గంగా నది మన జన్మజన్మ పాపాలు తొలగించే పవిత్రమైన నది . ఆ తల్లిని జీవదాయిని అని కూడా అంటారు, మన పాపాలను తొలగించే పాపనాశిని అంతే కాక మన పాపాలను తొలగించి మన జీవితాన్ని ఉద్దరించేది.
అదే విధంగా, గంగా సప్తమి అనే పవిత్రమైన రోజును గంగా నది అవతరణ సందర్భంగా జరుపుకునే పండుగ. ఈ రోజును జహ్ను సప్తమి మరియు గంగా పూజ అని కూడా అంటారు.
ఎక్కువగా ఈ రోజు గంగా నది పరీవాహక ప్రాంతాలలో పూజించే పండుగ. ఉత్తరాఖండ్లోని రిషికేశ్ మరియు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్ లోని త్రివేణి సంగమం వంటి పుణ్యక్షేత్రాలలో గంగా సప్తమికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. దేశంలోని దాదాపు ఉత్తర ప్రాంతంలో, గంగా సప్తమిని భక్తి ప్రపత్తులతో జరుపుకుంటారు.
వైశాఖ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే సప్తమిని గంగా సప్తమి అని పిలుస్తారు.
గంగా సప్తమి కథ
మన పురాణాలలోని దేవీ దేవతలకు సంబంధించిన ఎన్నో కథలు ప్రాచుర్యంలో వున్నాయి. అలాగే పురాణాలలో గంగా నదికి ప్రత్యేక స్థానం ఉంది. పద్మ పురాణం, బ్రహ్మ పురాణం మరియు నారద పురాణాలలో గంగా నది ప్రస్తావన ఉంది. ఈ పురాణాలు గంగా సప్తమి గూర్చి ప్రత్యేకంగా వర్ణించాయి.
మన హిందూ పురాణాల ప్రకారం గంగ స్వర్గం నుండి భూమిపైకి వచ్చింది. ఆమె భూమిపైకి వచ్చినప్పుడు, ఆ రోజును గంగా అవతరణం అని కూడా పిలుస్తారు . గంగా నది పరవళ్లు త్రొక్కుతూ భూమిపైకి వస్తున్నప్పుడు మార్గంలో అడ్డువచ్చిన వన్నిటిని నాశనం చేస్తూ వస్తూ జహ్నుముని ఆశ్రమానికి చేరుకుంది. తన ఆశ్రమం వైపు వస్తున్న భయంకరమైన గంగా ప్రవాహాన్ని చూసి కోపంతో గంగను పూర్తిగా త్రాగేశాడు.
తరువాత, భగీరథుడి కోరిక మేరకు, జహ్ను ముని గంగను గంగ యొక్క పవిత్రత్ర పోకుండా తన చెవి నుండి విడుదల చేసాడు. అందుకే గంగా నదికి జాహ్నవీ అని నామం కూడా స్థిరపడింది.

భగీరథుడు తన పూర్వీకుల మోక్షం కోసం గంగను భూమిపైకి తీసుకురావాలనుకున్నాడు. వైశాఖ మాసంలోని శుక్ల పక్ష సప్తమి నాడు వచ్చే ఈ రోజుని జహ్ను సప్తమి అని కూడా అంటారు. ముని గంగను తన కుమార్తెగా భావించి విడుదల చేయడం ద్వారా ఆమెకు పునర్జన్మ లభించింది. కాబట్టి గంగకు జాహ్నవి అనే మరో పేరు వచ్చింది.
గంగా సప్తమి నాడు గంగా నదిలో స్నానం చేయడం, గంగాజలం ఇంట్లో చల్లుకోవడం చాలా మంచిది.
గంగా మాతను పూజించి, దీపారాధన చేసి, దీపాలు వదులుతారు.
పవిత్ర గంగా స్నానం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి ప్రశాంతత మరియు సుఖశాంతులు లభిస్తాయి.

హిందువుగా పుట్టిన ప్రతి మానవుడు జీవితంలో ఒక్క సరైన గంగా నదిని దర్శించి స్నానమాచరించి తరిస్తారు.
మన పూర్వికులు మునులు ఋషులు గంగా ప్రదక్షిణ అనగా గంగోత్రినుండి గంగాసాగర్ అనగా గంగ సాగరంలో కలిసే ప్రదేశం వరకు వెళ్లి మరల తిరిగి గంగోత్రి చేరుకుంటారు.
గంగా నది ప్రవహించే వారణాశి, హరిద్వార్, రుషికేశ్, ప్రయాగ్ రాజ్ నుండి గంగాసాగర్ వరకు ఎన్నో పుణ్యక్షేత్రాలు మనకు దర్శనమిస్తాయి.
గంగోత్రి నుండి గంగాసాగర్ వరకు ప్రతినిత్యం గంగకు హారతి ఇస్తారు. అది చూసి దర్శించి తరించవలసిందే కానీ దానికి సాటి మరోటి లేదు.
No comments:
Post a Comment