు వాక్కులు విని ప్రమోద మందిరి. వారిలో సంసారముమీద విరక్తి జెందిన కొందఱు తమ సుతులపై కుటుంబభారముంచి స్వర్గ మేగిరి. వారు పరమానందముతో జ్యోతిర్మయులై దివ్యవిమాన మెక్కిరి. అపుడు హరిశ్చంద్ర రాజు తన రోహిత కుమారునకు రాజ్యాభిషేకముచేసి పెద్దలుగల రమ్యమగు నయోధ్యాపుర మతని కప్పగించెను.
పిదప రాజు తన కుమారు నభినందించి మిత్రులను గౌరవించి పుణ్యభాగ్యము దేవ దుర్లభమైన కీర్తి బడసెను. అట్లు కీరితిబడసి రాజు కింకిణీరవమున చెన్నారి కామమగమనముగల దేవవిమాన మలంకరించెను. ఆ సమయమునందు సకల శాస్త్రార్ధ తత్త్వ విదుడు-మహాత్ముడు- దైత్యాచార్యుడు-నగు శుక్రుడు రాజునుగాంచి యిట్ల పొగడెను.
శుక్రు డిట్లనెను: ఓహో! ఓరిమియొక్క మహత్తః: ఓహో దానఫలమహిమలు! ఏమని చెప్పవచ్చును. వానివలననే హరిశ్చంద్రు డింద్రలోకమున కరుగగల్గెను. ఈ పకారముగ మీకు హరిశ్చంధ్రోపాఖ్యానమంతయును వినిపించితిని. దుఃఖార్తుడీ కధ విన్నచో వాని దుఃఖము తొల గును. ఈ కధవలన స్వర్గకాముడు స్వర్గమును పుత్రార్ధి పుత్రుని భార్యార్ధి భార్యను రాజ్యార్షి రాజ్యమును బడయగలడు.
No comments:
Post a Comment