Sunday, May 24, 2026

Saturday - శనివారం

శనివారం

శనివారం రోజున హనుమంతుడిని భక్తితో కొలిస్తే, శని దేవుని ఆగ్రహం చల్లారి, జాతకంలోని ఏల్నాటి శని దోషాలు తొలగిపోతాయి.

ఈ పవిత్రమైన రోజున గుడిలో లేదా ఇంట్లో కనీసం 3 సార్లు హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మానసిక భయాలు, ఒత్తిడి పూర్తిగా దూరం అవుతాయి.

ఆంజనేయ స్వామికి నువ్వుల నూనెతో (లేదా ఆవనూనెతో) దీపం వెలిగించి, సింధూర బొట్టు పెట్టడం వల్ల అనుకున్న కార్యాలన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి.

హనుమంతునికి అత్యంత ప్రీతికరమైన తమలపాకుల మాల లేదా సింధూర మాల సమర్పించడం వల్ల ఆయురారోగ్యాలు, లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తాయి.

హనుమంతుని ప్రసన్నం చేసుకోవాలనుకునే వారు శనివారం నాడు ఇష్టమైన పరిమళాన్ని, చందనాన్ని హనుమంతునికి సమర్పిస్తే హనుమంతుడు సంతోషిస్తారని చెబుతున్నారు.

శనివారం రోజున ఆంజనేయస్వామి వారికీ ఎవరైతే సుందరకాండను పఠనం చేస్తారో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, సమస్యల నుండి ఉపశమనం లభిస్తుందని చెబుతారు.

No comments:

Post a Comment