నారాయణు డిట్లనెను: ఆ యనంతుని ప్రభావమును బ్రహ్మపుత్రుడగు నారద భగవానుడు బ్రహ్మసభలో పాటలుగ పాడుచు ఉపాసించును. ఎవ్వాని దివ్యగుణము లీ జగముల సృష్టిస్థితి లయములకు మూలకారణములో యెవ్వని మేలుచూపు మాత్రాన ప్రకృతి గుణములు తమతమ విధులు నెఱవేర్చునో యెవని దివ్య స్వరూపము ధ్రవతేజమో యనాదియో యెవం డొక్కడే యయ్యు పెక్కురూపుల చక్కనిపేరుల భాసిల్లునో యాతని మూలతత్త్వ మెట్టు లెఱుంగబడును!
ఈ సదసద్రూప విశ్వమే విశ్వరూపు నమృతదయవలన సత్త్వముగ దోచునో యే రసికశేఖరుని లీలా వినోదము భక్తుల మనస్సులను సింహము వలె లాగునో యట్టి యుదారవిక్రము ననన్యగతి నాశ్రయింపవలయును. ఏ హరి శుభనామధేయము నార్తుడుగాని పతితుడు గాని నవ్వులాట కేని యొక్కసారియేని విన్న-కీర్తించినయేని పాపుని పాపరాసులు కూలిపోవునో యాశేష భగవానుని ముముక్షు వాశ్రయింప వలయును ఏవేల శిరముల యనంతుడు నదీ-నద-సాగరములు గిరి-దరీభూములుగల భూమండలము నొక్క పరమాణులీల దాల్చునో యట్టి మొక్క పోనియుక్కుగల్గిన శేషుని వీర్యమహిమను వేయినాల్క లున్నవాడు నుగ్గడింపజాలడు.
ఇట్టి యనంత గుణగరిష్ఠుడు దురంతవిక్రముడు ననంతప్రభావుడునగు ననంతశేషుడు స్వతంత్రముగ లీలగ నీ భూమి నంతయును తలదాల్చి పాతాళమందున విరాజిల్లుచుండును. మునిపుంగవా! నరులు తమతమ కర్మల ననుసరించి గతులు పొందుదురు. నరులెట్టి కొర్కెలు కొరుకొందురొ యట్టి ఫలితములు బొందుదురు.
ఓ రాజేంద్రానీకీ విధముగ నల-మృగ-పక్షుల గూర్చి తెల్పితిని. ధర్మబద్దములైన వారివారి కర్మ-కాల-పరిపాక-గతులను గూర్చి వాని మంచి చెడులను గుఱించి నీప్రశ్నలకు తగినట్లుచెప్పితిని.
నారదు డిట్లనెను; ప్రాణికోటుల కర్మలన్నియును సమానములే గదా! భగవానుడీ లోకముల నింత వింత వింతలు దోప నేల సృజించెనో నాకు దెలుపుము.
నారాయణు డిట్లనెను: కర్త యొక్క శ్రద్ద ననుసరించి కర్మఫలములు వేర్వేరుగ మూడు విధములుగ నుండును. కర్తకు సాత్విక శ్రద్దవలన సుఖమును రాజుల శ్రద్దవలన దుఃఖమును గల్గును. తామసశ్రద్దవలన దుఃఖమేకాక మూర్ఖత్వమును గల్గును. ఈ శ్రద్దల తరతమ భేదముల వలననే ఫలితము లందును భేదములు గలుగు చుండును.
ఓనారదా! అవిద్య - అనాది. దానివలన జరుగు పనుల గతులు ప్రవృత్తులు ఫలితములు వేనవేలుగ గల్గుచుండును.
విప్రవర్యా ! కర్మగతుల భేదములను తేటపఱతును. ఈ ముల్లోకముల మధ్యను దక్షిణ దిశయందున భూమికి క్రిందుగ నతలమునకుపైగ నగ్ని ష్వాత్తులను పితృగణములును పితరులును వసింతురు. వారు స్వాత్మసమాధిలో మునింగి తమతమ గోత్రజులను తప్పక దీవించుచుందురు. పితృరాజు-యమధర్మరాజు. అతని భటులు మృతప్రాణులను కొని తెత్తురు.
విప్రవర్యా ! కర్మగతుల భేదములను తేటపఱతును. ఈ ముల్లోకముల మధ్యను దక్షిణ దిశయందున భూమికి క్రిందుగ నతలమునకుపైగ నగ్ని ష్వాత్తులను పితృగణములును పితరులును వసింతురు. వారు స్వాత్మసమాధిలో మునింగి తమతమ గోత్రజులను తప్పక దీవించుచుందురు. పితృరాజు-యమధర్మరాజు. అతని భటులు మృతప్రాణులను కొని తెత్తురు.
యముడు ప్రాణుల కర్మగుణదోషాలను బట్టి విచారశీలుడై వారి వారికి తగిన శిక్ష విధించును. యముడు గణములతోగూడి దైవాజ్ఞ పాటించును శాసించుచుండును. యముడు ప్రాజ్ఞుడై తన యాన జవదాట నట్టి ధర్మత్తత్వజ్ఞులగు వారిని తన యాదేశము పాటించుటకు పంపుచుండును. కొందఱు నరకము లిరువదొకటనియు మఱికొందఱిరువదెనిమిదనియు నందురు.
వాని సరియగు సంఖ్య చెప్పుదును వినుము. తామిస్రము అంధతామిస్రము రౌరవము మహారౌరవము కుంభీపాకము కాలసూత్రము అసిపత్రారణ్యము శూకరముఖము అంధకూపము కృమి భోజనము సందంశము తప్తమూర్తి వజ్రకంటకము శాల్మలి వైతరణీ పూయోదము ప్రాణరోధము విశసనము లాలాభక్షణము సారమే యాదనము అవీచి అయఃపానము క్షార కర్దమము రక్షోగణము సంభోజము శూలప్రోతము దందశూకము వటారోధము పర్యావర్తనము సూచీముఖము ననున విరువ దెనిమిది నరకములు. ఓ నారదా! ఇవన్నియును పెక్కు యాతనలు పెట్టు నరకభూములు. ఆయా చెడుకర్మల ఫలితముగ ప్రాణు లాయా నరకములందు గూలుదురు.
దుష్కర్మలు - నరకయాతనలు
దుష్కర్మలు - నరకయాతనలు
No comments:
Post a Comment