సురథోపాఖ్యానము
జనమేజయు డిట్లు వ్యాసుని ప్రశ్నించెను : మునిచంద్రా ! నీవు శ్రీచండికాదేవి మాహాత్మ్యము విపులముగ చక్కగ వివరించితివి. ఆ దేవి యొక్క మూడు చరిత్రములు మున్నెవడు తెలిసికొనెను? ఆ దేవిని మున్నెవ డారాధించెను? పూర్వమా వరదాయిని యగు దేవి నారాధించి యెవడు మహాఫలమందెను? ఆ తల్లి యెవని యెడల సుప్రసన్న మయ్యెను?
దయానిధీ! నాకది యంతయు దెలుపుము. మహాత్మా! ఆ దేవి పూజాహోమ విధానములు నుపాసనాక్రమమును నాకు క్రమముగా వివరింపుము అను రాజు పలుకులు వినిన సత్యవతీ తనయుడగు వ్యాసమహర్షి ప్రసన్నుడై రాజునకు మహామాయాపూజా విధానమిట్లు చెప్పసాగెను.
రాజా! పూర్వము స్వారోచిష మన్వంతరమునందొక రాజుండెను. అతని పేరు సురథుడు. అతడు ప్రజాపాలన తత్పరుడు - మహోదారుడు - నిత్యసత్యవత్రుడు - సత్కర్మనిరతుడు - బ్రాహ్మణపూజకుడు - గురుభక్తి పరాయణుడు - ఏకపత్నీరతుడు - దానశీలి - అజాతశత్రువు - ధనుర్విద్యాపారగుడు.
అట్టి మంచి రాజు పాలించుచుండగ పర్వత వాసులగు వ్లుెచ్ఛులకు చెడుబుద్ధి పుట్టెను. వారు రాజుతో పగబూని మదగర్వముతో చతురంగబలములు గూర్చుకొనిరి. ఆ కోలావిధ్వంసులు (కోల-అవిధ్వంసినః-తమ ఆహారమునకై పందులను చంపనివారు - వ్లచ్ఛులు) సురథుని రాజ్య మపహరింప తరలిరి. సురథుడును తన సేనలతో వైరులను తాకెను.
అంత వారిర్వురికిని దారుణమగు పోరు సంఘటిల్లెను. అందు వ్లచ్ఛుల బలము కొలది - రాజు బలము పెద్దది అయ్యెను. ఐనను దైవ మనుకూలింపని కారణమున రాజోడిపోయెను. అతడు దుర్గ రక్షితమైన తన పురమును జేరెను. నీతివిశారదుడు - మేధావియగు ఆ రాజు తన మంత్రులు తన్ను వీడి శత్రు పక్షములో జేరుటగని ఇపుడు నేనేమి చేయవలయునాయని చింతింపసాగెను.
నాపురమున కగడ్త గలదు. ఇది దుర్గ రక్షితము. ఇపు డిచ్చటనే యుండి మంచికాలమున కెదరు చూచుట మంచిదా?
ఇపుడు మంత్రులెల్లరును శత్రుపక్షములో జేరియున్నారు. కనుక నాలోచించుట తగదు. ఇపుడేమి చేయుదునని రాజు నెమ్మది నిట్లు తలపోసెను :
ఇపుడు మంత్రులెల్లరును శత్రుపక్షములో జేరియున్నారు. కనుక నాలోచించుట తగదు. ఇపుడేమి చేయుదునని రాజు నెమ్మది నిట్లు తలపోసెను :
ఒకవేళ పరుల నాశ్రయించిన పాపిష్ఠులగు నా మంత్రుల నన్ను పరులకు పట్టించి యప్పగించిన నేనేమి చేయగలను? పాపాత్ముల నెన్నడు నమ్మరాదు. లోభులెంతటి పనినైన చేయగలరు. లోభమునకు పాల్పడినవాడు పూజ్యులగు గురువులను - ద్విజులను - తల్లిదండ్రులను - సోదరులను - బంధుమిత్రులను ద్వేషించుచుండును. నేనిపుడు పరులకు వంతపాడు నా పాపిష్ఠ మంత్రులను నమ్మకూడదు, అని యిట్లు సురథుడు చింతించెను.
అతనికి మనశ్శాంతి లేదు. కనుక నతడు గుఱ్ఱమెక్కి యొంటరిగ తన పురము విడిచి వెళ్ళెను. ఆ మేధావి యే తోడు నీడలేక యొక మహారణ్యము చేరెను. అపు డింకెచటి కేగవలయునాయని యతడు చింతింపసాగెను. ఆ చోటికి మూడు యోజనముల దూరమున నొక తాపసాశ్రమము గలదు. ఆ తాపసోత్తముడు సుమేధుడు.
రాజాముని సన్నిధికి జేరెను. ఆ యాశ్రమ మొక నదీ తీరమున గలదు. అది పలువిధములగు మధుర రస ఫలయుతములగు చెట్లతో - కోయిలల కలకంఠారావములతో సహజవైర ముడిగిన క్రూర జంతు సంతతితో నొప్పారుచుండెను. ఆ పావనాశ్రమములో నొక్కెడ శిష్యుల వేదఘోషలు మరొక్కెడ లేళ్ళగుంపులు నింకొక్కెడ ఫలపుష్పభరిత వృక్షములు వేరొక్కెడ పండిన నీవారధాన్యములు కనులపండువు సేయుచుండెను.
ఒక్కెడ ప్రాణులకు ప్రీతి గొల్పునట్టి హోమధూమములు - సుగంధ పరిమళములు వాసించుచుండెను. అది స్వర్గము కంటె మిన్నగ నిట్లందగించుచుండెను. అట్టి యాశ్రమమును గాంచి రాజు పరమానందబరితుడయ్యెను. అతడు జయమువాసి శాంతి చెందెను. మరియు ఆ ద్విజాశ్రమమందు విశ్రమింప మది దలచెను.
అతడొక చెట్టునకు తన గుఱ్ఱమును కట్టివేసి సవినయముగ ముని సన్నిధి కేగి మునిని దర్శించెను. ఆ ముని యొక సాలతరువు క్రింద నుండెను. అతడు కృష్ణాజినము పై గూర్చుండి వేదశాస్త్రార్థము లెఱుగగోరు శిష్యుల కధ్యాపన మొనరించుచుండెను. ఆ ముని పరమశాంతుడు. తపముచే కృశించినవాడు. కామక్రోధ మత్సరరహితుడు. సత్యవాది. ఆత్మవంతుడు. శమ దమ సంపన్నుడగు ఆ మునీశ్వరుని దర్శించగనే రాజునకు కన్నులనిండ నీరు నిండెను.
అతడొక చెట్టునకు తన గుఱ్ఱమును కట్టివేసి సవినయముగ ముని సన్నిధి కేగి మునిని దర్శించెను. ఆ ముని యొక సాలతరువు క్రింద నుండెను. అతడు కృష్ణాజినము పై గూర్చుండి వేదశాస్త్రార్థము లెఱుగగోరు శిష్యుల కధ్యాపన మొనరించుచుండెను. ఆ ముని పరమశాంతుడు. తపముచే కృశించినవాడు. కామక్రోధ మత్సరరహితుడు. సత్యవాది. ఆత్మవంతుడు. శమ దమ సంపన్నుడగు ఆ మునీశ్వరుని దర్శించగనే రాజునకు కన్నులనిండ నీరు నిండెను.
అతడు వెంటనే మునికి దండప్రణామము లాచరించెను. అంత ముని లేలెమ్ము. నీకు సేమమా?' యని యడిగెను. ఒక శిష్యుడు ముని యనుమతితో రాజు కూర్చుండుటకు కుశాసన మేర్పరచెను. ముని యానతితో అతడు దానిపై కూరుచుండెను. ముని అతని కర్ఘ్యపాద్యాదివిధు లొనరించెను. నీవెవరవు? నీవెట నుండి వచ్చితివి? నీ మోము వాడినదేమి? నీ దైన్య కారణమేమి? నా కన్నియు దాపరికము లేక తెల్పుము. నీ రాకకు కారణమేమి? నీ మనోగత వాంఛిత మెద్ది? నీ కోర్కి యెంత యసాధ్యమైనదైనను సాధింపగలను. అంతయు తెలుపుము' అని ముని రాజు నడిగెను.
రాజిట్లనియెను : నే నొక రాజను. నన్ను సురథుడందురు. నేను పగతురచేతిలో నోడితిని. రాజ్యమును గృహమును భార్యను వదలిపెట్టితిని. నీ శరణు చొచ్చితిని. ఓ మునిచంద్రమా! నీవు నన్నాజ్ఞాపింపుము. నీవు చెప్పిన దానిని భక్తిశ్రద్ధలతో నొనరింతును. నిన్ను మించిన రక్షకుడు నా కింకొకడు లేడు. నీవు శరణాగతవత్సలుడవు. నేను శత్రుభీతిచే నీ శరణు జేరితిని. నన్ను బ్రోవుము.' అన
ముని యిట్లనియెను : నీ విచ్చట నిర్భయముగ నుండుము. నీ వైరు లిచటకి రాజాలరు. వచ్చినను నా తపోబలము ముందు వారు నిలువ నోపరు. ఇచట హింసకు తావు లేదు. ఇట వన్యవృత్తితో నీవారధ్యానములతో ఫలపుష్పములతో మనుగడ సాగింపవలయును.' అనిన ముని వాక్కులు విని రాజు నిర్భయుడు నిశ్చింతుడును శుచియునై ఫలమూలాదుల తినుచు నాశ్రమమందుండెను.
ఒకనాడు రాజొక చెట్టు నీడను గూర్చుండి తన యిల్లు మున్నగు వానిని గుఱించి ఇట్లు నెమ్మది నాలోచించుచుండెను. నా రాజ్యము పాపులగు వ్లచ్ఛుల చేతిలోబడినది. ఆ సిగ్గుమాలిన దుష్టుల మూలమున నా ప్రజలెంత పీడింపబడుచున్నారోకదా! వేళకు మేత లేనందువలన నా గజాశ్వములు స్రుక్కి పరులచేత పీడింపబడుచుండును.
నా సేవకులు నాచేత చక్కగ పాలింపబడిరి. నేడు వారు తప్పక శత్రువులకు వశులై కడగండ్ల పాలైయుందురు. ఆ దుష్టులు నా సంచిత ధనరాశులను జూదము త్రాగుడు మున్నగు దురభ్యాసములకు వ్యయించి నాశము చేసి యుందురు. ఆ పావులు వ్యసన పరులునగు వ్లచ్ఛులను వారి మంత్రులును దాన పాత్రత్వ మెరిగినవారు కారు కాన వారు ధనాగారమును శూన్యము చేతురు.
ఇట్లు రాజు చెట్టు మొదట చింతాక్రాంతుడై యుండగ నంతలో నచటికొక కోమటి దుఃఖార్తుడై వచ్చెను.
అతడు వచ్చి రాజు చెంత గూర్చుండగా ఆజతని నిట్టులడిగెను: 'నీవెవరు? ఈ వనమున కెచటి నుండి యేతెంచితివి? నీ పేరేమి? ఏల శోకపీడితుడవైనట్లు తెల్లబోవుచు పాలిపోయినవాడవై దీనముగ గనింపించుచున్నావు? ఏడు పదముల చేతనే నరులు పరస్పర మిత్రములడుదురు. కాన నేను నీకిపుడు మిత్రుడను. నాతోనన్నియు దెలుపుము' అనిన రాజు పలుకులు విని చక్కగ గూర్చుండి తను మంచి మైత్రి దొరికినదని తలచి రాజుతో కోమటి ఇట్లనియెను :
మిత్రమా! నేను జాతికి కోమటిని. నా పేరు సమాధి. ధనికుడు - ధర్మ నిరతుడను. సత్యవాదిని. అసూయలేనివాడను.
నా భార్యాపుత్రులు ధనాశపరులు దుష్టాత్ములు. వారు మాయ పన్ని నన్ను దిక్కరించిరి. నేను పిసినిగొట్టునను నెపము నాపై మోపిరి. నన్ను వారిల్లువెడల బైటికి గెంటిరి. నేను గెంటబడి యీ వనము చేరితిని. నీవు మహానుభావుడవుగ గనంబడుచున్నావు. నీవెవరవో తెలుపుము' అన
నా భార్యాపుత్రులు ధనాశపరులు దుష్టాత్ములు. వారు మాయ పన్ని నన్ను దిక్కరించిరి. నేను పిసినిగొట్టునను నెపము నాపై మోపిరి. నన్ను వారిల్లువెడల బైటికి గెంటిరి. నేను గెంటబడి యీ వనము చేరితిని. నీవు మహానుభావుడవుగ గనంబడుచున్నావు. నీవెవరవో తెలుపుము' అన
రాజిట్లనెను : నన్ను సురథు డందురు. వ్లచ్ఛులు నన్ను బాధలు పెట్టిరి. నా మంత్రులు నన్ను మోసగించిరి. అంత నే నిచ్చటికి వచ్చి చేరితిని. నా యదృష్టము కొలది నీవు నాకు మిత్రుడవైతివి. మహాబుద్ధీ! నీ విక శోక ముడుగుము. చిత్తశాంతి నొందుము. మన మీచల్లని చెట్ల నీడను సుఖముగ విహరింతము. నీవు నాతో నిచట స్వేచ్ఛగ సుఖముండుము' అన
వైశ్యుడిట్లనెను : నేను లేనందున నా కుంటుంబము దిక్కుమాలిని దగును. అది చింతాశోకములకు వ్యాధి దుఃఖములకు లోనయి బాధలు పడుచుండును. నా భార్యపుత్రులు సుఖముండిరో లేదో యని నాకు చింతగల్గుచున్నది. నా మదికి శాంతి చేకూరుట లేదు. నా మనస్సు గృహచింతలతో సతమతమగుచున్నది. నా చిత్తమునకు శాంతి గల్గుటలేదు. నా భార్యాపుత్రుల నెన్నడు చూతునాయని విచారపడుచున్నాను' అన
రాజిట్లనియెను : నీవు చెడువృత్తిగల నీ పుత్త్రులచే తిరస్కరింపబడితివి గదా! వారిని మరల గాంచినచో నీ చిత్తమున కెట్లు శాంతి గల్గును? అన
వైశ్యుడిట్లనియెను : నరు డెంత చెడ్డవాడైనను తన కుటుంబమును వదలజాలడు: అట్టి కుటుంబము దుఃఖముల పాలయినందున నా మది యెంతయో కుందుచున్నది. నా మదికి నిలుకడ కుదురుటలేదు' అని
రాజిట్లనెను : రాజ్యదుఃఖము నా మనస్సునుగూడ కలత పరచుచునే యున్నది. పరమశాంతుడగు మునిని జేరి శోకనాశమునకు తగిన ¸యషధ మడుగుదము అని వారిర్వురు నిట్లొక నిశ్చయమునకు వచ్చి శోకకారణ మడుగుటకు సవినయముగ మునిని జేరిరి. రాజు మునిని సమీపించి యతనికి ప్రణమిల్లి కూర్చుండి శాంత చిత్తముతో సుఖాసీనుడైన మునితో నీ విధముగ బలికెను:
అధ్యాయము 120 మహామాయకు దేవతలు సైతము మోహితులగుట
అధ్యాయము 120 మహామాయకు దేవతలు సైతము మోహితులగుట
No comments:
Post a Comment