దేవతలు శ్రీదేవిని సంస్తుతించుట
రాజా ! అట్లు దేవత లెల్ల రోడిపోవగ శుంభుడు వేయేండ్లు పాలించెను. అపుడు రాజ్యభ్రష్టులైన సురలు దుర్భర దుఃఖసాగరమున మునిగి బ్రహస్పతిని జేరి యిట్లనిరి:
'గురూ! నీవు మహామునివి; సర్వజ్ఞుడవు. మాకిపుడు దుఃఖము తొలగునట్టి యుపాయమును కర్తవ్యమును దెలుపుము. వేదమంత్రము లనంతములుగ గలవు. వానిని ససూత్రముగ నిష్ఠతో నాచరించినచో నవి వాంఛితము లీడేర్చును. కోరికలు దీర్చునట్టి యజ్ఞములు పెక్కులు గలవు. నీవు వాని నన్నిటి నెఱుగుదువు.
కనుక నీవు వానిని మా శ్రేయమున కొనరింపుము. వేదమున శత్రునాశమునకు మంత్రములు చెప్పబడినవి. ఆ పద్ధతులను నీవు విధిగ మా దుఃఖనాశమునకు మా బ్రదుకు వెల్గునకు నిర్వహింపుము. దానవ వినాశమున కభిచారకృత్యములు చేయుటకు నీవే సమర్థుడవు' అన
బృహస్పతి యిట్లనెను : 'సురలారా! సకల వేదోక్త మంత్రములును దైవాధీనములు. అవి స్వతంత్రములు గావు. అవి నియమబద్ధములైనపుడే ఫలము లొసంగును. ఎల్ల మంత్రములకు దేవతలు మీరలు. అట్టి మీరు బలిష్ఠమైన కాలవశమున దుఃఖముల పాలైతిరి గదా! ఇక నేనుమాత్రమేమి చేయగలను? యాగము లన్నిటియందు నింద్రాగ్ని వరుణులను మిమ్ము గూర్చి వేల్తురు గద!
అట్టి మీరే యిపుడు విపత్తులోనుండగ నిక జన్నములెట్లు సాగును? జరుగవలసిన దాని కెన్నడును ప్రతీకారము జరుగజాలదు. కాని, యట్టి పరిస్థితియందు నుపాయ మవలంబింపవచ్చునని శిష్టులందురు. కొందఱు సారమతులు దైవమే బలవత్తరమైన దందురు. కాని, కొందఱది వ్యర్థము పురుషకారమే గొప్పదని వాదింతురు. ఉపాయము-దైవము-రెండును నరుల కావశ్యకములే. కేవలము దైవము మీదనే యాధారపడి యుండరాదు.
కనుక నెల్ల విధముల బుద్ధితో చక్కగ నుపాయ మాలోచించియే చేయవలయును. నేను మీతో పల్మారు దూరమాలోచించియే పలుకుచున్నాను. పూర్వము దుర్గాభవాని మహిసాసురు నంతమొందించెను. అపుడు మీ రా తల్లిని నుతింపగ నామే మీకిట్లు వరప్రదానము చేసెను :

దేవతలారా! నన్ను సంస్మరింపుడు. మీ యాపద లెల్ల తొలగును. మీ కెప్పుడైన దైవికముగ సంకటములు గల్గవచ్చును. అపుడు మీరు నన్నే స్మరింపుడు. మీ బాధలన్నిటిని బాపగలను.
కాన, మీరిపుడు సుమనోహరమగు హిమగిరికేగి కామకళాస్వరూపిణియగు శ్రీచండికాదేవిని శ్రద్ధాభక్తులతో సేవింపుడు. మీరు మాయాబీజ విధాన మెఱిగి దానిని పునశ్చరణ చేయుడు. ఆ నామపారాయణ ప్రీతియగు దేవి మీ యెడల సుప్రసన్నయగునని నేను యోగబలమున నెఱింగితిని. దాన మీ క్లేశములు తప్పక గట్టెక్కును.
ఆ మహాకైలాస నివాసియగు దేవి నిరంతరము హిమాలయముపై కాపుర ముండునని విందుము. మీరు కాత్యాయనిని పూజించి సంస్తుతింపుడు. మీ వాంఛితము లీడేరును. ఇపుడు వేగమే మీరు కలసికట్టుగ హిమగిరికేగ నిశ్చయించుకొనుడు. ఆ దుర్గాదేవి మీ పనులన్నిటిని చక్కబెట్టును' అను గురుని వాక్యములు విని యమరులు హిమనగరమున కేగిరి.
వారచ్చట మాయాబీజమును తమ హృదయకమలములందు నిల్పుకొనిరి. హ్రీంమయి-మాయబీజ నివాసిని యగు తల్లిని ధ్యానింప గడంగిరి. వారు పరమభక్తుల కోర్కులు దీర్చు మహామాయను పరమభక్తితో నమస్కరించి మంత్రములతో నిట్లు సంస్తుతించిరి:
'విశ్వేశ్వరీ! భక్తిగమ్యా! సచ్చిదానంద స్వరూపిణీ ! ప్రాణశ్వరేశ్వరీ ! అశేషదుష్టదనుజమర్దినీ ! అమరానంద ప్రదాయినీ ! నీకు నమస్కారమమ్మా! ఆదిదేవీ! నీ యనంత నామరూపము లెవ్వడు నెఱుగజాలడు. సృష్టిసంహారాది కార్యములన్నిటిలో నీవు సర్వక్రియాశక్తి స్వరూపిణివి.

సర్వేశ్వరీ ! స్మృతి-ధృతి-బుద్ధి-జర-తుష్టి-పుష్టి-కాంతి-శాంతి-విద్య-లక్ష్మి-గతి-కీర్తి-మేధ-విశ్వాదిబీజము-ఇవన్నియు నీవే అమ్మా! నీ వేయే దివ్యరూపములలో విబుధుల కార్యముల నిర్వహింతువో ఆ యాయా యద్భుత రూపములకు నమస్కరించుచున్నాము. నీవు శాంతి - క్షమ-యోగనిద్ర మున్నగు సర్వరూపములతో జీవులలో నివసింతువు.
నీవు తొల్లి దేవతల మహోజ్జ్వల భవిష్యత్తునకై మదాంధుడగు మహిషాసురు నంతమొందించితి, ఆనాడు నీ యనుగ్రహభాగ్య మెల్ల సురలపట్ల నుండెను. నీవు దయామతల్లివని వేదములు నుద్ఘోషించుచున్నవి. తల్లి తన తనయుని గారాబముతో లాలించి పాలించి పెంచుననుటలో నచ్చెరువేమియునులేదు. నీవు నిఃల సురలకు సహాయ మొనర్చుదానవు. ఇపుడు తప్పక నీవు మా యెల్ల కార్యములు చక్కపఱచుము.
విశ్వవంద్యా! నీ యనంత గుణరూపము లత్యద్భుతములు. మేము వాని నెఱుగజాలము. మేము నీ దయకు పాత్రులము. మా భయములు పాపుము. మమ్ము బ్రోవ నీవే సమర్థురాలవు. శత్రువులను పరిమార్చుటకు నీకు బాణములు - ముష్టిఘాతములు-శూలఖడ్గములు-శక్తిదండములు మున్నగువానితో పనిలేదు. నీవు లోకోపకారమునకు యుద్ధాదులొనర్తువు. అవి నీకు లీలావినోదమాత్రములే. ఈ జగము నశ్వరమని మూఢులకును తెలియును. కారణము లేక కార్యము జరుగదు.
కాన నన్నిటికి నీవే మూలకారణము ప్రమాణము నని తలంతుము. బ్రహ్మ-విష్ణు-మహేశ్వరులు సృష్టి-స్థితి-సంహారకర్తలుగా పురాణములందు ప్రఖ్యాతి వహించిరి. సృష్టికి మొదట త్రిమూర్తులను గన్నతల్లివి నీవే కదా! కనుక నీ విశ్వములకు జననివి నీవే. నీవు పూర్వము త్రిమూర్తులచే బూజింపబడితివి. వారికి పరిపూర్ణ దివ్యశక్తులు ప్రసాదించితివి. నీవు సృష్టి స్థితి సంహారవినోదవు. దేవవందితపాదకమలవు.
సకల కామముక్తి ఫలదాయినివి, పరావిద్యవు. త్రిమూర్తులు నీ శక్తులనుగూడి తమ తమ పనులు చక్కగ నిర్వహించుచున్నారు. నిన్ను గొల్వనిచో యతులైనను మందమతులై మూఢులగుదురు. ఏకవు-లజ్జవు-కీర్తివి-పుష్టివి-కాంతివి-స్థితివి. నిన్ను ధ్యానింపని వైష్ణవులు-శైవులు-సౌరులు డాంబికులుగ నెన్నబడుదురు.
జననీ! నీవు హరిహరాది దేవవరులచేత సేవింపబడుదువు. నిన్నీపుడమిపై కొంచెపు బుద్దివారు గొలువనోపరు. వారు నిజముగ విధివంచితులు. హరి స్వయముగ లక్ష్మియొక్క పదకమలములకు లత్తుకరంగు పూయును. శివుడును శివాచరణకమల రజము సేవింప గోరుకొనును. ఇక సామాన్యులగూర్చి చెప్పనేల? వీతరాగులు ధీమంతులు మునులు సైతము దయాక్షమాది సద్భావములతో నిన్నే సేవింతురు.

కనుక లోకములందు నీ పదకమలములు సేవింపని వారెవరును లేరు. పారిజాత పరిమళములు విరజిమ్ము నీ చరణ కమలములకు పూల పూజ పచరింపని నరులు సంసారకూపనిపతితులు-పతితులు - కుష్ఠ గూల్మాది రోగ పీడితులు-దైన్య దారిద్ర సహితులు-సుఖరహితులు-నై యుందురు. తల్లీ! ఈ జన్మములో కట్టెలు గడ్డి గాదములు మోయుటలో నేర్పరులై - భార్య సంపదలు లేనివారె బుద్ధిహీనులై యున్నవారు గత జన్మములో నీ పదకమల సేవ చేయనివారని భావింతుము.'
అని యీ విధముగ దేవతలెల్లరును సంస్తుతింపగా మహాతిశయ లావణ్యయగు జగదంబ వేగిరమే కనికరముతో వారికి ప్రత్యక్షమయ్యెను. శృంగార రస పూర్ణయగు దేవి దివ్యమాల్యాంబర భూషణములు దాల్చి దివ్య చందనములలందుకొని వెలుగొందు చుండెను. దేవి సర్వశుభ లక్షణములతో సాటిలేని జగన్మోహన సుందరాంగియై దేవతలకు కనులపండు వొనరించెను:

ఆ విశ్వమోహన మోహిని కామకలారూపిణియగు దేవి గంగలో స్నానమాడగోరి గిరిగుహ వెడలివచ్చెను. మధుర కలకంఠియగు ఆ దేవి వాత్సల్యము చిగురింప మేఘ గంభీర వాక్కులతో తన్ను నుతించు దేవతలతో నిట్లు పలికెను
సురవరులారా ! మీరిచట నెవరిని నుతించుచున్నారు? మీకేమి కావలయును? మీరేల యిట్లు దీనవదనములతో నున్నారు? అని దేవి పలుకగ సురలు దేవి సురూపశ్రీకి మొదట ముగ్ధులైరి. పిదప వారు తెల్వితెచ్చుకొని దేవి వాక్కుల కలరి భక్తినమ్రులై యామె కిట్లనిరి:
'దేవి! నీవు విశ్వేశ్వరివి. దయా సాగరవు. నీ కివే మా ప్రణా మాంజలులు. ఇవే మా స్తుతులు. మేము దైత్య పీడితులము. మాలో చింత మెఱమెఱలాడు చున్నది. మమ్ము దుఃఖములనుండి కాపాడు మమ్మా మహాదేవీ! తొల్లి నీవు లోక కంటకుడగు మహిషాసురుని వధించితివి. అపు డాపదలందు నన్ను స్మరింపుడని మా కభయ ప్రదాన మొనర్చితివి. నిన్ను స్మరించినంతనే దానవులవలని బాధలు తొలగింతు నంటివి. అందులకే మేమిపుడు నిన్ను స్మరించుచున్నాము.

ఇపుడు శుంభ నిశుంభులను నిర్వురు ఘోరరాక్షసులు పుట్టి మా కార్యములకు విఘ్నము లొనర్చు చున్నారు. వారు పురుషులకు వధ్యులుగారు. రక్తబీజుడు-చండ ముండులు మహాబలవంతులు. వారు సురల రాజ్య మపహరించిరి. దేవదేవీ! మాకు నీవే దిక్కు. మా మొఱలాంలించి పాలించు మమ్మా! మేమాపదలలో జిక్కుకొంటిమి. మా కార్యము చక్కబెట్టుము.
మాకు వేరే దిక్కెవ్వరునులేరు. అమరుల్లెవేళల నీ చరణ కమల సేవలో మగ్నులై యుందురు. ఐనను దైత్యులు వారి కాపదలు గల్గింతురు. అట్టి సురలు దుఃఃతులు-నీ యందలి నిశ్చల భక్తితత్పరులు. వారికి నీ కరావలంబ మొసగుము. వారిని దుఃఖరహితులుగ జేయుము. జననీ! విశ్వమంతయు నీచే సృజింపబడినది. అటులే యిపుడును విశ్వపరిరక్షణ నీ కవశ్య కర్తవ్యమగును.
అధ్యాయము 110 సుగ్రీవుని రాయబారము
అధ్యాయము 110 సుగ్రీవుని రాయబారము
No comments:
Post a Comment