ఒకనాడు హరిశ్చంద్రుడు వసిష్ఠాశ్రమముజేరి మునికి తలవంచి మనస్కరించి తనకు సంతానములేని లోటు వెల్లడించెను. ఓ ధర్మజ్ఞా! నీవు దైవజ్ఞుడవు. మంత్రవిద్యావిశారదుడవు. మానదా! నా సంతతి కేదైన నుపాయము తెల్పుము.
ద్విజవర్యా! సంతులేనివానికి సద్గతులు లేవనుట నీకును దెలియును గదా! నీవు శక్తిమంతుడవు. నా దుఃఖ మెఱిగియు నీవేల యూరకున్నావు? నాకన్న పక్షు లెంతయో ధన్యములు. అవి పిల్లలను గని పెంచును. నేను భాగ్యహీనుడను. అందుచే రేబవళ్ళు లోన కుమిలిపోవుచున్నాను. అని రాజు దుఃఖముతో బలుకగ విని వసిష్ఠముని తన మదిలో చక్కగ నాలోచించుకొని యిట్లనెను:
మహారాజా! నీవు పల్కినదంతయు నిజమే. ఈ సంసారమున సంతానము లేనివాడు పొందు దుఃఖము మరెవ్వడును పొందడు. కనుక రాజేంద్రా! నీవు వరుణదేవుని గొలుపుము. అతడు తప్పక నీ కోర్కి దీర్పగలడు.
ఓ దర్మిష్ఠా! సంతాన మిచ్చుటలో వరుణుని మించిన దేవుడు లేడు. నీ వతని నారాధించుము. నీ కోర్చి తీరగలదు. రాజులు దైవమును-పురుషకారమును-రెంటిని పాటించవలయును. ప్రయత్నము లేనిచో ఏ కార్యమైనను నెఱవేరజాలదు. తత్వ మెఱిగినవారు న్యాయ ముగ తప్పక ప్రయత్నము చేయవలయును.
రాజా! ప్రయత్నించిన సిద్ధించును. లేనిచో సిద్దించదు. అమిత తేజస్వియగు గురుని మాటలువిని యతనికి నమస్కరించి రాజు తపము చేయదలంచి వెడలెను.
అతడు గంగాతీరమున మంచి యాశ్రమ మేర్పరచుకొని పద్మాసనమున వరుణుని ధ్యానించుచు తీవ్రముగ తపించెను.
అట్లు రాజు తప మొనర్చుచుండగ ప్రసన్నముఖ కమలముగల వరుణుడు దయతో దర్శన మిచ్చెను. అపుడు వరుణుడు హరిశ్చంద్రునితో నిట్లనెను : దర్మజ్ఞా! నేను సంతో షించితిని. నీ తపము గొప్పది. ఏదేని వరము గోరుకొనుము.
రాజిట్లనియెను : దేవేశా! నేను ఋణత్రయము బాపుకొనుటకు ప్రయత్నించుచున్నాను. కనుక సుఖము గల్గించు నొక్క పుత్రుని ప్రసాదింపుము. అని రాజు కన్నీరు ప్రవహింపగపలుకగ విని వరుణుడు తన యెదుట నున్న రాజుతో నవ్వుచు నిట్లనెను:

రాజా! నీవు కొరినట్లుగ గుణవంతుడగు పుత్రుడు గల్గినచో నీ కార్యము సిద్ధించిన పిమ్మట నాకేమి ప్రియము గూర్చగలవు?
రాజా! నీవు నీ పుత్రుని పశువుగ బంధించి విచారము చెందక నా యజ్ఞము చేయుటకొప్పుకొన్నచో నీకుపుత్రుని ప్రసాదించగలను.
రాజిట్లనెను : దేవా ! నాకు సంతాన హీనత్వము లేకున్ననంతే చాలు తప్పక నీకు యజ్ఞమొనర్ప గలను. నా కొడుకును పశువుగ చేయుదును. నా మాట నిజము. నమ్ముము.
మానదా! ఈ ప్రపంచమున సంతానము లేకుం డుట భరింపరాని దుఃఖము. సుతుడు నరుల శోకాగ్ని చల్లార్చగలడు. కొడుకు నిమ్ము.
వరుణుడిట్లనెను: రాజా! నీకు తప్పక సుతుడు గలుగగలడు. ఇక నీ యింటి కేగుము. నీవు నాతో బలికిన వాక్కును సత్యమొనరింపుము. అని వరుణుడు పలుకగ హరిశ్చంద్రుడు తన యింటికేగి వరుణుని వరప్రదానము గూర్చి తన భార్యకు తెల్పెను.
ఆ రాజున కందాల భార్యలు నూర్గురు కలరు. వారిలో శైబ్య పట్టమహిషి. ధర్మపత్ని. పతివ్రత. కొంత కాలమున కావరవర్ణిని గర్బము దాల్చెను. ఆమెకు వేవిళ్లు గల్గుట విని రాజు ప్రమోదభరితుడయ్యెను. ఆమెకు రాజు యథావిధిగ సంస్కారము లొనరింపజేసెను.
పిమ్మట పదవ నెలలో నొక శుభదినమున నామె ప్రసవించెను. అపుడు తారాబలము గ్రహబల మనుకూలముగ నుండెను. దేవకుమారుని బోలు కుమారుడు పుట్టగనే రాజు స్నానమాడి విప్రులను దర్శించెను.
జాతకర్మాదులొనరించి భూరిదానము లొసగెను. పుత్ర జన్మమున రాజున కమితానంతము గల్గెను. ఆ సమయమున రాజు విశేష దానము లొనరించి యుదారముగ ధన ధాన్యములు దానముచేసి సంగీత నృత్య గోష్ఠులు జరిపించెను.
అట్లు రాజభవనమున పుత్ర మహోత్సవము జరుగుతుండగ వరుణుడు బ్రాహ్మణ వేషమున నేతెంచెను. రాజా! నేను వరుణుడను. నీకు మేలు గల్గుగాక! నీ కిపుడు కొడుకు గల్గెను గదా! అతనినో నాయజ్ఞము వేగ మొనరింపుము. నా వరప్రభావమున నీ వంధ్యత్వము తొలగినది గదా!

ఇపుడు నీవు మునుపు నా కిచ్చినమాట నిలబెట్టుకొనుమని వరుణు డనెను. వరుణుని పల్కులు విని హరిశ్చంద్రు డిట్లు తనలో తలపోసెను. కమలమువంటి ఈ నా సుకుమార కుమారు నెట్లు చంపగలను? మహశక్తిగల నరుణుడు విప్రవేషమున వచ్చియున్నాడు. మేలుగోరుకొను వాడెవ్వడును దేవత లను పరిహసించి నిందింపరాదు. ఎల్ల ప్రాణులకు పుత్ర వాత్సల్యము ఛేదింపంరాని-తెలియని-యనుబంధము. ఇపుడేమి చేతును? నాకు సంతానసౌఖ్య మెట్లు గల్గును? అని రాజు తలంచుకొని ధైర్యము తెచ్చుకొని వరుణునకు నమస్కరించి పూజించి సవినయముగ తీయగ నిట్టు లనియెను:
దేవదేవా! దయానిధీ! నీ యనుజ్ఞ పాటింపగలను. వేదోక్త విధానముగ యజ్ఞ మొనర్చి దానదక్షిణ లొనరింపగలను. కొడుకు పుట్టిన పదినాళ్లకు తండ్రికి శుద్ధి యగును. తల్లికి నెల నాళ్లకు శుద్ధి యగును. దీనికి దంపతులు కారణము. వరుణదేవా! పరమేశ్వరా! నీవు ధర్మజ్ఞుడువు. కనుక నాయెడ దయయుంచి యొక్క నెలవఱకు క్షమించుము. అనగనే
వరుణుడు రాజుతో నిట్లనెను: రాజా! నీకు మేలు గల్గుగాక! నేను వెళ్ళుచున్నాను. నీ పనులు చక్కబెట్టుకొనుము. నేను మరల నొకనెలకు రాగలను. అపుడు తప్పక హోమము చేయవలయును రాజా! అప్పటి వఱకు జాతకార్మాది విధు లొనరింపుము. అని వరుణుడు రాజుతో తీయగ పలికి వెళ్ళగ హరిశ్చంద్రుడు ప్రమోద మొందెను.
అటు పిమ్మట రాజు బంగరుతో నలకరించినవియు కుండలంతపోదుగులుగలవియు అగు కోట్ల యావులను తిలపర్వతములను దానమొసంగెను. రాజు తన కుమారుని మన ముఖలక్షణములు వీక్షించి పరమానందమంది యతనికి యధావిధిగ రోహితుడను పేరు పెట్టేను.
ఒక నెల గడిచిన పిదప వరుణుడు మరల విప్రవేషమున రాజభవనమునకు వచ్చి యిపుడే యజ్ఞ మొనర్పుమని పల్మారు లనెను. రాజు వరుణుని జూచి శోకసాగరమున మునిగి యతని కాతిధ్య మొసంగి దోసిలొగ్గి యిట్లనెను.
జలాధిపతీ! నా యదృష్టముననే నీవు వచ్చితివి. గృహము పావనమైనది. నీ యిష్టానుసారముగ యజ్ఞ మొవర్తును. నోటిపండ్లు రానిది యాగవశవుగ నుండరాదని వేదవిదు లంచురు. కనుక నా కొడుకునకు పండ్లు వచ్చిన పిమ్మట నీ యజ్ఞ మొనర్తును. అని రాజు పలుకగ వరుణుడు సరేయని వెళ్ళిపోయెను. హరిశ్చంద్రుడు తన యింట సంసారసుఖము లనుభవించుచుండెను.
రాకుమారునకు దంతములు మొలిచిన పిదప వరుణుడు మరల విప్రవేషమున రాజు నింటికి వచ్చి తన పని నెఱవేర్పుమని యడిగెను. రాజు విప్రరూపమున నున్న వరుణునిగాంచి నమస్కరించి సగౌరవముగ నాసన మొసంగి సమ్మానించి పూజించెను: ఆ పిదప వినయముగ తలవంచి నుతించి
రాజిట్లనెను: ''దేవా! తప్పక భూరిదక్షిణలతో నీ యజ్ఞ మొనరింపగలను. నా బాలున కింకను చూడాకరణము చేయలేదు. పుట్టువెండ్రుకలున్నవాడు యజ్ఞపశువుగ తగడని పెద్దలందరు. ఓ జలాధి నాధా! నీవు శాశ్వతవిధి నెఱగిన వాడవు. కాన నంతవఱకు క్షమించుము. నా శిశువునకు వెండ్రుకలు తీసిన మీదట నీయాగ మొనర్పగలను.'' అను రాజు మాటలువిని
వరుణు డతని కిట్లనెను: ''రాజా! ఏమేమో చెప్పి నన్ను మాటిమాటికి మోస గించుచున్నావు. ఇపుడు నీకడ యజ్ఞసామగ్రి యంతయును గలదు గదా! కేవలము పుత్రవాత్సల్యమున జిక్కుకొని నన్నిట్లు మోసగించుచున్నావు. నీవు క్షౌరకర్మమున్నగు విధులైన పిదపనైన యాగము చేయుకున్నచో కోపముతో నిన్ను దారుణ ముగ శపింపగలను.
రాజా! మానదా! ఇప్పటికి నీ మాట మీద వెళ్ళుచున్నాను. నీ విక్ష్వాకు వంశజుడవు. నీ మాట వమొనపరింపకుము.'' అని పలికి వరుణుడు రాజ గృహము వెడలి చనెను. రాజు తన భవనమున సుఖముగ నుండెను.
అటు పిమ్మట పుట్టువెండ్రుకలు తీయు మహోత్సవమున వరుణుడు మరల రాజప్రాసాదమున కేతెంచెను. ఆ మహోత్సవమున రాణి తన కుమారుని తన తొడపై నిడుకొని రాజు ప్రక్కనుండెను. అంతలో వరుణు డేగుదెంచెను. వరుణుడగ్ని హోత్రుడు ప్రత్యక్షమైనట్లు విప్ర వేషమున వెలుగుచుండెను. అతడు రాజుతో తన పని నెఱవేర్పుమని కచ్చితముగ నడిగెను. ఆపుడు రాజు వరుణుని గాంచి వ్యాకుల చిత్తముతో గడగడలాడుచు చేతులు జోడించి నమస్కరించెను. ఆ పిదప సవినయనుగ రాజు చక్కగా వరుణుని పూజించి యతని కిట్లనెను. ఓ స్వామీ! నీ కార్యము యధావిధిగా నొనరింపగలను. నీతోనొక మాట చెప్పదలచుకొంటిని. నీవు నన్ను మన్నించి చెప్ప వచ్చునన్న చెప్పగలను. నిశ్చలముగ వినుము. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులను మువ్వురను ద్విజులందురు. వీరికి సంస్కారము లావశ్యకములు. తక్కిన వారిని శూద్రులని వేదవాదులందురు. కనుక నా కొడుకిపుడు శూద్రునివలె నున్నాడు. వడుగైనవాడు కర్మకు యోగ్యుడగునని వేదములు నిర్ణియించినవి గదా! విప్రుల కెనిమిదవయేట రాజులకు పదునొకండవయేట వైశ్యులకు పండ్రెండవయేట నుపనయనము చేయవలయును గదా! దేవేశా! నేను దీనుడను. నీ సేవకుడను. నా యెడ దయ బూనినచో నా కొడుకును వడుగు చేసిన పిదప నతనిని యాగ పశువుగా నొనరింపగలను. నీవు లోకపాలకుడవు. ధర్మజ్ఞుడవు. సర్వ శాస్త్రవిశారదుడవు. నా మాటమీద నీకునమ్మకమున్నచో నీవు నీ యింటి కెగుము అను రాజు మాటలు విని వరుణుడు దయతలచి యొప్పకొని వెడలిపోయెను. రాజును సంతోషించెను.

వరుణుడు వెళ్ళిన మీదట రాజు పుత్రోత్సాహముతో సుఖముగ కాలము గడుపుతుండెను. ఈ విధముగా హరిశ్చంద్రచక్రవర్తి రాజ కార్యములు చక్క పెట్టుచుండగనే యతని కొడుకు పదేండ్ల వాడయ్యెను.
అపుడు శాంతులగు విప్రులు మంత్రులు ననుమతింపగ రాజు తన శక్తికి తగినటు లుపనయన సామాగ్రి సమకూర్చెను. తన తనయునకు పదుకొకండవ యేడు వచ్చిన వెంటనే యధావిధిగ నపనయన సంస్కార మొనరింతెను. కాని మదిలో చింతాతురుడై యుండెను. రాకుమారునకుపనయన సంస్కారము జరుగుచున్న సమయమునందు వరుణుడు బ్రహ్మణ వేషమున మరల నచటికి వచ్చెను.

అంత రాజు తన యెట్టయెదుట నున్న వరుణువి జూచి వెంటనే కైమోడ్చి నమస్కరించి ప్రీతితో నతిని కిట్లనెను. దేవా! వడుగైన పిదప నా కొడుకు యాగపశువుగ తగినవాడగును. నీ దయవలననే నా వంధ్యత్వదోషము పాసెను. ధర్మజ్ఞా! సమయము వచ్చినప్పుడు గొప్పగ దక్షిణలిచ్చి నీ జన్నము పూర్తి చేయగలను. ఇప్పుడు నేను నిజముగ బలుకుచున్నాను. నా కొడుకునకు సమావర్తనము జరిగిన పిమ్మట నీ కోరిక నెఱవేర్పగలను. నా యెడ దయయుంచి యంతదనుక తాళుము.
వరుణు డిట్లనెను: ఓ మహామతీ! రాజా! నీవు పుత్రవాత్సల్యమున వ్యాకులుడవై మోహితుడై యుక్తియుక్తముగ నేర్పుతో నన్ను మోసగించుచున్నావు. మహారాజా! ఇపుడుకూడ నీయిష్ట ప్రకారముగ వెళ్ళుచున్నాను. సమావర్తనమ్మునాటికి తిరిగి రాగలను. అనిపలికిరాజును వీడ్కొని వరుణు డేగెను.
రోహితుడి పలాయనం - హరిశ్చంద్రుడికి జలోదరం
శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము
శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము
శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము
శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము
శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము
శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము
శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
శ్రీ దేవీ భాగవతం ప్రథమ స్కంధము
శ్రీ దేవీ భాగవతం ద్వితీయ స్కంధము
శ్రీ దేవీ భాగవతం తృతీయ స్కంధము
శ్రీ దేవీ భాగవతం చతుర్థ స్కంధము
శ్రీ దేవీ భాగవతం పంచమ స్కంధము
శ్రీ దేవీ భాగవతం షష్ఠ స్కంధము
శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
No comments:
Post a Comment