త్రయంబకేశ్వరాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. త్రయంబకేశ్వర్ శివాలయం త్రయంబక్ పట్టణంలోని ఒక పురాతన హిందూ దేవాలయం. ఈ క్షేత్రం నాసిక్ పట్టణానికి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. త్రయంబకం లేదా త్రయంబకేశ్వర్ అని పిలిచే ఈ క్షేత్రాన్ని గోదావరి జన్మస్థానంగా పిలుస్తారు. అయితే ఈ క్షేత్రానికి గోదావరి జన్మ స్థానం కొన్ని వందల అడుగుల ఎత్తులో ఉంటుంది.
ఇది నాసిక్ నుండి 24 నక్షిక్ రహదారిలో ఉంది. శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఇది ఒకటి. మహారాష్ట్రలోని త్రయంబకేశ్వర్ వద్ద పవిత్ర గోదావరి నది మూలం త్రయంబక్ సమీపంలో ఉంది. ఇండోర్ రాష్ట్రానికి చెందిన ఫడ్నవీస్ అయిన శ్రీమంత్ సర్దార్ రావుసాహెబ్ పార్నేర్కర్ నిర్మించిన ఆలయ ప్రాంగణంలోని కుసావర్త కుంట (పవిత్రమైన చెరువు), భారతదేశం ద్వీపకల్పలో రెండవ పొడవైన నది అయిన గోదావరి నదికి మూలం. కొండ అంచున సర్దార్ ఫడ్నవీస్, అతని భార్య ప్రతిమను చూడవచ్చు. ప్రస్తుత ఆలయాన్ని మొఘల్ పాలకుడు ఔరంగజేబు ధ్వంసం చేసిన తర్వాత పేష్వా బాలాజీ బాజీరావు నిర్మించారు.
పురాణ ఇతిహాసం, చరిత్ర
త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు. 'అంబక 'మంటే 'నేత్ర' మని అర్థం. మూడు నేత్రాలు గల శివుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని - అనే మూడు తేజస్సులు మూడు నేత్రలుగా వెలసిన శివుడు. పాలభాగంలోని మూడవ నేత్రమే అగ్నినేత్రం. మన్మథుణ్ణి ఈ నేత్రాగ్నితోనే శివుడు భస్మం చేశాడు. స్వర్గం, ఆకాశం, భూమి - అనే మూడు స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు. 'త్రయంబకం యజామహే - సుగంధిం పుష్టి వర్ధనమ్' మృత్యుంజయ మహామంత్రంతో మృత్యువు అనగా మరణం నుండి విడుదల చేయమని భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు.
పురాణ కథనం:
బ్రహ్మగిరిపై గౌతమ మహర్షి అహల్యతో కలిసి నివసించేవారు. ఒకానొకప్పుడు దేశంలో క్షామం ఏర్పడి కరువుతో తినడానికి తిండి లేకుండా ఉన్న సమయంలో గౌతమ మహర్షి తన తపోశక్తితో తోటి ఋషులకు, వారి శిష్యులకు కరువు నుండి విముక్తి కలిగించి అన్నపానాలు దొరికే ఏర్పాటు చేశాడు.
అప్పుడు ఆ ఋషులు తమకు లేని తపోశక్తులు గౌతమునికి ఉన్నాయని ఈర్ష్యతో ఒక మాయ గోవును పంపి గౌతముడి పాడిపంటలు నాశనం చేయించారు. గౌతముడు ఒక దర్భతో ఆ గోవును అదలించగా అది మరణించింది.
గౌతముడు తాను చేసిన గోహత్యాపాతకం నివృత్తి కోసం శివుడిని మెప్పించి గంగను భూమి మీదకు తెప్పించాడు ఆ గంగయే గోదావరి లేదా గౌతమీ నది. ఈ నదిని ఆ చనిపోయిన గోవు మీద నుండి ప్రవహింపజేసి తన గోహత్యాపాతకాన్ని విముక్తి చేసుకొన్నాడు. ఆ గోవుకి స్వర్గప్రాప్తి కలిగింది.
ప్రత్యేకతలు త్రిమూర్తి స్వరూపం: లింగం లోపల చిన్న గుంటలు ఉండి బ్రహ్మ, విష్ణు, శివుల రూపాలను సూచిస్తాయి.
ఆలయ విశేషాలు
పూర్వపు ఆలయ విశేషాలు ఎక్కువగా లేకపోయినా ఇప్పటీ ఆలయాన్ని మాత్రం 1730 లో ఛత్రపతి శివాజీ సైన్యాధిపతి బాజీరావు పీష్వా నిర్మించినట్లు శాసనాల ద్వారా తెలుస్తుంది. ఎక్కువభాగం దేవాల నిర్మాణానికి నల్ల శాణపు రాయిని ఉపయోగించారు.
ఈ ఆలయం హేమంత్‌పంతీ శైలికి చెందిన నిర్మాణం. ఆలయం చుట్టూ నిర్మాణం లోపలివైపు చాతురస్రా కారంగానూ బయటి వైపుకు నక్షత్రాకారంగానూ ఉంటుంది.
కుశావర్తనం, గోదావరి పుట్టుక
గర్భగుడికి బైటవైపుగా నాలుగు ద్వారాలతో మండపం ఉంటుంది. గర్భగుడిలో కల శివలింగం భూమికి కొంత దిగువలో ఉంటుంది. దాని నుండి నిరంతరం నీటి ఊట ఊరుతూ ఉంటుంది. అది దేవాలయం ప్రక్కన కుశావర్తనం అనే సరోవరంలో కలుస్తూ ఉంటుంది. కుశ అంటే ధర్భ, వర్తం అంటే తీర్ధం అని అర్ధం. దీనిలో స్నానం చేయడం వలన సర్వపాపాలు, రోగాలు పోతాయని భక్తుల విశ్వాసం.
గౌతముడు శివుని మెప్పించి గంగను తీసుకువచ్చే ప్రారంభంలో తన చేతినున్న ధర్భతో గౌతమి చుట్టూ తిప్పాడు. అలా తిప్పిన, ఆవర్తనమైన చోట బ్రహ్మగిరి నుండి గంగ నేలకు దిగి గోదావరిగా ప్రవహించడం మొదలిడిందని పురణాల ప్రకారం కథనం.
రోడ్డుమార్గం: నాసిక్ నుండి దేవాలయానికి 28 కిలోమీటర్లు. ఇక్కడి నుండి బస్సులు ఉంటాయి.
మన దేవాలయాలు చారిత్రక నగరాలూ
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం

రైలు మార్గం: నాసిక్ రోడ్డు రైల్వే స్టేషన్ ఆలయానికి సుమారు 39 కిలోమీటర్ల దూరంలో ఉంది.
వాయుమార్గం: దేవాలయానికి నాసిక్ విమానాశ్రయం 55 కిలోమీటర్ల దూరంలో ఉంది.
మన దేవాలయాలు చారిత్రక నగరాలూ
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
No comments:
Post a Comment