నారాయణమహర్షీ! సరస్వతీదేవి గంగాశాపంవల్ల భారతదేశంలో నదిగా అవతరించింది అన్నావు. వారిద్దరికీ కలహమేమిటి? ఎలా వచ్చింది? తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. వేదసారాలైన కథల్ని వినడం ఎవరికైనా కుతూహలాన్ని కలిగిస్తుందిగదా! కథామృతాస్వాదన ఎంత చేసినా నాకు తృప్తి కలగడం లేదు. ఇక చాలు అనిపించడం లేదు. శ్రేయస్సులవిషయంలో ఎవరైనా అసలు తృప్తిచెందుతారా! అది అంతే. ఆ శాపవృత్తాంతం తెలియజెయ్యి - అని అభ్యర్థించాడు. నారాయణుడూ సరే అని ఆరంభించాడు.
బ్రహ్మకుమారా! అతిపురాతనమూ అత్యంత పుణ్యప్రదమూ గంగా సరస్వతీ కలహగాథను వివరిస్తున్నాను. శ్రద్ధగా ఆలకించు. లక్ష్మి - సరస్వతి - గంగ ఈ ముగ్గురూ శ్రీమహావిష్ణువుకి ఇల్లాండ్రు. ముగ్గురినీ సమానంగా ఆతడు చూసుకుంటున్నాడు. ముగ్గురూ సమానంగా అతడిని ప్రేమించి సేవిస్తున్నారు.
ఒకరోజున చల్లబాటువేళ గంగాదేవి విష్ణుమూర్తి ముఖంలోకి పదేపదే ఒయ్యారంగా సాకూతంగా క్రీగంటిచూపులు విసురుతోంది. ప్రభువు గమనించాడు. స్పందించాడు. తానూ చూపులు కలిపాడు.
వీరిద్దరి వ్యవహారాన్నీ లక్ష్మీ సరస్వతులు గమనించారు. లక్ష్మీదేవి మనకెందుకులే అని ఓరిమితో మిన్నకుంది. సరస్వతి అలా ఉండలేకపోయింది. అదేదో అవమానమని గుంజుకుంది. సత్త్వస్వరూపిణి లక్ష్మీదేవి చిరునవ్వులు చిందిస్తూ ఓదార్చింది. ఓరిమి వహించమని సర్ది చెప్పింది. అయినా సరస్వతి వినలేదు. ఊరుకోలేదు. కళ్లూ ముఖమూ ఎర్రబడ్డాయి. పెదవులు వొణికాయి. కోపంతో ఊగిపోయింది. నోరు చేసుకుంది.
మగడు ధర్మాత్ముడూ ఉత్తమోత్తముడూ అయితే భార్యలందరి పట్లా సమతాబుద్ది ఉంటుంది. ఖలుడిది అంతా పక్షపాతబుద్ది. తెలిసిందిలే. నాథా! నీకు గంగాదేవిపట్ల సౌభాగ్యం అధికం. లక్ష్మీదేవి అన్నా నీకు ప్రేమ అధికమే. నేనంటేనే అలుసు. నీకు బొత్తిగా పనికిరానిదాన్ని నేనే. అందుకే లక్ష్మీదేవికి నీపట్ల విపరీతమైన ఓరిమి. ఎన్ని నాటకాలాడినా నువ్వు తనవాడివేనని ఆవిడ ధీమా. అందుకే నన్ను ఊరుకో ఊరుకో అని ఓదారుస్తోంది. ఎందుకులే ఈ ఓదార్పులూ అవసరం లేదు, నీ అవమానాలూ అవసరంలేదు. నా దౌర్భాగ్యం ఇలా ఉంటే ఎవరిని అని ఏమి ప్రయోజనం! అనురాగంలో భర్తృవంచిత జీవితం నిష్ఫలం. నిన్ను అందరూ సత్త్వస్వరూపుడవని కీర్తిస్తుంటారు. వాళ్ళు ఎంత మూర్ఖులు! ఎంత అజ్ఞానులు! వాళ్ళకి శ్రుతీ తెలియదు, నీ మతీ తెలియదు - అంటూ దులిపేసింది.
ఇప్పుడు ఏమి మాట్లాడినా విపరీతార్థాలు వస్తాయనీ సరస్వతి మరింతగా రెచ్చిపోతుందని భావించిన శ్రీమన్నారాయణుడు మౌనంగా అక్కడినుంచి నిష్క్రమించాడు. అతడు వెళ్ళగా చూసి మరింత నిర్భయంగా సరస్వతీదేవి విజృంభించింది. కర్ణకఠోరంగా మాట్లాడింది.
సిగ్గులేనిదానా! కామం కళ్ళకెక్కినదానా! మాకన్నా ఎక్కువగా భర్తను లాంగదీసుకున్నానని గర్వపడుతున్నట్టున్నావ్! విర్రవీగుతున్నట్టున్నావ్! అధిక సౌభాగ్యవతిని నేను అని పెద్ద ప్రదర్శన చేస్తున్నావా? నీ గర్వాన్ని అణుస్తాను. నీ మగడు చూస్తుండగానే కొమ్ములు విరుస్తాను. ఏం చేస్తాడో చూస్తాను.
ఇలా నోరుపారేసుకుంటూ గబగబావచ్చి గంగాదేవిని జుట్టు పట్టుకోబోయింది. లక్ష్మీదేవి మధ్యలో నిలబడి గట్టిగా మందలించి వారించింది. సరస్వతికి అప్పుడు లక్ష్మీదేవిమీదకూడా కోపంవచ్చింది.
లక్ష్మీ! ఇది దారుణం. కళ్ళ ఎదుట విపరీతం జరుగుతూంటే నోరుమెదపకపోగా నన్ను వారిస్తున్నావా! ఒక చెట్టులాగా ఒక నదిలాగా అడ్డునిలుస్తున్నావా? సరే - ఒక చెట్టువీ ఒక నదివీ అయిపో, ఇది నా శాపం - అనేసింది.
లక్ష్మీదేవికి కోపమూ దుఃఖమూ పొంగివచ్చాయి. అయినా నిభాయించుకుంది. ప్రతి శాపం ఇవ్వలేదు. తన చేతిలో ఉన్న సరస్వతి చెయ్యిని వదలనైనా వదలలేదు. మృదువుగా నొక్కుతూ ఆలాగే నిలబడింది.
ఎరుపెక్కిన కన్నులతో వొణుకుతున్న పెదవులతో దుఃఖిస్తూ నిలబడిన లక్ష్మీదేవి గంగాదేవి కన్నులకి మహోన్నతంగా కనపడింది. పద్మా! సరస్వతిని వారించకు. విడిచిపెట్టు, రానీ. ఎమి చేస్తుందో చూద్దాం. చెయ్యని. పరమదుఃశ్శీల, అందరిమీదా నోరుపారేసుకోవడం ఆవిడ నైజం. వాగధిష్ఠాత్రికదా! ఆవిడ ఇష్టం. ఎది పడితే అది ఎలా పడితే అలా మాట్లాడగలదు, కనక మాట్లాడుతుంది. కలహప్రియ. వాదవివాదాలు లేనిదే రోజు గడవదు. ఎవరికి తెలియదు ఈవిడ సంగతి! యోగ్యత ఉన్నమేరకు శక్తి ఉన్న మేరకు వాదులాడనీ . తనబలాన్నీ నా బలాన్నీకూడా లోకానికి తెలియజెబుదామనుకుంటోందేమో, అలాగే చెయ్యని. మా ఇద్దరి ప్రభావాన్నీ ప్రతాపాన్నీ లోకం తెలుసుకుంటుంది. తెలుసుకోనీ. మంచిదే - అంటూ గంభీరంగా మాట్లాడుతున్న గంగాదేవి హఠాత్తుగా కోపావిష్టురాలై సరస్వతిని శపించింది.
సరస్వతీ! లక్ష్మీదేవిని శపించావు కనక నువ్వు నదీరూపం పొంది భూలోకంలో పాపాత్ములమధ్యన ప్రవహించు. వారి అందరి పాపాలూ కలియుగంలో నువ్వే గ్రహించు - అనేసింది. సరస్వతికి ఇది అగ్నిలో ఆజ్యం పోసినట్టయ్యింది. వెంటనే తడుముకోకుండా ప్రతిశాపం ఇచ్చింది - నువ్వే భూలోకానికి పోతావ్. నదిగా ప్రవహిస్తావ్. పాపాలు గ్రహిస్తావ్! పాపాత్మురాలా! - అనేసింది.
అంతలోకీ చతుర్భుజ నారాయణుడు మరో నలుగురు చతుర్భుజ పార్షదులతో లోపలికోచ్చాడు. వస్తూనే సరస్వతిని చేతుల్లోకి తీసుకున్నాడు. గుండెలకు హత్తుకున్నాడు. మెల్లగా పురాతనజ్ఞానాన్ని ఉపదేశించాడు. కలహానికీ శాపానికీగల రహస్య కారణాన్ని వివరించాడు.
లక్ష్మీ! నువ్వు భూలోకంలో ధర్మధ్వజుడి గృహంలో కళాంశరూపంతో అయోనిజగా ఆవతరించు. అతడికి కూతురుగా ఉండు. అక్కడే నీకు దైవదోషంవల్ల వృక్షత్వం ప్రాప్తిస్తుంది. నా అంశతో అవతరించే శంఖచూడుడు అనే అసురుడికి భార్యవై అటుపైని కొంత కాలానికి మళ్ళీ నన్ను చేరుకుందువుగాని. అలాగే తులసి పేరుతో పరమపావనమూర్తివై మరొక కళాంశరూపాన భారతదేశంలో అవతరించు. హే గంగే! నువ్వు సరస్వతి శాపం కారణంగా భారతదేశంలో నదిగా అవతరించు. అది నీ అంశావతారం. పాపాత్ములను పవిత్రీకరించు. భగీరథుడు తపస్సు చేసి నిన్ను తనవెంట తీసుకువెడతాడు. అప్పటినుంచి భాగీరథి అనే పేరుతో విఖ్యాతి వహిస్తావు. నా అంశమైన సముద్రుడికి భార్యవవుతావు. అలాగే నా అంశతో అవతరించే శంతనుడికీ ఇల్లాలివవుతావు.
సరస్వతీ! గంగాశాపం వల్ల నువ్వుకూడా కళాంశగా భారతభూమిలో నదిగా అవతరించు. సవతులతో కలహాలను అనుభవించు. సత్యలోకంలో బ్రహ్మకు ఇల్లాలివై ఆనందించు.
గంగా! నువ్వు ఈ వైకుంఠంలో పద్మగానూ, శివస్థానమైన కైలాసంలో గంగగానూ కీర్తింప బడతావు. క్రోధరహితవై శాంత సత్త్వస్వరూపిణివై మహాసాధ్వివై ధర్మచారిణివై సుశీలవై పరమపావనివై అందరి ప్రశంసలూ అందుకుంటావు. పూజలు అందుకుంటావు. మీరు ముగ్గురూ ఇలాగే ప్రతి విశ్వంలోనూ ప్రతి కల్పంలోనూ కీర్తింపబడతారు. స్తుతింపబడతారు. పూజింపబడతారు. మీరు
మంగళప్రదలు. పనిలో పనిగా లోకంలో అందరికీ పనికివచ్చే ఒక ఉపదేశం చేస్తున్నాను, మీరు ఆలకించండి -
ఏ ఇంటిలో ఇల్లాలు మగరాయుడిలా ప్రవర్తిన్తుందో ఆ ఇంటిలో అన్నీ ఆశుభాలే. ఆ పురుషుడి జన్మ నిష్ఫలం. జగడాలమారి భార్యతో కాపురం చేసేకన్నా అడవులకు పోవడం ఉత్తమం. కడుపునిండా తినడానికీ తాగడానికీ పళ్ళూ నీళ్ళూ దొరుకుతాయి. మనశ్శాంతిగా బతకవచ్చు. గయ్యాళి భార్యతో వేగడంకన్నా నిప్పుల్లో దూకడం నయం. పులులూ సింహాలమధ్య బతకడం తేలిక. వ్యాధిజ్వాల కన్నా విషజ్వాలకన్నా దుష్టస్త్రీల ముఖజ్వాల మరణాంతకం. ఆ పురుషుడి బతుకు నవ్వులపాలవుతుంది. ఇహపరాలకు చెడతాడు. జీవన్మృతుడికింద లెక్క. ఒక పురుషుడికి ఒక ఇల్లాలు ఉండటం ఉత్తమోత్తమం.
ఆవిడ గుణవతి శీలవతి అయితే చాలు ఆ పురుషుడి జన్మ ధన్యమైనట్టె. అంతటి సుఖి ఉండడు. బహుభార్యలు ఉండటం ఎంతటివాడికైనా నరకమే. అది ధర్మవిరుద్దమూ వేదవిరుద్దము కూడా. అందులోనూ సవతులు ఒకేచోట ఉండటం మరింత నరకం. నేనే ఉదాహరణ. అందుచేత గంగా! నువ్వు శివస్థానానికి వెళ్ళు. సరస్వతీ! నువ్వు బ్రహ్మస్థానానికి వెళ్ళు. లక్ష్మీదేవి ఒక్కతే ఇక్కడ ఉంటుంది. అందరికీ సుఖంగా ఉండేందుకు ఈ ఏర్పాటు చేస్తున్నాను.
శ్రీహరి మాటలు విని ముగ్గురూ పశ్చాత్తాపంతో కుమిలిపోయారు. ఒకరినొకరు కౌగిలించుకుని విలపించారు. శాపాలూ భూలోకనివాసమూ నదీరూపాలూ తలుచుకుని గజగజలాడిపోయారు. క్రమంగా తేరుకుని జగన్నాథుణ్డి బతిమిలాడుకున్నారు. ముందుగా సరస్వతీదేవి నోరు విప్పింది.
నాథా! నాకు శాపవిమోచనం అనుగహించు. నిన్ను విడిచిపెట్టి నేను వెళ్ళలేను. నీలాంటి ఊన్నతులే శాపాన్ని మళ్ళించడానికి సమర్ధులు. నువ్వు కాదంటే నిప్పుల్లో దూకి ప్రాణాలు వదులుతాను - ఆంది.
వెంటనే గంగాదేవి ఆందుకుంది. జగన్నాథా! నేను ఏమి తప్పు చేశానని నన్ను వదిలిపెడు తున్నావు? నేనూ ప్రాణత్యాగం చేస్తాను. నిర్దోషను సంహరించిన పాపం కట్టుకుందువుగాని. ఏ తప్పూ చెయ్యని ఇల్లాలిని వెళ్ళగొట్టిన పురుషుడు సర్వేశ్వరుడైనా సరే నరకానికి పోతాడు.
ఆటుపైని లక్ష్మీదేవి ప్రసంగించింది. హృదయేశ్వరా! నువ్వు సత్త్వస్వరూపుడివి. నీకు కోపమా? చాలా ఆశ్చర్యంగా ఉందే ! దయచేసి ప్రనన్నుడివికా. ఈ ఇద్దరిపట్లా దయచూపించు. చాలు. మంచి మగడికి ఓర్పేకదా గొప్పగుణం.
భారతీశాపంవల్లా నీ నిర్ణయంవల్లానేను భారతదేశంలో అవతరించబోతున్నాను. సరే. అవతరిస్తాను. అయితే ఎంతకాలం ఉండాలి అక్కడ నేను. మళ్ళీ నీ సన్నిధిని నేను ఎప్పటికి నోచుకుంటాను. నదీరూపం ధరించానంటే మహాపావులు అందరూ వచ్చి మునకలు వేస్తుంటారు. వారి పాపమంతా నాకు చుట్టుకుంటుంది. మరి ఆ మహాపాపాలనుంచి నాకు విముక్తి ఎలాగ? నీ సన్నిధికి తిరిగి చేరుకోవడమెలాగ? అలాగే ధర్మధ్వజుడి ఇంట కూతురిగా తులసీరూపాన్సి ధరించమన్నావు. ధరిస్తాను, ఆ జన్మనూ అనుభవిస్తాను. అచ్యుతా! మళ్ళీ నీ పాదపద్మాల చెంతకు చేరుకునేదెప్పుడు?
ప్రభూ! నువ్వు అధిష్టానదేవతగా తులసీ వృక్షరూపాన్ని ధరిస్తాను. ఎప్పుడు నన్ను ఉద్ధరిస్తావో దయచేసి ఆ ఒక్కముక్కా చెప్పు. నువ్వు కృపానిధివి. కనక నాకూ గంగా సరస్వతులకూ శాపవిమోచనం ఎప్పుడో నీ సన్నిధికి తిరిగి రావడం ఎప్పుడో చెప్పి మమ్మల్ని అనుగ్రహించు. సరస్వతిని బ్రహ్మ పదనానికీ గంగను శివమందిరానికీ పొమ్మన్నావు. ఈ ఒక్కమాటనూ ఉపసంహరించుకో - అంటూ లక్ష్మీదేవి శ్రీహరి పాదాలమోద పడి ఓలుఓలున విలపించింది. తన జడతో పాదాలను చుట్టి పట్టుకుంది.
భక్తానుగ్రహకాతరుడైన అచ్యుతుడు ప్రసన్నుడయ్యాడు. మందహాససుందరవదనారవిందుడై లక్ష్మీదేవిని బుజాలుపట్టి పైకి ఎత్తి గుచ్చి కౌగిలించుకున్నాడు. మృదువుగా బదులు పలికాడు.
సురేశ్వరీ! నా హృదయేశ్వరీ! నీ అభ్యర్థనను మన్నిస్తున్నాను. నా మాటకూ నీ కోరికకూ ఒక సమత కూరుస్తున్నాను. సరస్వతీదేవి కేవలం కళాంశరూపంతో భారతదేశాన నదిగా అవతరిస్తుంది. ఆర్థభాగంతో బ్రహ్మ సదనంలో నివసిస్తుంది. స్వయంగా ఇక్కడే మన ఇంటిలోనే ఉంటుంది. ఆలాగే గంగాదేవి భగీరథుడివెంట కళాంశరూపంతో నదిగా భారతదేశానికి వెడుతుంది. ముల్లోకాలనూ పవిత్రీకరించడానికి స్వయంగా తానూ ఇక్కడే ఉంటుంది. భూలోకానికి వెళ్ళే దారిలోనే కైలాసంలో అన్యదుర్లభమైన శివుడి జటాజూటాన్ని ఆలంకరిస్తుంది. నువ్వుకూడా ఇలాగే కళాంశాంశరూపంలో పద్మావతీనదిగా తులసీవృక్షంగా భారతభూభాగంలో అవతరిస్తావు. కలియుగంలో అయిదువేల సంవత్సరాలు గడిచాక మీరు ముగ్గురూ తిరిగి పరిపూర్ణ రూపాలతో నా ఈ వైకుంఠానికి చేరుకుంటారు. చింతించకండి. సంపదలు వచ్చినప్పుడే ఆపదలూ వస్తాయి. నిజానికి సంపదలకు ఆపదలే హేతువులు. ఆపదలు వచ్చినప్పుడే కదా.ఎవరి మహిమ అయినా బయటపడేది.
అంచేత మీ మహిమలు లోకానికి తెలియడంకోసమే ఈ ఆపదలు వచ్చాయనుకోండ్షి, నారాయణ మంత్రోపాసకులైన సజ్జనుల దర్శన స్పర్శన స్నానావగాహనలతో మీరు పాపవిముక్తలు అవుతారు. ఎందరు పాపాత్ములు మీలో స్నానాలు చేసినా ఒక సజ్జనుడు స్నానమాడితే చాలు ఆ కిల్బిషాలన్నీ పటాపంచలయిపోతాయి. మీ పవిత్రత మీకు మిగులుతుంది. నా భక్తుల దర్శన స్పర్శనాలతో మీరే కాదు భూలోకంలో ఉన్న అసంఖ్యాక నదీతీర్థాలన్నీ పరిపూతాలు అవుతున్నాయి.
ఆసలు నా భక్తులు భారతదేశంలో సంచరించేదే ఇందుకోసం. భూమినీ నదులనూ పవిత్రీక రించడానికే. వారు ఎక్కడ కాళ్ళు కడిగితే అక్కడ అదొక మహాతీర్థమవుతుంది. పంచమహాపాతకాలు చేసినవాడైనా సరే (స్తీ హత్య - గో హత్య - బ్రాహ్మణ హత్య - కృతఘ్నత - గురుపత్నీ సంభోగం - ఇవి పంచమహాపాతకాలు) నా భక్తులను దర్శించినా స్పృశించినా పవిత్రుడై జీవన్ముక్తుడవుతాడు. మిగతా పాపులను గురించి చెప్పాలా! అందుచేత లక్ష్మీదేవీ! నదీరూపాలు ధరిస్తున్నామనీ పాపాత్ములు వచ్చి మునుగుతారని భయపడకండి. నా భక్తుల దర్శన స్పర్శనాలు మిమ్మల్ని పావనం చేస్తాయి - అని శ్రీహరి ఊరడించాడు.
ఈ మాటలకు లక్ష్మీదేవి కలతదేరింది. అయితే నాథా! హరిభక్తుల లక్షణాలూ గుణగణాలూ చెప్పు. ఎవరు నిజమైన హరిభక్తులో ఎవరు కాదో గుర్తించడం మాకూ ప్రజలకూ సులువవుతుంది - అని అడిగింది. శ్రీహరి ఆరంభించాడు.
లక్ష్మీ! హరిభక్తుల లక్షణం ఆతి నిగూఢమైనది. వేధపురాణాలలో నిక్షిప్తమై ఉంది. అది తెలునుకోవడమే పుణ్యప్రదం. మీకు చెబుతాను. విని మనస్సులో దాచుకోండి. ఖలులకు చెప్పకండి. నువ్వు నాకు ప్రాణతుల్యవు. పవిత్రురాలివి. కనక చెబుతున్నాను విను. గురువు ముఖంనుంచి విష్ణుమంత్రం చెవిలో పడగానే మానవుడు పవిత్రుడవుతున్నాడు, సర్వోత్తముడు అవుతున్నాడు అని వేదాలు చెబుతున్నాయి. అటువంటి పురుషుడి వంశంలో నూరు తరాలు తక్షణం విముక్తి పొందుతాయి. ఏ రూపంలో పుట్టినవారైనా పరిపూతులు అవుతారు. నా భక్తుడు నా గుణాలను పొంది కడపటికి ముక్తుడవుతాడు. నా గుణాలను ఉపాసిస్తూ నా కథలను ఆలకిస్తూ విన్నంతమాత్రాననే పులకితగాత్రుడై ఆనందపరవశుడై బాష్పవారి పరిపూర్ణలోచనుడై గద్గదకంఠుడై మైమరిచిపోతాడు. నా భక్తుడు నన్ను సేవించడంకన్నా సుఖాన్నిగానీ ముక్తినిగానీ సాలోక్యాది చతుష్టయాన్నిగానీ బ్రహ్మత్వామరత్వాలనుగాని ఏమో కోరుకోడు. ఇంద్రత్వ బ్రహ్మత్వ మనుత్వాలూ స్వర్గరాజ్యాలూ అతడికి తృణపాయాలు. నన్ను సేవించడమే కోరుకుంటాడు తప్ప వీటిని కలలోకూడా వాంఛించడు. ఇటువంటి నా భక్తులు భారతదేశంలో సంచరిస్తున్నారు. శ్రావ్యంగా నా గుణగణాలను గానంచేస్తూ ఆనందంగా జీవయాత్ర సాగిస్తున్నారు. మెట్టిన ప్రతిచోటునీ పావనంచేస్తూ మహీమండలాన్ని ఒక తీర్థంగా నా ఆలయంగా మారుస్తున్నారు.

నారదా! శ్రీహరి ఇలా వివరించి చెప్పేసరికి గంగా లక్ష్మీ సరస్వతులు కుదుటపడ్డారు. ముందుగా భారతీదేవి కళాంశరూపంతో భూభాగానికి వచ్చింది. నదిగా అవతరించి నేలలో ఇంకిపోయింది. వాపీకూపతటాకాలన్నింటా తన అంశంతో ప్రకాశించింది. అందుకనే సరస్వతి (సరస్సు) అయ్యింది. శ్రీహరి సరస్వతుడు అయ్యాడు. మరొక కళాంశరూపంతో సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడికి ప్రియురాలు అయ్యింది. బ్రాహ్మి అనే పేరు పొందింది. వాగధిష్ఠానదేవతయై వాణిగా కీర్తింపబడింది. స్వయంగా తాను విష్ణుసన్నిధిలోనే మిగిలింది.
అటుపైని భగీరథుని వెంట గంగానది కళాంశరూపంతో భారతభూమికి అవతరించింది. అలా అవతరిస్తున్న సమయంలోనే ఆ వేగాన్ని భరించలేనని భూదేవి ప్రార్థిస్తే శివుడు తన జటాభారాన్ని విస్తరించి బంధించాడు, శిరసా ధరించాడు. పాయగా విడిచిపెట్టాడు. ఇలా గంగాకళాంశకు శివస్థానం అభించింది. న్వయంగా తానూ విష్ణు సన్నిధిలోనే మిగిలింది.
లక్ష్మీదేవి (పద్మ) ఒక కళాంశరూపంతో పద్మావతీనదిగా భారత భూమికి దిగింది. స్వయంగా హరిసన్నిధిలోనే నిలిచింది. మరొక కళాంశరూపంతో ధర్మధ్వజుడి కూతురుగా జన్మించింది. తులసీ నామధేయంతో విఖ్యాతి వహించింది. మొదట సరస్వతి శాపంవల్లా తరవాత హరిశాపంవల్లా వృక్షరూపాన్ని పొందింది. కలియుగంలో అయిదువేల సంవత్సరాలు ఇలా వీరు ముగ్గురూ ఈ నదీరూపాలతో ఉండి తిరిగి విష్ణులోకానికి వెళ్ళిపోతారు. కాశీ బృందావనాలు తప్ప తక్కిన సకల తీర్జాలూ పుణ్యక్తేత్రాలూ వారితోపాటు వైకుంఠానికి వెళ్ళిపోతాయి. ఇది హరి ఆజ్ఞ.
No comments:
Post a Comment