నవగ్రహాల్లో బృహస్పతి గ్రహం ఒకటి. దీన్నే గురుగ్రహం అని కూడా అంటారు. ఇది పురుష గ్రహం, బ్రాహ్మణ కులంగా కూడా చెబుతారు. సత్త్వగుణ ప్రధానమైన ఈ గ్రహం భూమిపై నివసించే జీవులపై, మానవులపై ప్రభావం చూపుతుంది.
ఈ గ్రహ ప్రాబల్యం బాగా ఉన్న వారికి విద్య, బుద్ధి, జ్ఞానం బాగా ఉంటుంది. ఈ గ్రహం బాగుంటే వారు అమితమైన తేజోవంతులుగానూ, ధనవంతులుగానూ ఉంటారని శాస్త్రం చెబుతోంది.
జాతకంలో గురు గ్రహం (బృహస్పతి) బలహీనంగా ఉన్నప్పుడు లేదా అశుభ స్థానంలో ఉన్నప్పుడు "గురుగ్రహ దోషం" ఏర్పడుతుంది. దీనివల్ల విద్యలో ఆటంకాలు, వివాహంలో జాప్యం, సంతాన లేమి, ఆర్థిక సమస్యలు, మరియు సమాజంలో గౌరవం తగ్గడం వంటి సమస్యలు ఎదురవుతాయి. మరియు కాలేయం, వెన్నుపూస, తొడలు, చెవులు, మూత్రపిండాలు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, నత్తి, మతిమరుపు, శరీరానికి నీరు పట్టడం, కఫం వంటి వ్యాధులు గురు గ్రహ ప్రభావంతో కలుగుతాయి.
అలాగే గౌరవహాని, పండితపామరులతో వివాదం, స్థానచలనం, అధికార నష్టం, తీర్థయాత్రలలో ఇబ్బందులు, స్వార్థం, సంతానదోషం, ధననష్టం, పుత్ర విరోధం, దైవ, గురు భక్తి లోపించడం ఇవి సామాన్యంగా గురు గ్రహ బలహీనతవలన కలిగే ఇబ్బందులు, లోపాలని శాస్త్రం చెబుతుంది.
అందుకే గురుగ్రహ దోషాలు, వ్యాధుల పరిహారం కోసం మంచి పుష్యరాగ మణిని గురువారం రోజు శివ పంచాక్షరి మంత్రం, గురుగ్రహ మంత్రంతో కలిపి జపించిన తర్వాత ధరించాలి. స్త్రీలు పాదాలకు ధరించే పసుపు, గడపలకు పసుపు రాయటం, పూజా కార్యక్రమాల్లోనూ, స్నానానికి మనం వినియోగించే పసుపు ఎన్నో వ్యాధుల్ని నివారించగలదు. కాబట్టి పసుపు రంగు వేయబడిన గది గోడల మధ్య నివాసం ఈ లోపాన్ని పూరిస్తుందని శాస్త్రం చెబుతోంది.
జాతకంలో గురువు బలహీనంగా ఉంటే, సంతాన సౌఖ్యత లేక పోవటం, కీర్తి గౌరవ ప్రతిష్టలకు నశించుట, నిత్యం వాహన ప్రమాదాలు దయాదాక్షిణ్యాలు లేక పోవుట, ఇతరులను కష్ట పెట్టే విధంగా నిర్మొహమాటంగా సత్యం చెప్పుట,నీష్ఠూరంగా మాట్లాడటం, షుగర్, క్యాన్సర్, మూత్ర రోగాలు, పెద్ద పొట్టతో కలిగిన దేహం, పరులను నమ్మి సెక్యూరిటీగా ఉండటం, గురువు జాతక చక్రంలో ఏ అవయవం మీద ఆదిపత్యం వహిస్తే ఆ అవయవ పరిమాణాన్ని పెంచి పెద్దది చేస్తాడు.
వ్యాధి వస్తే తొందరగా తగ్గదు. లైఫ్ లో ఎంజాయ్ మెంట్ ఉండదు. జీవితంలో సుఖం, సంతోషం లేక పోవుట, దైవంపై నమ్మకం లేకపోవుట, పెద్దల యందు గౌరవం లేకపోవుట, ఆచారములు పాటించకుండుట, ఉన్నత విద్యకు ఆటంకాలు, నియంతగా ప్రవర్తించుట, ధనమునకు ఇబ్బందులు కలుగుట, ఎన్ని పూజలు, వ్రతాలు చేసినా ఫలితం లేకపోవుట, జీర్ణశక్తి లేకపోవుట, లివర్‌కు సంబంధించిన వ్యాధులు కలుగుచున్నప్పుడు గురుగ్రహ దోషంగా గుర్తించి గురు గ్రహ అనుగ్రహం కొరకు గురుచరిత్ర పరాయణ చేయడం, గురువులను గౌరవించుట, దైవ క్షేత్రములు సందర్శించుట, శనగలు దానం చేయుట, పంచముఖ రుద్రాక్షను లేదా కనక పుష్యరాగమును ధరించవచ్చును.
ప్రతి గురువారం ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల సమయంలో దగ్గరలో ఉన్న దత్తాత్రేయ దేవాలయానికి వెళ్ళి 160 ప్రదక్షిణలు చేయాలి. 16 గురువారాలు నవగ్రహములకు 160 ప్రదక్షిణలు చేసి, పసుపు వస్త్రంలో ఐదు పావుల శనగలు పోసి, మూత కట్టి, దాన్ని దానం చేయాలి.
అలాగే గురువారం రోజున ఉడికించిన శనగలు పేదలకు పంచిపెట్టాలి. కుడి చేతి చూపుడు వేలుకి కనకపుష్యరాగం ఉన్న బంగారు ఉంగరాన్ని ధరించాలి. బ్రాహ్మణుడితో గురు గ్రహ జపం చేయించి శనగలు దానం చేయాలి. గురువారం నాడు గురుగ్రహం వద్ద 16 పసుపు రంగు వత్తులతో దీపారాధన చేసి పసుపు వస్త్రాన్ని దానం చేయాలి.
16 గురువారాలు ఉపవాసము ఉండి చివరి గురువారం దక్షిణామూర్తి పూజ, గురు అష్టోత్తర పూజ చేయాలి. ప్రతిరోజూ 160 మార్లు చొప్పున 160 రోజుల పాటు గురు ధ్యాన శ్లోకాన్ని పారాయణం చేయండి.16 గురువారముల పాటు గురు గాయత్రి మంత్రాన్ని 160 సార్లు పారాయణ చేయాలి. ప్రతి రోజూ దత్త శ్లోకాన్ని పారాయణ చేస్తూ, 40 రోజుల్లో 16.000 సార్లు గురు మంత్రాన్ని జపించండి. తీరిక లేనివారు కనీసం గురుశ్లోకములు 16 సార్లు లేదా గురు మంత్రాన్ని 160 సార్లు కాని పారాయణ చేయాలి. గురు పౌర్ణమి పర్వదినమున 18 సార్లు స్తవం పారాయణ చేయాలి.
జాతకంలో గురుగ్రహ దోషం ఉన్నవారు ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రం చదివితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది.
భక్తి బావనలు, ఉన్నత విద్య, విదేశి విద్య కలగాలంటే గురుగ్రహ అనుగ్రహం ఉండాలి.
గురుగ్రహానికి అధిదేవత హయగ్రీవుడు. సకల విద్యాధి దేవతయైన శ్రీమన్నారాయణుడు ‘హయగ్రీవుని’గా అవతరించాడు.
సరస్వతీదేవి, వేదవ్యాసుడు హయగ్రీవుని నుండి విద్యాశక్తిని సముపార్జించారని ‘హయగ్రీవ స్తోత్రం’లో దేశికాచార్యులు పేర్కొన్నారు.
హయగ్రీవోపాసన వాక్ శక్తిని, విద్యాశక్తిని, జ్ఞానశక్తిని సిద్ధింపచేస్తుంది.
జ్ఞానానంద మయం దేవం, నిర్మలాస్ఫటికాకృతమ్ ।
ఆధారం సర్వ విద్యానాం, హయగ్రీవ ముపాస్మహే ॥
జ్ఞానం, ఆనందం, మూర్తీభవించిన దైవస్వరూపం హయగ్రీవుడు. నిర్మలమైన స్ఫటికాకృతి కలిగి సర్వవిద్యలకు ఆధారభూతమైన విద్యాధిదేవత హయగ్రీవునకు నమస్కారము.
హయగ్రీవుని పూజించడం వల్ల విద్య, ఐశ్వర్యం, అధికారం, ఆయువు మొదలైనవన్నీ లభిస్తాయి.
విద్యార్థులు హయగ్రీవుని పూజించడం వల్ల చదువు బాగా వస్తుంది. పిల్లలున్న ఇంట హయగ్రీవ పూజ పిల్లలకు విద్యాటంకాలు తొలగించి, ఉన్నత విద్యను అందిస్తుంది.

గురుగ్రహ దోష శాంతి కోసం చేయవలసిన మరియొక పరిహారం
మేష, సింహ, ధనుర్ మాసాల్లో.. ఆది, సోమ, మంగళ, గురువారాల్లో, పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర నక్షత్రాలు కలిసి వచ్చిన రోజు వైష్ణవాలయం పూజారిని రాత్రి 1.30 గంటలకు స్వగృహానికి పిలిపించాలి.
గృహ మధ్య హాలులో 9 మూరల పసుపు వస్త్రం పరిచి 9 దోసిళ్ళు శెనగలు పోసి, ఆ రాశిపై బంగారు లేక ఇత్తడి చెంబును కలశంగా స్థాపించి, కలశంపై అష్ట దిక్కులకు 8 తమలపాకులను పెట్టి, వాటిపై టెంకాయను పెట్టి, విష్ణు స్వరూపమగు పసుపు కుంకుమ రేఖలు నిలువుగా పెట్టి ఆ కలశం ఈశాన్య దిశాముఖంగా పెట్టాలి.
కలశం ఎదుట ఎవ్వరూ కూర్చోకూడదు. వాయువ్య ముఖంగా వైష్ణవాలయ పూజారిని, ఆగ్నేయముఖంగా గృహస్థుడు అతని భార్య కూర్చొనాలి. తర్వాత మమ శనివర్గ జాతస్య.. లగ్నజాతకానుసారేన.. స్థాన స్థితి గురుగ్రహ పరిహారార్థం శతృరుణరోగపీడ పరిహారార్థం అని సంకల్పించాలి.
ఆ కలశమునకు పురుష సూక్త, నారాయణ సూక్తులతో ఆవాహన చేసి గురుగ్రహ సహిత శ్రీకృష్ణపర బ్రహ్మణే నమః పంచామృత అభిషేకం కరిష్యే అని చెప్పి కలశము ముందు భాగాన ఇత్తడి తట్టలో గురు గ్రహ పంచలోహ విగ్రహము, శ్రీకృష్ణుని బంగారు లేక పంచలోహ విగ్రహము పెట్టి పంచామృతములతో అభిషేకించి, కృష్ణ సహస్ర నామ, అష్టోత్తరములతో గురు అష్టోత్తరముతో పూజలు చేయాలి.
ఇలా రాత్రి మూడు గంటల వరకు పసుపు పువ్వులతో గంధాక్షత్రలతో పూజించి ఉద్వాసన పలకాలి. కలశ సహితంగా శెనగలు పసుపు, పువ్వులు, పసుపు రంగు వస్త్రం, రూ. 9 దక్షిణ ఇచ్చే మొత్తం సంఖ్య 9 వచ్చేలా చూసుకోవాలి.
ఇలా భార్యాభర్తలచే పూజపూర్తయ్యాక .. ఆ దంపతులు పూజారికి అన్నింటిని దానంగా ఇచ్చి సాష్టాంగ దండప్రణామములు ఆచరించి ఆశీర్వాదం పొందాలి. తర్వాత రాత్రి మూడు గంటల ప్రాంతాన అయ్యవారిని స్వగృహము నుంచి సాగనంపాలి. గురు గ్రహ పీడా పరిహారార్థం చేసినది కావున తీర్థప్రసాదములు తీసుకోరాదు. తర్వాత స్నానము చేయాలి.
గమనిక : ఈ పూజా కార్యక్రమము, అయ్యవారికి ఇచ్చే దానం కార్యక్రమాలు రాత్రి 3 గంటలలోపుగా ముగించాలి.

No comments:
Post a Comment