ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లా శ్రీశైలంలో కొలువైన శ్రీ భ్రమరాంబికా దేవి ఆలయం, నల్లమల కొండల మధ్య ఉంది. అత్యంత శక్తివంతమైన 18 మహాశక్తి పీఠాలలో 6వదిగా, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన మల్లికార్జున స్వామి దేవిగా పూజింపబడుతుంది.
సతీదేవి కంఠభాగం పడిన ప్రదేశంగా నమ్మే ఈ క్షేత్రంలో అమ్మవారు అష్టభుజాలతో మహిషాసురమర్దినిగా దర్శనమిస్తారు.ఇది శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ సముదాయంలో భాగం. ఈ ఆలయం శక్తి పీఠాల (18 మహా శక్తి పీఠాలలో ఒకటి) మరియు జ్యోతిర్లింగం (12 జ్యోతిర్లింగాలలో ఒకటి) ఉన్న ఒక పవిత్ర క్షేత్రం.
శక్తి పీఠం:
భ్రమరాంబికా దేవి ఆలయం 18 మహా శక్తి పీఠాలలో ఒకటైన పార్వతి దేవి (సతీ దేవి) ఆలయం.
ఈ ఆలయం శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం సముదాయంలో ఉంది, ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి.
చరిత్ర:
స్కంద పురాణంలోని శ్రీశైల ఖండం ప్రకారం భ్రమరాంబ దేవి, పార్వతీ దేవి దివ్య మూల రూపం. ఒకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు గాయత్రీ దేవిని ఉపాసన చేసాడు. అతను ఆ ఉపాసనలో అమరత్వాన్ని కోరుకుంటాడు, గాయత్రీ దేవి అటువంటి కోరికను తాను తీర్చలేనని, బ్రహ్మదేవుడు మాత్రమే దానిని చేయగలడని చెప్పింది.
ఆ సలహా తీసుకున్న అరుణాసురుడు 'ఓం బ్రహ్మదేవాయ నమః' అంటూ బ్రహ్మదేవుడిని గూర్చి తీవ్రమైన తపస్సు చేశాడు. అతని తపోజ్వాలలు అన్ని లోకాలకు చేరాయి.
కష్టాల్లో ఉన్న దేవతలు బ్రహ్మదేవుడిని చెంతకు చేరి, అరుణాసురుడు కోరిక చాలా త్రీవమైనకోరిక అనీ, దీనికి ఏదైనా చేయమని బ్రహ్మదేవుడుని ప్రార్థించారు.
తదుపరి బ్రహ్మదేవుడు అరుణాసురుని ముందు ప్రత్యక్షమై అతని కోరిక తెలుపని అనగా. అప్పుడు అరుణాసురుడు అమరత్వం కావాలని కోరాడు. అరుణాసురుని కోరిక విన్న బ్రహ్మ దేవుడు అలాంటి కోరిక విశ్వ నియమాలకు విరుద్ధమని, దానికి బదులుగా వేరే ఏదైనా కోరికను కోరామని తెలుపగా అంత అరుణాసురుడు లోతుగా ఆలోచించి రెండు కాళ్ల లేదా నాలుగు కాళ్ల జీవుల వల్ల తాను మరణాన్ని పొందకుండునట్లు వరం ప్రసాదించమని కోరతాడు.
దేవతలు మరియు మునుల కోరిక మేరకు దుర్గా దేవి, రాక్షసుడిని చంపటానికి అతను పొందిన వరానికి అనుగుణంగా ఆరు కాళ్ల భ్రమరి (భ్రమరాంబిక) రూపాన్ని తీసుకుని తననుండి వేల భ్రమరాలను సృష్టించి వాటిని అరుణాసురుడు రాక్షసుడుపైకి వదిలింది. భ్రమరాల దాడికి అరుణాసురుడు మరణిస్తాడు. ఆ తర్వాత అమ్మవారు శ్రీశైలంలో భ్రమరాంబిక రూపంలో వెనుదిరిగింది.
భ్రమరాంబికా దేవి వృత్తాంతం
సతీదేవి అతి ముఖ్యమైన పీఠమైన శ్రీశైలంలో మహాదేవి స్వయంగా భ్రమరాంబిక దేవిగా కొలువై ఉంటుంది. శ్రీశైలఖండంలోని 23వ అధ్యాయం శ్రీ భ్రమరాంబిక దేవి ప్రాముఖ్యత, చరిత్రను వివరిస్తుంది. భ్రమరాంబిక కథను శివుడు స్వయంగా పార్వతీదేవికి చెపుతాడు. పార్వతీ నీ మహిమవలన అష్టాదశ శక్తి పీఠాలన్నీ ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.
అయితే శరీర భాగాలన్నింటిలో గొంతు ఎంత ముఖ్యమో, అష్టాదశ శక్తి పీఠాలన్నింటిలో శ్రీశైలానికి అంత ప్రాధాన్యత ఉంది.
దేవీ శ్రీశైలంలో నీ భౌతిక రూపం ఉంది. ఈ మహాపీఠంలో, శ్రీశైలంలో నా పక్కనే, భ్రమరాంబికగా దేవతలందరూ నిన్ను సేవిస్తున్నారు. ఆ విధంగా భ్రమరాంబికా దేవి రూపంలో మూడు లోకాలను అనేక రకాలుగా కాపాడుతూ ఉన్నావు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంది.
వరాలను ఇచ్చే దేవతలలో శ్రీ భ్రమరాంబిక దేవి లాంటి వారు ఎవరూ లేరు. వేదాల తల్లి అని పిలవబడేది ఆమె మాత్రమే అయినప్పటికీ, ప్రపంచాన్ని రక్షించడానికి ఆమె చాలా అవతారాలను స్వీకరించింది.
భ్రమరాంబిక దేవి ఆశీర్వాదం వల్ల దీర్ఘాయువు, విజయం, ఆరోగ్యం, శ్రేయస్సు, శుభాలు, అదృష్టం, ఆనందాన్ని భక్తులకు లభిస్తాయి.
ఈ తల్లి అనారోగ్యాలను, అకాల మరణాలను దరి చేరనివ్వదు. అంతేకాక భయాందోళనలను, శత్రువులను దరి చేరనివ్వదు. భక్తులకు సకల వరప్రదాయిని. ఆకర్షణ శక్తిని, అపారమైన జ్ఞానాన్ని అందిస్తుంది.
ఆలయం: ఆలయంలో భ్రమరాంబ దేవి విగ్రహం ఎనిమిది చేతులతో మరియు పట్టు చీర ధరించి ఉంటుంది. ఆలయానికి పడమర దిక్కున నివసిస్తుంది.
క్షేత్రపాలకులు: క్షేత్రపాలకుడిగా భ్రమరాంభికా దేవి ఆలయం సమీపంలో శ్రీ బయలు వీరభద్ర స్వామి కొలువై ఉన్నారు.
క్షేత్రపాలకులు: క్షేత్రపాలకుడిగా భ్రమరాంభికా దేవి ఆలయం సమీపంలో శ్రీ బయలు వీరభద్ర స్వామి కొలువై ఉన్నారు.
ప్రాముఖ్యత: శ్రీశైలం జ్యోతిర్లింగం మరియు శక్తి పీఠం రెండింటినీ ఒకేచోట కలిగిన ఏకైక ఆలయం.
శ్రీశైలంలో భ్రమరాంబికా దేవిని పూజించడం ద్వారా అన్ని దివ్య శక్తులను పూజించినంత పుణ్యం లభిస్తుంది
దర్శన సమయాలు: భ్రమరాంబ దేవి ఆలయంలో దర్శన సమయాలు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. ఇది వారంలోని అన్ని రోజులూ తెరిచి ఉంటుంది. భక్తులు సంవత్సరం పొడవునా ఈ ఆలయాన్ని సందర్శించినప్పటికీ, పండుగల సమయంలో దర్శించడం మరింత ఉత్తమం. ఆ సమయంలో భక్తుల సందడి, ఉత్సాహం మరింత పెరిగి ఆలయం కళకళలాడుతుంది. ముఖ్యంగా నవరాత్రి మరియు వార్షిక కుంభోత్సవం ఘనంగా జరుగుతుంది.
శ్రీశైలంలో భ్రమరాంబికా దేవిని పూజించడం ద్వారా అన్ని దివ్య శక్తులను పూజించినంత పుణ్యం లభిస్తుంది
దర్శన సమయాలు: భ్రమరాంబ దేవి ఆలయంలో దర్శన సమయాలు ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. ఇది వారంలోని అన్ని రోజులూ తెరిచి ఉంటుంది. భక్తులు సంవత్సరం పొడవునా ఈ ఆలయాన్ని సందర్శించినప్పటికీ, పండుగల సమయంలో దర్శించడం మరింత ఉత్తమం. ఆ సమయంలో భక్తుల సందడి, ఉత్సాహం మరింత పెరిగి ఆలయం కళకళలాడుతుంది. ముఖ్యంగా నవరాత్రి మరియు వార్షిక కుంభోత్సవం ఘనంగా జరుగుతుంది.
వస్త్రధారణ నియమాలు: సాంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి.
సమీప ప్రదేశాలు: కృష్ణానది, పాతాళగంగ, సాక్షి గణపతి ఆలయం, శివాజీ స్మారక కేంద్రం.
మన దేవాలయాలు చారిత్రక నగరాలూ
అష్టాదశ శక్తిపీఠ స్తోత్రం
అష్టోతరశత (108) శక్తిపీఠ స్తోత్రం
నిత్య స్తోత్రావళి
నిత్య పారాయణ శ్లోకాలు
స్తోత్రాలు
పంచాంగం
No comments:
Post a Comment