నారాయణు డిట్లనెను: ఓ నారదమునీ! దేవతలు నిర్ణయించిన ప్రకారము నీ మొత్తము భూమండలము వైశాల్యమును ద్వీప-దేశ-భేదములతో తెల్పుదును. వినుము. మిక్కిలి విపులముగ గాక సంక్షేపముగ జెప్పగలను. మొదటిది జంబూద్వీపము. దాని ప్రమాణము లక్ష యోజనములు. ఆది కమలమందలి మొగ్గవలె విశాలముగ గుండ్రముగ గలదు.
అందు తొమ్మిదివేల యోజనములతో తొమ్మది దేశములు గలవు. అది తొమ్మదివేల యోజనముల వెడల్పుగల యెనిమిది పర్వతములతో పొడవుగ చుట్టుకొనబడియున్నది. రెండు దేశములు దక్షిణోత్తరములందు ధనురాకారముగనున్నవి. మఱి నాలుగు పొడవుగ నున్నవి. వీని మధ్య 'ఇలావృతము' గలదు. ఇలావృతము నడిబొడ్డువలె నడుమను గలదు.
దీనియందు లక్ష యోజనముల యొత్తుగల సువర్ణ పర్వతము గలదు. ఈ భూగోళము కమలములోని మొగ్గవలె నున్నది. దీనిపై భాగము ముప్పదిరెండు వేల యోజనములు గలిగియున్నది. ఈ పర్వతమునకు క్రింది భాగము పదునారు వేల యోజనములవఱకు వ్యాపించినది. ఇలావృతమునకు నుత్తరమున నీలశ్వేతగిరులు పెద్ద శిఖరములతో నొప్పుచున్నవి. ఈ మూడు గిరులు తమ అవధులలో తాముండును. ఈ పర్వతములు రమ్యక-హిరణ్మయ దేశములందును. మూడవదగు కురువర్షమునందు తూర్పు నుండి క్షారసముద్రము వఱకును పొడవుగ వ్యాపించియున్నవి.
ఇవి తూర్పునుండి యుత్తరమువఱకు రెండువేల యోజనముల పోడవున గలవు. ఇవి తూర్పు నుండి యుత్తరమునకు దశాంశభాగము కన్న నెక్కువగ వ్యాపించియున్నవి. ఈ పర్వతముల నుండి యెన్నియో పెద్ద నదీనదము పుట్టుచున్నవి. ఇలా వృతమునకు దక్షిణమున హేమకూటము-నిషదము- హిమాలయము-నను మూడు గిరులు తూర్పుదెసకు చక్కగ వ్యాపించయున్నవి.
కనుక బంగారము దేవనిర్మితమై జాంబూనదమన బరగును. స్త్రీలకు బంగారుమపై సాహజముగ మక్కువ యెక్కువ గదా. వారు కిరీటము మొలనూలు చేతి కడయములు మున్నగునవి బంగారముతో చేయించుకొందరు. ఇంక సుపార్శ్వగిరిపై పెద్దకదంబవృక్షములు గలవు. ఈ గిరిశిఖరముల నుండి యైదు సెలయేళ్లు వెల్వడును. అవి సుపార్శ్వ శిఖరములనుండి భూమిపై పడును. ఈ యైదు మధుధార లిలావృతమునకు పడమటగ ప్రవహించును. ఆ మధుధార లనుభవించు దేవతల ముఖములనుండి సువాసనలు గ్రహించి గాలు లల్లెడల నూఱు యోజనము లందాక వ్యాపించును. అచ్చటి దేవి ధారేశ్వరి నా బరగి భక్తుల కోర్కులు దీర్చును. దేవి-దేవపూజ్య-మహోత్సాహ-కాలరూప-మహానన-కర్మఫలద-కాంతార గ్రహణేశ్వరి-కరాలదేహ- కాలాంగి- కామకోటి ప్రవర్తిని-యను పేళ్లతో నచటి దేవి నిత్యపూజ లందుకొనును.
ఆచోట భగవానుడు భవుడు (శివుడు) సర్వభూతహితముగోరి ధ్యానయోగముతో తన మూర్తిని తామసీ తురీయ ప్రకృతి నాశ్రయించియుండును. అతడేకాగ్రచిత్తముతో నా ప్రకృతిని ధ్యానించుచుండును.

ఈ గిరులు పదివేల యోజనముల యెత్తున తనరారుచున్నవి. ఈ మూడు పర్వతములును హరివర్షము-కింపురుషము-భారతవర్షము- నను మూడు దేశముల కెల్లలుగ నొప్పుచున్నవి.
ఇలా వృతమునకు పడమట మాల్య వంతమును తూర్పున దంధమాదనము నను గిరులు రెండలరుచున్నవి. ఇవి నీల- నిషధగిరులవరకు రెండువేల యోజనముల మేరకు వ్యాపించియున్నవి. మఱి కేతుమాల భద్రాశ్వదేశములందు మందరము మేరు మందరము సుపార్శ్వము కుముధము నను పర్వతములు గలవు.
ఇవి మేరు పాదములని ప్రసిద్ధగాంచినవి. ఆయుత యోజనముల ప్రమాణముననివి మేరువునకు నలుదెసల వ్యాపించియున్నవి. ఇవి మేరుగిరి నడ్డగించుచు దానికి నలువైపుల నొప్పుచున్నవి. ఈ గీరులపూ మామాడి-జామ-కడిమి-మఱ్ఱి-యను నాల్గువిధముల చెట్లుండును. ఇవి పదునొంకడు వందల యోజనముల యెత్తున గిరికి టెక్కెములవలె చక్కదనముతో నున్నవి.
అ గిరిపై నంతియే సంఖ్యగల పెద్దచెట్లు గలవు. ఈ గిరులపై పాలు -పెరుగు- చెఱకు- నీటి సరస్సులు గలవు. వానిని తాకినంతనే దేవతలు యోగైశ్వర్యములు పొందుదురు. అందు స్త్రీలకు సుఖసంతోషములు గల్గించునట్టి నాల్గు దేవోద్యానములు గలవు. ఈ యుద్యానవనములకు నందనము -చైత్రరథము-వైభ్రాజము-సర్వభద్రకమును పేర్లు గలవు.

అందమరులు దేవాంగనలంగూడి యుందురు. వారు దేవగణములకు తన గొప్పలు చెప్పుకొనుచు కోరిక తీరికలెత్తయథేచ్చగస్వైరవిహారము చేతురు. ఆ మందరగిరిపై పదునొకండు వందల యోజనముల యెత్తున మామిడిచెట్లు గలవు. వానినుండి ఫలములమృతరసభరితములై క్రిందపడుచుండును. గిరిశిఖరమంత ప్రమాణము గల్గి తీయతీయగ మెత్తగ నున్న మామిడిపండ్ల నుండి మధురరసము జారును.
ఈ రస మెఱ్ఱగ నుంట నట ''నరుణోద'' యనుబడు మంచి నది ప్రహించుచున్నది. ఆది దేవదానవులచేత పూజింపబడును. ఓ రాజా! అచ్చోట ''అరుణాఖ్య''యను దేవి పాపహారిణియైయెల్ల కోర్కెలు దీర్చుచుండును. పూజలందుకొనుచుండును. అట్టి పాపాలను బాపి యభయ మొసగు తల్లికి పెక్కుకానుకలు బలులు నిత్తురు. అమె దయగల తల్లియగుటవలననే ప్రజలు క్షేమారోగ్యము లందుదురు.
అమె ''అదిమాయ-అనంత-అతుల-పుష్టి-ఈశ్వరమాలిని- కాంతిదాయిని-దుష్టవినాశకారిణి- యని ధరపై ప్రసిద్దివహించినది. ఈ దేవిని పూజించుటచే నామె దయా ప్రభావము వల్ల జంబూనది ప్రవహించుచుండును.
శ్రీ నారాయణు డిట్లనెను: ఓ నారదా ! నేను తెల్పిన ''అరుణోదానది'' మందరాద్రినుండి వెల్వడి తూర్పు నిలావృతము జేరుచున్నది. యక్ష-గంధర్వుల భార్యలు భవానీదేవి చెలికత్తెలు. వారా నదీని సేవించుటవలన వారి దేహముల నుండి తీయని నెత్తావులు వెల్వడును. ఈ తావులు నేలపై పది యోజనముల దూరము వ్యాపించును. ఆచట నువ్వెత్తగు చోటి నుండి నేరేడుపండ్లు పడును. అవి యేనుగుగంత లావుండును. ఆ పండ్ల రసాము జంబూనదిగ ప్రవహించుచున్నది.
అదిమేరు గిరినుండి వెడలుచున్నది. జంబునది యిలావృతమునకు దక్షిణముగ ప్రవహించుచున్నది. జంబూఫలరసమాస్వాదించుట వలన నచటి దేవిని ''జంబ్వాదిని'' యందురు. ఆ దేవి యచ్చోట నివంసించుచున్న దేవ-ఋషి-నాగ-రాక్షసుల చేత పూజలందుకొని గౌరవింపబడి యెల్ల భూతములపై దయ చూపును.
ఈ దేవి పాపులమను పునీతులను చేయును; తన్ను దలంచినంతనే రోగముల బాపును; సంకీర్తించినంతనే విఘ్నములు హరించును; నిత్యము దేవసన్నుతయై యలరారును. అచట దేవి కోకిలాక్షి-కామపూజిత-కఠోరవిగ్రహ-ధన్య-నాకమన్య-గర్బస్తని-అను నామముల చేత ప్రజలచే నిరంతరము జపింపబడును. జంబూనది తీరమందలి మన్ను శ్రేష్టమైనది. ఈ మన్ను జంబూరసములో తడిసి గాలియెండల తాకుడులవలన విద్యాధరామర స్త్రీలకు సోమ్ముగ నేర్పడును.
కనుక బంగారము దేవనిర్మితమై జాంబూనదమన బరగును. స్త్రీలకు బంగారుమపై సాహజముగ మక్కువ యెక్కువ గదా. వారు కిరీటము మొలనూలు చేతి కడయములు మున్నగునవి బంగారముతో చేయించుకొందరు. ఇంక సుపార్శ్వగిరిపై పెద్దకదంబవృక్షములు గలవు. ఈ గిరిశిఖరముల నుండి యైదు సెలయేళ్లు వెల్వడును. అవి సుపార్శ్వ శిఖరములనుండి భూమిపై పడును. ఈ యైదు మధుధార లిలావృతమునకు పడమటగ ప్రవహించును. ఆ మధుధార లనుభవించు దేవతల ముఖములనుండి సువాసనలు గ్రహించి గాలు లల్లెడల నూఱు యోజనము లందాక వ్యాపించును. అచ్చటి దేవి ధారేశ్వరి నా బరగి భక్తుల కోర్కులు దీర్చును. దేవి-దేవపూజ్య-మహోత్సాహ-కాలరూప-మహానన-కర్మఫలద-కాంతార గ్రహణేశ్వరి-కరాలదేహ- కాలాంగి- కామకోటి ప్రవర్తిని-యను పేళ్లతో నచటి దేవి నిత్యపూజ లందుకొనును.
ఇంక కుముదమను పర్వతముపై ''శతబల'' మను వటవృక్షము గలదు. ఆ చెట్టు మొదళ్ల మీదుగ కుముదగిరిపై నుండి నదులు ప్రవహించుచుండును. అవి పాలు-పెరుగు-నెయ్యి-తేనె-బెల్లము-అన్నము-వస్త్రములు-సెజ్జ-ఆసనము-సొమ్ములు-కామ్యములు-నొసంగు చుండును. అవి యిలావృతమునకు నుత్తరముగ ప్రవహించును. అచటి మీనాక్షిదేవి దేవాసురులచేత సేవింపబడుచుండును.
నీలాంబర - రౌద్రముఖి -నీలాలకయుత - స్వర్గదేవతలకు ఫలవరము లొసగునది - అతిమాన్య- అతిపూజ్య-మత్తమాంగ గామిని-మదనోన్మాదిని-మానప్రియ-మానప్రియాంతర- మారవేగధర-మారపూజిత-మారమాదిని -మయూరవర శోభాఢ్య- కుమారగర్భభూ-అనెడు దివ్యనామములచేత నచటి మీనలోచనాదేవి నమస్కరింపబడును. ఆ యీశ్వరసంగిని తన్ను జపించి స్మరించువారల గౌరవమర్యాదలు కాపాడుచుండును. అచటి నదులలోని నీరు గ్రోలిన ప్రజల కెన్నడును తలవెండ్రుకులు తెల్ల పబడవు - ఊడిపోవు. శ్రమవలన చెమట-చెడువాసన - జరా రోగములు చావు-జంకు-శీతవాతోష్ణములవలన పాలిపోవుట-మొగము వెలవెలబారుట-మున్నగు ప్రమాదములు బాధలు నచటివారికి గలుగవు. జీవితమంతయును నిరంతరముగ వారికి సుఖశాంతులు గల్గును. ఇక దీని తర్వాతిది చెప్పుచున్నాను.

ఆ పర్వతము చెంతనే సువర్ణమయ మనబడు మేరుగిరులు కలవు. ఆ గిరులు మొత్తమిరువది. ఇవన్నియు మేరుగిరికి మొదట కర్ణికచుట్టునున్న కేసరమువలె నొప్పుచున్నవి. ఇవి నలుదెసల వ్యాపించియున్నవి. వీని పేర్లు వినుము. కురంగము-కురగము-శుంభము-వికంకతము-కూటము-శిశిరము-పతంగము-రుచకము-నిషదము-శితీవాసము-కపిలము-శంఖము-వైడూర్యము-చారుధి-హంసము-ఋషభము-నాగము-కాలంజరము-నారదము-ననునిరువది గిరులు ఇవి.
శ్రీ నారాయణుడిట్లనెను : మేరుగిరికి తూరుపుదెస పదునెనిమిదివేల యోజనముల దూరమున కావలనుత్తర దిశగ రెండువేల యోజనముల యెత్తు -పొడువు- వెడల్పుగల రెండు గిరులు గలవు. జఠరము దేవకూటమని యా రెండు గిరులకు పేర్లు. అట్లే మేరువునకు పడమటి దెసను రెండుగిరి లంతియు పొడవు - వెడల్పు- నెత్తు- గల్గియున్నవి. వాని తర్వాత పవ మానగిరి పారి యాత్ర గిరి కలవు. ఈ రెండు సంతియే పొడవు - వెడల్పు- నెత్తు గల్గియున్నవి. మేరుగిరికి దక్షిణమున కైలాసము - కరవారము - నను గిరులు రెండు కలవు. ఇవి తూర్పు దిశగ వ్యాపించియున్నవి. మేరువునకు నుత్తర దిశగ త్రిశృంగ -మకరగిరులు గలవు. ఈ యెనిమిది పర్వతములుచేత మేరు మహాపర్వతము చుట్టబడి సువర్ణమయమై సూర్యునివలె వెలుగులు విరజిమ్ముచున్నది. ఆ మేరుగిరిపైనే పద్మభవుడగు బ్రహ్మయొక్క పురము పదివేల యోజనముల వెడల్పున చెన్నొందును. ఈపురము సమముగ చతురస్రముగ-స్వర్ణమయమై యుండునని మహాత్ములగు బుధులు వర్ణింతురు. బ్రహ్మపురికి క్రింది భాగమున నెనిమిది దిశలం దష్టదిక్పాలకుల బంగరు పట్టణములు తనర్చును. ఒక్కొక్కటి రెండున్నర వేల యోజనముల ప్రమాణము గలది. ఇట్లు మేరుగిరిపై బ్రహ్మపురితో గలిసి తొమ్మిది పురములు గలవు. మనోపతి-అమరావతి-తోజోపతి-సంయమని-కృష్ణాంగన-శ్రద్దావతి-గంధవతి-మహోదయ- యశోపతి- యను పేర్లు వరుసగ బ్రహ్మఇంద్రుడు అగ్ని మున్నగు దిక్పతులపురములపేర్లు.

విష్ణువు త్రివిక్రముడు. విష్ణు నెడమకాలి బొటనవ్రేలి కొనగోట చీల్చబడిన యండ కటాహపు పైరంధ్రమునుండి గంగ యుద్బవించి దివి కేగుచున్నది. అచటినుండి స్వర్గము ద్వారమున భూమిపై పడి గంగ యెల్ల లోకములను పునీతము చేయుచున్నది. పాపములు పాపుచున్నది. ఈ నది లోకములందు విష్ణుపదియన ప్రసిద్దిగాంచెను. అది వేలయుగమలు దనుక ప్రవహించును. గంగదివ్య లోకములందు ప్రవహించుటవలన దేవనదుల కధీశ్వరియైనది. అది ముజ్జగములందు విష్ణు పదిగా వాసిగాంచెను.
పరమ పావనుడగు నుత్తానపాదుని కొడుకు ధ్రువుడు. అతడీ గంగాతీరమున శ్రీ విష్ణు భగవానుని దివ్యపాదయుగ కమలరజము తల దాల్చెను. అందువలన నా రాజర్షి నేటికిని ధ్రువపదము నాశ్రయించి యున్నాడు. సప్తర్షి మహాశయులతని ప్రభావ మెఱింగిరి. కనుక వారు లోక కల్యాణమునకై ధ్రువునకు ప్రదక్షిణము సేతురు. గంగ తాపసుల కాత్యంతికసిద్ది నొసంగునది. ఇట్టి గంగను గంగాధరుడగు శివుడు తన తలపై దాల్చి గౌరవించును. గంగ శ్రీ విష్ణుపదకమలమునుండి యుద్బవించును. అది యనేక సహస్ర కోటుల విమానములు తిరుగుచుండునట్టి దేవయానమార్గమున నవతరించును. అచటినుండి చంద్రమండలమును చంద్రమండలమునుండి బ్రహ్మపురము జేరును. ఓయి నారదా! గంగాదేవి బ్రహ్మలోకమందు నాల్గు దిక్కులందును నాల్గు తెఱంగుల నాలుగు నామములతో విలసిల్లుచుండును. అటుపిమ్మట గంగ నదీపతియగు సాగరముతో సంగమించును. గంగ-సీత- అలకనంద-చతుర్బద్రయను నవి గంగపేర్లు. గంగ బ్రహ్మపురము నుండి వెలువడి సంగమించును. గంగ-సీత-అలకనంద-చతుర్బద్రయను నవి గంగపేర్లు.
గంగ బ్రహ్మపురమునుండి వెలువడి మేరుగిరిపై కేసరములవంటి శిఖరము మీద ప్రవహించును. ఇచటనుండి పాపహీరిణియగు గంగ గంధమాదన గిరిపై పడును. అచటినుండి భద్రాశ్వదేశ మధ్యమునుండి వెడలి సాగరమును గలియును. ఇట్లు దేవపూజితయగు దేవనది క్షారసముద్రములో గలిసిపోవును. రెండవ ప్రవాహము మాల్యవతి శృంగముల నుండి వెలువడును. అచటనుండి వేగవతియై కేతుమాలగిరిని జేరి చక్షుర్నామమున పిలువబడిన గంగ పడమటి దిశగ ప్రవహించును. ఆ గంగ దేవవందితయై నదీపతియగు సాగరము జేరును. నారదా! ఇంక మూడవధారపేరులో ప్రసిద్ధిగాంచెను. అది పుణ్యయగు ''అలకనంద''. అది బ్రహ్మభవనమునుండి దక్షిణముగ బయలుదేరి వనదుర్గములు. గిరులు. దాటును. అటుల దాటివాటి గంగహేమకూటాద్రిని జేరును.
అచటినుండి మహావేగమున భారతవర్షము జేరును. ఈ మూడవధార దక్షిణసముద్రములో కలియును. ఈ గంగలో స్నాన మాడుట కేగెడు నరులతి ధన్యాత్ములు. వారి కడుగడుగున రాజసూయ-అశ్వమేధ యజ్ఞములు ఫలితము తప్పక లభించును. ఇక నాల్గవ గంగాధర శృంగాధార శృంగావత్‌గిరినుండి వెల్వడును. త్రైలోక్యపావని యగు నీ గంగభద్ర యనబరగి యుత్తర కురుభూములను తనిపి సముద్రగర్బములో గలియును.
ఓయి నారదా! ప్రతిదేశ మందెన్నెన్నియో నదీనదములు గలవు. మేరుగిరిపై మందారవృక్షములు కోకొల్లులుగ నున్నవి. అచట దేవతలు ప్రమోదభరితు లగుచుందురు. భారతవర్షము ధర్మ-కర్మ-క్షేత్రము. మిగిలిన యెనిమిది దేశములు నమిత స్వర్గభోగములొసంగు నవి. ఆ యెనిమిది దేశమునులు స్వర్గము ననుభవించి వచ్చిన వారి పుణ్యశేషమునకు భోగస్థానములు-అచటి పురుషులు వజ్రకాయులు-దేవసన్నిభులు-సహస్ర దీర్ఘజీవులు. అచటి పురుషులు పదివేల యేనుగులంతటి బలము గలవారు. నిరంతరము స్త్రీల శృంగాక్రీడలందు ప్రమోదమందుచుండువారు. తమ ఆయువులో ఒక సంవత్సరము తక్కువ యున్నంతవరకు నచటి స్త్రీలు గర్బము దాల్తురు. అచ్చట త్రేతాయుగముతో సమానమైన కాలము సర్వకాలములందు నొకే రీతిగ నుండును.
నారాయణు డిట్లనెను : దేవతలు పూర్వము చెప్పిన ప్రకారముగ నాయా దేశములలోని దేవేశ్వరిని దేవీభక్తులు స్తోత్రజపధ్యాన సమాధులతో సమారాధింతురు. అచట ఋతువులన్నిటియందును వనములు నిరంతరము పల్లవ-కుసుమ-ఫల రసాదులతో పచ్చపచ్చగ శోభిల్లుచుండును.

ఆ వర్షారణ్యములందును అచటి వర్షపర్వతముల చఱియలందును కొండలోయ లందును విప్పారిన కలువపూలశ్రేణుల కల నిర్మల జలాశయములందును హంసలతోను బెగ్గురు పక్షులతోను ఆ జలములందు విరియబూచిన కమలకుసుమములపై సంచరించు ఆయా పక్షుల కూతలతోను మిశ్రితములగు ఆ అరణ్య ప్రదేశములందును సుందరుల అందమయిన కనుబొమలనెడు గృహములందును అచటివారు అచటియువతులతోకూడి జలక్రీడలు మొదలగు విచిత్ర వినోదములతో విహరించుచుందురు.
ఆ తొమ్మిది వర్షములందు నాది పూరుషుడగు భగవానుడు పూజ్యడు. అతడు నారాయణ నామముతో పిలువబడుచు లోకాల నను గ్రహించు చూపులతో దేవిని నెమ్మదిగా గొల్చచుండును. అట్టి నారాయణమూర్తి నచటి జనములు నిశ్చలమతితో గొలుచుచుందురు. అచట నతడు ఆత్మవ్యూహముతోను ఆరాధన రూపమగు యజ్ఞముతోను సన్నిహితుడై యుండును.
బ్రహ్మకనుబొమల రుద్రాంశజుడగు దేవుడు భవుడుద్బవించెను. అతడు దేవినిగూడి ''ఇలావృతవర్షమున'' పూజింపబడును. ఆ క్షేత్రమున పురుషుడెవ్వడును ప్రవేశింపడు. భవానీ శాపకారణముగ నచటికి వెళ్ళిన పరుషుడు స్త్రీరూపము దాల్చను. అచట భవానీపతియగు శివుడు కోట్లకొలది స్త్రీగణములతో జేరి సంకర్షణుని గొల్చుచుండును.
ఆచోట భగవానుడు భవుడు (శివుడు) సర్వభూతహితముగోరి ధ్యానయోగముతో తన మూర్తిని తామసీ తురీయ ప్రకృతి నాశ్రయించియుండును. అతడేకాగ్రచిత్తముతో నా ప్రకృతిని ధ్యానించుచుండును.
భగవాను డిట్లనెను: మహా పురుషుడు సర్వగుణవిఖ్యాతుడు అనంతుడు అవ్యక్తుడునగు భగవానునకు నమస్కారము. భజింపదగిన రమ్యపదకమలములు గల వానిని భక్తులపాలిటి కల్పతరువును భూతభావనుని సంసారబాధానివారకుని సకల పరాయణుని పరమేశ్వరుని భజించుచున్నాను. ఏ దేవుని చూపు మాయాగుణ కర్మవృత్తులుగల విషయములందు జిక్కుకొనదో యట్టి జితమన్యడు ఈశ్వరుడు నగు దేవు నాత్మవిజయముగోరువా డెవ్వడు చింతింపడు? మదువు గ్రోలుటవలన నెఱ్ఱని కన్నులుగల్గి యెవడు మాయచేత నెఱుంగబడడో మూఢములైన యింద్రియిములుగల నాగకన్య లెవని రమ్యపదకములములు తాకి సిగ్గుచేత గొలువజాలరో జన్మ స్థతి లయములులేని యెవనివలన జన్మస్థితిలయములు గల్గునో ఋషులెవని ననంతుడందురో తన వేల శిరములలో నొకదాని మీద కొద్దిచోటగల యీ భూమండలమంతయు నొక చిన్న కమలము మాత్రముగనైన లేదని యెవడు భావించునో ఎవ్వాని తొలి విగ్రహము గుణనిమిత్తమగు మహత్తత్త్వమో యే భగవానుడు విజ్ఞానమయుడో యెవని వలన రుద్రుడనగు నేను త్రిగుణాత్మకతేజముగల యహంకారముతో తామససృష్టి చేతునో-త్రాళ్లచేత గట్టుపడిన పక్షులవలె నే మహితాత్మునివలన మేమెల్లరము నిగ్రహింపబడియున్నారమో యహంకారవికార తామసేంద్రియములుగల మేమెవని దయచే సృష్ఠిరచన సాగింతుమో ఎవ్వని కర్మరూపమగు మాయకు లోనై జనులు భ్రాంతితో తరించు నుపాయ మెఱుంగరో యట్టి సృష్టిస్థితిలయాత్మునకు పదివేల నమస్కారములు.
నారాయణు డిట్లనెను : ఈ విధముగ నిలావృతములోని రుద్రుడు దేవీగణములను గూడి సంకర్షణదేవు నుపాసించును.
నారాయణు డిట్లనెను : ఈ విధముగ నిలావృతములోని రుద్రుడు దేవీగణములను గూడి సంకర్షణదేవు నుపాసించును.
No comments:
Post a Comment