ఈ 13 రోజుల క్రియలు ఎందుకు చేస్తారు? ఇప్పుడు తెలుసుకుందాం
మరణం జరిగిన వెంటనే మనిషి శరీరం విడిచిన వెంటనే, ఆత్మ సూక్ష్మ శరీరంతో ప్రయాణం ప్రారంభిస్తుంది. ఈ సమయంలో ఆత్మకు తన శరీరంపై ఇంకా మమకారం ఉంటుంది. అందుకే శాస్త్రాల ప్రకారం శరీరాన్ని అగ్నికి అప్పగించడం ద్వారా ఆత్మకు విముక్తి మార్గం సుగమమవుతుంది.
మొదటి 3 రోజులు మరణం తర్వాత మొదటి మూడు రోజులు ఆత్మ తన ఇల్లు, కుటుంబం చుట్టూ తిరుగుతుందని నమ్మకం. ఈ సమయంలో ఆత్మకు దారితెలియని స్థితి ఉంటుంది. అందుకే కుటుంబ సభ్యులు శాంతి, ప్రార్థనలు చేస్తారు.
4వ రోజు నుంచి 10వ రోజు వరకు ఈ రోజుల్లో ఆత్మకు ప్రేత స్థితి ఉంటుందని గరుడ పురాణం చెబుతుంది. ప్రతిరోజూ చేసే పిండ ప్రదానం, తిల తర్పణం ఆత్మకు ఆహారం, శక్తిగా మారుతాయి. ఈ క్రియల ద్వారా ఆత్మకు సూక్ష్మ శరీరం ఏర్పడుతుంది మరియు తదుపరి లోకానికి ప్రయాణం సులభమవుతుంది.
11వ రోజు – ఏకోదిష్ట శ్రాద్ధం ఈ రోజు చాలా ముఖ్యమైనది. ఆత్మను పితృలోకానికి పంపే ప్రధాన క్రియ ఇది. ఇక్కడ ఆత్మను ప్రేత స్థితి నుంచి పితృ స్థితికి చేర్చుతారు.
12వ రోజు – సపిండీకరణ ఈ రోజు మరణించిన వ్యక్తి ఆత్మ పూర్వీకులతో కలిసిపోతుంది. అంటే పితృ దేవతలలో ఒక భాగంగా మారుతుంది. ఇది లేకపోతే ఆత్మకు శాంతి దక్కదని శాస్త్రాలు చెబుతాయి.
13వ రోజు – కర్మకాండ ముగింపు 13వ రోజుఆత్మ ప్రయాణానికి ముగింపు కాదు, కానీ ఒక కొత్త దశకు ఆరంభం. ఈ రోజు తర్వాత ఆత్మ తన కర్మల ఆధారంగా పితృలోకంలో ఉండవచ్చు లేదా మళ్లీ జన్మకు సిద్ధమవుతుంది.
ఈ 13 రోజులు ఎందుకు ముఖ్యమైనవి? ఆత్మకు శాంతి కోసం కుటుంబానికి మానసిక ధైర్యం కోసం పూర్వీకుల ఆశీస్సులు పొందేందుకు సనాతన ధర్మం ప్రకారం మరణం ఒక ముగింపు కాదు. అది ఒక మార్పు మాత్రమే. మన కర్మలే మన తదుపరి ప్రయాణాన్ని నిర్ణయిస్తాయి. అందుకే మంచి ఆలోచనలు, మంచి కార్యాలు మన జీవితం మాత్రమే కాదు మరణానంతర ప్రయాణాన్నీ ప్రభావితం చేస్తాయి.
అంత్యక్రియలప్పుడు కుండలో నీరు పోసి రంధ్రాలు పెట్టి పగలగొడతారు ఎందుకో తెలుసా?
వాస్తవానికి శరీరం ఆత్మ రెండు వేరు వేరు. కలియుగ ధర్మం ప్రకారం మనిషి జీవితకాలం 120 సంవత్సరాలు కానీ, ఈ మందుల తిండికి ఆయుష్షు 100 సంవత్సరాల లోపు పడిపోయింది. ఇంకా కొందరైతే ఈ కొత్త కొత్త రోగాలకు 60 కే అంతిమయాత్ర అవుతుంది.
ఆత్మ చెప్పినట్టు శరీరం వినాలంటే, శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరంలో ప్రాణం ఉన్నంత సేపు అందులో ఆత్మ ఉంటుంది. శరీరం చనిపోయిందంటే ఆత్మ అందులో ఉండలేదు. ఎందుకంటే ఆత్మ చెప్పినట్టు శరీరం వినే స్థితిలో లేదు. బతికి ఉన్నంత కాలం భార్యాపిల్లలు, బంధువులు, స్నేహితులు, తాగుడు, తినుడు, పైసా సంపాదన లో లీనమై పోతుంది.
ఎప్పుడైతే మనిషి చనిపోతాడో, శరీరం నుండి ఆత్మ వేరైపోతుంది. శరీరాన్ని దహనం చేసే దాకా ఆత్మ, మళ్లీ తన శరీరం లోకి చొచ్చి తిరిగి శరీరాన్ని లేపి, మళ్ళి తన వాళ్లతో కలిసి ఉండాలని ప్రయత్నిస్తూనే ఉంటుంది. పాడె కట్టి శరీరాన్ని ఎత్తుకు పోయేటప్పుడు స్మశానానికి కొద్ది దూరంలో దాన్ని దింపి, చిన్న ముల్లెలో కట్టిన బియ్యాన్ని (డెలివరీ అయి బిడ్డ బతికి చనిపోయిన ఆడవాళ్ళకి ఆవాలను కడతారు) విప్పి కింద పోస్తారు.
ఎందుకంటే శరీరాన్ని కాల్చిన తర్వాత కూడా ఇంటి మీద తన వాళ్ళ మీద ఇష్టంతో ఆత్మ ఇంటికి రావాలంటే శరీరం మీద చల్లిన ప్యాలాలను, ఈ బియ్యాన్ని, పూర్తిగా ఒక్కో గింజను లెక్కించిన తర్వాతనే ఆత్మకి తన వాళ్లను చూడడానికి అనుమతి దొరుకుతుంది. అది కూడా సూర్యోదయం లోపు మాత్రమే. అంతలోపు లెక్కించకపోతే, మళ్ళీ తిరిగి మొదటి నుండి లెక్కించాలి.
శరీరాన్ని చితి మీద పెట్టి కుండలో నీరు పోసి దానికి రంధ్రాలు చేసి చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే కుండా నీ శరీరం లాంటిది, అందులో ఉన్న నీరు, నీ ఆత్మ లాంటిది. కుండకు పెట్టిన రంధ్రం నుండి నీరు ఎలాగైతే వెళ్లి పోయిందో నీ శరీరం నుండి నీ ఆత్మ బయటికి పోయింది.
కుండను కింద పడేసి పగలగొడతాం అంటే, ఇప్పుడు నీ శరీరాన్ని కాల్చేస్తాము. ఇంకా నీకు ఈ శరీరం ఉండదు, నువ్వు వెల్లిపో అని ఆత్మకు మనమిచ్చే సంకేతం. హిందూ సాంప్రదాయం లో చేసే ప్రతి పనికి ఓ అర్థం దాగి ఉంటుంది.
No comments:
Post a Comment