Sunday, May 24, 2026

Seven 7 Chakras - 7 చక్రాలు

7 చక్రాలు

7 చక్ర అనేవి మన శరీరంలో ఉండే ప్రముఖ ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు. సంస్కృతంలో 'చక్ర' అంటే 'చక్రం' లేదా 'తిరిగే చక్రం' అని అర్థం. మన వెన్నెముక గుండా ప్రవహించే ప్రాణశక్తి ఈ ఏడు చక్రాల ద్వారానే నియంత్రించబడుతుందని నమ్ముతారు.

7 చక్రాలు అనగానేమి అవి మన శరీరం లో ఎక్కడ ఉత్తేజమవుతాయి..?

1. మూలాధార చక్రం - వెన్నెముక దిగువ భాగం (జననేంద్రియాల మధ్య).

2. స్వాధిష్ఠాన చక్రం - నాభి (బొడ్డు) కింద, పొత్తికడుపు భాగంలో ఉంటుంది.

3. మణిపూరక చక్రం - నాభి భాగంలో ఉంటుంది.

4. అనాహత చక్రం - ఛాతీ మధ్యలో (హృదయ భాగం) ఉంటుంది.

5. విశుద్ధ చక్రం- గొంతు భాగంలో ఉంటుంది.

6. ఆజ్ఞా చక్రం - రెండు కనుబొమ్మల మధ్య (నొసటి భాగంలో). దీనినే 'మూడో కన్ను' అంటారు.

7. సహస్రార చక్రం - తల పైభాగంలో (నడినెత్తి మీద).


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Tuesday - మంగళవారం

మంగళవారం

ఏదైనా శుభకార్యం తలపెట్టే సమయాల్లో మంచి రోజు చూసుకునే పద్ధతి ఆనవాయితీగా వస్తోంది. మనం ఎంచుకునే రోజులో ఏ సమయం బాగుంటుందని పురోహితుల సూచన మేరకు ఏ కార్యాన్నైనా ప్రారంభించడం అలవాటు. ఎందుకంటే? తలపెట్టిన కార్యం విజయవంతంగా పూర్తి కావాలని అందరూ కోరుకుంటారు. అయితే మంగళవారం ఎలాంటి పనులను మొదలుపెట్టడం అంత మంచిది కాదని పెద్దలు అంటున్నారు. పెళ్లి, వ్యాపారం ప్రారంభించడం, గృహప్రవేశం చేయడం వంటి శుభకార్యాలను మంగళవారం చేయకూడదని వారు చెబుతున్నారు.


హనుమంతుడి ఆరాధన వలన కార్యసిద్ధి కలుగుతుందనీ, అనారోగ్యాలు దూరమవుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. హిందూ మతంలో హనుమాన్ చాలీసాకి ప్రత్యేక స్థానం ఉంది.

హనుమాన్ చాలీసా పఠనం వల్ల, హనుమంతుడ్ని మెప్పించి ఆయన దీవెనలు పొందవచ్చని అంటారు. హనుమాన్ చాలీసా చదవటం వల్ల శనిప్రభావం కూడా పోతుంది.

శాస్త్రం ప్రకారం మంగళవారం చాలా మంచి రోజు శుభప్రదమైన మంగళప్రదమైన వారం. ఆంజనేయ స్వామికి, అమ్మవారు దేవతలకి అత్యంత ప్రీతికరమైన వారం ఈ మంగళవారం. అందుకే ఆలయాలలో మంగళవారం నాడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.

మంగళవారం మారు కోరుతుంది. మారు జరుగుతుంది అంటారు. సౌభాగ్యానికి ప్రతీకగా నిలిచిన ఏదైనా కొంటే చీరలు, నగలు, అలంకరణ సామగ్రి వంటివి.. ఆ తరువాత కూడా మరోమారు ప్రాప్తిస్తాయి అని విశ్వసిస్తారు కొందరు. మంగళవారం మారు కోరుతుంది కాబట్టి మంగళవారం రోజు అప్పులు తీసుకోకూడదు అని చెబుతుంటారు.

మంచి మనసుతో మంచి పని ఎప్పుడైనా ఏ వారం నాడైనా చేయవచ్చు. మంగళవారం మంచిదికాదని ఏ గురువు చెప్పలేదు.. ఏ పురాణం లోనూ లేదు. కొన్ని విదేశాల్లో ముఖ్యమైన పనులు మంగళవారమే మొదలుపెడతారు.

మంగళవారం ఈ వస్తువులను కొంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది:
మంగళవారం రోజున లక్ష్మీదేవిని (అమ్మవారిని) ప్రసన్నం చేసుకోవడానికి పసుపు, కుంకుమ, కమలపువ్వులు, తామర గింజలు, లేదా లక్ష్మీదేవి ప్రతిమను కొనుగోలు చేయడం చాలా మంచిది.

తామర పువ్వులు లేదా గింజలు: లక్ష్మీదేవికి తామర పువ్వులంటే అత్యంత ఇష్టం. కమలపువ్వులను లేదా తామర గింజలతో చేసిన మాలను పూజలో ఉపయోగించడం మరియు కొనుగోలు చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్ముతారు.

పసుపు కొమ్ములు & కుంకుమ: ఇవి శుభప్రదానికి ప్రతీకలు. మంగళవారం రోజున అమ్మవారి పూజ కోసం పసుపు కొమ్ములు, కుంకుమ కొనుగోలు చేసి పూజా మందిరంలో ఉంచడం శ్రేయస్కరం.

లక్ష్మీదేవి ఫొటో లేదా విగ్రహం: లక్ష్మీదేవి అనుగ్రహం కోసం నిలబడి ఉన్న రూపం కంటే, పద్మంపై కూర్చుని ఉన్న లక్ష్మీదేవి ప్రతిమను కొని పూజించడం చాలా మంచిది.

గోమతీ చక్రాలు : వీటిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. మంగళవారం లేదా శుక్రవారం పూజా సమయంలో అమ్మవారి ముందు గోమతీ చక్రాలు ఉంచి పూజించడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

అలాగే ఇంకా ఏమి చెయ్యకూడదో చూద్దాం :
మంగళవారం రోజున కొత్త బట్టలను కొనకూడదు. ఈరోజున కొత్త బట్టలను ధరించకూడదు. ఒకవేళ కొత్త బట్టలు ధరిస్తే కుజ గ్రహ ప్రభావం వల్ల అవి పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు ధరించిన కొత్త బట్టలు ఎక్కువ రోజులు మన్నిక రావు. శుక్రవారం కొత్త బట్టలను కొనుగోలు చేయడం లేదా ధరించడం పవిత్రంగా భావిస్తారు.

మంగళవారం పొరపాటున కూడా కటింగ్, షేవింగ్ చేయడం, గోర్లు కత్తిరించడం వంటి పనులు చేయకూడదు. ఎందుకంటే ఈరోజున ఈ పనులు చేయడం వల్ల ఆయుషు తగ్గిపోతుందని నమ్ముతారు. అంతేకాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గుతాయి. శాస్త్రాల ప్రకారం మంగళవారం అనేక పనులు నిషిద్ధం. అంతేకాకుండా అపవాదుగా భావిస్తారు. అయితే దుర్గాదేవి, మహాలక్ష్మీ అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించొచ్చు.

శని దేవుడికి మంగళవారంతో సంబంధం ఉన్న కారణంగా కొత్త బట్టలతో పాటు కొత్త బూట్లను ధరించకూడదు. ఆర్థిక పరంగా కొంత నష్టం ఉండొచ్చు. అంతేకాకుండా మీ ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశముంది.


గమనిక: ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ నిలిచి ఉండాలంటే, రోజు ఇల్లు పరిశుభ్రంగా ఉంచుకోవడం, పెద్దలను/స్త్రీలను గౌరవించడం, మరియు తోటివారికి దానధర్మాలు చేయడం అత్యంత ముఖ్యమని పండితులు చెబుతున్నారు.

నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Wednesday - బుధవారం

బుధవారం

బుధవారంను బుధ గ్రహానికి సంబంధించిన రోజుగా భావిస్తారు. బుధుడు బుద్ధి, వాక్చాతుర్యం, వ్యాపారం, విద్యలకు అధిపతి. ఇక గణపతి దేవుడు “బుద్ధి ప్రదాత”, “విఘ్నేశ్వరుడు”గా ప్రసిద్ధి. అందుకే బుధవారం రోజున గణపతిని పూజిస్తే బుద్ధి, జ్ఞానం, కార్యసిద్ధి కలుగుతాయని పురాణ విశ్వాసం.

బుధవారం నాడు గణపతికి పూజ చేస్తే ఎంతో మంచి జరుగుతుంది. జ్ఞానాన్ని ఇచ్చే గణేశుడిని బుధవారం పూజించడం వలన అడ్డంకులు అన్ని తొలగిపోతాయి, అనుకున్నది సాధించొచ్చు, కష్టాలు కూడా గట్టెక్కుతాయి. వినాయకుడిని పూజిస్తే మీరు అన్ని రకాల బాధల నుంచి విముక్తి పొందుతారు.

ఆర్ధిక ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే బుధవారం నాడు పచ్చని పెసలను దానం చేయండి. ఇలా చేయడం వలన ఎంతో మంచి కలుగుతుంది. పెసలని మరిగించి నెయ్యి పంచదార కలిపి ఆవుకి పెట్టడం వలన కూడా ఎంతో మేలు కలుగుతుంది.

వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం. అందుకే వినాయకుని ప్రత్యేక అనుగ్రహం పొందడానికి బుధవారం 21 గరిక పోచలను వినాయకుడికి సమర్పించండి.

ఈ సమయంలో సంతోషం, శ్రేయస్సు, సంపద వృద్ధి చెందాలని గణపతిని కోరుకోండి. ఇలా చేయడం వల్ల జీవితంలో దుఃఖం, సంక్షోభం, డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి.

ఇలా గరికను సమర్పించడం వలన వినాయకుని అనుగ్రహంతో మీ కష్టాలు తొలగిపోతాయి. అదేవిధంగా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే బుధవారం నాడు ఏదైనా అవసరమున్న వాళ్ళకి ఆహారాన్ని, వస్త్రాలను దానం చేయండి.

ఇంటర్వ్యూలో సక్సెస్ ని పొందాలంటే ప్రతి బుధవారం వినాయకుడిని పూజించండి. అదేవిధంగా ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే బుధవారం నాడు ఏదైనా అవసరమున్న వాళ్ళకి ఆహారాన్ని, వస్త్రాలను దానం చేయండి

Naradhisti Nardishti - నరదిష్టి

నరదిష్టి

నరదిష్టి తగలడం వల్ల పనులు ఆగిపోవడం, అనారోగ్యం, లేదా ఇంట్లో నెగటివ్ ఎనర్జీ రావడం జరుగుతుందని నమ్ముతుంటారు.

నరదిష్టి తగలడం వల్లజరిగే పరిణామాలు:
1. వ్యాపారం మరియు ఆర్థిక ఎదుగుదల లోపించడం.

2. ఇల్లు మరియు నిర్మాణ పనులు ఆగిపోవడం.

3. పెళ్లిళ్లు మరియు శుభకార్యాలు మధ్యలో నిలిచిపోవడం.

4. చదువు మరియు ఉద్యోగం రానించలేకపోవడం.

5. ప్రశాంతత లోపించడం వంటివి ఎన్నో జరుగుతు ఉంటాయి.

నరదిష్టి తొలగడానికి సాధారణ పరిహారాలు :
దిష్టి తీయడం: వారానికి ఒకసారి (ముఖ్యంగా మంగళవారం లేదా ఆదివారం) ఉప్పు, ఎండుమిర్చి, లేదా నిమ్మకాయతో ఇంట్లో వాళ్లకు దిష్టి తీసి బయట పడేయాలి.

ఇంటి గుమ్మం దగ్గర: ఇంటి సింహద్వారం బయట నల్లతాడు కట్టిన గుమ్మడికాయ, కలబంద, లేదా నరదిష్టి బొమ్మను వేలాడదీయడం వల్ల చెడు చూపు ఇళ్లల్లోకి రాదు.

కళ్లదృష్టి పరిహారం: ప్రతిరోజూ సాయంత్రం ఇంట్లో ధూపం (సాంబ్రాణి) వేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ పోతుంది.

నరదిష్టికి కరుంగాలి మాల:
నరదిష్టి, నరఘోష, మరియు నెగెటివ్ ఎనర్జీ (ప్రతికూల శక్తులు) అన్నింటికీ ఒకే ఒక్క శక్తివంతమైన పరిష్కారంగా కరుంగాలి మాల ధరించావచ్చు.

కరుంగాలి మాలను ధరించే ముందు ఒకసారి మంచి నీటితో లేదా పాలు, గంగాజలంతో శుద్ధి చేసి, పూజ చేసి ధరిస్తే మంచి ఫలితం ఉంటుంది.

గమనిక: దీనిని మాంసాహారం తినేటప్పుడు, తీసి పక్కన పెట్టడం మంచిది.


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Thursday, May 21, 2026

Adhika Jyeshta Maasam - అధిక జ్యేష్ఠ మాసం

అధిక జ్యేష్ఠ మాసం

అధిక జ్యేష్ఠ మాసం అనేది హిందూ పంచాంగం ప్రకారం చాలా పవిత్రమైన మరియు విశేషమైన సమయం. సూర్య మానానికి, చంద్ర మానానికి మధ్య వచ్చే తేడాని సరిచేయడానికి ప్రతి 32 నెలలకు (దాదాపు 3 సంవత్సరాలకు) ఒకసారి ఒక 'అధిక మాసం' వస్తుంది.

ఈ మాసానికి అధిపతి శ్రీమహావిష్ణువు. అందుకే దీనిని "పురుషోత్తమ మాసం" అని కూడా పిలుస్తారు. ఈ సమయంలో చేసే పూజలు, దానాలకు సాధారణ రోజుల కంటే వంద రెట్లు ఎక్కువ ఫలితం ఉంటుందని నమ్ముతారు.

ఈ అధిక జ్యేష్ఠ మాసంలో ఎలాంటి పనులు చేయాలో, ఏవి చేయకూడదో ఇక్కడ చూద్దాం:

అధిక మాసం పూర్తిగా ఆధ్యాత్మిక సాధనకు, పుణ్య కార్యాలకు కేటాయించాల్సిన సమయం.

విష్ణు ఆరాధన: ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం శ్రీమహావిష్ణువును, లక్ష్మీదేవిని పూజించాలి. "ఓం నమో నారాయణాయ" లేదా "ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే మంత్రాన్ని జపించడం చాలా మంచిది.

విష్ణుసహస్రనామ పారాయణం: ఈ నెల రోజులు రోజూ విష్ణుసహస్రనామ స్తోత్రం చదవడం లేదా వినడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి.

దీపారాధన: ఇంటి పూజగదిలో మరియు తులసి కోట వద్ద ప్రతిరోజూ నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి.

సత్కార్యాలు & దానాలు: అన్నదానం, వస్త్రదానం, పుస్తక దానం, మరియు వీలైనంత వరకు పేదలకు సహాయం చేయడం వల్ల అఖండ ఐశ్వర్యం లభిస్తుంది.

ఉపవాసం మరియు జాగరణ: వీలున్నవారు ఏకాదశి తిథుల్లో ఉపవాసం ఉండటం, విష్ణు కథలు వినడం విశేష ఫలితాన్నిస్తాయి.

నిషిద్ధ పనులు:
అధిక మాసంలో ఎలాంటి కామ్య కర్మలు (కోరికలతో కూడిన శుభకార్యాలు) చేయకూడదు. కేవలం నిష్కామ కర్మలు (భగవత్ చింతన) మాత్రమే చేయాలి.

శుభకార్యాలు: పెళ్ళిళ్ళు (వివాహాలు), ఉపనయనాలు, గృహప్రవేశాలు, నిశ్చితార్థాలు వంటి శుభకార్యాలు ఈ మాసంలో పూర్తిగా నిషిద్ధం.

కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, కొత్త ఉద్యోగంలో చేరడం (వీలైతే నివారించడం), లేదా కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టడం చేయకూడదు.

ఆస్తులు కొనడం: కొత్త ఇల్లు, స్థలం లేదా వాహనాలు కొనడం వంటివి ఈ నెలలో వాయిదా వేసుకోవడం మంచిది.


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

shivudi vividha naamaalaku vivarana - శివుడి వివిధ నామాలకు వివరణ

శివుడి వివిధ నామాలకు వివరణ

పంచభూతాత్మకుడు : శివుడు ధరించే పులిచర్మం భూతత్త్వానికీ, తలపై గంగ జలతత్త్వానికీ, మూడవనేత్రం అగ్నితత్త్వానికీ, విభూతి వాయుతత్త్వానికీ, శబ్దబ్రహ్మ స్వరూపమైన డమరుకం ఆకాశతత్త్వానికీ చిహ్నాలు.

త్రయంబకుడు : శివుని మూడుకన్నులు కాలాలను (భూత,భవిష్యత్, వర్తమానాలు) సూచిస్తాయి. ఇక శివుని మూడవకన్ను జ్ఞానానికి చిహ్నం. ఆజ్ఞాచక్ర స్థానములో వుండే ఈ ప్రజ్ఞాచక్షువు జ్ఞానాన్ని సూచిస్తుంది. ఈ ప్రదేశమందే ఇడా పింగళ సుషుమ్నా నాడులు కలుస్తాయి. దీనినే త్రివేణి సంగమం అని అంటారు.

విభూతిదారుడు : సృష్టి అంతయూ ఎప్పటికైనా నశించునదే. అంటే భస్మంగాక తప్పదు. నీవు నేను అనుకొనబడు ఈ దేహం కూడా ఎప్పటికైనా భస్మమగునని తెలుపుటయే భస్మధారణ ఉద్దేశ్యం.

నాగాభరణుడు : సర్పం ప్రాపంచిక విషయాలకు ప్రతీక. హానికరమైన సర్పంను తన ఆదీనంలో పెట్టుకోవడంలో మర్మం ఏమిటంటే, ప్రాపంచికంగా ఎంతో హానికరాలు అయిన కామ, క్రోద, లోభ, మోహ, మద, మాత్సర్యాలన్న విషయాలను జయించడం బహు కష్టం. అవి వీడిపోయేవి కావు, కావున వాటిని అదుపులో వుంచుకోవాలని సూచిస్తూ శివుడు నాగాభరణుడుడైనాడు. అటులనే మన దేహంలో ఉన్న వెన్నెముక పాములా, మెదడు పడగలా గోచరిస్తుంది కదా, ఇది కుండలినీ జాగృతిని సూచిస్తుందని చెప్తుంటారు.

బోళాశంకరుడు : శివున్ని బోళాశంకరుడు అంటారు. ఎందుకంటే, సులభంగా అనుగ్రహిస్తాడు. ఈ అనుగ్రహం కూడా రెండు విధాలు. సంసారబద్ధుడై భోగాలను ఆశిస్తూ ఆరాదించినవారికి వాటిని అనుగ్రహిస్తాడు. జననమరణ చక్రభ్రమణంలో పడిపోకుండా సంసారంనుండి విముక్తిని కోరేవారికి విముక్తుల్ని చేసి ముక్తిని ప్రాసాదిస్తాడు.


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

Dwadasa Rasula vaaru veliginchalsina Vattulu - ద్వాదశ రాశుల వారు వెలిగించాల్సిన వత్తులు

ద్వాదశ రాశుల వారు వెలిగించాల్సిన వత్తులు

సాంప్రదాయ పరంగా సరైన వాతావరణాన్ని సృష్టించడానికి చేసే మొదటి పని దీపాన్ని వెలిగించడం. దీపం సానుకూల శక్తికి, దైవిక శక్తికి చిహ్నంగా పరిగణించబడుతుంది. ఇది భూమికి, దైవిక శక్తికి మధ్య వారధిగా పనిచేస్తుంది, భక్తులు దైవంతో మరింతగా అనుసంధానించబడటానికి సహాయపడుతుంది. ద్వాదశ రాశుల వారు వారి రాశులను బట్టి ఎన్ని వత్తులు వెలిగించాలో తెలుసుకుందాం.

ద్వాదశ రాశులవారు వెలిగించాల్సిన వత్తులు

మేష రాశి - త్రివత్తులు (3)

వృషభ రాశి - చతుర్ వత్తులు (4)

మిధున రాశి - సప్తవత్తులు (7)

కర్కాటక రాశి - త్రివత్తులు (3)

సింహ రాశి - పంచమవత్తులు (5)

కన్య రాశి - చతుర్ వత్తులు (4)

తులా రాశి - షణ్ముఖ వత్తులు (6)

వృశ్చిక రాశి - పంచమవత్తులు (5)

ధనుస్సు రాశి - త్రివత్తులు (3)

మకర రాశి - సప్తమవత్తులు (7)

కుంభ రాశి - చతుర్ వత్తులు (4)

మీన రాశి - పంచమవత్తులు (5)

Brahmanula Kutra - Goutamudi Saapam - బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం

శ్రీ దేవీ భాగవతం ద్వాదశ స్కంధము - బ్రాహ్మణుల కుట్ర - గౌతముడి శాపం ఇలా ఉండగా నారదుడు ఒకనాడు అక్కడికి వచ్చాడు. మహతిని మోగించుకుంటూ గాయత్రీ గుణ...