చైత్ర నవరాత్రి, బసంత నవరాత్రి అని కూడా పిలువబడే వసంత నవరాత్రి, వసంత ఋతువులో (మార్చి-ఏప్రిల్) దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను, తొమ్మిది రోజుల పాటు పూజిస్తారు. ఇది మనలోని ఆధ్యాత్మిక శక్తిని పునరుద్ధరించడానికి ఎంతో ఉపయోగకారి. ఈ నవరాత్రులు ఉపవాసాలు, దుర్గా అమ్మవారి పూజలు ఉంటాయి. ఈ నవరాత్రులు రామ నవమితో ముగుస్తాయి.
వసంత నవరాత్రి యొక్కప్రాముఖ్యత:
ఈ రోజు నుండి చాంద్రమాన నూతన సంవత్సరం (ఉగాది/గుడి పడ్వా) ప్రారంభం. మరియు మనలోని ఆధ్యాత్మిక, భౌతిక, మరియు మేధోపరమైన శక్తిని పెంచుకోవడానికి అత్యంత కీలకమైన సమయం.
వసంత ఋతువులోకి ప్రవేశాన్ని సూచించే చైత్ర మాసంలో ఈ నవరాత్రులు జరుపుకుంటారు.
ఈ తొమ్మిది రోజులు భక్తులు శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి మరియు సిద్ధిదాత్రితో సహా దుర్గా (నవదుర్గ) తొమ్మిది రూపాలను పూజిస్తారు.
ఘటస్థాపన ప్రారంభం తో, రోజువారీ ఉపవాసం, దేవి మహత్యం (చండీ పారాయణం) దుర్గా సప్తశతీ పారాయణం మరియు ఆయుధ పూజ చేయడం వంటివి సాధారణ పద్ధతుల్లో ఉన్నాయి.
నవరాత్రుల సమయంలో అమ్మవారిని మీ ఇంటికి ఆహ్వానించే ప్రక్రియనే ఘటస్థాపన అంటారు. సంపూర్ణ ఘటస్థాపన పూజను మొదటి రోజున చేస్తారు. మొదటి రోజు ఘటస్థాపన పూర్తయిన తర్వాత, ఆ ఘట/కలశాన్ని దేవి సజీవ స్వరూపంగా భావిస్తారు. కాబట్టి, రెండవ రోజు నుండి నవరాత్రులు ముగిసే వరకు, అమ్మవారి స్వరూపంగా భావించి ఆ ఘట/కలశంపై ప్రతిరోజూ క్రమం తప్పకుండా పూజలు చేస్తారు. 10వ రోజున, పూజను పూర్తి చేయడానికి ఘట విసర్జన చేస్తారు.
తొమ్మిది రోజుల దేవతారాధన:
1వ రోజు : మా శైలపుత్రి (పసుపు)
2వ రోజు: మా బ్రహ్మచారిణి (ఆకుపచ్చ)
3వ రోజు: మా చంద్రఘంట (బూడిద రంగు)
4వ రోజు: మా కుష్మాండ (నారింజ)
5వ రోజు: మా స్కందమాత (తెలుపు)
6వ రోజు: మా కాత్యాయని (ఎరుపు)
రోజు 7: మా కాళరాత్రి (రాయల్ బ్లూ)
8వ రోజు: మా మహాగౌరి (గులాబీ రంగు)
9వ రోజు: మా సిద్ధిదాత్రి (ఊదా/రామ నవమి)
సిద్ధ కుంజికా స్తోత్రం
1వ రోజు : మా శైలపుత్రి (పసుపు)
2వ రోజు: మా బ్రహ్మచారిణి (ఆకుపచ్చ)
3వ రోజు: మా చంద్రఘంట (బూడిద రంగు)
4వ రోజు: మా కుష్మాండ (నారింజ)
5వ రోజు: మా స్కందమాత (తెలుపు)
6వ రోజు: మా కాత్యాయని (ఎరుపు)
రోజు 7: మా కాళరాత్రి (రాయల్ బ్లూ)
8వ రోజు: మా మహాగౌరి (గులాబీ రంగు)
9వ రోజు: మా సిద్ధిదాత్రి (ఊదా/రామ నవమి)
తొమ్మిదవ రోజును శ్రీరాముని జన్మదినమైన రామ నవమిగా జరుపుకుంటారు.
వసంత నవరాత్రులకు సంబంధించిన మూలం వెనుక కథ
ఒకానొకప్పుడు, మహారాజైన ధ్రువసింధు వేటకు వెళ్ళినపుడు ఆయనను సింహం చంపివేసింది. యువరాజు సుదర్శనుడికి రాజ్యాభిషేకం చేయడానికి సన్నాహాలు జరిగాయి. కానీ, మహారాణి లీలావతికి తండ్రి, ఉజ్జాయినీ రాజ్యానికి రాజయిన యుధజిత్తు,, మహారాణి మనోరమకు తండ్రి, కళింగ రాజ్యానికి రాజయిన వీరసేనుడు తమ తమ మనవళ్ళ కోసం కోసల రాజ పీఠాన్ని కైవసం చేసుకోవాలన్న కోరిక కలిగి ఉన్నారు. వాళ్ళు ఒకరితో మరొకరు యుధ్ధం చేసారు. యుధ్ధంలో రాజు వీరసేనుడు మృతి చెందాడు. మనోరమ యువరాజు సుదర్శనుడినీ, ఒక నపుంసకుడినీ తోడు తీసుకుని అడవిలోకి పారిపోయింది. వాళ్ళు ఋషి భరద్వాజుని ఆశ్రమంలో తలదాచుకున్నారు.
విజితుడయిన రాజు యుధజిత్తు, అప్పుడు కోసల రాజధాని అయిన అయోధ్యలో, తన మనుమడయిన శత్రుజిత్తుని పట్టాభిషిక్తుని చేసాడు. అతను ఆ తరువాత, మనోరమను ఆమె కొడుకునూ వెతుక్కుంటూ బయలుదేరాడు. తనను రక్షణ కోరిన వారిని అప్పగించనని ఋషి సెలవిచ్చాడు. యుధజిత్తు కోపోద్రిక్తుడయ్యాడు. అతను ఋషిపై దాడి చేద్దామని అనుకున్నాడు. కానీ, అతని మంత్రి అతనికి ఋషి వ్యాఖ్యకు సంబంధించిన నిజాన్ని చెప్పాడు. యుధజిత్తు రాజధానికి వెనుదిరిగాడు.
యువరాజు సుదర్శనుడిని అదృష్టదేవత వరించింది. తపస్వి కుమారుడు ఒక రోజు వచ్చి, నపుంసకుడిని తన సంస్కృత నామమయిన క్లీబ అన్న పేరుతో పిలిచాడు. యువరాజు మొదటి శబ్దమయిన క్లిను పట్టుకుని దానిని క్లీం అని సంబోధించడం మొదలు పెట్టాడు. ఆ అక్షరం చాలా శక్తిమంతమయిన, పవిత్రమయిన మంత్రం. అది దేవీ మాతకు బీజాక్షరం (మూల అక్షరం). యువరాజు ఈ అక్షరాన్ని మాటిమాటికీ పలకడం వలన అతనికి మనశ్శాంతి, దేవి మాత అనుగ్రహం కలిగింది. దేవి అతనికి దర్శనం ఇచ్చి, ఆశీర్వదించి, అతనికి దైవికమైన ఆయుధాలను, ఎప్పటికీ తరిగిపోని అంబులపొదినీ వరంగా ఇచ్చింది.
వారణాసి రాజదూతలు ఋషి ఆశ్రమం గుండా పయనించినపుడు ఉదాత్తమైన యువరాజు సుదర్శనుడిని చూసి, అతనిని వారణాసి రాజు కుమార్తె అయిన యువరాణి శశికళకు వరుడిగా ప్రతిపాదించారు.
యువరాణి తన వరుడిని ఎన్నుకునే స్వయంవరం ఏర్పాటు చెయ్యబడింది. శశికళ వెంటనే సుదర్శనుడిని వరించింది. వారికి శాస్త్రోక్తంగా వివాహం జరిగింది. ఆ పెళ్ళిలోనే ఉన్న రాజు యుధజిత్తు, వారణాసి రాజుతో యుధ్ధం చేయడం మొదలు పెట్టాడు. దేవీ మాత సుదర్శనుడునీ అతని మామనీ రక్షించింది. యుధజిత్తు ఆమెను హేళన చేసాడు, దానితో వెనువెంటనే దేవీ మాత అతనినీ అతని సైన్యాన్ని బూడిదగా మార్చింది.
అప్పుడు సుదర్శనుడు, తన భార్య, మామతో కలిసి దేవిని స్తుతించాడు. దేవి అతి ప్రసన్నురాలై, వారికి తనని హోమంతో ఇతర సాధనాలతో వసంత నవరాత్రులపుడు పూజించమని ఆదేశించింది. తరువాత ఆమె మాయమయ్యింది.
యువరాజు సుదర్శనుడు, శశికళ ఋషి భరద్వాజుని ఆశ్రమానికి వెనుదిరిగి వచ్చారు. ఋషిపుంగవుడు వారిని ఆశీర్వదించి సుదర్శనుడిని కోసల రాజుగా పట్టాభిషిక్తుని గావించాడు. సుదర్శనుడు, శశికళ ఇంకా ఆమె తండ్రి అయిన వారణాసి రాజు తుచ తప్పకుండా దేవి మాత ఆదేశాలను పాటించి ఆమెకు వసంత నవరాత్రులలో అద్భుతరీతిలో పూజలు జరిపారు.
సుదర్శనుడి వారసులయిన, శ్రీ రామ లక్ష్మణులు కూడా శరన్నవరాత్రులలో, దేవిని పూజించి, ఆమె సహాయంతో సీతను తిరిగి తేగలిగారు.

No comments:
Post a Comment