Monday, June 16, 2025

Purva Phalguni Nakshatra - పూర్వఫల్గుణి (పుబ్బ) నక్షత్రం

పూర్వఫల్గుణి (పుబ్బ) నక్షత్రం

నక్షత్రం - పూర్వ ఫల్గుణి

అధిపతి - శుక్రుడు

గణము - మానవ

జాతి - పురుష

వృక్షం - మోదుగ

జంతువు - సింహం

నాడి - మధ్య

పక్షి - పెద్దపక్షి

అధిదేవత - భర్గుడు

రాశి - సింహం

పూర్వఫల్గుణి నక్షత్ర జాతకుల గుణగణాలు
పూర్వఫల్గుణీ నక్షత్రము అధిపతి శుక్రుడు. ఈ నక్షత్రమునకు స్వల్ప శాంతి చేయవలెను. వీరికి బాల్యములో కొంత వరకు సుఖమయ జీవితము గడుస్తుంది. ఆటంకము లేకుండా విద్యాభ్యాసము కొనసాగుతుంది. రాశ్యాధిపతి సూర్యుడు, గణము మానవ గణము. లౌక్యము, అధికారము కలగలసిన ప్రవర్తన వీరు ప్రవర్తిస్తారు. సమయానుకూలముగా ప్రవర్తించే కారణముగా అధికారులుగా రాణిస్తారు. దానధర్మాలు, అన్నదాన సత్రములు, విద్యాదానము చేస్తారు.

ఆర్ధిక పురోగతి బాగుంటుంది. అన్య భాషలు సైతము అనర్గళంగా మాట్లాడగలరు. తమ జీవన శైలికి భిన్నముగా సంతానాన్ని వేరు రంగాలలో ప్రోత్సహిస్తారు. సమాజములో చురుకైన పాత్ర పోషిస్తారు. దేశ విదేశాలలో పేరు తెచ్చుకుంటారు. వీరి జీవితము స్నేహానికి అంకితము.

వీరికి బాల్యం నుంచి కూడా ఆసక్తి ఉండటం వల్ల సంగీతం, కళలు గురించి చాలా విషయాలు తెలుసుకొని ఉంటారు. వీరి యొక్క ఆలోచనా సరళి చాలా ప్రశాంతంగా ఉంటుంది. నిజాయితీ మార్గంలో వీరు జీవితాన్ని గడపడానికి ఇష్టపడతారు.

జీవితంలో, ఏదో ఒక రంగంలో ప్రత్యేక కీర్తిని పొందుతారు. వీరు దయామూర్తులు కావడం వల్ల, ఇతరులకు సహాయం చేసే విషయంలో వారు కోరడానికి కంటే ముందే మీరు వారికి సహాయపడతారు. ఇతరులపై ఆధారపడే ఏ పనిని కూడా చేయడానికి వీరు ఇష్టపడరు. వీరికి కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది, అలానే వీరు ప్రతిదీ కూడా తమ కుటుంబానికి అంకితం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు.

పూర్వఫల్గుణీ నక్షత్రం మొదటి పాదము
ఈ నక్షత్రములోని ఏ పాదంలో శిశువు జన్మించినా, సామాన్య దోషం కలుగుతుంది. ఈ దోష శాంతికి సామాన్య శాంతికి శిశువు ముఖాన్ని తండ్రి నూనెలో చూడాలి.

అబ్బాయి పుడితే ధనవంతుడు, ధర్మాత్ముడు, కార్య విచారమును ఎరిగిన వాడుగా, నృత్య శాస్త్రమున సమర్థుడుగా అవుతాడు.

స్త్రీ పుడితే ఉత్తమమైన సంతానం కలిగినదిగా, ధనవంతురాలుగా, శతృజయం పొందినదిగా అవుతుంది.

పూర్వఫల్గుణీ నక్షత్రం రెండవ పాదము
పూర్వఫల్గుణీ రెండో పాదములో జన్మించిన జాతకులకు 15 సంవత్సరముల వరకు శుక్ర మహర్దశ ఉంటుంది. 15 సంవత్సరముల నుంచి 21వ సంవత్సరముల వయస్సు వరకు రవి మహర్దశ ఉంటుంది.

21 సంవత్సరముల నుంచి 31 సంవత్సరముల వరకు ఈ జాతకులకు చంద్ర మహర్దశ ఉంటుంది. 31 నుంచి 38 సంవత్సరముల వరకు కుజ మహర్దశ ఉంటుంది. 38 నుంచి 56 సంవత్సరముల వరకు రాహు మహర్దశ ఉంటుంది.

56 సంవత్సరముల వయస్సు నుంచి 72 సంవత్సరముల వరకు గురు మహర్దశ ఉంటుంది. 72 సంవత్సరముల నుంచి 91 సంవత్సరముల వరకు శని మహర్దశ ఉంటుంది.


పూర్వఫల్గుణీ నక్షత్రం మూడోపాదము
పూర్వఫల్గుణీ మూడో పాదములో జన్మించిన జాతకులైతే.. జన్మించిన 10 సంవత్సరముల వయస్సు వరకు ఈ జాతకులకు శుక్ర మహర్దశ ఉంటుంది. ఇక 10 సంవత్సరముల నుంచి 16 సంవత్సరముల వరకు రవి మహర్దశ ఉంటుంది.

16 సంవత్సరముల నుంచి 26 సంవత్సరములు వరకు చంద్ర మహర్దశ ఉంటుంది. 26 నుంచి 33 సంవత్సరముల వరకు కుజ మహర్దశ. 33 సంవత్సరముల నుంచి 51 సంవత్సరముల వరకు రాహు మహర్దశ ఉంటుంది.

51 నుంచి 67 సంవత్సరముల వరకు గుర మహర్దశ. 67 సంవత్సరముల నుంచి 86 సంవత్సరముల వరకు శని మహర్దశ ఉంటుంది.

పూర్వఫల్గుణీ నక్షత్రం నాలుగో పాదము
పూర్వఫల్గుణీ నక్షత్రం 4వ పాదములో జన్మించిన జాతకులైతే జన్మించిన 5 సంవత్సరముల వరకు శుక్ర మహర్దశ ఉంటుంది. 5 సంవత్సరముల నుంచి 11 సంవత్సరముల వరకు శని మహర్దశ ఉంటుంది.

11 సంవత్సరముల నుంచి 21 సంవత్సరముల వరకు చంద్ర మహర్దశ ఉంటుంది. 21 నుంచి 28 సంవత్సరముల వయస్సు వరకు కుజ మహర్దశ ఉంటుంది. 28 నుంచి 46 సంవత్సరాల వరకు రాహు మహర్దశ ఉంటుంది.

46 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వరకు గురు మహర్దశ ఉంటుంది. 62 ఏళ్ల వయసు నుంచి 81 సంవత్సరముల వరకు శని మహర్దశ ఉంటుంది.

పూర్వఫల్గుణి నక్షత్ర జాతకులు పెంచవల్సిన వృక్షము
పూర్వఫల్గుణి నక్షత్రం వారు మోదుగ చెట్టుని పెంచడం, పూజించడం ద్వారా ఆయురారోగ్యాలు వృద్ధి చెందడమే కాకుండా, సంతానలేమి సమస్యల నుండి కూడా బయటపడతారు.

మఖ నక్షత్ర జాతకుల తారాఫలాలు
తార నామం - తారలు - ఫలం

జన్మ తార - భరణి, పూర్వ ఫల్గుణి, పూర్వాషాఢ - శరీరశ్రమ

సంపత్తార - కృత్తిక, ఉత్తర ఫల్గుణి, ఉత్తరాషాఢ - ధన లాభం

విపత్తార - రోహిణి, హస్త, శ్రవణం - కార్యహాని

సంపత్తార - మృగశిర, చిత్త, ధనిష్ట - క్షేమం

ప్రత్యక్ తార - ఆర్ద్ర, స్వాతి, శతభిష - ప్రయత్న భంగం

సాధన తార - పునర్వసు, విశాఖ, పూర్వాభాద్ర - కార్య సిద్ధి, శుభం

నైత్య తార - పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర - బంధనం

మిత్ర తార - ఆశ్లేష, జ్యేష్ట, రేవతి - సుఖం

అతిమిత్ర తార - అశ్విని, మఖ, మూల - సుఖం, లాభం
పుబ్బ నక్షత్ర ప్రయోజనాలు :
ఆకర్షణ మరియు కళాపరంగా ప్రతిభ: ఈ నక్షత్రంలో జన్మించిన వారు సహజంగా ఆకర్షణీయ వ్యక్తిత్వం కలిగి ఉంటారు. సంగీతం, నృత్యం, కళలు, నాట్యం వంటి రంగాల్లో ప్రతిభ కనబరుస్తారు.

శాంతమైన స్వభావం & సృజనాత్మకత
వారు మృదువైన స్వభావంతో, సృజనాత్మకతతో ఉండటం వల్ల ఇతరులను ఆకర్షిస్తారు.

ప్రజాసేవ & కమ్యూనికేషన్ స్కిల్స్
వారు మంచి వక్తలు, రచయితలు, మీడియా, పాలిటిక్స్ వంటి రంగాల్లో రాణించగలుగుతారు.

వైవాహిక జీవితం:
బాగుంటుంది, ఈ నక్షత్రం వివాహానికి అనుకూలమైనదిగా భావించబడుతుంది.

సంపద & ఆరామ జీవితం: శుక్రుడు గ్రహాధిపతిగా ఉండటం వల్ల, వారు విలాసవంతమైన జీవితం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

ముఖ్య విషయాలు:
పూర్వ ఫల్గుణి నక్షత్రంలో జన్మించిన వారు సాధారణంగా అదృష్టవంతులు మరియు గౌరవప్రదమైన వ్యక్తులు. వారు సమాజంలో గౌరవంగా పరిగణించబడతారు. వీరు సృజనాత్మకత మరియు కళాత్మకతలో రాణిస్తారు. వీరు ఇతరులతో సంబంధాలు బాగా కలిగి ఉంటారు.

సూచన:
పుబ్బ నక్షత్రానికి శుక్రుడు అధిపతి కావడం వల్ల, శుక్ర గ్రహ శాంతి లేదా పూజలు చేయడం, శుక్రవార పూజలు చేయడం అనుకూలంగా ఉంటుంది.


నిత్య స్తోత్రావళి

నిత్య పారాయణ శ్లోకాలు

స్తోత్రాలు

పంచాంగం

No comments:

Post a Comment