శ్రీ దేవీ భాగవతం అష్టమ స్కంధము - భువనకోశము
జనమేజయు డిట్లనెను: ఓ విప్రఋషీ! అమృతమునకు తావలమైన సూర్యచంద్రనవంశజులగు రాజుల సచ్చరిత్ర మును నీనోటచెవులారవింటిని. ఇపుడెల్ల మన్వంతరములందును శ్రీదేవి యేయే రూపములు దాల్చిపూజలందుకొనును? ఏయే స్థానములందేయే కర్మములచే నేయే శరీరములు దాల్చి యారాధింపబడి దేవిఫలము లొసగును. ఏ యే మంత్రబీజములచే జపింపబడును?ఆదేవి విరాట్స్యరూపవర్ణన యెట్టిది? ఎట్టిధ్యానమువలను బుద్ది సూత్రాత్మలో లీనమగును? అంతయును నాకు విపులముగ తేటతెల్ల మొనరింపుము. దానివలన నాకు శుభము గలుగుత.
వ్యాసు డిట్లనెను: రాజా! అత్యుత్తమమైన శ్రీదేవ్యారానము గుఱించి చెప్పుచున్నాను. వినుము. అట్టియారాధనముచేసిన-విన్న-కన్నంత-మాత్రన నరుడు సకల శుభములుపడయగలడు. ఇదేవిషయమును గూర్చి మునుపు నారదుడు నారయణునడిగెను. అపుడు యోగవిద్యా ప్రవర్తకుడగు విష్ణు వతనికి చెప్పినవి నీకును చెప్పుదును వినుము.
పూర్వ మొకప్పుడు నారదుడు యోగాత్మకుడగు పురుషోత్తమునితో నీ వడిగివన విషయము లడిగెను.
ఓ దేవదేవా! మహాదేవా! పురాణపురుషోత్తమా!జగదాధారా! సర్వజ్ఞా! పోగడ దగిన సద్గుణముల రాశీ! ఈ ప్రపంచముయొక్క మూలతత్త్వ మెఱిగింపుము. ఈజగమంతయు నెచటినుండి పుట్టును? ఎచట ప్రతిష్ఠింబడి యున్నది? ఇది తుదకెచటలయ మొందును? ఎల్ల కర్మఫలము లెచటినుండి గల్గను? దీని నెఱింగినందువలన మోహకారమగు మాయ నశించగలదు? ఎవరి నర్చించిన నెవరిని జపించిన నెవరిని ధ్యానించిన చీకటి యండు సూర్యోదయమునలె స్వాత్మప్రకాశమగు జ్ఞానము గల్గను?
దేవా! నా యీ ప్రశ్నముల కన్నిటికి పూర్తిగ సమాధానము లిమ్ము. వానివలన వేగముగ లోకములన్నియు నజ్ఞాన తమస్సునుండి విడిపడును. అని దేవర్షి ప్రశ్నింపగా పురాణమునిసత్తముడు మహాయేగియగు నారయణుడానందభరితుడై యతని కిట్లు పలికెను:
దేవా! నా యీ ప్రశ్నముల కన్నిటికి పూర్తిగ సమాధానము లిమ్ము. వానివలన వేగముగ లోకములన్నియు నజ్ఞాన తమస్సునుండి విడిపడును. అని దేవర్షి ప్రశ్నింపగా పురాణమునిసత్తముడు మహాయేగియగు నారయణుడానందభరితుడై యతని కిట్లు పలికెను:
ఓయి దేవఋషీ! ఈ జగముయొక్క మూలతత్త్వము వినుము. దాని నెఱుంగుటవలన మానవుడు తిరిగి జగద్బ్రాంతిలో పడడు. ఈ జగత్తు మూలతత్త్వముగూర్చి నాతో దేవియే స్వయముగ మున్ను చెప్పినది. దేవ-ఋషి-గంధర్వ-మనీషులును నాతో చెప్పిరి. ఈజగమును దేవియే త్రిగుణము లాధారముగ చేసికొని పుట్టించును. పెంచును. తుద కామెయే సర్వము నశింపజేయును.
దేవి దివ్వస్వరూపమును మహర్షులు-సిద్దులు వర్ణించి పూజించి చెప్పిరి. ఆస్వరూపమును స్మరించినంతనే పాపములు తొలగును. కామమోక్షములు గలుగును మొట్టమొదటి బ్రహ్మపుత్రుడు స్వాయంభువ మనువు. ఆతడు ప్రతాపవంతుడు. మన్వంతరాధిపతి-శతరూపాపతి-శ్రీమంతుడు. మనువు కల్మషరహితుడు ప్రజాపతియుగు తన పితృదేవుని భక్తితో సేవింపగ బ్రహ్మ తన కుమారున కిట్లనెను:
ఓయి వత్సా! నీవు పవిత్రయు-సర్వోత్తమయునగు దేవి నారాధించుము. ఆమె దయవలన నీకు ప్రజాసృష్టి గల్గించు శక్తి గల్గును. అని బ్రహ్మపలుకగ స్వాయంభువ విభుడు జగత్కారణురాలగు జగదంబను గూర్చి తపముచేసి యామెను సంతోషపఱచెను. అతడు నిశ్చలమతితో సర్వ కారణకారణ-సర్వశక్తి-సమష్టిబ్రహ్మశక్తి-అద్య-దేవేశియగుదేవి నిట్లు నుతించెను.
ఓ జగత్కారణకారణదేవీ! దేవేశ్వరీ! శంఖచక్రగదాహస్తా! నారాయణహృదయ కమలవాసినీ! నీకు శతకోటి నమస్సులు.
ఓ జగన్మాతా! కారణ స్దాన రూపిణి! శివా! సర్వ దేవ సన్నుతా! వేదత్రయ ప్రమాణజ్ఞా! వేదమూర్తీ! నీకు శతకోటినమస్సులు. మాహేశ్వరీ! మాహాభాగా! మహామాయా! మహోదయా! మహాదేవ ప్రియంకరీ! మహాదేవప్రేయసీ! నీకు శతకోటి నమస్సులు. గోపేంద్రప్రియా! జ్యేష్టాదేవీ! మహానందా! మహోత్సవా! మహామాయా! భయహరీ! దేవాదిపూజితా! నీకు శతకోటి నమస్సులు. సర్వమంగల మాంగల్యా శివా! సర్వార్థసాధికా! శరణ్యా! త్య్రంబకదేవీ! గౌరీ! నారాయణీ! నీకు శతకోటి నమస్సులు.
ఓ జగన్మాతా! కారణ స్దాన రూపిణి! శివా! సర్వ దేవ సన్నుతా! వేదత్రయ ప్రమాణజ్ఞా! వేదమూర్తీ! నీకు శతకోటినమస్సులు. మాహేశ్వరీ! మాహాభాగా! మహామాయా! మహోదయా! మహాదేవ ప్రియంకరీ! మహాదేవప్రేయసీ! నీకు శతకోటి నమస్సులు. గోపేంద్రప్రియా! జ్యేష్టాదేవీ! మహానందా! మహోత్సవా! మహామాయా! భయహరీ! దేవాదిపూజితా! నీకు శతకోటి నమస్సులు. సర్వమంగల మాంగల్యా శివా! సర్వార్థసాధికా! శరణ్యా! త్య్రంబకదేవీ! గౌరీ! నారాయణీ! నీకు శతకోటి నమస్సులు.
ఈ విశ్వమంతయు నెవరి వలన నుత్పన్నమై ఎవరితో పడుగు పేకలతో వలె నిత్యము నిండియుండునో ఏది దివ్య చైతన్యపుంజమో యెద్ది తేజో విధానమో యెద్ది యాద్యంతరహితమో ఏ దేవీ కటాక్ష వీక్షణ మాత్రమున బ్రహ్మ జగము లన్నిటిని పుట్టించునో హరి పాలించునో రుద్రడు సంహరించునో పద్మసంభవుడును మధుకైటభ భయపడితుడునగు బ్రహ్మ యే దేవిని సన్నుతించి ఘోర దానవ భయము పాసెనో అట్టి దేవిని హ్రీ-కీర్తి-స్మృతి-కాంతి-కమల-గిరిజ-సతి-దాక్షాయణి-వేదగర్బ-బుద్థిదాత్రి-అభయవు నీవే! ఓశ్రీమాతా! నీకు శతకోటి నమస్సులు.
నేను నిన్నే పూజించి -జపించి-ధ్యానించి-భావించి వీక్షించి-విని-సుతింతును. దేవీ! నాయెడల ప్రసన్ను రాలవు గమ్ము బ్రహ్మవేదములకు నిధి; విష్ణువు లక్ష్మీ నిలయుడు; ఇంద్రుడు త్రిలోకపతి; వరుణుడు జలాధినేత; కుబేరుడు నిధులకునాధుడు; యముడు ప్రేతపతి; నైఋతుడు రక్షోదక్షుడు; సోముడు జలమయుడు; వీరెల్లరు నీ వలన నున్నత పదవులందిరి. జగన్మాతా! నీవు త్రిలోకవంద్యపు; లోకేశ్వరివి; మహా మాంగల్యస్వరూపిణివి; నీకు శతకోటి నమస్సులు తల్లీ!
నారాయణు డిట్లనెను: నారదా! అని యిట్లు దుర్గ-భగవతి-నారాయణి దేవిని సన్నుతింతగ దేవిని ప్రసన్నరాలై మనువున కిట్లు పలికెను.
నారాయణు డిట్లనెను: నారదా! అని యిట్లు దుర్గ-భగవతి-నారాయణి దేవిని సన్నుతింతగ దేవిని ప్రసన్నరాలై మనువున కిట్లు పలికెను.
బ్రహ్మపుత్రా! రాజేంద్రా! నీ సంస్తవమునకు ప్రసన్నురాలనైతిని. ఏదేని వరమడుగుము.
మను విట్లనెను: దయామయా! దేవీ! నా భక్తికి ప్రసన్నవైనచో నీ యానతి వలన నేయడ్డంకులు లేక ప్రజాసృష్టి కొనసాగవలయును.
శ్రీదేవి యిట్లనెను: రాజేంద్రా! నాయనుగ్రహము వలన ప్రజాసృష్టి నిర్విఘ్నముగ నుత్తరోత్తరముగ నభివృద్ధి జెందుగాత! నా మీది భక్తితో నీవు స్తుతించిన యీ స్తోత్రము నెవడు పఠించునో యతనికి తప్పక విద్య సంతతి కీర్తి కాంతి గల్గను;
రాజా! ఎవరు దేవి దయకు పాత్రులో వారికి ధన ధాన్యములు గల్గను; ఎల్లెడల వారికి విజయము సుఖము గల్గను; శత్రువులు నశింతురు.
నారాయణు డిట్లనెను: ఈ విధముగ బ్రహ్మపుత్రుడగు మనువునకు వరము లొసంగి యాధీశాలి చూచుచుండగ దేవి యంతర్దాన మొందెను. రాజా! ఇట్లు బ్రహ్మపుత్రుడగు ప్రతాపి యగు మనువు వరములు బడసి తనకోక ప్రత్యేక సాధన మిమ్మని బ్రహ్మనడిగెను. నే నచ్చటి నుండి పుష్కలముగ ప్రజలను సృజింపగలను; యజ్ఞములతో దేవేశిని గూర్తి వెల్తును; త్వరగ నాకు చోటు చూపుము; ఆజ్ఞాపింపుము. ఆను కూమారుని పలుకులు విని ప్రజాపతియు విభుడునగు బ్రహ్మ యీ పని యెట్లు నెఱవేరునాయని దీరఘముగ నాలోచించెను. ఈ యనంతమైన సృష్టి చేసి నా కనంతకాలము గడచిపోయెను. భూమి నీట మునిగెను; అన్నిటికి జలము సదా ధారమయ్యెను, ఈ నా తలంచిన కార్యము నాది పూరుషుడగు భగవానుడే చేయగలడు. ఎవని యాదేశమున నే నిచట నుంటినో యతడే నాకీ పనిచో తోడుపగలడు.
No comments:
Post a Comment