జనమేజయు డిట్లనెను : ఓ మహానుభావా ! సూర్యవంశమునందు బుట్టిన ధర్మజ్ఞులగు రాజుల చరిత్ర నాకు వివరముగ వినిపింపుము. ఆన
వ్యాసు డిట్లనెను: ఓ భారతా ! నేను మున్నొకప్పుడు ఋషిసత్తముడగు నారదునివలన సూర్యవంశ చరిత్ర విస్తరము వింటిని. ఆ వినిన విధమునే నేను నీకిపుడు తెలిపెదను.
ఒకప్పుడు శ్రీమంతుడగు నారదముని స్వేచ్చగ పర్యటించుచు పావన సరస్వతీ తీరమందలి నాపుణ్యాశ్రమము జేరెను. అపుడు నేను నారదుని పాదములకు మ్రొక్కి యాస నమిచ్చి గౌరవించి యతనిముందు నిలుచుంటిని. అతనిని యథావిధిగ పూజించి
నేనిటు లంటిని: 'ఓ మునివరా! నీవు లోక పూజ్యు డవు. నీ రాకవలన నేను తరించితిని. ఏడవ మనువునకు జన్మించిన రాజులు ఘనముగ పేరు ప్రతిష్ఠలు గడించిరి. వారి కథలు చరిత్రలు నాకు వినిపింపుము.
మహానుభావా! వారి జన్మలు పుణ్యధన్యములు. వారికి వారే సాటి. వారి చరిత లత్యద్బుత ములు. అట్టి సూర్యవంశజుల చరిత్ర విపులముగ వినకుతూహలము గల్గుచున్నది.
మునివరా! ఆ కథలను సమాస వ్యాస పూర్వకముగ (ఒక విషయమును మొదట దానియందలి అంశముల కథనముతో తెలుపుట సమాసము-వానిలో నొక్క యంశ మునే విస్తరించి అదే క్రమమున చెప్పుట వ్యాసము-పరిష్కర్త) తెలుపుము. అని నేను పరమార్థవిదుడగు నారదు నడిగితిని. అది విని నవ్వుచు నారదుడు పరమప్రీతితో నిట్లు పలుకదొడగెను.
సత్యవతీ తనయా! వినుము. సూర్యవంశ రాజుల పవిత్ర వంశ ముత్తమమైనది. వారి వంశము పావనము. కర్ణామృతము. పరమధర్మమయము. జ్ఞానసంపన్నము. పూర్వము విష్ణువు నాభి కమలమునుండి బ్రహ్మ యుద్బవించెను. అని పురాణములందు ఘనముగ వర్ణింపబడెను.
బ్రహ్మ స్వయంభువు సర్వజ్ఞుడు సర్వశక్తియుక్తుడు విశ్వాత్ముడు. అతడు విశ్వరచన చేయగోరి వేల యేండ్లు ఘోరముగ తపమొనరించెను. అతడు శ్రీమాతృదేవిని ధ్యానించి మహాశక్తిని సంపాదించెను. బ్రహ్మ మానసపుత్రులను సృజించెను.
వారు శుభలక్షణలక్షితులు. వారిలో మరీచి సృష్టిరచనలో పేరెన్నిక గాంచెను.
మరీచి కుమారుడు కశ్వపుడు. అతడు విశ్వమాన్యుడు-లోక ప్రియుడు-విశ్వవిఖ్యాతుడు. దక్షుని పదుముగ్గురు కూతురు లతని భార్యలు.
మరీచి కుమారుడు కశ్వపుడు. అతడు విశ్వమాన్యుడు-లోక ప్రియుడు-విశ్వవిఖ్యాతుడు. దక్షుని పదుముగ్గురు కూతురు లతని భార్యలు.
కశ్యప ప్రజాపతి వలన దేవతలు దైత్యులు యక్షులు పన్నగములు పశుపక్షులు సృజియింపబడెను. ఇది కాశ్యపసృష్టి యన మహిమ గాంచెను. ఎల్ల దేవతలలో సూర్యుడు ప్రముఖుడు. సూర్యునకు వివస్వంతు డను పేరు గలదు.
వివస్వంతుని పుత్రుడు వైవస్వతమనువు. అతడు ఘనకీర్తి గడించెను. వైవస్వతునకు సూర్యకుల వర్ధనుడగు ఇక్ష్వాకుడు సంభవించెను. ఇక్ష్వాకుడు గాక వైవస్వతునకు మఱి తొమ్మండుగురు జన్మించిరి. వారి పేర్లు నాభాగుడు దృష్టుడు శర్యాతి నరిష్యంతుడు ప్రాంశుడు నృగుడు దిష్టుడు కరూషుడు వృషధ్రుడు వీరు మనుసంభవులు.
వైవస్వత మనువున కిక్ష్వా కుడు జ్యేష్టపుత్రుడు. ఇక్ష్వాకునకు నూర్గురు కుమారులు. వారిలో వికుక్షి పెద్దవాడు ఆత్మవంతుడు. ఆ వైస్వత మనువునకు మరల తొమ్మండుగురు శూరులుద్బవించిరి. వారి వంశ క్రమము సంగ్రహముగ తెల్పుదును. వినుము.
నాభాగున కంబరీషుడు జన్మించెను. ఇతడు పరమ భాగవతోత్తముడు ధర్మజ్ఞుడు సత్యసంధుడు ప్రజాపాలనతత్పరుడు. ధృష్టునకు ధార్షకులు గల్గిరి.
వీరు రాజులైనప్పటికి బ్రహ్మభూతులు. యుద్దకాముకులు గారు. బ్రహ్మకర్మనిరతులు. శర్యాతికి ఆనర్తుడను కొడుకును చక్కని సుకన్యయను కన్యయుబుట్టి కీర్తి వహించిరి.
శర్యాతి తన యందచందాల ముద్దుపట్టిని గ్రుడ్డి వాడగు చ్యవనున కిచ్చెను. ఆమె సౌశీర్యము-సౌజన్యము-పాతివ్రత్యము ప్రభావమున చ్యవనునకు కండ్లు వచ్చెను.
సూర్యున కశ్వి కుమారులు గల్గిరి. వారు మునికి కంటివెలుగు ప్రసాదించిరని నేను వింటిని.
సూర్యున కశ్వి కుమారులు గల్గిరి. వారు మునికి కంటివెలుగు ప్రసాదించిరని నేను వింటిని.
అన జనమేజయు డిట్లనెను: ఓ మహత్మా ! నీవు చెప్పిన కథలో నాకు సందేహము గల్గుచున్నది. రాజు తన కన్యను సుకన్యనొక గ్రుడ్డి ముని కిచ్చె నంటివి గదా ! లోకమున నొకని కూతురు రూపగుణములు లేనిది గావచ్చును. అతడు తన కూతురునొక గ్రుడ్డివాని కిచ్చిన ఈయవచ్చును. కాని యే మచ్చలేని చక్కదనాల చుక్కయగు తన గారాబాల కన్నియ సుముఖియగు సుకన్య నొక్క చీకుమునికంటగట్టుటకు రాజు మన సెట్టు లొప్పుకొనెను!
మహానుభావా! నా యందు దయయుంచి దీని మూలకారణము తెలుపుము. అను జనమేజయుని మాటలను వ్యాసుడు వినెను. అతడు ప్రసన్నతతో నవ్వుచు నతనితో నెట్లనెను.
వైవస్వతుని కుమారుడు శర్యాతిరాజు. శర్యాతికి నాల్గువేలమంది రాచకన్నియలు భార్యలైరి. వారెల్లరును సకల శుభలక్షణలు. వారెల్లరును తమ పతి కనుకూలలై పతిప్రియలై వర్దిల్లిరి. వారికి సుకన్యయను చక్కనికన్య కుమారిగ జన్మించెను.
ఆ చిఱుతనవ్వుల సింగారి తన తల్లిదండ్రులకు ముద్దుల మూటగసొంపు మీరెను. రాచనగరికి దరిదాపున మానససరోవరమును మఱపించు సరోవరము గలదు. దానిలోనికి దిగుడు మెట్లు గలవు. ఆ కొలంకులో రాయంచలు కారండవ చక్రవాకములు స్వేచ్చావిహారములు సల్పుచుండెను.
ఆ కొలను భరతపక్షులు సారసములు మున్నగు జలపక్షులతో శోభిల్లుచుండెను. అందైదు విధముల నొప్పు మారు కమలములు తేనెసోనలతో ఝంఝుమ్మను గండుతుమ్మెదలు మదనరాగములతో కనులవిందొన రించుచుండెను. దానికి నలుగడల పెద్ద పెద్ద సాలతమాల తరువులు అశోకములు సరల పున్నాగములు - వటవృక్షములు-రావిచెట్లు-కదంబవనములు-అరటిచెట్లు-జంబు-జంబీర-పనస-ఖర్జూరవృక్షములు-పోకమ్రాకులు-కొబ్బరిచెట్లు-మొగలిచెట్లు-కోవిదారతరువులు-మల్లియతీవియలు-చల్లగ నుల్లమున కుల్లాసముగ నలరారుచుండెను.
మఱియు అచ్చట గున్నమావి నేరేడు చింత కరంజ కుటక మోదుగ వేప ఉసిరిగ ఖదిర మున్నగు వృక్షములు విలసిల్లుచుండెను. అందు కోయిలల కలకుహూరావములు నెమిళ్ల కేకారవములు చెవులకు తియ్యదనంబు గొల్పుచుండెను. ఆ ప్రదేశ మిట్లు పలువిధములగు తరువులతో పవిత్రమై యొప్పెను.
అది నిర్జన ప్రశాంత ప్రదేశ మగుటచేత పరమశాంతుడు దాంతుడు మహాతపస్వి భార్గవుడునైన చ్యవనమహర్షి యచ్చోట నిష్టించి ఘోరనియమములతో తప మాచరించుచుండెను. ఆ తపోధను డింద్రియములు జయించి యాహారముమాని సుఖాసనమందుండి ప్రాణాయామ పరాయణత్వమున నాత్మ విచారముతో లోచూపుతో మౌనమూని యుండెను.
అది నిర్జన ప్రశాంత ప్రదేశ మగుటచేత పరమశాంతుడు దాంతుడు మహాతపస్వి భార్గవుడునైన చ్యవనమహర్షి యచ్చోట నిష్టించి ఘోరనియమములతో తప మాచరించుచుండెను. ఆ తపోధను డింద్రియములు జయించి యాహారముమాని సుఖాసనమందుండి ప్రాణాయామ పరాయణత్వమున నాత్మ విచారముతో లోచూపుతో మౌనమూని యుండెను.
అమునీశ్వ రుడు నీరు సైతము ముట్టక హ్రీంకారిణియగు పరాభట్టారికాదేవిని హృదయకమలమున ధ్యానించుచుండెను. ఆ విధిగ నిష్ఠగ నుండగా నతని చుట్టును పైని తీవెలతో చుట్టబడిన గొప్పపుట్ట పుట్టెను. అట్లు దీర్ఘకాలము గడచుటవలన ఆ పుట్టనిండ చలి చీమలు చేరియుండెను. తన మీద చీమలపుట్టలు కోవలుగ పెరిగినను
ప్రజ్ఞాధీరుడగు చ్యవనుడు మట్టిముద్దవలె గదలక మెదలకుండెను. ఒకనాడు శర్యాతిరాజు తన కామినీగణము వెంట రాగ వనవిహారమున కాదివ్యసరస్సును కేతెంచెను. అతడు సరస్సులోని నిర్మలజలములందు తన సుందరీ బృందమునుగూడి తమిమీర క్రీడాసక్తుడయ్యెను.
సుకన్య మెఱుగుబోడి చప లాక్షి ; ఆమె పూలుగోయుచు కేరింత లాడుచుండెను. ఆ పడుచుపిల్ల తన మేనిసొమ్ములు తళతళలాడగా గజ్జెలందియలు ఘల్లుఘల్లు రనగ గంతులతో చ్యవన మునీశుని పుట్టదాపునకు జేరెను. ఆ చిలిపికన్నె పిల్లలాటల తమకముతో పుట్టచెంత గూరుచుండి పుట్టరంధముల నుండి మిణుంగురులను బోలు రెండు మినుకుమినుకుమను వాడి వెలుగులుగాంచెను.
ఆ తలోదరి యిదేమి వింతయో తెలిసికొందమని వాడి ముల్లుగొని వేగిరముగవానిని పీకివేయ పూనుకొనెను. ఇట్లు కమ్మని ముంగురులబాల ప్రయత్నించి పుట్ట కెట్టుదుట నేగెను. రతీదేవివలె అందకత్తె అగు ఆమె చ్యవనునకు కనబడెను.
భార్గవుడా సుదతినిగాంచి డగ్గుత్తికతో నిట్లనెను : ''కళ్యాణీ! శోభనాంగీ! ఇదేమి చేయుచుంటివి. తలోదరీ! విశాలాక్షీ! వరారోహా! నేనొక తబిసిని. ముంటితో పుట్టను పొడువకు. దూరముగ నేగుము.'' అని చ్యవనుడు పలుకు చున్నప్పటికిని సుకన్య వానిని పెడచెవినిబెట్టి యిదేమి చూతమని ముని వెల్గుచూపులను గ్రుచ్చెను.
భార్గవుడా సుదతినిగాంచి డగ్గుత్తికతో నిట్లనెను : ''కళ్యాణీ! శోభనాంగీ! ఇదేమి చేయుచుంటివి. తలోదరీ! విశాలాక్షీ! వరారోహా! నేనొక తబిసిని. ముంటితో పుట్టను పొడువకు. దూరముగ నేగుము.'' అని చ్యవనుడు పలుకు చున్నప్పటికిని సుకన్య వానిని పెడచెవినిబెట్టి యిదేమి చూతమని ముని వెల్గుచూపులను గ్రుచ్చెను.
అట్టులా రాచకన్నె కాలయోగమున ప్రేరితురాలై యాటలాడుచు పుట్టను గ్రుచ్చెనే కాని యామె తరువాత నేనెంతపని చేసితినని లోనలోన విచారించుచు నాచోటు వదలెను. తన కన్నులలో ముల్లు గ్రుచ్చుకొనుటవలన చ్యవనుడు వేదనతో పరితాపముతో కోపావిష్టుడయ్యెను.
ఆ మునివరుడు వెనువెంటనే సైనికులయెక్కయు మంత్రులయెక్కయు రాజుయెక్కయు మలమూత్రములు నిరోధించెను. చ్యవనుని మహిమమున గజతురగములయెక్కయు నొంటెలయెక్కయు తక్కిన ప్రాణులయెక్కయు మలమూత్రము లొక్కపెట్టున నాగిపోవుటవలన రాజు కడు దుఃఖితుడయ్యెను.
సైనికు లెల్లరి మలమూత్ర నిరోధముగూర్చి రాజు తెలిసికొనెను. ఇట్టి దుఃఖమొకేసారి గల్గుటకు కారణమేమోయని రాజు చింతించెను. చింతార్తుడై అతడు విచారముతో తన యింటికేగి తన సైనికులలో జనులలో నెవడేని చేయరాని పని చేసెనేమోయని తెలిసికొనెను.
ఆ సరస్సునకు పడమటి దెసను నట్టడివిలో చ్యవనమహర్షి తీవ్రముగ తప మొనరించుచుండెను. ఆ నిప్పువంటి తపస్వి కెవరో యేదో యపరాధము చేసి యుండవచ్చును. దాని మూలమున నెల్లరికిట్టి కడగండ్లు వాటిల్లినవి. ఆ బార్గవుడు తపో వృద్ధుడు - వృద్ధుడు - మహామనీషి - పరిష్ఠుడు. అట్టి మునివర్యున కెవరో యపచారము చేసిరని తలంతును.
ఎవరో దుష్టులు తెలిసియో తెలియకయో యా తాపసు నవమానించి యుండవచ్చును. ఈ యడ్డంకి తప్పక దాని మూలముననే జరిగి యుండవచ్చునని రాజు తలచెను. రాజు ప్రశ్నింపగసైనికులు లోన బాధజెందుచు మా మనోవాక్కాయములతో నీ మునివర్యునకెట్టి యపకారము చేయలేదని యనిరి.
సుకన్యా వృత్తాంతము
No comments:
Post a Comment