ఏకవీరుని జన్మ వృత్తాంతము
జనమేజయు డిట్లనెను : వ్యాసమహర్షీ ! నాకొక పెద్ద సందేహము గల్గుచున్నది. దానిని దీర్చుము. ఆ బాలుడట్లు పుట్టిన పిదప నిర్జన ప్రదేశమున నొంటిగ విడువబడెను గదా! అతనిని తిరిగి యెవరు తీసికొనిరి? ఆ యర్భకుని గతి యేమయ్యెను? అతడు వ్యాఘ్ర సింహాది క్రూర జంతువుల బారికి చిక్కలేదు గదా?
వ్యాసుడిట్లనెను : అట్లు శ్రీలక్ష్మీనారాయణులా బాలునచట విడిచి వెళ్ళిన పిమ్మట చంపకుడను విద్యాధరుడచ్చోటి కేగుదెంచెను. అతడు మదనాలసయను తన మదపతిని గూడి యథేచ్ఛముగ విమానముపై క్రీడల మునిగి తేలుచుండెను. అతడంతలో భూమిపై నొంటిగ సుఖముగ నాడుకొనుచు - దేవపుత్రుని బోలిన యొక శిశువును గాంచెను. చంపకుడు వెంటనే విమానము దిగి శిశువు నెత్తుకొని పేదవాడు పెన్నిధిని గాంచినట్లు పరమానందమొందెను.
అతడు సద్యోజాతుడు సుమనోహరుడు మారసుకుమారుడునైన బాలునిగొని మదనాలసకిచ్చెను. ఆమె ప్రేమతో బాలునెత్తుకొని గుండె గగుర్పొడువ నెడదకు హత్తుకొని యతని చిన్నారి ముద్దుల మోము ముద్దిడుకొనెను. అటులామె బాలుని తన యక్కున జేర్చి ముద్దాడి వాత్సల్యముతో పుత్రభావమున నతని వొడిలో కూర్చుండబెట్టుకొనెను. వారు విమానమెక్కి బాలుని తొడపై నిడుకొనిరి.
అపుడు మదనాలస నవ్వి తన పతికిట్లనెను : కాంతుడా! ఈ బాలకుడెవనివాడు? ఈ వనమున నితని నెవరు వదలిరి? నీ కితడు శివుడు తన చేతితో ప్రసాదించిన పుత్రదానమని తోచుచున్నది.
చంపకు డిట్లనెను : ప్రియా! మనమిపుడు వెంటనే సర్వజ్ఞుడగు ఇంద్రు నడుగుదము. ఇతడు దేవ - దానవ - గంధర్వులలో నెవడో కావలయు. మన మింద్రుని యానతి వడసి దొరకిన యితనిని పుత్రునిగ స్వీకరింతుము. అతని నడుగక చేయుట నాకు మంచిదిగా దోచదు అని చంపకుడు భార్యతో బాలునెత్తుకొని త్వరితముగ నింద్రపురి కేగెను.
అచట చంపకు డింద్రుని పాదములపైబడి లేచి బాలునింద్రుని కిచ్చి చేతులు జోడించి యిట్లనెను :
అచట చంపకు డింద్రుని పాదములపైబడి లేచి బాలునింద్రుని కిచ్చి చేతులు జోడించి యిట్లనెను :
దేవదేవా! ఈ మార సుందరుడగు కుమారుడు పరమపావన తీర్థమగు కాళిందీ తమసల సంగమమున నాకు దైవ యోగమున దొరకెను. శచీపతీ! దేవేశా! ఈ పిల్లవాడెవనివాడు? ఎవరిచే విడువబడెను? నీ యానతియైనచో నితనిని సుతునిగ స్వీకరింపగలను. ఈ చిన్నారి బాలుడు నా ప్రియురాలికి ముద్దుగనున్నాడు. ధర్మశాస్త్రములందు కృత్రిమ పుత్రుని బడయవచ్చునని కదలదు గదా!
ఇంద్రు డిట్లనెను : మహాత్మా! ఈ బాలుడు హయరూపములు దాల్చిన లక్ష్మీనారాయణుల హృదయానందమువలన నుద్భవించెను. ఇతనిని హైహయుడందురు. యయాతి కుమారుడగు తుర్వసున కిచ్చుటకు భగవంతు డీ దక్షుడగు బాలుని గనెను. తుర్వసుడు పరమధార్మికుడగు రాజు. అతడు హరి ప్రేరితుడై పుత్రార్థియై యీ పవిత్ర తీర్థమునకు రాగలడు. అతడు హరి ప్రేరణచే నచటికి వచ్చు లోపల నీవీ చక్కని బాలుని గొని యచటి కేగుము. అచటి కేగి నీవితని నక్కడ నుంచుము. నీవు జాగు సేసినచో రాజు బాలకు నచట గానక దుఃఖింపగలడు.
చంపకా! నీ వితనిని అట వదలిపెట్టుము. ఆ రాజీ పుత్రుని గ్రహించును. ఇతడు భూమిపై నేకవీర నామమున వాసి కెక్కగలడు అను నింద్రుని మాటలు విని చంపకుడు ముద్దులపట్టిని దీసికొని త్వరగ నచ్చోటికి వెళ్ళెను. ఆ బాలుడు మున్నున్నచోట నతనిని వదలి చంపకుడు విమానమెక్కి తనదారిని తాను వెళ్ళెను. అంతలో జగద్గురువగు లక్ష్మీపతి లక్ష్మిని గూడి విమానమెక్కి రాజున్నచోటి కరిగెను. హరి రాజునుగాంచి విమానము దిగెను. రాజును హరిని సందర్శించి సంతోషించి దండ ప్రణామము లాచరించెను.
అట్లు నేలపై పడిన భక్తుని వత్సా ! లే లెమ్మని హరి యతని నూరడించి లేపెను. అతడును లేచి పరమానందముతో తన ముందున్న హరిని ప్రియవాక్కులతో నీ విధముగ సంస్తుతించెను :
అట్లు నేలపై పడిన భక్తుని వత్సా ! లే లెమ్మని హరి యతని నూరడించి లేపెను. అతడును లేచి పరమానందముతో తన ముందున్న హరిని ప్రియవాక్కులతో నీ విధముగ సంస్తుతించెను :
'ఓ దేవాధిదేవా! అఃలలోకనాథా! లోక గురూ! రమేశా! వరమయోగులకును పరమ దుర్లభమైన నీ దివ్యదర్శన మీజడున కొసంగితివి. నీ దివ్యదర్శనము విషయలోలతలేని నిష్కాములకే సాధ్యము.
దేవదేవా! నే నా శాపాశబద్దుడను. నేను నీ దర్శనమునకు దగనివాడను అని రాజు సంస్తుతించగ విష్ణువమృతవాక్కులు గురియుచు నతని కిట్లనెను :
'రాజా! నీ తపమునకు మెచ్చితిని. నీ యభిమతము చెప్పుము. తప్ప కీడేర్పగలను.' అంత రాజు తన యెట్టయెదుట వెలుగొందుచున్న విష్ణుని పదపద్మములపై బడి
మురారీ! నేను సంతానమునకు తపించితిని. కనుక స్వాత్మసముడగు పుత్రుని ప్రసాదింపు'మని వేడుకొనెను. రాజు ప్రార్థన విని యాదిదేవుడతని కమోఘవాక్కుల నిట్లనెను :
ఓ యయాతి పుత్త్రా! నీవు తమసాకాళిందుల సంగమస్థలి కరుగుము. నీ కోరికను దగిన ప్రభావశాలియగు పుత్రుని నే నచట నుంచితిని. అతడు నా మహావీర్యమున లక్ష్మియందు నీకొర కుద్భవించెను. అతనిని గ్రహింపుము అను హరి వరవాక్కులకు రాజు సంతుష్టాత్ముడయ్యెను.
హరియు నతనికి వరమిచ్చి లచ్చితో వైకుంఠపుర మరిగెను. మాధవుడేగిన పిమ్మట యయాతి సుతుడు ప్రేమమీర జనార్దనుని మాట చొప్పున పుత్రుడున్నచోటికి వడిగల రథముపై నేగెను. అతడచటికేగి బొటనవ్రేలు నోటనిడుకొని యాడుకొనుచున్న చిన్నారి బాలుని కన్నులార గాంచెను. రాజు హరుని ప్రభావమున లక్ష్మీనారాయణులకు గల్గిన మదనసుందరుడగు పుత్రుని గాంచెను.
అపుడతని మోము దమ్మి సంతసమున విప్పారెను. రాజు వెంటనే యతనిని తన కరమలముల నెత్తుకొని వాత్సల్యము పొంగులు వార నతని శిరంబుమూర్కొని మోదముతో గుండెకు హత్తుకొనెను. రాజు బాలుని ముద్దులు గారు మోమందము తిలకించి డగ్గుత్తికతో నిట్టులనియెను :
నాకు లక్ష్మీనారాయణుల దయవలన నీ బాలుడు గల్గెను. నాకిక పున్నామనరక భయము లేదు. పుత్రా! నేను నూఱరేండ్లు తపమొనర్పగా రమాపతి సంతసించి నా వంశవృద్ధికై నిన్ను నాకు ప్రసాదించెను. నీ తల్లి కేవలము లక్ష్మీదేవి. ఆమె నిన్ను నాకు వదలి హరితో వెళ్ళెను. నిన్ను గుండెలకు హత్తుకొని సంతసించు తల్లి యెంతటి ధన్యురాలో కదా!
అని రాజు ముదముతో కొడుకు నెత్తుకొని తన యింటి కేగుచుండెను. రాజు తన నగరు ప్రవేశించుట విని మంత్రి పురోహితులు ప్రజలు పెక్కు కానుకలు గొని రాజున కెదురేగిరి. వందిమాగధులు గాయకులు సూతులును రాజును కొండాడిరి. రాజు వారి నందఱిని చల్లని చూపులతో మాటలతో సత్కరించెను. పౌరులు రాజును ఘనముగా సమ్మానించిరి. వారెల్లెడల మార్గమున సమములు సేసలు జల్లిరి.
అని రాజు ముదముతో కొడుకు నెత్తుకొని తన యింటి కేగుచుండెను. రాజు తన నగరు ప్రవేశించుట విని మంత్రి పురోహితులు ప్రజలు పెక్కు కానుకలు గొని రాజున కెదురేగిరి. వందిమాగధులు గాయకులు సూతులును రాజును కొండాడిరి. రాజు వారి నందఱిని చల్లని చూపులతో మాటలతో సత్కరించెను. పౌరులు రాజును ఘనముగా సమ్మానించిరి. వారెల్లెడల మార్గమున సమములు సేసలు జల్లిరి.
ఈ విధముగ రాజు తన కుమారునితో నిల్లు చేరెను. అట్లు రాజు సచివులతో నింటికేగి సద్యోజనితుడు మారసుకుమారుడు నగు కుమారుని రాణి చేతులలో నుంచెను. ఆ చిర్నగవుల జాబిల్లి నెత్తుకొని
రాణి రాజుతో నిట్లనెను : 'రాజా! మన్మథుని మించిన యీ యందాల బాలుడు నీకెక్కడ లభించెను? ఇతనిని నీకెవరిచ్చిరో త్వరగ జెప్పుము. ఈ పొన్నారి సుతుడు నా మదికానందము గల్గించుచున్నాడు'
రాజిట్లనెను : ప్రేయసీ ! ఈ తనయుని నాకు శ్రీహరి ప్రసాదించెను. చపలాక్షీ! ఇతడు మహాసత్వుడు. జనార్దనాంశమున లక్ష్మికి జనించినవాడు అన విని యామె సంతసించెను. రాజు గొప్పగ పుత్రోత్సవము జరిపించెను. యాచకులకు భూరిదానము లొసంగెను. వాద్యగీతములు మిక్కిలి మ్రోగెను.
అట్లు మహోత్సవము జరుపుకొని రా జతని కేకవీరుడను ప్రసిద్ధనామ మొసంగెను. ఇంద్రవీర్యుడగు రాజు హరి రూపగుణములు గల సుతుని బడసి ప్రమోదమంది ఋణవిముక్తుడయ్యెను. అతని వంశము వర్ధిల్లెను. ఇట్లు సకల సురపతి యగు హరివలన సకల గుణగణములు గల సుతునిబడసి ప్రమోదమంది ఋణముక్తుడయ్యెను. అతని వంశము వర్ధిల్లెను. ఇట్లు సకల సురపతియగు హరి వలన సకల గుణగణములు గల తనయుని బడసి తన సతి పరిచర్యలు చేయుచుండగ నింద్రవీర్యము గల రాజు సుఖముండెను.
అధ్యాయము 142 ఏకవీరుని వనవిహారము
అధ్యాయము 142 ఏకవీరుని వనవిహారము
No comments:
Post a Comment