దశ మహావిద్యలలో రెండవ మహావిద్య శ్రీ తారా దేవి. శ్రీ తారావాక్కుకి అధిదేవత. తాంత్రిక దేవతలలో అత్యంత శక్తి వంతమైనది మరియు ఉగ్రమైనదిగా తారాదేవి భావించబడుచున్నది. ఏకష్టం నుంచైనా తరింపచేయగలశక్తి స్వరూపిణి తారాదేవి. ఈ తారావిద్య వాక్కుకు అధిదేవత. తార అంటే భయాన్ని పోగొట్టేది అని ఒక అర్థము, సంసార ప్రవాహము నుండి రక్షించేది అని మరో అర్థము, ఓంకార స్వరూపిణి, నాద స్వరూపిని అని మరో అర్థం కూడా చెబుతారు. తారాదేవిని మోక్షస్వరూపిణిగా భావిస్తారు.
నీలవర్ణంతో భాసించే ఈ దేవికి చైత్రమాసం శుక్లపక్ష నవమి తిథి ప్రీతిపాత్రమైంది. శ్రీ తారాదేవి వాక్కుకి అధిదేవత తాంత్రిక దేవతలలో అత్యంత శక్తి వంతమైనది మరియు ఉగ్రమైనదిగా తారాదేవి భావించబడుచున్నది. ఈ దేవిని నీలసరస్వతి అని కూడా పిలుస్తారు. తారాదేవి సాధనవల్ల శత్రునాశనం, దివ్యజ్ఞానం, వాక్సిద్ధి, ఐశ్వర్యం, కష్టనివారణ సాధకుడికి లభిస్తుంది. వశిష్ట మహర్షి గొప్ప తారా ఉపాసకుడు అని చెబుతారు.
తరింప చేయు శక్తితార. దేనినుంచి తరింపచేయటం? కష్టాలు, బాధలు, అజ్ఞానం, పేదరికం, ఆపదలు, భయాలు, తెలివి తక్కువ తనం ఇత్యాది. ఏకష్టం నుంచైనా తరింప చేయగలశక్తి స్వరూపిణి తారాదేవి.
ఒక రకంగా చెప్పాలంటే ప్రపంచం మొత్తం మీద అందరూ రకరకాలైన పేర్లతో ప్రార్థిస్తున్న జగన్మాత తారాదేవియే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరైనా కోరేది ఆపదలనుండి తరింప చేయ మనీ, సుఖాన్ని ఇవ్వమనీ అంతేకదా. కనుక తెలిసో తెలియకో అందరూ ప్రార్థిస్తున్నది ఈదేవినే. కాని ఈవిద్యను ఉపదేశపూర్వకంగా తెలుసుకుంటే ఆలస్యం లేకుండా చక్కగా సూటిమార్గంలో ప్రయాణం చేసిగమ్యం చేరవచ్చు. తారా మహాదేవి కాళీ కంటే వేరు కాదు. ఈమె జగన్మాత రూపాలలో ఒకటి. వీరందరూ వేర్వేరు అని తలచుటతప్పు అని తంత్రములు చెప్పాయి. నిజానికి వీరందరూ ఒకే ఆద్యాశక్తి యొక్క వివిధ రూపాలు అని చెప్పవచ్చు.
తారా దేవి ఆవిర్భావం
పురాణకథనము ప్రకారము పూర్వము హయగ్రీవుడను దానవుడు వేదములను అపహరించి, సముద్రములో దాగిన సమయంలో, మత్స్యమూర్తియైన హరి, వానిని సంహరించి వేదోద్ధరణమును గావించినాడు. బృహన్నీల తంత్ర ప్రకారము తారాదేవి హయగ్రీవుని అంతమొందించి, వేదోద్ధరణను గావించెను అని చెబుతారు.
ఒక కథనం ప్రకారం తార రాక్షస సంహార శక్తి హయగ్రీవ అనే రాక్షసుడు దేవతలను బాధించి, వారి పట్టణమైన అమరావతి నుండి దేవతలను వెళ్ళగొట్టాడు. అప్పుడు దేవతలు బ్రహ్మను శరణువేడారు. బ్రహ్మ వారిని కాళీ వద్దకు పంపుతాడు. అప్పుడు కాళిమాత తన మూడవ కంటి నుండి ఒక దేవతను సృష్టిస్తుంది. ఆమెయే తార. ఈమెను రాక్షసుడైన హయగ్రీవుని మీదకు యుద్దానికి పంపుతుంది. ఈయుద్ధంలో తారచేతిలో హయగ్రీవుడు హతుడౌతాడు.
తృ అనే ధాతువు నుంచి 'తార' అనే శబ్దం పుట్టింది. తృ అంటే దాటించేది, అనగా తన భక్తుల్ని కష్టాల నుంచి దాటించేది అని తార శబ్దానికి అర్ధం. ఈ తారావిద్య వాక్కుకు అధిదేవత. తార అంటే భయాన్ని పోగొట్టేది అని ఒక అర్థము, సంసార ప్రవాహము నుండి రక్షించేది అని మరో అర్ధము, ఓంకార స్వరూపిణి, నాద స్వరూపిని అని మరో అర్ధం కూడా చెబుతారు. తారాదేవిని మోక్షస్వరూపిణిగా భావిస్తారు.
తారాదేవి నవయౌవనముతో ప్రకాశిస్తుం టుంది. ఈ శక్తి ఘోర-అఘోర రూపములలో దర్శనమిస్తుంటుంది. నీలి నాగమును జటలకు అలంకరించుకుంటుంది. ముండమాలను ఒడ్డాణముగా ధరిస్తుంది. శ్వేతనాగులను పోలిన కుండలములను ధరిస్తుంది. శక్తిని కోల్పోయి భూమధ్యమున అచేతనముగ నున్న ప్రేతముపై నిలబడి ఉంటుంది. అహోరియైనపుడు తళుకుల తారా ప్రకాశముతో శరణుకోరిన వారిని తరింప చేస్తుంటుంది. సంస్కృత ధాతువు నుండి జనించిన తార శబ్దము భవసాగరమును దాటించునది అనే అర్ధములో అమ్మ కారుణ్యధారను తెలియచేస్తుంది.
తారామాత స్వరూపం అచ్చం కాళీమాత లాగానే ఉంటుంది. కానీ కాళీ మాత నలుపు రంగులో ఉంటే తారామాత నీలం రంగులో ఉంటుంది. తారామాత రూపం భయంకరంగా ఉన్నా అమె కారుణ్య మూర్తి.
కమలము-ఖడ్గము-కత్తెర-గద వంటి ఆయుధములను ధరించి ఉంటుంది. నీలిరంగులో ఉంటుంది. కమలము సృష్టికి గుర్తు. కత్తెర అవిద్యకు ప్రతీక. ఖడ్గము పశుభావమును సూచిస్తుంది. దిక్కులకు ప్రతీకగా తల్లి పులి చర్మమును ధరించి ఉంటుంది. నాద సృష్టియైన ముండమాలను ధరించియుంటుంది. పాత్రలోని రక్తము రజోగుణమునకు, కామక్రోధాదులకు సంకేతం. నిష్క్రియత్వమును సూచిస్తున్న అచేతన శివ శరీరము మీద నిలబడిఉంటుంది.
ధారణాశక్తికి మూలం తార

మంత్ర భేదాలతో ఈ విద్య తార, ఏకజట, ఉగ్ర తార, నీల సరస్వతి అనే విధాలుగా ఉన్నది. ముఖ్యంగా ఈ దేవి కృపవల్ల కవిత్వశక్తి, ధారణా శక్తి, జ్ఞానశక్తి కలుగుతాయి. పాండిత్యాభిలాషులు సాధారణంగా తారా మంత్రోపదేశం కలిగి ఉంటారు. తారానుగ్రహం వల్ల అనర్గళమైన వాక్శక్తి , మంచి జ్ఞాపకశక్తి, వాక్సుద్ధి కలుగుతాయి.
సీతారామ శబ్దములోని స్త్రీపురుష శక్తులే తారా అని, శ్రీరామా నవమి నాడు తారా పూజ అత్యంత ఫలవంతమని తంత్రశాస్త్రము భావిస్తుంది. అవలోకేశుని భార్యగా తారాదేవిని బౌద్ధమతము

విశ్వసిస్తుంది.
గౌరీ అని, ఓంకారము అని వేద పురాణాల్లో చెప్పబడిన మాతయే తంత్రమందు తార అని చెప్పబడినది అని కావ్యకంఠ గణపతి ముని తారా తత్వమును గురించి చెబుతారు. అంటే తార అంటే ప్రణవోపాసన. వాక్కును, అర్థాన్ని ఉపాసించడమే.
తరింపజేయు శక్తి తార. ముఖ్యంగా ఈ దేవి కృపవల్ల కవిత్వశక్తి, ధారణా శక్తి, జ్ఞాన శక్తి కలుగుతాయి. తరింపచేయడమే తార తత్వం. తారని ఉగ్రతారగా, ఏకజటగా పిలుస్తూ త్రంలో కూడా ఉపాసిస్తారు.

ఇతర మహావిద్యల వలెకాక తారావిద్య బౌద్ధ జైనమతాలలో కూడా ప్రవేశించింది. జ్ఞానానికి అధిదేవతగా, కరుణామూర్తిగా, ఆపదలనుంచి కాపాడే దయామయిగా తారాదేవి ఆయా మతాలలో పూజింపబడుతున్నది.
తారాదేవి రూపం కొన్ని కొన్నిసార్లు సరస్వతీదేవి రూపంలా ఉంటుంది. కనుక ఇద్దరూ ఒకటే అని కొందరు అంటారు. తారా మంత్రాలలో ప్రాంతీయ మంత్రాలు కొన్ని ఉన్నాయి. అవి శాబర మంత్రాలవలె ఉండి చూడగానే సంస్కృత భాషా మంత్రాలు అని అనిపించవు. అయినా కూడా ఇవి సంస్కృత మంత్రాల కంటే ప్రభావ వంతములు అంటారు. వీటికి అవైదికక్రియా కలాపాలతో సంబంధం ఉంటుంది. అందుకని శిష్టాచారసంపన్నులు వీటి జోలికిపోరు.
ఇహపర మోక్షదాయిని తారాదేవి
ఇహపర మోక్షదాయిని తారాదేవి
తారా సాధకునికి చతుర్విధ పురుషార్ధాలు శీఘ్రంగా లభిస్తాయి. భవ సాగరాన్ని దాటి మోక్షాన్ని పొందాలంటే తారాసాధన చాలా శీఘ్ర ఫలదాయిని. తారాదేవి ఇహమున భోగాన్ని పరమున మోక్షాన్ని ఇవ్వ గలదు. ఈదేవి సంసారులకు సన్యాసులకు సమానంగా వరదాయిని. సంసారులకు ఈతిబాధలను పోగొట్టగలదు. సన్యాసులకు ఆంతరిక శత్రువులైన కామాది షడ్వర్గములను సునాయాసంగా దాటించి మోక్షాన్ని కరతలా మలకం చేయగలదు.
లోకాద్భుతమైన పనులలో ఉన్నప్పుడు అవ్యయ కాంతితో తల్లి గౌరిగాను, లోకసృష్టి రచనను చేయుచున్నప్పుడు నీలిరంగు గాను, లోకమాత అయినపుడు చిత్ర వర్ణముగాను తారా మాత దర్శనమిస్తుందట. తాను నిర్వర్తించుచున్న పనుల వైఖరిని బట్టి తెలుపు, నీలము, పసుపు ఎరుపు ఆకుపచ్చ రంగులతో అమ్మవారు సంకేత రూపంలో భక్తులకు దర్శనమిస్తుందని అంటారు. సర్వ వర్ణోప శోభితకు ఆమె భక్తులు సాష్టాంగ దండ ప్రణామములు చెబుతారు.
అద్భుత రామాయణ కథనము ప్రకారము దేవతల ప్రార్థనలనలకు ప్రసన్నయై , కాళిశక్తి తన మహోగ్ర రూపమును కొంతవరకు ఉపశమింప చేసుకొని, తారాశక్తి రూపముగా ప్రకటి తమైనదని నమ్ముతారు. ఆ సమయమున రుద్రుడు తారాశక్తిని తన గురువుగా గుర్తించి, పాదా క్రాంతుడై, తనకు బ్రహ్మవిద్యను భోదించమనినాడను కథనము కూడ ప్రచారములో కలదు.
తారాదేవికి మూడు రూపాలు
తారాదేవికి మూడు రూపాలున్నాయి.
1.ఉగ్రతార,
1.ఉగ్రతార,
2. నీలసరస్వతి,
3.ఏకజట.
3.ఏకజట.
వాక్కు అంటే శబ్దం. ఆది శబ్దం ఓంకారం కనుక ప్రణవాన్ని (ఓంకారాన్ని) ఉపాసించినా అది తారదేవి ఉపాసనే అవుతుంది. లలితాదేవి మంత్రిణి అయిన శ్రీ శ్యామలాదేవి ఆజ్ఞతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఆ తారాదేవి తరణీశ్వరి అనీ, మహాశక్తి స్వరూపిణి అని ఈ బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానం మనకి తెలియజేస్తుంది.
బెజవాడ కనకదుర్లే తారాదేవా?
జ్యోతిర్విద్యలో ఈ దేవి బుధ గ్రహాది దేవతగా చెప్తారు. దానికి తగినట్లే ఈమె రూపం కూడాపొట్టిగా, కొంచెం పెద్దపొట్టతో, ఎప్పుడూ నవ్వు ముఖంతో ప్రసన్నంగా ఉంటుంది. బుధ గ్రహానికి కూడా ఇదే రూపం ఉన్నట్లు జ్యోతిర్వేత్తలు అంటారు. విజయవాడ కనకదుర్ణమ్మగా ఈనాడు పూజ లందుకుంటున్న మూర్తి నిజానికి తారాదేవి అని బౌద్ద సాంప్రదాయంలో చెబుతారు. హుఎన్ సాంగ్ మన దేశానికి వచ్చినపుడు, ఆయన అమరావతి వద్ద గల ధరణికోటకు వచ్చి అక్కడ తాంత్రిక బౌద్ధం అభ్యాసం చేసాడు. అప్పుడు దారిలో విజయవాడ ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఆయనకు
పెద్దవెలుగు కనిపించిందని చెప్పాడు. అది తారాదేవి యొక్క తేజో రూపదర్శనం అని భావించాడు.
టిబెటన్ తంత్రంలో తారాదేవిని పదహారేళ్ళ బాలికగా భావిస్తారు. ఈ భావన షోడశీ భావనకు దగ్గరిది. పదహారు కళల చంద్రుడు ఎలాగైతే పూర్ణంగా వెలుగుతూ తన చల్లని వెలుగుతో లోకానికి చల్లదనం ఇస్తున్నాడో అదే విధంగా తారా దేవికూడా తన చల్లని వెలుగుతో కరుణాపూరిత హృదయంతో బాధలనుంచి కాపాడుతుంది అని భావన.
ఏదైనా రెండు అవస్థలమధ్య సందిగ్గంలో పడి తీరాన్ని చేరలేక ఉన్నవారికి తారాదేవి ఉపాసన చక్కని మార్గం చూపటమే గాక మార్గంలో గల ఆటంకాలను తొలగించగలదు. సమస్యలన్నీ అనుకోకుండా దూది పింజలవలె తేలిపోవటం తారాసాధకులకు అనుభవంలోకి వస్తుంది. ఆపదలనుంచి తరింపచేయటం తారాదేవి ప్రధానలక్షణం.
ఈమె ఆకు పచ్చ రంగులోనూ, కొన్ని రూపాలలో నీలం రంగులోనూ ఉంటుందని తాంత్రిక వేత్తలు చెబుతారు. నిజానికి ఈమె ఏ రూపంలో అయినా సాధకునికి దర్శనం ఇవ్వగలదు. ప్రసన్నమైన రూపాల నుంచి అతి భయంకరమైన రూపాల వరకూ ఏ రూపాన్నైనా ఈమె ధరించగలదు.
ఉగ్రతార, స్మశానతార మొదలైన రూపాలు అతి భయంకరంగా ఉంటాయి. ఆషామాషీ సాధకులు ఈ దర్శనాలు తట్టుకోలేరు అంటారు.
తారాదేవిని త్రిమూర్తులకు జన్మ నిచ్చిన ఆదిశక్తిగా వర్ణిస్తారు. తారా రూపం చాలాసార్లు ప్రసన్నంగా, కరుణామయిగా, దయా స్వరూపిణిగా ఉంటుంది. జీవులు పడే బాధలు ఆమెకు తెలుసు గనుక, దయా హృదయంతో తనను ఆశ్రయించిన వారికి ఆ బాధలు పోగొట్టటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. తారామాత పుట్టుక గురించి తంత్రంలో ఓ కథ బాగా ప్రచారంలో ఉంది. క్షీరసాగరాన్ని చిలుకుతున్నప్పుడు ఉద్భవించిన హాలా హలాన్ని లోకరక్షణకై లోకనాయకుడైన పరమేశ్వరుడు స్వీకరించాడు. కానీ దాని ప్రభావం నుండి పరమేశ్వరుణ్ణి తప్పించడానికి ఆ జగన్మాత శ్రీ తారాదేవి రూపంలో ప్రత్యక్షమై ఆయనకు తన చనుబాలనిచ్చి ఆ విష ప్రభావాన్ని తగ్గించింది. ఆ అమృతాన్ని తాగటం వల్లనే శివుడు ఆ భయంకర విషం యొక్క ప్రభావం నుంచి బతికి బయట పడ్డాడని తంత్రాలలో ఈ గాధ చెబుతున్నది. ప్రపంచాన్ని ఉద్దరించటానికి వచ్చే (ప్రవక్తలందరూ ఆమె బిడ్డలే అని బౌద్ధంలో భావిస్తారు. ఆమె 'కరుణ” అనే భావనకు ప్రతిరూపం.

కాళీమాత, తారాదేవి ఇద్దరు ఒకే విధంగా కనిపిస్తారు. ఇద్దరూ శివుని మీదే నిలబడి కనిపిస్తారు.
అయితే కాళీ రంగు నల్లగా వర్ణించబడగా, తార నీలం రంగులో వర్ణించబడుతుంది. తార పులిచర్మంతో కనిపించగా, కాళి మానవ చేతులతో చేసిన దండను ధరించి దర్శన మిస్తుంది. ఇద్దరూ మానవ శిరస్సు లతో చేయబడిన దండను మెడలో ధరిస్తారు. ఇద్దరూ నాలుక చాచి ఉంచి, అందులోనుండి రక్తం కారుతుండగా దర్శనమిస్తారు. తార ప్రతాలిథా భంగిమలో కనిపిస్తుంది. (ఎడమ పాదం ముందుకు ఉన్న స్థితి). తారకు అష్ట తారా అని పిలువబడే ఎనిమిది రూపాలు ఉన్నాయి. ఏకాజట, ఉగ్రతారా, మహోగ్రా, కామేశ్వరి, చాముండా, నీల సరస్వతి, వజ్రా, మరియు భద్రాకాళి. తారా తన మాతృ ప్రవృత్తి కారణంగా భక్తుడికి లేదా తాంత్రికకు మరింత చేరువవుతుందని అంటారు.

బొడ్డుతాడు ఏవిధముగా తల్లికి, పెరుగుచున్న శిశువుకు వారథిగా ఉండి సహాయపడుతుందో అదే విధముగా కాళి తత్త్వమునుండి తనకు కావలిసినవి స్వీకరించి కొత్తరూపును సంతరించుకున్నది తారాదేవి. కాళిని నల్లని చీకటిగా కనుక మనము భావిస్తే దానిని చీల్చుకొని తేజమును అంటే శబ్దమును వెంట తీసుకుని వచ్చిన శక్తి తార. మూలమైన శక్తి కాళియై సృష్టిని చేసింది. ఇంకొక శక్తిని ప్రకటింపచేసి, సృష్టిలోని అజ్ఞానమును కత్తిరించమంది. అందుకు వెలుగును, వాక్కును సహాయకారులుగా పంపించింది.
గగనవీథి మెరుపుగా ఆశీర్వదించిన తల్లి
గగనవీథి మెరుపుగా ఆశీర్వదించిన తల్లి
తారదేవి మహావిద్యగా, అంతరాత్మగా, అతీత సౌందర్యవతిగా సాధకునకు అనుభవానికి వస్తుంది. మధ్యమా-వైఖరీ వాగ్దశలుగా తారాశక్తి పరిణమిస్తుంది. నాఖీచక్రము నివాసస్థానమైనప్పటికిని, ధ్వనులు పైకిపైకి సాగి మెదడులోని భావములను తాకు సమయమున ఆజ్ఞా చక్రములోను తల్లి విహరిస్తుంటుంది. వ్యక్తావ్యక్త వాక్స్వరూపమైన తల్లి సమయాను సారముగా సంచరిస్తుంటుంది. గణపతిముని అమ్మను విశుద్ధచక్ర నివాసినిగా గుర్తించి కీర్తించారు. వశిష్టముని అమ్మ సాక్షాత్మారమును పొంది ధన్యుడైనాడు. గురుగ్రహాధిదేవత తారాదేవి. కావ్యకంఠ గణపతి ముని ఉమాసహస్ర రచనమును గగనవీధి మెరుపుగా ఆశీర్వదించిన తల్లి తారాదేవి.
చైత్ర శుక్ల నవమి ఇష్టమైన తిథి. అవతారములలో శ్రీరామావతారముగా ప్రసిద్ధికెక్కినది. తృ అను ధాతువు నుండి పుట్టినది తార. తార అంటే నక్షత్రం అనే అర్థం అనేక భాషలలో కూడా ఉంది. తారా మహావిద్య శబ్దశక్తియే అయినప్పటికిని శబ్దగుణమైన ఆకాశ సంబంధము లేకుండుట ప్రత్యేకత. తారాదేవి వేదత్రయిగా మారినప్పుడు “శుక్ల” అను నామము తోను, సత్యసత్య మిశ్రమమైనపుడు “చిత్ర” అను నామముతోను, రాక్షస సంహారము చేసినపుడు “నీల” గాను కీర్తింపబడుతోంది. శబ్దార్థములలోని లోతులలో దాగిన నిక్షేపములను ప్రచోదనము చేయు శక్తే తార.

తారాదేవి ముఖ్యముగా వాగ్రూపశక్తి వాక్కుపర, పశ్యంతీ, మధ్యమ, వైఖరి అని నాలుగు విధములుగా విభజింపబడినది. స్థూలములో గమనిస్తే ఉరుములు, చెట్టు కొమ్మలనుండి వచ్చు శబ్దములు, అలల ఘోష, జంతువుల అరుపులు, మానవ సంభాషణలు తారా మాత వాగ్రూపముగా చెప్పుకొనవచ్చును. మూలము నుండి బయలు దేరిన వాక్కు దర్శనమై, భావమై, భాషయై బహుముఖముల విరాజిల్లుతుంటుంది. కాళిమాత మన గుండెను పనిచెయిస్తుంటే, తారామాత మన వాక్కుకు వారధియై వ్యక్తపరిచేటట్లు చేస్తుంది. తల్లీ నీవు అత్యంత దయతో నీ నివాసమైన నా నాభీక్షేత్రము నుండి నాకొరకై పైపైకి పాకుతు మూల కారణమైన పరావాక్కును పశ్యంతీగా దర్శింపచేస్తూ, మధ్యమగా దానిని భావముగా మారుస్తా, వైఖరిగా భాషను అలది బహుముఖములుగా వీనుల విందు చేయుచున్నావు. నిన్ను ప్రస్తుతించక మనగలనా తల్లీ. ధన్యోస్మి మాతా ధన్యోస్మి
హిమాలయ ప్రాంతాలలో ఇప్పటికీ క్రూరమృగాలు ఎదురైనపుడు తారాదేవిని స్మరించటం వల్ల అవితొలగిపోవటం సర్వ సాధారణమట. ఇవి మనం నమ్మము కాని భక్తితో అమాయకంగా ప్రార్థించే హిమాలయ పల్లె ప్రజలకు తారాదేవి చూపిన ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. బౌద్ధంలో తారాదేవిని అందరు బుద్దులకు తల్లిగా భావిస్తూ ఒక భావన ఉన్నది. ఎందుకంటే బుద్ధత్వం అనేస్థితి పొందినవారు తమ నిర్వాణం తాము చూచుకోకుండా లోకాన్ని ఉద్దరించటానికి కరుణతో పనిచేస్తారు కనుక ఆ కరుణ భావన అనేది తారాదేవి స్వరూపమే అనితలుస్తారు. కనుకనే అవలోకితెశ్వర బోధిసత్వుని పక్కనే తారాదేవికొలువై ఉన్నట్లు మనం విగ్రహాలు చూడవచ్చు. దీని అర్థం ఆయనలో ఉన్నటువంటి కరుణా భావమే తారా స్వరూపం అని. మనదేశంలో తారాదేవి యొక్క దేవాలయాలు బెంగాల్, అస్సాం, హిమాలయ ప్రాంతాలు, ఇంకా నేపాల్, టిబెట్టులలో ఉన్నాయి.
హిందూతంత్రముల నుండి బౌద్ద తంత్రముల లోనికి వెళ్లి అక్కడ అత్యున్నత స్థానాన్ని పొంది నేటికీ నేపాల్, టిబెట్, అస్సాం, ఇంకా హిమాలయ సానువులలో ఆరాధించబడుతున్న శక్తితార. మన తంత్ర గ్రంధాలు అన్నీ నాశనం అయినా అవి చాలావరకూ టిబెట్టులో భద్రంగా ఉన్నాయి. క్రీ శ 1000 ప్రాంతంలో బెంగాల్ నుండి టిబెట్టుకు వెళ్లి అక్కడ మొదటి తంత్ర గురువుగా పరిగణింపబడుతున్న అతిశదీపాంగారుడు మొదటగా తారావిద్యను టిబెట్టుకు పరిచయం చేశాడు. ఆయనకు తారాదేవి ప్రత్యక్షమై నీవు టిబెట్టుకు వెళ్ళటంవల్ల నీ ఆయువు క్షీణిస్తుంది. కాని నీవల్లకొన్ని వేలమంది జ్ఞానాన్ని పొందగలుగుతారు. నీకు ఏం కావాలి? అని కోరితే తన ఆయువు తగ్గినా పరవాలేదు. అంత మంది తనవల్ల మోక్షాన్ని పొందగలిగితే చాలు అంటూ విలువైన తంత్ర గ్రంధాలను టిబెటన్ భాషలోకి అనువదిస్తాడు. నేడు మన దేశంలో అగ్నికి ఆహుతి అయిన తంత్రగ్రంధాలు టిబెట్టులో భద్రంగా ఉన్నాయి. వాటిని మళ్ళీ టిబెట్ భాష నుంచి సంసృతంలోకి అనువాదం చేసేపని కొందరు చేస్తున్నారు.
బౌద్ధంలో ఈ మాత పూజకు చాలా ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా తాంత్రిక బౌద్ధంలో తారామాత యొక్క ఉపాసనకు చాలా విశిష్టత ఉంది. బౌద్ధంలో ఈ దేవికి సంబంధించిన మంత్రాలన్ని పాళీ భాషలో ఉన్నాయి. టిబెట్, చైనా, థాయిల్యాండ్, జపాన్, మంగొలియా దేశాల్లో ఈ దేవి పూజకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ దేవికే 'నీల సరస్వతి” అనే పేరు కూడా ఉంది.
శ్రీచక్ర ఆవరణ దేవతలలో తారిణి
శూన్యంలో కూడా ప్రయాణించగల మనో తరంగ విశ్వసృష్టి స్పందన. దీన్ని తారా దేవి తెలియ జేయగలదు. మన సాంప్రదాయంలో శ్రీవిద్యలో ఈదేవిని శ్రీచక్ర ఆవరణ దేవతలలో ఒకరైన తారిణిగా పూజిస్తారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో తారాపీఠ్ గ్రామంలో శ్రీ తారాదేవి యొక్క ఆలయం వున్నది. తార అభయప్రదాత. ఆమె ఆపదలనుండీ కాపాడుతుంది. మోక్షజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. భయంకర విపత్తులనుంచి భక్తులను రక్షిస్తుంది కాబట్టీ, ఈమెను 'ఉగ్రతారా' రూపంలో కూడా యోగులు ఆరాధిస్తారు.
తారాదేవి దేవాలయములు
సిమ్లాకు వెళ్ళే దారిలో అంటే కాల్కా సిమ్లా జాతీయ రహదారిపై సిమ్లాకు 11 కి.మీ. దూరంలో తారాదేవి దేవాలయం ఉంది. ఇది 250 ఏళ్ళకు పూర్వమే వెలసిందని కథనం.

పశ్చిమ బెంగాలులో రాజాభూపేంద్రసేన్‌కు వేటలో గోచరమై తనకు గుడి కట్టమని చెప్పింది. ఆమెనే ఆ తర్వాతికాలంలో రాజాబల్‌బీర్ సేన్ (భూపేంద్ర తర్వాతి తరాలకు చెందిన రాజు)కు తారావ్ పర్వతం మీద, సిమ్లాలో నేడు తారాదేవి దేవాలయం ఉండేచోట తనను ప్రతిష్టించమని చెప్పిందిట. అలా తారావ్ పర్వతంమీద వెలసింది తారాదేవి. తారాదేవి విగ్రహాన్ని శంకర్ అనే పేరుగల ఏనుగుపై ఊరేగించి ప్రతిష్ట చేశాడా రాజు. ఈ తారాదేవి గుడికి సమీపంలోనే సంకట మోచన హనుమాన్ మందిరమూ ఉంది. ఎలాంటి కాలుష్యానికీ తావులేని సుమనోహర సుందర ప్రదేశం 'తారాదేవి దేవాలయం. ఆ ప్రదేశం ఎంత ఆహ్లాదాన్ని స్తుందో ఆ తల్లికూడా తన భక్తులను అంత చల్లగా చూస్తుంది.
సిమ్లాతోపాటు బెంగాలులో, ఇంకా మరెన్నో పవిత్ర ప్రదేశములలో తారాశక్తి మందిరములు కలవు.
తారా స్తోత్రపఠనం వలన సిద్దించే లాభాలు
శ్రీ తారాదేవి శీఘ్రఫలదాయనిగా ప్రసిద్ధిగాంచినది. ఈ తారాదేవి స్తోత్ర పఠనంవల్ల వాక్‌శుద్ది, శత్రునాశనం, దుష్టగ్రహబాధలు, దివ్యజ్ఞానం, ఐశ్వర్యం, కష్టనివారణ మొదలగు వాటిని ప్రసాదించే భగవతిగా శ్రీ తారాదేవి పూజింపబడుతుంది.

No comments:
Post a Comment