మఖ నక్షత్రము
నక్షత్రం - మఖ
అధిపతి - కేతువు
గణము - రాక్షస
జాతి - స్త్రీ
వృక్షం - మర్రి
జంతువు - మూషికము
నాడి - అంత్య
పక్షి - పెద్దపక్షి
అధిదేవత - పితృ దేవతలు
రాశి - సింహం
నక్షత్రం - మఖ
అధిపతి - కేతువు
గణము - రాక్షస
జాతి - స్త్రీ
వృక్షం - మర్రి
జంతువు - మూషికము
నాడి - అంత్య
పక్షి - పెద్దపక్షి
అధిదేవత - పితృ దేవతలు
రాశి - సింహం
మఖ నక్షత్ర జాతకుల గుణగణాలు:
నక్షత్రములలో ఇది పదవ నక్షత్రము. అర్జునుడు ఈ నక్షత్రంలోనే జన్మించినట్లు నానుడి. ఈ నక్షత్ర జాతకునుకి పొదుపు చేసే గుణము ఉంటుంది. మంచి మనుషులుగా పేరు తెచ్చుకుంటారు. వీరు దేని బాధ్యత అయినా తీసుకున్నట్లయితే, ఎంతో ఉత్సాహంగాను మరియు కష్టపడి పనిచేస్తారు కనుక, దానిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. చాలా చక్కటి ఆత్మ విశ్వాసం ఉంటుంది, ఈ విషయంలో వీరు ఎన్నటికీ రాజీపడరు.
ప్రతి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్న తరువాత మాత్రమే వీరు పనిచేస్తారు. దేవుడి విషయానికి వస్తే, వీరికి దేవుడిపై అత్యంత విశ్వాసం ఉంటుంది. వివిధ కళల్లో ఆసక్తి కలిగి ఉంటారు. వీరి యొక్క శాంతియుత ప్రవర్తన, అందమైన జీవితం మరియు తెలివితేటల కారణంగా సమాజంలో గౌరవించబడతారు.
ఏదైనా కార్యము చేయడానికి వచ్చినప్పుడు, సత్యానికి విరుద్ధంగా వీరు ఏదీ చేయడానికి ఇష్టపడరు. వీరి ప్రవర్తన వల్ల ఎవరూ కూడా బాధించబడకూదనే విధంగా వీరి ప్రవర్తన ఉంటుంది. తమ ప్రవర్తన వల్ల ఎవరైనా బాధించబడినట్లుగా అనిపిస్తే, వెంటనే వారికి క్షమాపణలు కూడా చెప్పుటకు వెనుకాడరు.
సంస్కృతి, సంప్రదాయాలు మరియు పెద్దవారిని వీరు గౌరవిస్తారు. అందుబాటులో సౌకర్యాలను ఉత్తమంగా ఉపయోగించుకుంటారు. వివిధ రకాల అంశాల్లో నైపుణ్యం ఉంటుంది. అదేవిధంగా, సామాజిక కార్యక్రమాల్లో ఆసక్తి ఉంటుంది. అందువల్ల వీరు అటువంటి పనుల్లో చాలా ఉత్సాహంగా పాలు పంచుకుంటారు. వీరి వ్యక్తిత్వం అందమైనది మరియు ఆకర్షణీయమైనదిగా ఉంటుంది, ఎలాంటి స్వీయ ఆసక్తి లేకుండా ప్రజలకు సేవ చేసే లక్షణాన్ని కలిగి ఉంటారు.
మఖ నక్షత్రం మొదటి పాదము
మఖ నక్షత్ర జాతకునికి కుజుడి ప్రభావం మరింత ప్రభావితం చేస్తుంది. అనుకున్న కార్యం వీరు అనుకున్నంత వేగంతోనే పూర్తి చేస్తారు.
కేతు గ్రహ ప్రభావంతో వీరికి ఆద్యాత్మిక చింతన అధికంగా ఉంటుంది. ఏ కార్యమైనా దైవ నమ్మకంతో పూర్తి చేస్తారు. భూ సంబంధిత వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తాయి.
రాహుదశ కొన్ని సమస్యలను తీసుకువచ్చే అవకాశం ఉంది. రాహుదశ అనంతరం వచ్చే గురు దశ కారణంగా జీవితం తిరిగి సాఫీగా సాగుతుంది.
మఖ నక్షత్రం రెండవ పాదము
మఖ నక్షత్ర రెండవ పాద జాతకునికి స్థిరమైన అభిప్రాయాల ఉంటాయి. ఒకసారి ఏర్పరచుకున్న అభిప్రాయాలు అంత త్వరగా మార్చుకోలేరు.
కళా సంబంధిత వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారం వీరికి అనుకూలిస్తాయి. ఈ జన్మ నక్షత్రంలోని రెండవ పాదము వారికి సౌఖ్యవంతమైన జీవితం సాగుతుంది.
రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదురైనా జీవితంలో సౌఖ్యం తిరిగి మొదలవుతుంది.
మఖ నక్షత్రం మూడవ పాదము
మఖ నక్షత్ర మూడవ పాదము జాతకులు స్థిరమైన అభిప్రాయాలు కలిగి ఉంటారు. కనుక వీరు ఒక్కసారి ఏర్పరచుకున్న అభిప్రాయాలు అంత త్వరగా మార్చుకోలేరు. మేధో సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి. భూ సంబంధిత వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు వీరికి అనుకూలిస్తాయి.
కేతు గ్రహ ప్రభావం వలన వీరు అత్యంత ఆధ్యాత్మికత వాతావరణాన్ని కలిగి ఉంటారు. వీరికి వ్యాపార, ఉద్యోగాల, వ్యవసాయం మీద సమానమైన ఆసక్తి ఉంటుంది.
రాహుదశ కారణం వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి రావచ్చు. రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. తరువాత గురుదశ కాలంలో సమస్యలు తగ్గు ముఖం పట్టి తిరిగి సుఖసంతోషాలు మొదలవుతాయ.
మఖ నక్షత్రం నాలుగవ పాదము
మఖ నక్షత్ర నాల్గవ పాదము జాతకులకు పట్టుదల అధికం. వీరికి తల్లి అంటే అభిమానం అధికంగా ఉంటుంది. కేతు గ్రహ ప్రభావం వల్ల వీరికి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది.
వీరికి పాలు, పాల ఉత్పత్తులు, బియ్యం, ముత్యం, కాగితం, ఔషధ తయారీ విక్రయం వంటి వృత్తులు, ఉద్యోగాలు వ్యాపారాలు అనుకూలిస్తాయి. శుక్ర దశ ఉండటంతో జీవితం అప్పటి వరకు సాఫీగా సాగుతుంది.
తరువాత రాహుదశ కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవలసి రావచ్చు. రాహుదశ అనుకూలిస్తే విదేశీ పర్యటనలు అనుకూలిస్తాయి. తరువాత గురు దశ సమయంలో సమస్యలు తగ్గు ముఖం పట్టి తిరిగి సుఖ సంతోషాలు చోటు చేసుకుంటాయి.
మఖ నక్షత్ర జాతకులు పెంచవల్సిన వృక్షము
మఖ నక్షత్రం వారు మర్రి చెట్టుని పెంచాలి. ఈ చెట్టును పూజించడం వల్ల ఆయురారోగ్యాలు వృద్ధి చెందడమే కాకుండా, పితృ దేవతల అనుగ్రహం, కుటుంబంలో అన్యోన్యత మరియు జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయని నమ్ముతారు.
మఖ నక్షత్ర జాతకుల తారాఫలాలు
తార నామం - తారలు - ఫలం

జన్మ తార - అశ్విని, మఖ, మూల - శరీరశ్రమ
సంపత్తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - ధన లాభం
విపత్తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - కార్యహాని
సంపత్తార - రోహిణి, హస్త, శ్రవణం - క్షేమం
ప్రత్యక్ తార - మృగశిర, చిత్త, ధనిష్ట - ప్రయత్న భంగం
సాధన తార - ఆర్ద్ర, స్వాతి, శతభిష - కార్య సిద్ధి, శుభం
నైత్య తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - బంధనం
మిత్ర తార - పుష్యమి, అనూరాధ, ఉత్తరాభాద్ర - సుఖం
అతిమిత్ర తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - సుఖం, లాభం

మఖ నక్షత్ర ప్రయోజనాలు :-
గౌరవం & అధికార స్థానం:
ఈ నక్షత్రంలో జన్మించిన వారు నాయకత్వ లక్షణాలతో, సౌభాగ్యంగా ఉంటారు. అధికారం, హోదా, పేరుప్రతిష్ట పొందే యోగం కలుగుతుంది.
పితృదేవతల అనుగ్రహం:
పితృదేవతల అనుగ్రహం వల్ల పితృ ఋణాలు తీరతాయి. వారి ఆశీస్సులతో సంపద, సంతానం, ఆరోగ్యం కలుగుతాయి.
బుద్ధి మరియు తాత్వికత:
మంచి ఆలోచన శక్తి, నైతికత, తాత్విక దృష్టి కలిగి ఉంటారు. ధర్మాన్ని గౌరవిస్తారు.
పదవులు మరియు గుర్తింపు:
రాజకీయ, ప్రభుత్వ, అధికారిక రంగాల్లో ఉన్నత స్థానాలు పొందే అవకాశం ఉంటుంది.
ఆధ్యాత్మిక అభివృద్ధి:
పితృ సేవ, ధర్మ మార్గం అనుసరించడం వల్ల దైవ అనుగ్రహం కలుగుతుంది.
గ్రహాధిపతి – సూర్యుడు ప్రయోజనాలు:
సూర్యుడి అనుగ్రహంతో నాయకత్వ లక్షణాలు, అధికార స్థానం, ధైర్యం, తేజస్సు పెరుగుతాయి.
ఆదివారాన్ని పవిత్రంగా గౌరవించటం, సూర్య నమస్కారాలు చేయడం, జపాలు చేయడం శుభప్రదం.
No comments:
Post a Comment