రక్తబీజుడు శ్రీదేవితో పోరవచ్చుట
అట్లు చండముండులు నిహతులగుటగని తక్కిన సైన్యము శుంభుని చెంతకు పరుగెత్తెను. వారిలో గొందఱి యంగములు - చేతులు బాణములచే తెగెను. మఱి కొందఱి మేనులనుండి నెత్తురు కారుచండగ వారు రోదించు చుండిరి. వారెల్లరును దానవపతిని జేరి రాజా! కాపాడుము. నేడు మహాకాళి మమ్ము భక్షించుచున్నద'ని గొల్లున వాపోయిరి.
మహాకాళిచేత సురభీకర వీరులగు చండ ముండులు సమసిరి, తక్కిన సైన్యము మ్రింగబడెను. మేము కళవళమంది పారివచ్చితిమి. శ్రీకాళిక మూలమున నొంటెలు గజాశ్వములు వీరపదాతులు నేలగూలుటచే రణభూమి బీభత్సముగ నున్నది. ఆ రణస్థలమున నెత్రుటేర్లు పారుచున్నవి. మాంసము బురదగ వెండ్రుకలు నాచుగ విరిగిన రథచక్రములు సుడిగుండములుగ నున్నవి.
తెగిన చేతులు చేపలుగ తలలు తంబీఫలములుగ నుండి పిరికిగుండెలకు వెఱపును వీరులకు సంతోషమును గల్గించుచున్నవి. ప్రభూ! ఇకనైన నీవు పాతాళ##మేగి నీ వంశమును నిలువబెట్టుకొనుము. కానిచో కాళికాదేవి నిస్సంశయముగ మహారౌద్రముతో మనలను నాశ మొనర్పగలదు.
దైత్యపతీ! ఆ పోరాటములో శ్రీ కాళి పెక్కురీతులతో బాణములు ఏసి చంపుచుండగ సింహము సైతము దానవులను పొట్ట బెట్టుకొనుచున్నది. ఐనను నీవు నీ సోదరునితోపాటు వట్టి కోపముతో వ్యర్థముగ చచ్చుటకు పూనుకొనుచున్నావు. ఆమెకొఱకు నీ బందుగులు ప్రాణములు వదలుచున్నారు.
అట్టి యామెను నీవొకవేళ గెల్చినను కులనాశని-క్రూరస్వభావురాలగు ఆమెతో నీకేమి లాభము? లోకమునందు జయాపజయములు దైవాధీనములు. ధీశాలి కొద్ది ప్రయోజనములకు ప్రాణాంతకములైన పనులు చేయగూడదు. లోకమందు విధివశములైన పనులన్నియు విచిత్రములు. ఏలన, నొక్క వీరయువతి చేతిలో రాక్షసులెల్లరు నూచకోతగా మడిసిరిగదా!
నీవు లోకపాలురను గెల్చినమాట నిజమే; ఇప్పుడు నీకు దొడ్డ సేనయు తోడుగ నున్నది. ఐననేమి? ఆ యొక్క వీరమూర్తి నిన్ను పోరుటకు పురికొల్పుచున్న దనుటెంతయు నబ్రముగా నున్నదిగదా! మున్ను నీవు పుణ్యపుష్కర తీర్థమందు తపమొనర్చు నపుడు లోకపితామహుడగు బ్రహ్మ వరమొసగ నేతెంచెను. అతడు నిన్ను వరము కోరుకొమ్మనగ నీవా విధితో నమరత్వ మిమ్మంటివి.

బ్రహ్మ దాని నీయ ననగ నీవు దేవ-దానవ-నాగ-కిన్నర-యక్ష-మనుజులలో నే పురుషుని వలనను చావులేని వరమిమ్మని కోరుకొంటివి. కనుక నిప్పుడీ వీరరసావతార నిన్ను చంపుకోరికతో నేతెంచెను. ఇకనైన దూరమాలోచించుకొని యుద్ధము విరమింపుము. రాజా! ఈ దేవి మహామాయపరాప్రకృతి. కల్పాంతమున సర్వసంహారకారిణి.
ఆమె దివ్య లోకములు సృజియించు సృజనాత్మక శక్తి దేవతలకు ఈశ్వరి, త్రిగుణమయి తామసీ శక్తి, సర్వ శక్తి సమన్విత. ఆమె అజయ్య - అక్షయ -నిత్య - సర్వజ్ఞ - సర్వదాప్రకాశమాన - సకల సురనిలయ - వేదజనని - సంధ్య - గాయత్రి - సర్వసురలకు ఆశ్రయరూప. నిర్గుణ - సగుణ-సిద్ధ-సర్వసిద్ధిప్రద-అవ్యయ-ఆనందరూప- దేవతల కభయానందము లొసగు దేవదేవి-గౌరి-దేవతల కభయప్రద.
రాజా! ఆమె నీ విధముగ నెఱుగుము. పగ పెంచుకోకుము. ఆమె శ్రీపాదరజమునకు ప్రపన్నుడవు గమ్ము. ఆమె నిన్ను బ్రోవగలదు. ఆ తల్లి యానతి తలదాల్చి నీ కులమును కాపాడుకొమ్ము. హతశేషులగు దానవులకు ప్రాణదాన మొనరింపుము'' అను సేనల మేలిమాటలు వినియును శుంభాసురుడు వీరగుణోపేతుడై తన యభిప్రాయము నిట్లని చెప్పసాగెను.
మూఢులారా! మీరు బ్రతు కాసచే పోరినుండి పారివచ్చితిరి. ఇక మీ గొప్పలు కట్టిపెట్టుడు. వెంటనే పాతాళ మేగుడు.
ఈ జగము బ్రహ్మాది సురలు మనుమును దైవాదీనులము. ఇక జయముగూర్చి యింతగ చింతింప నేల? హరి హర బ్రహ్మలును ఇంద్రాగ్ని యమ వరుణులును రవిచంద్రులు నెల్లరును దైవపరాధీనులు గదా? మూఢులారా! కానున్నది కాకమానదు. ఎట్లు కానున్నదోయట్లే యత్నము జరుగును. దీనికింత చింతింప నేల? అని యిట్లు తెలిసిన పండితులు శోకింపరు.

ఆత్మవంతులగు జ్ఞానులకు మరణభయము లేదు. వారు స్వధర్మము విడువరు. ఎల్ల ప్రాణులకు సుఖదుఃఖములు - బ్రతుకుదెఱువు - ఆయువు - దైవనిర్ణీతములై కాలానుసారముగ గల్గుచుండును. ఇంద్రుడును హరిహరబ్రహ్మలును తమ తమ కాలములు దీరినచో తప్పక కాలగర్భమున గలియుదురు. అట్లే నేను సైతము కాలబద్ధుడను గదా.
ఇపుడు నా స్వధర్మము నెఱవేర్చుచు జయమో లేక నాశమో పొందగలను. నే డీ యబలచే రణమునకు పురికొల్పబడితిని. ఇపుడు వెన్ను చూపి నే నెట్లు వందలయేండ్లు మనగలను? తప్పక సమర మొనర్తును. చావో గెలుపో దేనినైనను గ్రహింతురు. ఏదెట్లు గానున్నదో జరుగుగాక! ప్రయత్నశీలురగు పండితులు దైవమును మిథ్యయని పల్కుదురు.
వారి మాటలు యుక్తియుక్తములు. వాని సార మెఱిగినవారు నిజ మెఱిగినవారు. ప్రయత్నము చేయనిచో కోరిక లెన్నడును సఫలములు గావు. పిరికిగుండెలవారే యేది కానున్నదో యదే జరుగునని వాదింతురు. మూఢులగు పండితులు దైవమే బలవత్తరమైనదని తలంతురు. అదృష్టము కలదు లేదని యనుట కేదియును ప్రమాణము లేదు. అదృశ్య మెట్లు దృశ్యమగును? అదృష్ట మెచ్చటనైన గనుపించు వస్తువని మూర్ఖులు బెదరింతురు. ఇట్లనుకొనుట వలన దుఃఖితులగు మూఢులకు చిత్తము శాంతించును. కుక వారి కిది యాధారము.
విసరురాయి (తిరుగలి) గలదు. విసరవలసిన వస్తువును గలదు. కాని, మనుజయత్నము లేనిచో పిండి రాదు. అట్లే ప్రయత్నము చేసినచో కార్యము తప్పక ఫలించును. యత్నము లోపించినచో కార్యము ఫలింపనేరదు. తన బలము - పరబలము- దేశకాలములు ఎఱిగి చేసినపని తప్పక నెరవేరునని మున్ను బృహస్పతి వచించెను అని యిట్లు శుంభుడు పలికి మహాసురుడగు రక్తబీజునకు గొప్ప సేన నిచ్చి రణమున కంపుచిట్లనియెను :

మహాబాహూ! రక్తబీజా! నీవు సంగ్రామమునకేగి నీ బలము కొలది యుద్ధ మొనర్పుము అన రక్తబీజు డిట్లనెను : మహారాజా! ఈ కొద్దిదాని కింత చింతింప నేల ? నే నామెను చంపగలను. లేనిచో నీకు వశ్యురాలినిగ జేయగలను. నేడు నా యుద్ధ కౌశల్యము చూతువు గాక!
ఆ దేవప్రియ యగు నబల నాముం దెంతటిది? నేను పోరిలో నా బలముతో నామెను గెల్చి తెచ్చి నీ పాదాలముందు పడవేతును అని రక్తబీజ మహాసురుడు పల్కి తన బలముతో పోర తరలెను.
అతడు చతురంగ బలముతోగూడి రథ మెక్కి పర్వతము పైనున్న జగదంబతో పోరుటకు నగరము వెడలెను. వచ్చుచున్న దానవునిగని పరాదేవి సురల కానందము - నసురలకు భీతి గల్గించు శంఖనినాద మొనరించెను. రక్తబీజుడు దేవి భీకర శంఖధ్వని వినెను. అతడు చాముండాదేవిని సమీపించి యామెతో మెత్తని పల్కులతో నిట్లనెను :
బాలా! నన్ను ధూమ్రలోచనునివలె పరికివానిగ భావించి శంఖరవముతో భయపెట్టుచున్నావా? పికభాషిణీ! నన్ను రక్తబీజు డందురు. నేను నిర్భయముగ నీ చెంతకు వచ్చితిని. నీవు రణము చేయదలచినచో ఆయత్తవు గమ్ము. కాంతా! నేడు నా బలము చూతువు గాక! నీ వింతకుముందు గాంచిన భీరులవంటివాడను గాను నేను. నీ యిచ్చవచ్చినట్లు నాతో బోరుము.
రమణీమణీ! నీవు పూర్వము పెద్దలను సేవించినచో నీతిశాస్త్రము వినినచో అర్థశాస్త్రము చదివినచో పండిత గోష్ఠులు జరిపినచో సాహిత్య రసము తంత్ర విజ్ఞానము నెఱిగినచో నా మాట వినుము. నేను సప్రమాణముగ నిక్కముగ చక్కగ బల్కుచున్నాను.

పండితులు సభలందు నవరసములలో రెండు రసములు ముఖ్యము లందురు. అందొకటి శృంగార రసము. రెండవది శాంతరసము. ఆ రెంటిలోను శృంగారము రసరాజమని ప్రసిద్ధిగాంచినది. ఎడబాటెఱుగక విష్ణువు లక్ష్మితో - బ్రహ్మ సావిత్రితో - శివుడు పార్వతితో - నింద్రుడు శచితో గూడియుందురు. చెట్టు తీవియతో - మృగము మృగితో -కపోతము కపోతితో కలిసిమెలిసి యుండును. ఇట్లు ప్రాణులెల్లను శృంగారసమందు మునిగి తేలుచుండును.
తీయని భోగసంపదలకు నోచుకోని వారు దైవవంచితులై-మూర్ఖులై-తుదకు సంన్యాసులగుదురు. వారికి సంసార సుఖము తెలియదు. వంచకుల తీపిమాటలకు మోసపోదురు. అట్టివారికి శాంతరసము రుచించును. కామాగ్ని ప్రజ్వరిల్లగ జ్ఞాన వైరాగ్యములకు తావెక్కడిది? నిత్యకల్యాణీ! కామక్రోధలోభమోహములు మదిని చెడగొట్టును. అవి చెడ్డవి.
కనుక నీవు సురవిజేత యగు శుంభునిగాని నిశుంభునిగాని కాంతునిగ వరింపుము. వారు మహాబలులు అని పల్కి రక్తబీజుడు విరమించెను. ఆ మాటలన్ని విని జగదంబికయు కాళియగు చాముండయు తమలో తాము నవ్వుకొనిరి.
No comments:
Post a Comment