శ్రీకృష్ణుడు పుత్రప్రాప్తికి తపమొనరించుట
జనమేజయు డిట్లనియెను : ఓ మునివరేణ్యా! శ్రీకృష్ణ భగవానుడు వైష్ణవాంశ సంజాతుడు గదా! ఆతనికిని దుఃఖము గల్గుట యనునది నాకు సందియము గొల్పుచున్నది. వాసుదేవుడు నారాయణాంశ సంభూతుడు - మహావిక్రముడు. అంతటి కృష్ణుని కుమారుడు పురిటింట నెటుల నపమరింపబడెను?
ద్వారకానగరము మనోహరమైనది. సురక్షితమైనది. దాని నడుమ సూతికాగృహ మతి రహస్యముగ గలదు. అసురు డందు ప్రవేశించి శిశువు నెటుల నపహరింపగలిగెను? సత్యవతీ తనయా! శ్రీవాసుదేవున కీ విషయము తెలియదనుట విచిత్రముగను నద్భుతముగను నున్నది. బ్రాహ్మణవర్యా! మాధవుడుండగనే యతనికి తెలియని రీతిగా పురిటింటినుండి శిశువె ట్లపహరింపబడెనో దాని కారణము తెల్పుము అన
వ్యాసు డిట్లనెను : రాజా! లోకమున శాంభవీవిద్య యొకటి గలదు. అదెంత వారినైనా మోహములో ముంచును. అది నరుల బుద్ధులను మోహింపచేయును. ఆ మాయ చాల బలవత్తరమైనది. మానవజన్మ మెత్తిన జీవులకు మానవ గుణములే కలుగును గాని దేవాసురభావములు గలుగవు. ఆకలిదప్పులు -నిద్ర-తంద్ర-భయము-శోకమోహ-సంశయములు-హర్షము-దేహాభిమానము-జరామరణములు-అజ్ఞానము-అప్రియము-గ్లాని-ఈసు-అసూయ-మదము-శ్రమము-మున్నగున వన్నియును దేహమున గల్గు భావములు.
ఇవి దేహులకు గల్గుచుండును. గుణధాముడగు శ్రీరాముడు తనముందేయున్న బంగారు జింకనుగని సీతాపహరణము జటాయుమరణము జరుగుననికాని-యెరుగ కుండెను. పట్టాభిరాముడు తన పట్టాభిషేకమునాడే తన వనగమనమును పుత్రశోకము కారణముగ తన తండ్రి మరణము నెంతమాత్రము తెలిసికొనలేకుండెను. సీత రావణునిచేత బలిమితో నపహరింపబడెను.
అపుడు రాముడొక యజ్ఞానివలె వనము వనము తిరుగుచు సీతను వెదకుచు నేమియు గ్రహింపకుండెను. రఘురాముడు వాలిని వధించెను. వానరుల సాయముతో సాగరముపై వంతెన గట్టెను. సముద్రము దాటెను. సీతారాముడు తన సీతను వెదకుటకు కపివరుల నెల్లదెసల కంపెను. ఆ కోదండరాముడు ఘోర సంగర మొనరించి రణమున దుఃఖములు పొందెను.
మహావిక్రముడగు రాఘవుడు నాగపాశమున బద్ధుడై పిదప గరుడుని వలన విముక్తి జెందెను. భండన భీముడగు రాముడు మహాబలులగు రావణకుంభకర్ణులను మేఘనాదనికుంభులను నుగ్రుడై సంహరించెను. శ్యామలకోమలాంగుడగు రాముడు జానకి నిర్దోషత్వ మెఱుగలేక యామెను పవిత్రురాలిగ నిరూపించుట కామె నగ్నిలో ప్రవేశింపజేసెను.
మహావిక్రముడగు రాఘవుడు నాగపాశమున బద్ధుడై పిదప గరుడుని వలన విముక్తి జెందెను. భండన భీముడగు రాముడు మహాబలులగు రావణకుంభకర్ణులను మేఘనాదనికుంభులను నుగ్రుడై సంహరించెను. శ్యామలకోమలాంగుడగు రాముడు జానకి నిర్దోషత్వ మెఱుగలేక యామెను పవిత్రురాలిగ నిరూపించుట కామె నగ్నిలో ప్రవేశింపజేసెను.
అందు సీత పావని నిర్దోషురాలని తేలినది. పిదప మరల నామె దూషితురాలను లోకాపవాదము బయలుదేరెను. రాముడా భయమున జానకిని మరల కాననముల కంపెను. ఆమెకు వనములందు లవకుశులు జన్మించిరి. రాముడు వారిని తన సుతులని యెఱుగకుండెను. వాల్మీకి ముని చెప్పిన మీదట వారు తన పుత్త్రులని రాము డెఱుగగల్గెను. మఱి సీత పాతాళము జొచ్చుటయు రాము డెఱుగడు.
ఒకప్పుడు రామభద్రుడు కోపావేశమున తన తమ్ముని చంప నుంకించెను. ఖరాంతకుడైన రాముడు తన్ను కాల పురుషుడు సమీపించుటయును తెలిసికొనలేకపోయెను. ఈ విధముగ శ్రీరామచంద్రుడు మనుజ శరీరము దాల్చి మానవ కృత్యము లొనరించెను. రామునకు వలెనే శ్రీకృష్ణు నందును మానవ భావములు గలవనుటలో నెట్టి సందియమును లేదు. తొల్లి కృష్ణుడు కంస భీతిచే గొల్లపల్లె కేగెను. కృష్ణుడు జరాసంధుని భయమున ద్వారక జొచ్చెను.
కృష్ణుని రుక్మిణీహరణము పూర్తిగ ధర్మరహితమైనదే. శిశుపాలుడు తొలుత రుక్మిణిని మనసార వరించెను. హరికి సనాతన ధర్మము తెలియును. ఐన నత డట్లేల రుక్మిణిని హరించెను. తన కుమారుని శంబరుడు హరింపగ కృష్ణుడు బోరుబోరున విలపించెను. అపుడు శ్రీదేవి దయవలన హరి తన పుత్త్రుని సమాచార మెఱిగి సంతసించెను.
ఇట్లు కృష్ణునంతటి వాడును హర్ష శోకములనుభవించెను. అటుపిమ్మట సత్యభామ యానతి మేరకు కృష్ణుడు స్వర్గమున కేగెను. అచట నతడింద్రునితో పారిజాతము కొఱకు పోరు సల్పెను. దీనిబట్టి కృష్ణుడు స్త్రీ పరతంత్రుడని తేటతెల్లమగుచున్నది. కృష్ణుడింద్రు నోడించి పారిజాతము హరించి తెచ్చెను. ఇదంతయు ఆ చిత్రవిచిత్ర చరిత్రుడైన ప్రభువు మానినీ మాన సంరక్షణ కొనరించెను.
ఒకప్పుడు సత్యభామ తన పతి నొక చెట్టునకు గట్టి నారదునకు దానమొసంగెను. ఆమె తనపతి యెత్తు బంగారము తూచి యిచ్చి తన పతిని విడిపించుకొనెను. ప్రద్యుమ్నుడు మున్నగు తనయులను రుక్మిణి కనెను. వారు సుగుణవంతులు.
తనకు నట్టి సంతతి గలిగించుమని జాంబవతి దీనయై కృష్ణుని గోరెను. అంత కృష్ణుడు పుత్త్రార్థము తపమొనర్ప నొక పర్వతమున కేగెను. అచట శివభక్తుడగు నుపమన్యువు గలడు. కృష్ణు డతనియెడ కరిగి యతనిని తన గురునిగ భావించి పరమ దీక్షతో నియమ నిష్ఠలతో పాశుపత మంత్రము జపించెను.
తనకు నట్టి సంతతి గలిగించుమని జాంబవతి దీనయై కృష్ణుని గోరెను. అంత కృష్ణుడు పుత్త్రార్థము తపమొనర్ప నొక పర్వతమున కేగెను. అచట శివభక్తుడగు నుపమన్యువు గలడు. కృష్ణు డతనియెడ కరిగి యతనిని తన గురునిగ భావించి పరమ దీక్షతో నియమ నిష్ఠలతో పాశుపత మంత్రము జపించెను.
అపుడు కృష్ణుడు త్రిదండియై ముండియై యుగ్రతప మాచరించెను. అతడొక నెల ఫలములు మాత్రము తిని యుండెను. రెండవ నెలలో నీరుగ్రోలుచు శివధ్యాన పరాయణుడై సదాశివ మంత్రము జపించుచు నొంటికాలిపై నుండెను. మూడవ నెలలో వాయు భక్షణముతో బొటన వ్రేలిపై నిలిచి తప మొనర్చుచుండెను.
ఆరవ నెలలో సోముడు కరుణా సముద్రుడునగు రుద్రుడతని భక్తికి ప్రసన్నుడయ్యెను. నెలపూదాలుపగు పశుపతి శివుడు కృష్ణునకు దర్శనభాగ్య మొసగె. వృషభవాహనుడై యింద్రాది దేవతలతో గూడి బ్రహ్మ-విష్ణువు-యక్ష గంధర్వులు తన్ను సేవింపగ నేగుదెంచి వాసుదేవుని సంభావించి యిట్లు పలికెను :
"ఓ యదునందనా ! కృష్ణా! నీ యుగ్రతపమునకు సంతుష్టి నందితిని. నీ కామితములు దెలుపుము. తీర్పగలను. నేను పూర్ణకాముడను. నా దర్శన భాగ్యమున నా భక్తుని కోర్కులు పూర్తికాక మిగులవు. శంకరుడు తనపట్ల ప్రసన్నుడైనందులకు కృష్ణుడు ముదమందె. భక్తిమీర శివుని పాదపద్మములు పట్టి దండ ప్రణామము లాచరించెను.
సనాతనుడగు హరి శింభుని సమ్ముఖమున నిలుచుండి మేఘగంభీర వాక్కులతో హరు నీ విధముగ సంస్తుతించెను:
'దేవ దేవా జగన్నాథా! సర్వభూతార్తి నాశన! నీల కంధరా! మహాదేవా! శూలీ! సురపతీ! నీ కివే నమస్సులు. గిరిజారమణా! యాగ విధ్వంసకా! సువ్రత! నీకు నా మనస్సు. నీ దివ్య దర్శనముచే ధన్యుడనైతిని. కృతకృత్యుడనైతిని.
'దేవ దేవా జగన్నాథా! సర్వభూతార్తి నాశన! నీల కంధరా! మహాదేవా! శూలీ! సురపతీ! నీ కివే నమస్సులు. గిరిజారమణా! యాగ విధ్వంసకా! సువ్రత! నీకు నా మనస్సు. నీ దివ్య దర్శనముచే ధన్యుడనైతిని. కృతకృత్యుడనైతిని.
జగద్గురూ! నీ పదపద్మములకు మ్రొక్కుటచే నా బ్రతుకు సార్థకమైనది. ఈ సంసారమునందు కామినీ మోహపాశములకు బద్ధుడనైతిని. దుఃఖనాశకా! రుద్రా! ముక్కంటీ! నిన్ను శరణు వేడుచున్నాను. ఈ నరజన్మము పడసి నేను మిక్కిలి దుఃఖముల పాలైతిని. భవా! మదనాంతకా! నేను భవభీతుడను. నీకు శరణాగతుడను. నన్ను బ్రోవుము.
గర్భవాసమపుడు నేను మిక్కిలి దుఃఖమందితిని. నేను పుట్టిన నాటినుండి కంసుభయమున గోకులమున నుంటిని. అచట గొల్లవారి కోరిక ప్రకారము నందగోపాలకుడ నైతిని. నా తల వెండ్రుకలు గోధూళి ధూసరితములై యొప్పుచుండగ నేను ప్రాకృతిక శోభల తనరు బృందావమున గ్రుమ్మరితిని. వ్లచ్ఛుడగు కాలయవనునకు జడిసి ద్వారక కేగితిని.
విభూ! మధురానగరము దుర్లభమైనది. శుభప్రదమైనది. అది నా అభిజనము. అట్టి మాతృభూమిని యయాతి శాపబద్ధుడనై వదలిపెట్టితిని. మధురా రాజ్యము సిరిసంపదలకు నెలవైనది. నేను దానిని ధర్మరక్షణకు వదలి యుగ్రసేనున కొసంగి అతనికి దాస్య మొనర్చితిని.
పూర్వజులగు యాదవు లతనినే రాజు నొనర్చిరి. శంభూ! గార్హస్థ్యము దుఃఖకరము - ధర్మమును చెఱచునది. స్త్రీ ప్రాధాన్యము గలది. సంసారము పరతంత్రమైనది. ఇట్టి దుస్తర సంసారబంధము నుండి తరించుటతి దుర్లభము.
మదనాంతకా! నా భార్య జాంబవతి! ఆమె రుక్మిణీ తనయులను గాంచి తనకు నట్టి సుపుత్రులు వలయునని తప మొనర్ప నన్ను ప్రేరించినది. నేనిపుడు పుత్రార్థమయి సకామముగ తపమొనరించితిని.
మహాదేవా! శంకరా! జగద్గురూ! నిన్ను పుత్త్రునిమ్మని గోరుటకు నాకు సిగ్గగుచున్నది. నీవు భక్తుల యిలవేల్పవు. ముక్తిప్రదుడవు, దేవేశ్వరుడవు. సుప్రసన్నుడవు. నిన్ను మనసార నారాధించితిని. నశ్వరమగు తుచ్ఛఫలమును మూఢు డాశించును. ఇపుడు నేను నట్టి మాయా మూఢాత్ముడనైతిని.
కామినీ ప్రేరితుడ నైతిని. నీవు ముక్తిదాయకుడవు. శంభుడవు. జగత్పతివి. అట్టి నీ దర్శనము కాగా నేను పుత్త్ర సుఖము గోరుచున్నాను. సంసారము నశ్వరము. క్షణికము. దుఃఖమూలము. సారములేని ఈ సంసారము దుఃఖదాయకమని తెలిసియును దానిని వదలి పెట్టజాలకున్నాను.
కామినీ ప్రేరితుడ నైతిని. నీవు ముక్తిదాయకుడవు. శంభుడవు. జగత్పతివి. అట్టి నీ దర్శనము కాగా నేను పుత్త్ర సుఖము గోరుచున్నాను. సంసారము నశ్వరము. క్షణికము. దుఃఖమూలము. సారములేని ఈ సంసారము దుఃఖదాయకమని తెలిసియును దానిని వదలి పెట్టజాలకున్నాను.
నారాయణాంశజుడనయ్యు భూమిపై నవతరించితిని. మోహ మాయాపాశములకు బద్ధుడనైతిని. పెక్కు దుఃఖము లనుభవించుటకు జన్మమెత్తితిని. ఇట్లు గోవిందుడు పలుకగా మహేశ్వరుడు కృష్ణుని కిట్లు పలికెను :
"శత్రునిషూదనా! నీకు పెక్కురు పుత్రులు గలుగుదురు గాక! నీకు పదారువేల మంది స్త్రీలుందురు. ప్రతి యొక్కతెకు పదిమంది చొప్పున మహాబలశాలురు జన్మింపగలరు అని ప్రియదర్శనుడగు శంకరుడు పలికి ముగించెను.
అంత మధుసూదనుడు గిరిజాదేవికి మ్రొక్కెను.
ఈశ్వరి కృష్ణున కిట్లనెను : 'కృష్ణా! మహాబాహు! నరాధిపా! నీవీ ప్రపంచమందు వాసిగాంతువు. నీవు గృహస్థ శ్రేష్ఠుడవగుదువు. నూఱండ్లు పిదప నీకు విప్రశాపము తగులును. గాంధారీ శాపమున నీ కులక్షయమగును. నీ సుతులు శాపవశమున తమలోదాము పోరి చత్తురు.
పిమ్మట యాదవు లెల్లరు నశింతురు. బలరాముడు నీవును తనువులు చాలించి దివి కేగుదురు కాన భవితవ్యమునకు వగవ వలదు. జరుగవలసిన దానికి ప్రతీకారము సాధ్యమే కాదు. ఈ నా వాక్కులకు శోకింపకుము.
మధుసూదనా! నీ కష్టావక్రుని శాపము తగులును. దాని మూలమున నీవు దేహము చాలించిన పిదప నా భార్యలు దొంగలచేత నపహరింపబడుదురు అని గిరిజ పలికెను.
పిదప పార్వతి పరమేశ్వరులు దేవతలను గూడి యంతర్ధాన మొందిరి. అంత కృష్ణుడుపమన్యునకు నమస్కరించి ద్వారక కరిగెను.
కావున బ్రహ్మాదులగు నధీశ్వరులును మాయకు వశులగుదురు. వారును మాయా కల్లోలమున కొట్టుమిట్టాడుదురు. ఎల్లరును కొయ్యబొమ్మలవలె మాయాశక్తికి వశులగుదురు. ఎవరెవరి పూర్వజన్మ కర్మము లెట్లుండునో వారివారినట్లు చిద్రూపిణియగు మాయాశక్తి ప్రేరించును.
త్రిభునేశ్వరికి జీవుల యెడల నిర్దయత గాని వైషమ్యము గాని లేదు. ఆ తల్లి జీవుల ముక్తికి ప్రయత్నించును. ఆ త్రిభునేశ్వరీదేవి యీ చరా చర బ్రహ్మాండములను విశ్వ చైతన్య జ్యోతియై సృజింపనిచో నీ జగము జడమాత్రమైయుండెడిదే.
త్రిభునేశ్వరికి జీవుల యెడల నిర్దయత గాని వైషమ్యము గాని లేదు. ఆ తల్లి జీవుల ముక్తికి ప్రయత్నించును. ఆ త్రిభునేశ్వరీదేవి యీ చరా చర బ్రహ్మాండములను విశ్వ చైతన్య జ్యోతియై సృజింపనిచో నీ జగము జడమాత్రమైయుండెడిదే.
ప్రాణులకు జీవనాధారము చిచ్ఛక్తియగు జనని ఆమె. ఆమె కనికరముతో జగజ్జీవులను సృజించి వారి వారి కర్మానుసారము ప్రవర్తింపజేయును. బ్రహ్మాదులు సైతము మాయామోహితులు - మాయా పరతంత్రులు. వివిధ శక్తులు గల మాయకు పరతంత్రులనుటలో నెట్టి సందియమును లేదు.
విశ్వమాత-దేవదేవేశ్వరి-సర్వస్వతంత్రురాలు. స్వేచ్ఛా విహారిణి. కనుక నా మహేశ్వరి నెల్ల విధములు భజింపవలయును. ఈ ముజ్జగములందా లోకమాతను మించినదేదియును లేదు. పరాశక్తి పదకమల చింతనము వలన జన్మము తరించును. చరితార్థమగును.
ఎవరి కాదేవత కులదేవత కాదో యతని కులమున నెన్నడును నాకు జన్మము గలుగకుండుగాత! నేనే పరబ్రహ్మమను. నేనే శ్రీదేవిని. నేనే శోకరహితుడను. ఇతరముగాదు అను నభేదభావమున తన్మయత్వమున నిత్యము జగన్మాతను సంస్మరింపవలయును.
అచింత్య లక్షణములుగల మాతను వేదాంత శ్రవణముల వలన సద్గురు ముఖమున నెరుగవలయును. ఆ సన్మాత్రయగు చిన్మాత్ర పరమాత్మ స్వరూపిణి. ఆమె నేకాగ్ర చిత్తముతో భావింపవలయును.
అపుడు జీవుడిక్కడనే ముక్తిజెందును. అంతేకాని. కర్మకోటులవలన గూడకైవల్యముక్తి లభింపదు. శ్వేతాశ్వతరాది ఋషులు నిర్మల చిత్తముతో నాత్మానంద స్వరూపిణి నెరింగి భవబంధ ముక్తులయిరి.
బ్రహ్మ-విష్ణువు-గౌరి-లక్ష్మి మున్నగు దేవతలా సచ్చిదానంద స్వరూపిణిని నిత్యయుక్తులై సముపాసింతురు.
రాజా! ఈ ప్రకారముగ నీవడిగిన వన్నియును వివరించి చెప్పితిని. ఇంకేమి వినగోరుదువు?
ఓ రాజా! ఇట్లు పుణ్యప్రదము పాపహరము అత్యద్భుతమునగు శ్రీమద్దేవీ పురాణమును నీకు తెలిపితిని. ఈ దేవీ పురాణము వేదసమ్మితము. దీని నాత్యంతిక భక్తితో వినువాడు సర్వ పాపముక్తుడై శ్రీ దేవీ లోకమందు మహిమాన్వితుడగును.
ఈ ప్రకారముగ పంచమ పురాణమగు దేవీ భాగవతమును నేను పూర్వము వ్యాసమహర్షి వలన వింటిని.
No comments:
Post a Comment