ధూమ్రలోచనుని రాయబారము
అను శ్రీదేవి వచనములు విని నివ్వెఱపడి దూత మరల దేవి కిట్లనియెను : 'చారునేత్రీ! నీవు స్త్రీ స్వభావముకొలది తెంపు వహించి పల్కుచున్నావు.
భామినీ! ఇంద్రాదిదేవతలును దైత్యులును శుంభున కోడిరి. అంతటి వానిని నీవెట్లు యుద్ధములో గెల్వగలవు? ఆ శుంభుని జయించు మొనగా డీ ముల్లోకము లందింతవఱకును లేడు. అతని ముందింక నీవెంతటి దానవు? ఎక్కడనైన ముం దాలోచన చేయక పలుకరాదు. తన-యితరుల బలాబలము లెఱింగి సమయోచితముగ పలుకవలయును.
శుంభుడు త్రిలోకపతి. అతడు నీ వంపుసొంపులు చిందులాడు రూపమునకు మోహితుడై నిన్ను కోరుచున్నాడు: ఆతని కోర్కి దీర్చుము. నా మాట వినుము. నీ మొండిపట్టు వదలుము. నీ మేలు గోరి చెప్పుచున్నాను. శుంభునిగాని నిశుంభునిగాని చేపట్టుము. నవరసములలో శృంగారము రసరాజము. సహృదయు లెంతయో నెయ్యము తియ్యము దోప నెల్లవిధముల దానినే సేవింతురు.
బాలా! నీ వతనికడ కరుగనిచో నా భూపతి కినుక బూనును. అతడు దూతల నంపి నిన్ను లాగుకొనివచ్చునట్లు చేయగలడు. మదగర్వముగల దానవులు నీ జట్టుపట్టుకొని వేగమే శుంభుని చెంత కీడ్చుకొని కొనిపోగలరు. నీవు మానవతివి. నీ మర్యాద గాపాడుకొనుము. దుస్సాహసము వలదు. అతని చెంతకు మాన్యవై యరుగుము. వాడి బాణములతోడి పోరెక్కడ! రతిక్రీడల సుఖమెక్కడ! ఈ రెంటిలోని మంచిచెడ్డ లెఱిగి నా మాట కొంచెము వినుము. నీవు శుంభనిశుంభులలో నెవని భజించినను నీకు సుఖము గల్గితీరును' అను మాటలకు
శ్రీదేవి యిట్లనెను : దూతా! నీవు మహావక్తవు. నిక్కము వక్కాణించుటలో మిక్కిలి నేర్పరివి. శుంభ నిశుంభులు బలవంతులుగారని నే వనుటలేదు. కాని, చిన్న తనమున చేసిన నా ప్రతిన యెట్లు వమ్మొనరింపగలను? కావున శుంభనిశుంభులకు తెలియజెప్పుము. పోరాటమున గెల్వనిచో నాకు పతి యెవ్వడును గాజాలడు. నేను బాలను. ఐనను నేను రణకామమున నరుదెంచితినని యెఱుగుము. కాన, నన్ను గెల్చి వేగమే నా కరము పట్టుకొనుమనుము.
నీకు శక్తి యున్నచో వీర ధర్మముగ నాతో బోరుము. కాక నా శూలమునకు జంకినచో పాతాళమేగుము. నీకు బ్రదకుపై నాసయున్నచో నిపుడే స్వర్గభూములను విడనాడి పాతాళమేగుము అని నీపతికి సాదరముగ బలుకుము. ఆ బలశాలి యాలోచించుకొని తనకు తగినట్లు చేయగలడు. జగమున నిజము పల్కుటే దూత ధర్మము.
నీకు శక్తి యున్నచో వీర ధర్మముగ నాతో బోరుము. కాక నా శూలమునకు జంకినచో పాతాళమేగుము. నీకు బ్రదకుపై నాసయున్నచో నిపుడే స్వర్గభూములను విడనాడి పాతాళమేగుము అని నీపతికి సాదరముగ బలుకుము. ఆ బలశాలి యాలోచించుకొని తనకు తగినట్లు చేయగలడు. జగమున నిజము పల్కుటే దూత ధర్మము.
కనుక నీవేగి నీపని చేయుము అని దేవి పలికెను. దేవి పలుకులలో నీతి గలదు. బలము గలదు. ఆమె పల్కులు సహేతుకములు ప్రాగల్భ్యవంతములు. ఆదేవి వాక్కులు వినిన దూత విస్మయమంది దైత్యపతి చెంతకేగి పలుమార్లు చక్కగ నాలోచించుకొనెను. అతడు దైత్యపతి పాదములకు మ్రొక్కి సవినయముగ మెత్తని తీయని మాటలతో రాజనీతి చతురతతో నతని కిట్లనియెను :
రాజా! దూత తన ప్రభవు చెంత సత్యహిత వాక్కులు పలుకవలయును. కాని, నేడట్టివి నాయెడల దుర్లభములైనవి. అప్రియము బలుకుచో రాజు కోపించును. ఐనను చెప్పక తప్పుటలేదు. ఆ యువతి యెవతె? ఆమె యెటనుండి వచ్చెను? ఆమె బలమెంత? మున్నగు విషయములు నాకేమియు తెలియలేదు.
కాని, యామె గర్వపు పరుష వచనముల వలన నామె యుద్ధకాముకురాలని నాకు తెలిసినది. ఆమె నోట వెడలిన పలుకులు వినుము. తొల్లి బాల్యమున నే నాట పాటలతో వినోదించు చుంటిని. అత్తఱి నేను నా చెలుల యెదుట నన్నాలములో గెల్చిన వానినే వరింతును. అతడే నాకు సమబలుడగు తగిన పతి అని నా వివాహము గూర్చి యొక ప్రతిన బూనితిని. ఇట్టి నా ప్రతిజ్ఞను వమ్మొనరించుట తగదు.
కనుక నన్ను పోరిలో గెల్చి నీదానిగ జేసికొనుము అను దేవి పల్కులు విని నేను వచ్చితిని. ఆమె యుద్ధమునకే సిద్ధమై సింహవాహనయై యేతెంచినది. నిండు ధైర్యముతోనున్నది. ఇంక నీకు తగినట్లు చేయుము అను సుగ్రీవుని మాటలు శుంభుడు విని తనకడ నున్న తన తమ్మునిట్లడిగెను.
ఒక నారి పోరదలచి మనల నిప్పుడు పురికొల్పుచున్నది. నీవు సేనతో వెళ్ళెదవా? లేక నేను ముందు వెళ్ళుదునా? నీకేది నచ్చిన దానిని తప్పక చేయగలను అని పలుకగా విని
ఒక నారి పోరదలచి మనల నిప్పుడు పురికొల్పుచున్నది. నీవు సేనతో వెళ్ళెదవా? లేక నేను ముందు వెళ్ళుదునా? నీకేది నచ్చిన దానిని తప్పక చేయగలను అని పలుకగా విని
నిశుంభు డిట్లనెను : ఈ పరిస్థితిలో నీవుగాని నేనుగాని సంగ్రామమున కేగుట తగదు. నీవు వెంటనే ధూమ్రలోచను నంపుము. అతడామె నోడించి తీసికొని రాగలదు. ఆ పిమ్మట నామెను నీవే పెండ్లిగావచ్చును అను తన తమ్ముని మాటలను శుంభుడు విని తనప్రక్కనున్న ధూమ్రలోచనుని పంపించుచు నతని కిట్లనెను :
ధూమ్రలోచనా! నీవు వెంటనే నీ బలముతో తరలుము. వీర్యమదగర్వములుగల యా ముగుదను పట్టి తెమ్ము. అపుడు దేవ దానవ వీరులలో నెవడైన బలముతో రావచ్చును. ఆమె కండయై దండగ నిలువవచ్చును. అపుడు నీ వతనిని కూడా తెగటార్పుము. ఆమె ప్రక్కనున్న కాళిని సైతము చంపి తెమ్ము? నీవు కార్యము చక్కపెట్టుకొని వెంటనే తిరిగిరమ్ము. అమెకేమాత్రము దెబ్బ తగులనీయక మెత్తని ములుకులు జాగ్రత్తగ ప్రయోగింపుము.
ఆ యమ సాధ్వి; సుకుమార శరీర; లతాంగి. ఆమెకు తోడైన శస్త్రపాణుల నంతమొందించుము. ఆమెను మాత్రము చంపవలదు. ఎల్లవిధముల నామెను సురక్షితనుగ దెమ్ము. అను శంభు నాదేశమును ధూమ్రలోచనుడు విని ప్రభునకు దోయిలించి యారువేల దానవసేన వెంటగొని రణమునకు వెడలెను. మృగలోచనియగు దేవి యొక సుందరోద్యానమున నుండగ నతడామెను దర్శించెను. అతడు సహేతుకములు సరసమధురములు నగు వచనములతో నామె కిట్లనియెను:
దేవీ! నీవు మిక్కిలి సౌభాగ్యవతివి. శుంభుడు నీ మీద మరులుగొని తపించుచున్నాడు. అతడు నీతి విశారదుడు. కనుక రసభంగమగునేమో యని యెంచి యతడు నీ కడకు దూత నంపెను. వరాననా! ఆ దూత వచ్చి వ్యతిరేకముగ బల్కెను. అందుచే మా రాజు చింతాక్రాంతు డయ్యెను.
రసజ్ఞురాలా! శుంభుడు కామమోహితుడై యున్నాడు. నీ నర్మగర్భితములగు వాక్కులను దూత సరిగ గ్రహింపలేదు. సమరమున నన్ను గెల్వుమను కఠిన వాక్కుల వ్యంగ్యార్థ మతనికి దెలియలేదు. సమరము రెండు విధములు గదా! రంభోరూ! రతివలన గల్గున దొకటి. ఉత్సాహమున గల్గున దింకొకటి. రతి సమరము నీయందు శోభిల్లును. ఉత్సాహము వలని సమరము శత్రులపట్ల నలరును.
రసజ్ఞురాలా! శుంభుడు కామమోహితుడై యున్నాడు. నీ నర్మగర్భితములగు వాక్కులను దూత సరిగ గ్రహింపలేదు. సమరమున నన్ను గెల్వుమను కఠిన వాక్కుల వ్యంగ్యార్థ మతనికి దెలియలేదు. సమరము రెండు విధములు గదా! రంభోరూ! రతివలన గల్గున దొకటి. ఉత్సాహమున గల్గున దింకొకటి. రతి సమరము నీయందు శోభిల్లును. ఉత్సాహము వలని సమరము శత్రులపట్ల నలరును.
నితంబినీ! ఈ రెంటిలో మొదటిది సుఖదము. రెండవది దుఃఖదము. నేను నీ మనోభావమును చక్కగ నెఱిగితిని. ఇపుడు నీ యెడదలో రతి సమరభావమే తోచుచున్నది. దానిని గూర్చి నా కెక్కువగ దెలియునని శుంభుడు తలంచెను. అతడు నన్ను సేనతో బంపెను. నీవు చతురవు. నా మృదు వచనము లాలకింపుము. శుంభుడు దేవతల మద ముడిపిన త్రిలోకేశుడు. నీ వతనిని భజించి యతనికి పట్టమహిషికై యనేక భోగము లుపభోగింపుము. ఆ మహాబాహువు కామబల మెఱిగినవాడు.
కాన నతడు నిన్ను జయింపగలడు. ఇక నీవు నీ హావభావములు వెల్లడించుచూ నతడును తన యభిప్రాయము వెలిపుచ్చును. ఈ కాళిక మీ నర్మ క్రీడలో సైదోడుగ నుండగలదు. ఇట్టి సంభోగ సమరయోగమున నా పతి పరమార్థవేత్త. అతడు నిన్ను గెల్చి పూసెజ్జపై నిన్నలయ జేయగలడు. అతడు నఖదంతక్షతములతో నిన్ను బాధింపగలడు. అతడు నిన్ను చెమటచే నలసిన దానినిగ జేయలడు.
ఆతడు నీ రతి సంగ్రామవాంఛ దీర్చ గలడు. నిన్ను దర్శించినంతనే యతడు తన నిండు మనసున నీకు పశుడగును. ప్రియా! నా కోమలమగు మేలిపల్కులు వినుము. అతడు నీకైవస మగును. మానినీ! దానవ గణాధ్యక్షుడగు శుంభుని సేవించినచో నీవెల్లరిలోన మాననీయ వగుదువు. అస్త్రయుద్ధము గోరువారు మందభాగ్యులు సుమా! నీ వట్టిదానికి తగవు. నీకు సురతసమరము ప్రియమైనది. నీ పదతాడనమున నీ ముఖ మదిరా దానమున నా రాజు నశోకునిగ జేయుము. వకుళము కురవకము మరిదాసేచనమున శోభిల్లును. అశోకము పదాఘాతమున విప్పారును.
No comments:
Post a Comment