Friday, April 24, 2026

Mantra Dharana - మంత్ర ధారణ

శ్రీ దేవీ భాగవతం సప్తమ స్కంధము - మంత్ర ధారణ

ఓ వత్సా !నీ కిట్లు త్తమమైన యోగధారణ విధానము వివరించితిని. ఇపుటు చిత్తధారణ గూర్చి తెల్పుదును. సావధానముగ నవధరింపుము. 

శ్రీ దేవి దిక్కాలముల కతీతయైనది. ఆమెయందేచిత్తము నిలుకడ జెందవలయును. ఇట్లుచిత్తము నిల్పి దేవీ తన్మయుడైనవాడు జీవబ్రహ్మైక మొందును. ఒకవేళ మనస్సు రజోదోషమున మలినమైనచో యోగము వెంటనే సిద్ధింపదు. అపుడవయవయోగమున యోగి యోగమభ్యసింపవలయును. 

అనగ నామధుర మధురమైన పాదములు -చేతులుమున్నగువానియందు చిత్తము నిల్పవలయును. అటు లొక్కొక్కచోటు జయించుచు చిత్తశుద్దియైన వెంటనేచిత్తమును దేవీ రూపమందంతట నిలిపి ధ్యానింపవలయును. 

ఓయి పర్వతరాజా! జ్ఞానస్వరూపిణి నగు నా యందుచిత్తము లయమందువఱకు సాధకుడు తన కిష్టమైన మంత్రమో జపమో హోమమో చేయుచుండవలయును. ఇట్టి మంత్రాభ్యాసయోగమునను బ్రహ్మజ్ఞానముగల్గును. యోగము లేక మంత్రమును మంత్రము లేక యోగమును సిద్ధంపవు. ఈ రెంటి నభ్యసించిన మంత్రయోగి బ్రహ్మతాదాత్మ్య మందవచ్చును. 

ఇంటిలో పెంజీకటి తెరల మాటునగల కుండ దీపము వెల్గున కనబడును. అటులే మాయాంథతమములో జిక్కిన జీవాత్మ మంత్రయోగముల వెలుగు వెల్లువలలో కనిపించును. ఇటుల నీకు యోగవిధానమంతయును సాంగముగ వివపించితిని. ఇదంతయును సద్గురూపదేశమున తెలియవలసినదేకాని యెన్ని కోటుల శాస్త్రములను చూచిన నేమియు లాభములేదు.

శ్రీదేవి యిట్లనెను : ఓ గిరిరాజా! ఈ విధముగ బ్రహ్మస్వరూపిణి నగు నన్ను యోగయుక్తుడు సహజ భక్తితో నాసనమున గూర్చుండి సతతమను ధ్యానింపవలయును. బ్రహ్మము స్వయంప్రకాశము. సర్వవ్యాపకము. ఐనను హృదయ గుహ యందు వెలుగొందును. ఇది యోగ సాధ్యము. దీని యందాకాశాదులు ఎల్ల ప్రాణులు కాలములు నాధారపడియుండును. 

ఓ సురలారా ! బ్రహ్మమునిట్లెరుంగుడు. ఇది మాయా జగముల కంటె వరేణ్యమయినది. బుద్దులకందనిది. అణువు కంటె అణీయము. ఎల్ల లోకములు లోకులు దీనియందు ప్రతిష్టింపబడియున్నారు. ఓ సౌమ్యుడా! ఓంకారము అక్షరము- బ్రహ్మము. అది ప్రాణ-వాక్‌-మనో రూపములు దాల్చును. 

కనుక బ్రహ్మమందు మనస్సు లగ్న మొనర్చి యెఱుంగవలయును. ఉపనిషత్తను ధనువు నందు ధ్యాన మనెడు బాణమెక్కుపెట్టి నిశ్చల చిత్తముతో నక్షరమును లక్ష్యముచేసి ఏయవలయును. ప్రణవము - దనువు; హృదయము-బాణము; బ్రహ్మము లక్ష్యము; బాణము లక్ష్యమును భేదించునటుల నరుడు నప్రమత్తముగ భాగవత హృదయముతో బ్రహ్మమును గురిచూచి వేధించి బ్రహ్మ మయుడు గావలయును. బ్రహ్మమందు భూమి-అంతరిక్షము -ఆకాశము-ప్రాణములు - మనస్సు నిల్చియుండును. ఇదిసంసార సాగరమునకు సేతువు. 

కనుక వట్టి మాటలుకట్టిపెట్టి యాత్మనొక్క దని నెఱుంగుము. రథపు నాభి యందు చక్రమాకులు చేరియుండును. అటులే హృదయ మందు నాడులన్నియును చేరియుండును. పెక్కురూపులుగల బుద్ది వృత్తికి సాక్షియగు బ్రహ్మము హృదయమందే వెలుగొందుచుండును. 

అమరులారా ! మీకు మేలగుత ! సంసారపు గ్రుడ్డిపెంజీకటి తెరల కవ్వలి వెలుంగు వెల్లువ యగు నాత్మ నాత్మ విచారముతో ధ్యానింపుడు. ఆత్మ దివ్యమును -బ్రహ్మపురమునుగు హృదయాకాశమున వెల్గుచుండును. అత్మ మనోమయము: ప్రాణశరీరములకధినేత-అన్న మునప్రతిష్టితము- హృదయాంతరవర్తి-ఆనంద స్వరూపము- అమృత రసనిధి; ధీరులగు వారుఅనుభవ పూర్వక మగు ఆత్మ విచారముతో దీనిని దర్శింతురు.

ఇట్టి పరమాత్మ సాక్షాత్కారము గల్గిన వాని జన్మ జన్మముల హృదయ మందలి పెడముళ్లు తెగతెంపులగును. సంశయము లన్నియు పటాపంచలగును. కర్మబీజము లన్నియును నశించును. 

బ్రహ్మ విద్య

No comments:

Post a Comment