శుంభాసురుని మరణము
తన సైనికుల మాటలు విని శుంభాసురుడు క్రోధముతో వారి కిట్లనియెను : మూఢలారా! మీరేమి పల్కుచున్నారు? నా మంత్రులును సోదరులును చావగా నేను తలయెత్తుకొని యెట్లు తిరుగ గలను? ఈ దుర్భరమైన ముప్పు వలన నేనెట్లు మన గలను? కాల మింద్రజాలము వంటిది; బలవత్తరమైనది.
అది మంచిచెడ్డలకు కర్త-అరూపము-దుర్వారము-విశ్వప్రభువు. ఇక నేను మాత్ర మేమిచేయగలన? ఏది కానున్నదో కానిమ్ము. ఎవడు కుశలుడో వాడే ధన్యుడు; కార్యశూరుడు. నాకు చావుబ్రదుకుల గూర్చిన చింత యెంతమాత్రమును లేదు. ఈ చావుపుట్టువులను మార్చు శక్తి కాలమునకు గూడ లేదు. వానకాలమున మేఘము వర్షించును.
కాని యొకొకప్పుడు శ్రావణ మాసమందును మేఘములు కురియకుండును గదా! ఒక్కొక్కప్పుడు మార్గశీర్షపుష్యము లందును - మాఘపాల్గుణములందును కాలముగాని కాలమున వానలు గురియును గదా!
కావున పెక్కు భేదములుగల కాలము ముఖ్యముగాదని తెలియుచున్నది. కనుక కాలముకూడ నిమిత్తమాత్రమే. అన్నిటను దైవమే బలిష్ఠమైనది. దానిచేతనే విశ్వము సృజింపబడును. ఇతరముచే గాదు. దైవమే గొప్పదని తలంతును. పౌరుషము వ్యర్థము. పనికిమాలినది. ఏలయన, నెల్ల దేవతలను గెల్చిన నిశుంభుడు నేడొక స్త్రీ చేతిలో గూలిపోయెను గదా! రక్తబీజుడును మహా శూరుడు గదా! అంతటివాడును మిత్తి వాతబడెను.
ఇంక నేనెట్లు కీర్తిని వదలుదును? జీవితాశ యెట్లు గల్గియుందును? బ్రహ్మ జగత్కర్త-స్వయంప్రభువు. అతడును కాలము తీరినచో మృత్యువువాత పడవలసినవాడే గదా! నాలుగువేల యుగములు బ్రహ్మ కొకదినము. ఒక్క బ్రహ్మదినములో పదునాల్గు రింద్రులు పుట్టి గిట్టుదురు.
బ్రహ్మకు రెండింతల కాలము గడచిన మీదట విష్ణునాయువు పూర్తి యగును. విష్ణుని యాయువునకు రెండింతలైన శంకరుడు శాంతించును. మూఢులారా! దుర్దమ దైవమీ విశాల ప్రపంచములోని భూమి పర్వతములు సూర్యచంద్రులు మున్నగువానికి ముందే చావు వ్రాసి పెట్టియున్నది. ఇంక నా కీ చచ్చు చింతయేల? పుట్టినది తప్పక గిట్టును. గిట్టినది పుట్టును. ఈ నిలువని బొంది యుండగనే కీరితి దక్కించుకొనవలయును.
కనుక మీరు రథమాయాత్త పరచుడు. రణమున కేగగలను. చావో గెలుపో దైవమే నిర్ణయింపగలదు అని శుంభుడు తన సేనలతో నిట్టు పలికి యరదమెక్కి సదాశివ కుటుంబినియగు జగదంబిక యున్న హిమగిరికి తరలెను. అతని వెనువెంట రథాశ్వ గజాపదాతి బలములును నడచెను. అతడు పోయి ఆ హిమాద్రిపై నెలకొని యున్న త్రైలోక్యమోహిని - మనోహర - సింహవాహన యగు జగదంబికను గాంచెను.
కనుక మీరు రథమాయాత్త పరచుడు. రణమున కేగగలను. చావో గెలుపో దైవమే నిర్ణయింపగలదు అని శుంభుడు తన సేనలతో నిట్టు పలికి యరదమెక్కి సదాశివ కుటుంబినియగు జగదంబిక యున్న హిమగిరికి తరలెను. అతని వెనువెంట రథాశ్వ గజాపదాతి బలములును నడచెను. అతడు పోయి ఆ హిమాద్రిపై నెలకొని యున్న త్రైలోక్యమోహిని - మనోహర - సింహవాహన యగు జగదంబికను గాంచెను.
సర్వాభరణ భూషారంజిత సర్వలక్షణసంయుత - నిశ్చలచిత్తయగు దేవిని దివిజ-యక్ష-గంధర్వ-కిన్నరులచే సన్నుత. పారిజాత సుమముల చేత పూజింపబడుచు మనోమరమగు శంఖ నినదమును ఘంటానాదమును చేయుచున్న ఆ దేవిని చూచిన శుంభుడు కామవిమోహితుడు అగుచు మోహమునొంది పంచబాణాహతిచే మిగుల పీడితుడై తన మదినిట్లు తలపోసెను :
ఓహో! ఏమా రూపము! ఏమా యద్భుతము! చాతుర్యము! పరస్పర విరుద్ధములగు శౌర్యము సౌకుమార్యము నొక్కెడ రూపుదాల్చి యున్నవే! ఈ బాల సుకుమార. సూక్ష్మమగు దేహము కలది. ప్రకటమై ఉదయించిన జవ్వనము గలది - ఐనను కామవికారము లేనిది. ఓహో, ఏమా విచిత్రము! ఈమె రతీ దేవివలె జగదేక సుందరి. సర్వశుభలక్షణలక్షిత-జగదేకమాత. అయ్యును మహాబలులగు రాక్షసవీరులను అందరను తుదముట్టించుచున్నది.
ఈమె నాకు హస్తగతయగు నుపాయమేది? ఈ హంసగమనను నా దానిగ జేసికొనుటకు నా యొద్ద వశీకరణ మంత్రములైన లేవే! ఉన్న మాత్రనేమి? ఈ మదగర్వితయగు మోహనాంగి సర్వమంత్రాత్మిక యగు విశ్వ సుందరి. ఇంక నీ వరవర్ణిని నాకెట్లు వశగత కాగలదు? ఈ పరిస్థితిలో నేను యుద్ధరంగము వదలి పాతాళమేగుటి నీతిగాదు. ఈమె మహాబలిష్ఠ. ఈమె సామదానభేదములచేతను వశ్యగాదు.
ఇపుడెంత విషమస్థితి వచ్చిపడినది! ఇపుడేమి చేతును? ఎక్కడికేగుదును? ఒక యాడుదాని చేతిలో చచ్చుట నా కీర్తిని అపహరించునదగును. అది దగదు. సంగ్రామమందు సమాన బలశాలురతోడి పోరున మరణము మంగళకరమని ఋషులు వాక్రుత్తురు.
ఇపుడెంత విషమస్థితి వచ్చిపడినది! ఇపుడేమి చేతును? ఎక్కడికేగుదును? ఒక యాడుదాని చేతిలో చచ్చుట నా కీర్తిని అపహరించునదగును. అది దగదు. సంగ్రామమందు సమాన బలశాలురతోడి పోరున మరణము మంగళకరమని ఋషులు వాక్రుత్తురు.
అట్టి చావు గొప్పది. నూరుగురు పురుషుల కంటె మేటియగు ఈ యన్నులమిన్న - అతిబల యగు ఈ యబల - నా కులనాశమున కెల్లభంగుల నిర్ణయింపబడి వేల్పులచే సృజింపబడినది. ఈ పట్టున నా మెత్తని పల్కులు పనికిమాలినవి. ఈమె మమ్ము హతమార్ప నేతెంచిన ప్రళయమూర్తి. ఐనను నా సామవాక్కులకీమె ప్రసన్నురాలు గావచ్చును.
ఈమె నానా శస్త్రభూషితురాలు. కనుక నీమె దానములకు లొంగదు. ఈమె యెడల భేదమును పనిచేయదు. ఏలన, నీమెకు వశవర్తులై దేవతలండగ నిల్చియున్నారు. కనుక నా కిపుడు రణమున మరణమే మంచిది. పలాయనము తగదు. చావో గెలుపో విధి విధానమున్నట్లుగ జరిగి తీరును అని శుంభుడిట్లు తలపోసి బలము కూర్చుకొని పోర సమకట్టెను - అతడు తన ఎదుటనున్న దేవితో ఇట్లు పలికెను :
ఓ శ్రీదేవీ! నీవెంత మూర్ఖురాలవు. నీవు నాతో పోరినంత మాత్రాన నాకు హాని జరుగునా? నీ పడిన శ్రమయంతయు వ్యర్థమగును. స్త్రీల ధర్మము యుద్ధము చేయుట కాదు. ఏలన, నారికి బాణములు కన్నులు; ధనువు కనుబొమలు; శస్త్రములు హావములు; లక్ష్యము పురుషుడు; కవచమంగరాగములు; రథము మనోరథము; భేరీభాంకృతులు తియ్యని మాటలు; ఇవికాక స్త్రీకి వేరేమియుండును?
ఓ కాంతా! కాంతల కస్త్రధారణ మాడంబరమే యగును. ఆమెకు సిగ్గు పెట్టని మానికము. రమణికి ధృష్టత్వమెన్నడును తగదు. ఒక రమణి రణమునందు పోరాడుచున్నచో కర్కశముగ నుండును. ఆమె చాపము లాగునవు డామె బిగువైన స్తనము లెట్లు దాగగలవు? నీవు గదయెత్తి పరుగెత్తునపుడు నీ మందగమన మేమగునో కదా! ఈ కాళిక - యీ చాముండిక చతురలుకారు.
ఈ కర్కశవాక్కులు గల చండిక నీకు మంత్రాలోచనము నెఱపునదా! నిన్ను లాలించుమాత్రపుదా! సకల జంతు భీకరమగు నీసింహము నీకు వాహనమా! సురసుందరీ! సుమధుర వీణానాదము వదలి యీ ఘంటానాద మొనరింతువేల?
ఈ కర్కశవాక్కులు గల చండిక నీకు మంత్రాలోచనము నెఱపునదా! నిన్ను లాలించుమాత్రపుదా! సకల జంతు భీకరమగు నీసింహము నీకు వాహనమా! సురసుందరీ! సుమధుర వీణానాదము వదలి యీ ఘంటానాద మొనరింతువేల?
ఇదంతయు నీ సురూప ¸యవనములకు భిన్నమైనది సుమా! వ్రేలాడు పెదవులు - చెడుగోళ్ళు గల్గి కాకవర్ణమున నుండుము. లంబపాదములు - చెడిన పండ్లు - పిల్లికండ్లు గల్గిన రూపున రణమున నిలుము. నేను నీవంటి సుందరాంగిపై చేయిచేసికోజాలకున్నారు. కనుక తొలుత నాతో నీవు పరుషములు పలుకుము. పిదప నీతో నేను పోరు సాగింతును.
ఓ మృగాక్షి! నీవు రతి సమానవు. నిన్నెట్లు చంపగలను? అనగ విని దేవి శుంభుని కామార్తునిగ నెఱింగెను.
ఆమె చిర్నగవుతో వానితో నిట్లు పలికెను : ఓరి మందమతీ! కామబాణపీడితుడవై యేల విలపింతువురా. నాతో పోరుటకు నీవుత్సహింపనిచో కాళికతోగాని చండికతోగాని పోరుము. వారును నీకు తగినవారే. నీవు వారితోనే పోరుము. నేను నీతో పోర సమకట్టను అని పలికి దేవి మధురవచనములతో కాళికకిట్లు పలికెను :
కాళికా ! ఇతడు కురూపమును కామించువాడు. నీవును క్రూరురాలవు - కనుక నితనిని నీవే తునుమాడుము? అని దవి పలుకగనే కాలభయంకరియగు కాళిక కాలప్రేరితురాలయ్యెను. ఆమె సత్వరమే గద చేబూని రణాంగమున సిద్ధమయ్యెను.
అంత కాశీశుంభుల మధ్య పో రతిభీకరముగ జరిగెను. సకల మునుల దేవతలు చూచుచుండగ శుంభుడు గదగొని కాళికపై విసరెను. కాళికయు వెనువెంటనే గదతో దైత్యపతిని చావమోదెను. చండిక గదగొని వాని బంగారు టరదము విఱుగగొట్టెను. ఆమె వెంటనే వాని సారథిని నేలగూల్చెను. వాడొక పెద్ద గదపూని కోపముతో లేచెను.
అతడు కాళికపై గదవేసి నవ్వెను. కాని కాళిక వాని గదాఘాతమును విఫలమొనరించి ఖడ్గము చేపట్టెను. వాని యెడమ భుజము చందనమలందుకొని యాయుధము దాల్చియుండెను.
అతడు కాళికపై గదవేసి నవ్వెను. కాని కాళిక వాని గదాఘాతమును విఫలమొనరించి ఖడ్గము చేపట్టెను. వాని యెడమ భుజము చందనమలందుకొని యాయుధము దాల్చియుండెను.
కాళి దానిని తెగనఱికెను. తన బాహు వట్లు తెగగ నతడు విరథుడై మరల గద చేతబట్టెను. వాడు నెత్తుట తొప్పదోగుచు వచ్చి కాళికను మోదెను. ఆమె కరవాలము చేత ధరించెను. శ్రీ కాళిదేవి గదాభూషణములుగల వాని కుడిచేతిని మెత్తగ నవ్వుచునే ఖండించెను. వాడు కోపముతో ఆమెను తన్నబోయెను.
ఆ వెంటనే కాళి వాని కాళ్ళను సైతము నఱికివేసెను. వాడట్లు కాలు సేతులు తెగినను నిలునిలుమని చావుకేకలు వేయుచు కాళికను బెదిరించుచు పరుగెత్తి వచ్చుచుండెను. ఆ వచ్చు వానిని గని కాళికాదేవి కమలమును కత్తిరించినట్లు వాని తల కత్తిరించెను. వాని కుత్తుక నుండి నెత్తురు వరదలై ప్రవహించెను. తల తెగిన వెంటనే వాడు గిరి పగిది నేలగూలెను.
వాని ప్రాణములు వాని తనువు వదలి లేచిపోయెను. ఆ చచ్చిపడిన దానవు నింద్రాదులు చూచిరి. దేవత లంతట శ్రీకాళి చాముండలను సన్నుతింపదొడగిరి. అంత వాయువు చల్లగ మెల్లగ వీచెను. దిక్కులు విమలము లయ్యెను. అగ్ని ప్రదక్షిణ శిఖలతో మేలు వెల్గులు విరజిమ్ముచు హోమమున ప్రజ్వరిల్లెను.
మిగిలిన దానవులు జగన్మాతకు కైమోడ్పు లందించిరి. వా రాయుధములు విడనాడి పాతాళము త్రోవపట్టిరి.
ఇట్టి మహాద్భుతమైన శ్రీదేవి వీర రసభరిత చరిత్ర నీకు వివరించితిని. ఈ శుంభాదుల వధ సురసంరక్షణము గల ఈ దేవ్యుపాఖ్యానము చదివినవారు పరమ భక్తులు. దీనిని విన్నవారు పరమభాగవతోత్తములు. ధన్యజీవులు.
ఈ భూమిపై శ్రీదేవీ చరిత్ర వలన పుత్త్రహీనుడు పుత్త్రవంతుడగును. లేనివాడు కలవాడగును. రోగి రోగములేనివాడు అగును. సర్వకామములు దేవీభక్తుని వరించి వచ్చును. మహాకాళీశక్తి శుభ పవిత్ర చరిత్ర విన్న - చదివిన వారికి శత్రుభీతి లేదు. అతడు మృత్యుముక్తుడు.
No comments:
Post a Comment