శ్రీకాళికాదేవి చండ ముండులను హతమార్చుట
అట్లు శుంభ నానతి బడసి చండ ముండులు గొప్ప సేనతో రణభూమి కేగిరి. ఆ మహావీరులు దేవహితకారిణియగు దేవిని గాంచి సామ వచనములతో నామె కిట్లనిరి :
బాలా ! శుంభ నిశుంభులు దేవతల మదమడచి విజయగర్వమున నుండుట నీ వెఱుగవా యేమి? నితంబినీ! నీకు దుర్బుద్ధి పుట్టినది. కానిచో నీవు సింహమును కాళిని మాత్రము తోడు తీసికొని శుంభనోడించుట కేల వత్తువు? నీకు మంచిబుద్ధి గఱపు పురుషుడుగాని స్త్రీకాని లేరా? దేవతలు నీ చావు కాంక్షించి నిన్ను రణమునకు పురికొల్పి పంపిరి.
లతాంగీ! నీ బలము పరులబలము బాగుగ నెఱుగుము. పదునెనిమిది భుజములున్నవి కదా యని వట్టిగ గర్వింతు వేల? నీ యీ యాయుధములు భుజములు వట్టి శ్రమ కల్గించునవి మాత్రమే. శుంభుడు సురవిజేత-సమర చతురుడు. అతనిముం దివి యన్నియు వ్యర్థములే. శుంభు డైరావతపు తొండమును ఛేదించెను. గజములను చెండాడెను. దేవాంతకుడు. నీవతని మనోరథ మీడేర్చుము.
విశాలాక్షీ! నా మంచిమాట కొంచెము వినుము. నీకు దుఃఖములు తొలగి సుఖములు గల్గునట్టి హితము చెప్పుచున్నాను. తత్త్వశాస్త్రవిదులు దుఃఖప్రదములగు పనులు వదలుదురు. సుఖకరము లొనరింతురు. సుమధురభాషిణీ! నీవు లలిత చతురపు. శుంభుడు సురల మదమడచి వర్ధిల్లెను. నీవతని బలమును ప్రత్యక్షముగ గనుము. ఇట్టి ప్రత్యక్ష విషయము వదలి యనుమానము నేల నమ్ముదువు? పండితులు సందేహ విషయ కార్యములు నమ్మరు సుమా! శుంభుడు సమరదుర్జయుడు. సురవైరి. కనుక దైత్య పీడితులగు దేవతలు నిన్నతనిపైకి ప్రేరించి పంపిరి.
వారి తీయని మాటలకు నీవు మోసపోతివి. వారు తమ స్వార్థము గోరి నీకు దుఃఖప్రదమగు నుపదేశము చేసిరి. కార్యవశమున గలసిన మిత్రుని నమ్మరాదు. ధర్మకారణమున గలిసిన మిత్రు నాశ్రయింప వలయును. సురలు స్వార్థపరులని నీతో నిజము పలుకుచున్నాను. నీవు కామశాస్త్ర పండితుడు - వీరుడు-చతురుడు-అందగాడు-సురలను భువనములను గెల్చినవాడునగు శుంభుని సేవింపుము.

నీవు శుంభుని శాసనము క్రింద నున్నచో నెల్లలోకముల సంపద లనుభవింపగలవు. కాన శుభకరుడగు శుంభుని పతిగ నిశ్చయించుకొనుము అను చండుని మాటలు విని జగదంబ మేఘ గంభీర వాక్కులతో నతని కిట్లనియెను: ఓరీ పలువా! ఇంక నీ మోసపు మాటలు కట్టిపెట్టుము. వచ్చిన దారి పట్టుము. హరి హరాదులను వదలి శుంభుని పతిగ నెట్లు వరింతును? మూర్ఖా! నాకు పతితో బనిలేదు.
ఒకనిని పతిగ జేసికొను నావశ్యకత నాకంతకంటెను లేదు. ఈ సర్వభూతములకు నేను స్వామినిని. మున్ను పెక్కువేల శుంభ నిశుంభులు నసంఖ్యాకులగు దానవులును నా చేతిలో మడిసిరి. యుగయుగమున దేవతలకు క్లేశములు ప్రాప్తించుట గంటిని. ఇపుడెందఱో దైత్యదానవులు నాశము కానున్నారు. ఇపుడు దానవులకు పోగాలము దాపురించినది. ఇక వారి రక్షణోపాయములు చేయనేల?
నీవు వీరధర్మము గాపాడుటకు యుద్ధమొనర్పుము. నీకిపుడు చావు మూడినది. దీని నెవరు నాపలేరు. మహాత్ముల కీర్తి ప్రతిష్ఠలు రక్షించుట ముఖ్య కర్తవ్యము. నీకు దుష్టులగు శుంభ నిశుంభులతో నేమిపని? వీర మరణ మొంది స్వర్గసుఖములందుము. నీ తక్కిన బందుగులు శుంభ నిశుంభులు నిపుడే నిన్ను వెంటనంటి రాగలరు.
మూఢాత్మా! నేడు సకల దానవత్వమును మంటగలుపుదును. పిమ్మట రక్తబీజుని మదగర్వితులగు శుంభ నిశుంభులను హతమార్తును. మిగిలిన దానవులనెల్ల నంతమొందించి నా స్వస్థానమున కేగగలను. నీకు గుండెబలమున్న నిలుము. లేదా కాలికి బుద్ధిచెప్పుము. పిరికివానివలె పొగరుబోతు మాటలు ప్రేలుటేల? బాగుగ క్రొవ్వుబలిసి యున్నావు. శక్తియున్న నస్త్రము బట్టి నాతో కయ్యమును కాలుదువ్వుము, అని యిట్లు దేవ నాయికచే చండ ముండులు రెచ్చగొట్టబడిరి.

వారు కోప మదగర్వములు ముప్పిరిగొనగ వేగ భీకరముగ నారి సారించిరి. శివశక్తియు నంతట దిక్కులు పిక్కటిల్లగ విజయశంఖము పూరించెను. సింహము సైతము మహాక్రోధముతో గుండెలదర గర్జించెను. ఆ సింహనాదమున కింద్రాది దేవతలు - యక్ష-గంధర్వ-కిన్నర-సిద్ధ-సాధ్యులును పరమ హర్షమున పులకిత హృదయులైరి. అంత పిరికి గుండెలు అదురునట్లుగ చండికా చండుల మధ్య బాణ-ఖడ్గ-గదాదులతో భీకర సమరము జరిగెను. దైత్యనిఘాదిని యగు దేవి మహోగ్రమూర్తియై చండుడు వదలిన బాణములను తన కఱకుటమ్ములతో దునుమాడెను.
ఆమె తిరిగి వానిపై పాముల వంటి బాణములు ప్రయోగించెను. మిడుతల దండు కృషకులకు వెఱపుగొల్పుచు మేఘములను గప్పివేయును. అట్లే వారి బాణ పరంపరలచేత నింగి యంతయును గప్పబడెను. అంతలో ముండుడు సైతము కొంతసేన వెంటగొని యనిలో దుమికి దారుణ కోపముతో బాణము లేసెను. ఆ బాణ పరంపర గనినంతనే యంబికకు పట్టరాని కోపము వచ్చెను. ఆమె ముఖము కోపముచే మేఘమువలె నల్లనయ్యెను. వెంటనే యనటిపూవువలె నెఱ్ఱని నేత్రములు వంపుసొంపులు దిరిగిన కనుబొమలుగల దేవి నెన్నుదుటినుండి మహాద్భుతముగ శ్రీకాళికాదేవి యుద్భవిల్లెను.
ఆ లోక భయంకర - భీషణ యగు కాళి పులితోలు ధరించి గజచర్మ ముత్తరీయముగ దాల్చి పుర్రెలమాలలు మెడలో నలంకరించుకొని యెండిన బావివంటి పొట్టతో మహాఘోరముగ చెన్నొందెను. ఆమె ఖడ్గ-ప్రాస-ఖట్వాంగములు ధరించి మహాకాళరాత్రివలె క్రూరరౌద్రముగ భీకరలీల దనరెను.

ఆ కాళిక తన పెద్ద నోరు తెరచుకొని పొడవైన నాలుకును పల్మారు ఆడించుచు దనుజసేనల నెల్ల సత్వరమే చంపబూనుకొనెను. ఆమె జఘన మతివిశాలముగ నుండెను ఆ భీకరమూర్తి పటురోషముతో పెక్కురు దైత్యులను లీలగ పట్టి నోటబెట్టుకొని పటపటపట పండ్లతో కొఱుకుచుండెను. ఆ మహోగ్రరూప ఘలుఘల్లుమని గంటలుగల గజముల నవలీలగ చేతబట్టుకొని నోట పెట్టుకొనుచుండెను.
ఆ దేవి మావటీండ్రతో నొప్పు నేనుగులను మ్రింగి వికటాట్టహాస మొనరించెను. ఈ విధముగ యుద్ధమందు శ్రీ భద్రకాలి మహాభీకరముగ నొంటెలను గుఱ్ఱములను సారథులను పండ్లతో కఱ కఱ నమలి వేయుచు పొట్టబెట్టకొనుచుండెను. చండ ముండ మహాసురులు అట్లు తమ బలము నశించుటగని యెడతెగని బాణవర్షముతో దేవిని గప్పివేసిరి. అంత చండుడు చండరశ్మితేజము గల్గి చక్రాయుధములను బోలు చక్రమును వేగమే దేవిపై విసిరివేసి పలుమారులు బొబ్బరిల్లెను. కాళికాదేవి వాని పెడబొబ్బలు విని వెల్గులు చిమ్ముచు సుదర్శనమువంటి చక్రము తనపైకి వచ్చుటగాంచి దాన నొక యమ్ముతో తునుకలు చేసివైచెను.
అంతలో చండిక వాడి విశిఖములతో చండుని బాధింపగ వా డా దెబ్బలకు తట్టుకొనలేక నేలపై మూర్ఛిల్లెను. అట్లు తన యన్న పడిపోవుట గనిన ముండుడు దుఃఃంచి కినుకతో కాళికపై ములుకులు ఏసెను. అంతట చండిక యీషికాస్త్రములతో ముండుడు వదలిన దారుణ బాణములను ముక్కలు ముక్కలుగ జేసెను. ఆమె పిదప నర్ధచంద్రాకారము ప్రయోగింపగ దాని ధాటికాగలేక వాని మద మంతయు నుడిగిపోయెను. వాడు తుదకు నేలగూలెను.
అంత దానవ సేవలో హాహాకారములు మిన్నుముట్టెను. నింగిని వెలుగు దేవతలు దిగులుమాని పరమానందమందిరి. అంతలో చండుడు తెప్పరిల్లుకొని పెద్ద గదకొని కాళి కుడిభుజముపై విసరివేసెను. కాళికాదేవి వాని గదాఘాతము వమ్మొనరించి మంత్రించిన బాణపాశమున నా మహాసురుని గట్టివేసెను.

పిదప ముండుడు లేచి తన యన్న బంధింపబడుట గని కవచము ధరించి చేత శక్తి బూని బయలుదేరెను. ఆ వచ్చెడు రెండవ దానవుని గాంచి కాళిక వానిని సైతము వెంటనే బంధించి వేసెను. శ్రీభద్రకాళి చండముండులనట్లు కుందేలు పిల్లలనువలె పట్టుకొని పకపక నవ్వుచు జగదంబ సన్నిధికేగెను' జగదంబికా! రణయాగమునకు రణ దుర్జయులగు దానవ పశువులను గొనితెచ్చితిని. గైకొను'మని ఆమె జగదంబతో పలికెను.
కాళిక తెచ్చిన తోడేళ్ళవంటి దానవులను చూచి జగన్మాత మధుర వచనములతో రణప్రియులారా! వీరిని వదలక వధింపుము. వేగముగ సురల కార్యము నెరవేర్పుము' అని కాళికతో పలికెను. సర్వతంత్రేశ్వరియగు దేవి పలుకులు విని యామెతో మరల రణయాగమున ఖడ్గము యూపస్తంభముగ పేరొందెను. వారినిట చంపుట హింస కానేరదు' అని పలికి శీఘ్రమే ఖడ్గముతో వారి తలలు తెగనఱకెను.
అట్లు శ్రీకాలీదేవి వారిని ఖండించి సంతోషముతో వారి నెత్తురు గ్రోలెను. ఇట్లు చండ ముండులు చచ్చుటగని సర్వలోకేశ్వరి యగు దేవి కాళికకు ఓ భద్రకాళీ! నీవు చండముండులను హతమార్చితివి. దేవకార్యము నెరవేర్చితివి. కాన నీవు భూతలమందు చాముండయను పేర ప్రఖ్యాతి జెందగలవు అని వరము నిచ్చెను.
అధ్యాయము 114 రక్తబీజుడు శ్రీదేవితో పోరవచ్చుట
No comments:
Post a Comment