సూతుడు చెప్పిన ఈ వృత్తాంతాన్ని శ్రద్ధగా ఆలకించిన శౌనకాదిమ మహర్షులు హర్షపులకితగాత్రులు ఆయ్యారు.
శౌనకాది మహామునులారా! అప్పుడు జనమేజయుడు అడిగినదీ వ్యాసుడు చెప్పినదీ వివరిస్తున్నాను శ్రద్ధగా ఆలకించండి - అంటూ సూతుడు చెప్పడం ప్రారంభించాడు.
వ్యాసమహర్షీ! సూర్యచంద్రవంశాల చరిత్రనూ దేవీగీతనూ వినిపించావు. అమృత ప్రాయంగా ఆస్వాదించాను. మన్వంతరాలలో మహాదేవిని ఏయే స్థానాలలో ఎయే రూపాలలో ఏయే పూజలతో ఏయే బీజాక్షరాలతో ఎలాయెలా అర్చించాలో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. తెలియజెప్పవా - అని అభ్యర్థించాడు జనమేజయుడు.

వ్యాసుడు డిట్లనెను: జనమేజయా ! విను. దేవీ ఆరాధనవిధానమంతా చెబుతాను. అది చేసినా చెయ్యకపోయినా చెవులారా వింటే చాలు శ్రేయోదాయకమే. వెనకటికి నారదుడు అడిగితే యోగమార్గప్రవర్తకుడైన నారాయణుడు చెప్పిన విశేషాలివి.
No comments:
Post a Comment